Telugu lo kathalu stories heart touching story | గుండె లోతుల్ని ఆవిష్కరించే కథ |
పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది . " నేను మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను " అని .
అది అబద్ధం ఎందుకంటే ఆ తరగతి మూడో వరసలో ఉన్న మహేశ్ తీరు ఆమెకు నచ్చలేదు . ఏడాదిగా అతడిని గమనిస్తోంది.
అతడు మిగిలిన పిల్లల్లా
ఆటల్లో పాల్గొనడం లేదు , డ్రెస్ సరిగా వేసుకోవడం లేదు. దీంతో ఆమెకు అతడంటే సదభిప్రాయం కలగలేదు .
కాలం గడిచిపోసాగింది . అతడి పేపర్స్ లో ఆమె ఎర్ర సిరా గుర్తులు పెరిగిపోసాగాయి.. మార్కులు తక్కువగా పడుతున్నాయి. అతడు మిగిలిన పిల్లలతో కలవలేక పోవడమూ గమనించింది . పిల్లల గురించి టీచర్ సీసీఈ కుమ్యలేటివ్ రికార్డు రాయాలి .
చేసింది . వార్షిక పరిక్షలూ దగ్గర పడుతున్నాయి.
మహేశ్ వివరాలు నమోదుచేయాలి.
ఒక రోజు అతడి రికార్డు ముందరేసుకుని తిరగేయసాగింది . పేజీలు తిప్పిన కొద్దీ ఆమె అంతరంగంలో అలజడి మొదలవసాగింది.
అతడి ఒకటవ తరగతి అభ్యసనం తీరుపై అప్పటి టీచర్ ఇలా రాసింది " మహేశ్ చాలా తెలివైన కుర్రాడు .
అందరితో కలసి పోతాడు. అతడితో అందరూ చాలాస్నేహంగా ఉంటారు. ఇంటిపని నీట్ గా చేస్తాడు .
బ్రిలియంట్ బాయ్ " రెండో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ ఎక్సలెంట్ కుర్రాడు . కానీ ఈమద్య అతడి తల్లికి వచ్చిన జబ్బు వలన అతడు కుటుంబంలో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు "
మూడో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ ది చాలా కష్టపడేతత్వం. చదువులో బాగానే ఉన్నాడు కానీ
అతడి తల్లి మరణం అతడిని కుంగ తీసింది . అతడి తండ్రి అతడిని పట్టించుకోవడం లేదు . అది అతడిపై విపరీతమైన ప్రభావం చూపవచ్చు "
నాల్గో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ చదువులో వెనుకబడి పోయాడు . అతను ఫ్రెండ్స్ తో కలవక ఒంటరిగా ఉంటున్నాడు . క్లాస్ లో నిద్ర పోతున్నాడు . అతడు ఒక సమస్యాత్మక పిల్లవాడు కాబోతున్నాడు "
సరోజ టీచర్ కి సమస్య అర్ధ మైంది. ఇన్నాళ్ళూ తను మహేశ్ గురించి తెలుసుకోనందుకు బాధ పడింది .
అంతలోనే టీచర్స్ డే వచ్చింది. ఏర్పాట్లలో సరోజ తలమునకలైంది మహేశ్ నీ సానుభూతితో చూడడం తప్ప ఏమి చెయ్యాలో ఆమెకు తోచలేదు . టీచర్స్ డే రోజు అందరు పిల్లలూ టీచర్ కి కానుకలు ఇస్తున్నారు . అందమైన రంగుకాగితాలతో చుట్టిన విలువైన కానుకలు ఇవ్వసాగారు .
అందరు పిల్లలూ అది చూసి ఎగతాళిగా నవ్వతున్నారు . సరోజ వారిని కసిరి " చాలా బాగుంది " అని మహేశ్ తో అంది .
ఆమెకు దూరంగా నిల్చున్న మహేశ్ " మీరు ఈ రోజు మా అమ్మలా కనిపిస్తున్నారు" అన్నాడు .
అందరు పిల్లలూ వెళ్లి పోయారు . అయినా సరోజ టీచర్ మాత్రం క్లాసును వదల లేక పోయింది .
క్లాసులో కూర్చుని గంట సేపు ఏడ్చింది .
ఆ రోజు నుండి ఆమె మహేశ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టింది . మహేశ్లో మార్పు చాలా త్వరగా వచ్చింది . ఆమె ప్రోత్సహిస్తున్నకొద్దీ చురుకుగా తయారయ్యాడు . వాడు ఆ సంవత్సరం తరగతి ఫస్ట్ గా వచ్చాడు .
ఆ తర్వాత అతను సెకండరీ స్కూల్ కి పోయాడు. ఇక్కడితో అయిపోలేదు .
మరుసటి సంవత్సరం ఆమెకు ఉత్తరం వచ్చింది.
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
అందులో " ప్రాధమిక విద్యాభ్యాసం లో నాకు నచ్చిన ఉపాధ్యాయిని మీరు " అది ఆ ఉత్తరం సారాంశం .
మరో నాలుగేళ్లకు వచ్చిన ఉత్తరంలో " నేను సెకండరీ విద్యలో జిల్లా స్థాయిలో ర్యాంక్ సాధించాను . అయినా ఇప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ " మరో రెండేళ్లకు ఇంకో ఉత్తరం " నేను ఇపుడు
చదువు విషయం లో కష్టపడుతున్నాను .
ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా చదువు కొనసాగిస్తున్నాను . ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ " ఇంకో నాలుగు సంవత్సరాలు గడిచాయి . ఇంకో ఉత్తరం " డిగ్రీ తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాలు చదవాలి అనుకున్నాను . చదివాను .
సాధించాను . ఇదంతా మీ చలవే . మీరే నాకు ఫేవరెట్ టీచర్ " ఈసారి అతడి ఉత్తరం లో చివరన సంతకం కింద మహేశ్, M.D. అని సంతకం చేశాడు .
ఇంతటితో ఈ కధ అయిపోలేదు .
ఇంకో ఉత్తరం వచ్చింది .
" నేను ఒక అమ్మాయిని చూశాను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను . మా అమ్మగారు లేని సంగతి మీకు తెలిసిందే..నాన్న గారు కూడా రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు . వివాహంలో పెళ్ళికొడుకు తల్లి స్థానంలో మీరుండాలని నా కోరిక " సరోజ పెళ్ళికి వెళ్ళేటపుడు మహేశ్ ఐదవ తరగతిలోబహూకరించిన నెక్లెస్ ధరించింది..
అందులో సగం రాళ్ళు ఊడిపోయాయి .
ఆ పెళ్లి రోజు మహేశ్ కి వాళ్ళ అమ్మ కనిపించింది..
"కన్ను తెరిస్తే జననం...కన్నుమూస్తే మరణం... రెప్పపాటు జీవితం”. ఒక మహాకవి రాతల్లో జనించిన జీవిత సత్యమిది.
జననానికి, మరణానికి మధ్యసాగే ఈ జీవన సమరంలో మనిషి ప్రతిక్షణం ఒత్తిళ్ళకు లోనవుతూ, సమస్యలతో సతమతమవుతూ యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోతున్నాడు.
నవ్వులను మనిషి ఆస్వాదించడానికి మాధ్యమాలు ఎన్నో ఉన్నాయి. అంటే సినిమాలు, టి.వి.లు, లాఫింగ్ క్లబ్‌లు, నాటకాలు, హాస్య పుస్తకాలు లాంటివి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది వాటిలో ఒకటి.
మీరు మాత్రం కష్టాలున్నా, సమస్యలున్నా, బాధలున్నా, అప్పులున్నా, ముప్పులున్నా వీటన్నిటినీ ఒక పక్కనపెట్టి మరో పక్క నా పుస్తకాన్ని పెట్టుకోండి. మీ బాధలన్నీ మర్చిపోతారు. పుస్తకం చదివి హాయిగా నవ్వుతారు. బిగ్గరగా నవ్వుతారు... పగలబడి నవ్వుతారు... విరగబడి నవ్వుతారు... నవ్వుతూనే ఉంటారు. మీరలా నవ్వుతూనే ఉండాలని కోరుకుంటూ....
Telugu lo kathalu stories heart touching story | గుండె లోతుల్ని ఆవిష్కరించే కథ | 2026
Mahesh and Teacher Saroja – A Heart-Touching Story
Once upon a time, in a school, Teacher Saroja went to
her fifth-grade class. She told the children, “I love all of you equally.”
But this was not entirely true, because there was a boy
named Mahesh in the third row. Teacher Saroja didn’t like him at first.
He didn’t join games, didn’t wear his uniform properly, and his marks were low.
As time went on, Teacher Saroja noticed something. When she
checked Mahesh’s school record from previous years:
- In first
grade, his teacher wrote: “Mahesh is smart, friendly, and does his
homework well.”
- In second
grade, the teacher wrote: “Mahesh is excellent, but his mother was
sick, and he faced difficulties at home.”
- In third
grade, the teacher wrote: “Mahesh works hard in studies, but his
mother passed away, and his father doesn’t pay attention to him. He might
face big challenges.”
- In fourth
grade, the teacher wrote: “Mahesh is falling behind in studies. He
stays alone and seems unhappy. He may become a troubled child.”
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
After reading this, Saroja understood that Mahesh was not
a bad boy—he was just facing many problems at home. She felt sad that she
hadn’t noticed it before.
On Teachers’ Day, all students gave gifts to their
teachers. Mahesh came with a small paper bag. The bag was torn, and other
children laughed. But Saroja smiled and accepted it kindly. Mahesh told her,
“You look like my mother today.”
Saroja’s heart melted. From that day, she gave Mahesh
special care and encouragement. Slowly, Mahesh became active, confident, and
happy. By the end of the year, he stood first in his class.
Later, Mahesh went to secondary school, but he never forgot
Saroja. Every few years, he sent her letters, thanking her for believing in him
and helping him succeed.
Finally, after completing his medical degree, Mahesh
wrote to Saroja again. He asked her to be like a mother on his wedding day,
since his parents had passed away. On the wedding day, Saroja gave him a
special necklace—half of its stones were missing, but it was filled with love.
Moral of the Story:
- A
little care, love, and encouragement can change someone’s life.
- Everyone
may be going through struggles we don’t see.
- Kindness
and understanding can help someone grow strong and succeed.
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories, pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu
#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
Best Telugu Story about Friendship Stories : https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu

Post a Comment