Bhale Baapanamma Kids Song in Telugu
భలే బాపనమ్మ
గానం:మదన్, మూడవ తరగతి, టింబక్టు బడి, అనంతపురం జిల్లా.
Bhale Baapanamma Kids Song in Telugu | భలే బాపనమ్మ
భలే భలే బాపనమ్మ బండి కట్టింది
చిట పట రాళ్లల్లోన వాటపడింది
నిన్న పుట్టిన పాపకు తేలు కుట్టింది
ఆసుపత్రికెళ్తే ఆట్లాడుతుంది
గుండుకిందేస్తే గుడ్లిడుస్తుంది
పైన్నుంచీయేస్తే ప్రాణం పోతుంది.
Bhale Bhale Baapanamma, bandi kattindi
Chita pata raallalona vaatupadindi
Ninna puttina paapaku telu kuttindi
Aasupatri kelthey aaltlaadutundi
Gundukindeysthey gudlidistundi
Painunchi eysthey pranam potundi.
చల్లనైనదమ్మా మా బడి
గానం: అనిత , శిరీష, సౌజన్య, పోతులయ్య, అంజలి
డప్పు: పోతులయ్య
చల్లనైనదమ్మ మా బడి
ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి
చదువుల పువ్వులు పూసే-
ఇది నవ్వుల పూదోట
కమ్మని వెన్నెల కాచే-
సిరి మల్లెల విరిబాట
|చల్లనైనదమ్మా|
గోరుముద్దల్లాంటి-
కథలెన్నో మేము విన్నాం
మెదడుకు మేతను పెట్టే-
పాఠాలు మేము చదివాం
గురువులు మలిచిన శిల్పాలై ఈనాడు నిలిచాము
దిశలకు వెలుగులు పంచే దీపాలమైనాము
|చల్లనైనదమ్మా|
కోయిలమ్మలకంటే భలె కమ్మని పాటలు నేర్చి
లేడి కూనలకంటే చెంగ్ చెంగున గంతులు వేసి
భారతమాతను కొలిచే త్యాగయ్యలమౌతాము
భారతమాతను కాచే వీర సైనికులౌతాము
|చల్లనైనదమ్మా|
https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
Telugu Kids Songs Friendship Paatalu
https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Friendship Stories :
https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Marachembu Moral Story for Kid Telugu
https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
Telugu Kids Songs Friendship Paatalu
https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Friendship Stories :
https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
#pedaraasipeddamma
#stories
#telugustories
#kathalu
#telugukathalu
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu
0 Comments