Friendship story in Telugu | నక్క – కోడిపుంజు | Telugu Lo Stories
Dear All, here we will find friendship story in Telugu | నక్క – కోడిపుంజు | Telugu Lo Stories.
ఒక రోజున ఒక నక్క ఆకలితో మలమల మాడిపోతుంది. ఎక్కడైనా ఏదైనా తిండి దొరక వచ్చునని అంతటా వెతుకుతోంది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. కాని అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ పుంజుని చంపి ఆకలి తీర్చుకోవాలని అనుకుంది.
మెల్లగా ఆ చెట్టు వద్దకు వచ్చి “మిత్రమా! ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది. ఇకమీదట జంతువులన్నీ కలసి మెలసి స్నేహితులు లాగా జీవించాలంట.
అందుచేత కిందకు రా! మనం ఇద్దరం స్నేహితుల్లాగ మసలుకొందాం!” అంది.
ఆ జిత్తులమారి నక్క చెప్పే దాంట్లో నిజం ఎంతో ఆ కోడిపుంజుకు తెలుసు. అందుచేత అది “అవును, ఆ వార్త నేను కూడా విన్నాను” అంది. లోలోపల కోడిపుంజు నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తుంది. చివరికి కోడిపుంజు ఇలా అంది “అదిగో మీ స్నేహితులు ఎవరో ఇటే వస్తున్నారు, వాళ్లను కూడా రాని అందరం కలిసి అప్పుడు పండగ చేసుకుందాం!”
“ఈ దారిన వచ్చే నా స్నేహితులు ఎవరూ లేరే! ఇంతకూ ఎవరు వస్తున్నారు?” అని అడిగింది నక్క.
వేట కుక్కలు, వాటి స్నేహితులు” అని జవాబిచ్చింది పుంజు.
వేట కుక్కలు పేరు వినగానే నక్క హడలెత్తి పోయి వణకడం మొదలుపెట్టింది, వాటి కంటపడితే చావడం ఖాయం అనుకున్నది నక్క.
“అలా భయంతో వణికిపోతూ ఉన్నావు ఎందుకు?” అని అడిగింది కోడిపుంజు.
అందుకు నక్క “వాళ్ళు బహుశా నిన్నటి వార్త విన్న లేదేమో అనుకొంటాను” అని అక్కడి నుండి పరిగెత్తి పారిపోయింది.
Moral of the story: మోసాన్ని మోసంతోనే జయించాలి.
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
friendship story in Telugu | నక్క – కోడిపుంజు | Telugu Lo Stories
కచ్ఛర చెరువు
ఒక చిన్న ఊరిలో, అందమైన చెరువు ఉండేది. కానీ కాలక్రమంలో, అది మురికి, చెత్తలతో నిండిపోయింది. నీరు మచ్చపడి, వాసన రావడంతో, చిన్నపిల్లలు అక్కడ ఆడటానికి భయపడ్డారు. గ్రామంలో అందరికి ఇది ఆందోళనగా మారింది.
అప్పుడే చెరట దగ్గర కూర్చున్న జ్ఞాని, చిన్నారి వలె, మృదువుగా, కానీ స్పష్టంగా చెప్పారు:
“ఏ సమస్యను పరిష్కరించాలంటే సహకారం,
శ్రద్ధ,
మరియు కృషి అవసరం. ఒక్కరిపెద్ద ప్రయత్నం కంటే,
అందరం కలసి చేయడం నిజమైన మార్గం.”
గ్రామస్తులు ఆ మాటలు గమనించి, చక్కగా కలసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. వారు చెరువులోని చెత్తను తొలగించి,
నీటిని శుభ్రం చేశారు,
చెరువు చుట్టూ సుంకులను,
పూలను మొలిపించారు. కొద్ది రోజుల్లో,
చెరువు మళ్లీ అందంగా,
శుభ్రమైన సరస్సుగా మారిపోయింది. చిన్నపిల్లలు సంతోషంగా ఆడటానికి తిరిగి వచ్చారు,
పెద్దలు వాతావరణాన్ని ఆస్వాదించగలిగారు.
గ్రామం మళ్లీ సుఖంగా, జీవనశైలిలో ఆనందంగా మారింది. ప్రతి ఒక్కరు గ్రహించారు — శ్రద్ధ, సహకారం, మరియు కృషి ఏ సమస్యనైనా పరిష్కరించగలుగుతుందనే నిజాన్ని.
పాఠం: శ్రద్ధ, సహకారం,
మరియు కృషి సమాజాన్ని సంతృప్తిగా మారుస్తాయి.
The Polluted Pond
In a small village, there was a once-beautiful pond. Over
time, it had filled with dirt and litter. The water turned murky, and a foul
smell spread. Children no longer dared to play there, and the villagers felt
uneasy every day.
One evening, the wise sage sat by the pond and spoke softly,
almost like a child:
“To solve any problem, you need cooperation, care, and effort. One person’s
work is not enough; together, everyone can make a real difference.”
Inspired by his words, the villagers joined hands. They
cleaned the pond, removed debris, purified the water, and even planted flowers
and shrubs around its edges. Within a few days, the pond was transformed into a
clean, sparkling oasis. Children returned to play, and adults enjoyed the
peaceful surroundings.
The village thrived once again. Everyone realized that care,
cooperation, and effort can overcome even the toughest problems.
Moral: Care, cooperation, and effort can transform a
community.
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
The Fox and the Chick
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu,
friendship story in Telugu | నక్క – కోడిపుంజు | Telugu Lo Stories
#storyintelugu #storiesintelugu #teluguneethikathalu #neethikathalu #telugufairytales #telugumoralstories #telugulostories
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
friendship story in Telugu | నక్క – కోడిపుంజు | Telugu Lo Stories
#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories
Best Telugu Story about Friendship Stories : https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Post a Comment