Elephant - Friends ఏనుగు – స్నేహితులు | Friendship Story | Telugu Lo Stories
Dear Telugu Lo Stories Readers, here is the Telugu story about Elephant - Friends ఏనుగు – స్నేహితులు | Friendship Story | Telugu Lo Stories Updated 2026
ఏనుగు – స్నేహితులు || Elephant - friends
ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ, కోతుల గుంపుని చూసి, “మీరు నాతొ స్నేహం చేస్తారా?” అని అడిగింది.
కోతులు, “అబ్బో! నువ్వెంత పెద్దగా ఉన్నావో? మా లాగా కొమ్మలు పట్టుకుని ఉయ్యాలా జంపాల ఊగగలవా? అందుకే మనకి స్నేహం కుదరదు,” అన్నాయి.
ఆ ఏనుగుకి కుందేలు కనిపించింది. “హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా?” అని ఆశగా అడిగింది. “నువ్వు ఇంత పెద్దగా ఉన్నావ్, నాలాగా చిన్న బొరియలలో, కన్నాలలో దూరగలవా? మనకి స్నేహం ఎలా కుదురుతుంది?” అంది.
ఆ తరువాత ఏనుగు ఒక కప్పని కలిసింది. దాన్నికూడా స్నేహం కోసం అడిగింది. “నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు. నీతో స్నేహం కుదరదు,”అని చెప్పింది.
దారిలో నక్క కనిపిస్తే, దానిని కూడా అడిగి, కాదనిపించుకుంది. ఈలోగా, అడవిలోని జంతువులన్నీ చెల్లా చెదురుగా పరిగెడుతున్నాయి. “ఏమైంది? అంత భయంగా పారిపోతున్నారు?” అని ఒక ఎలుగుబంటి ని అడిగింది. “అయ్యో పులి జంతువుల్ని వేటాడుతోంది.” అని చెప్పి పారిపోయాయి. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులనందర్నీ కాపాడాలని అనుకుంది. పులి కెదురుగా నిలబడి, “దయచేసి నా స్నేహితులని చంపద్దు,” అంది.
“నీ పని నువ్వు చూసుకో …నీ కెందుకు వాళ్ళ గోల?” అంది పులి. తన మాట వినేట్టు లేదని, ఏనుగు పులి ని గట్టిగా కొట్టి బెదరకొట్టింది. పులి నెమ్మదిగా అక్కడినించి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. “నీ ఆకారం సరైనదే. ఇప్పట్నించీ నువ్వు మా అందరి స్నేహితుడివని ” ఎంతో మెచ్చుకున్నాయి.
కథ యొక్క నీతి : స్నేహానికి నియమాలు లేవు. ఏ రూపం,ఆకారం లో ఉన్నా స్నేహం స్నేహమే!
Elephant - Friends ఏనుగు – స్నేహితులు | Friendship Story |
Best Telugu Story about Friendship Stories : https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
-
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
🌟 FAQs in Telugu (బాల మిత్రుల కోసం)
1. ఈ కథలో ప్రధాన పాత్ర ఎవరు?
కథలో ప్రధాన పాత్ర ఒక ఏనుగు. అది ఒంటరిగా స్నేహితులు వెతుక్కుంటుంది.
2. ఏనుగు ఎందుకు స్నేహితులు కోసం వెతుకుతున్నది?
అది ఒంటరిగా ఉండి,
నిజమైన స్నేహితులను పొందడానికి ఆకాంక్షించింది.
3. కోతులు, కుందేలు, కప్ప ఎందుకు ఏనుగుతో స్నేహం చేయలేదు?
వారి శరీరం మరియు జీవన శైలుల కారణంగా వారు స్నేహం చేయలేమని అనుకున్నారు.
4. పులి స్నేహితులను ఎందుకు భయపెట్టింది?
పులి అడవిలోని ఇతర జంతువులను వేటాడుతూ,
వారు భయంతో పారిపోవాల్సి వచ్చింది.
5. ఏనుగు పులిని ఎలా నిలిపేసింది?
ఏనుగు ధైర్యంగా పులిని ఎదుర్కొని,
దానిని భయపెట్టింది మరియు అందరి స్నేహితులను కాపాడింది.
6. అందరూ చివరగా ఏనుగును ఎందుకు స్నేహితులుగా అంగీకరించారు?
ఆమె ధైర్యం,
సహాయమనసు వల్ల ఆమె నిజమైన స్నేహితురాలు అని తెలుసుకున్నారు.
7. ఈ కథ యొక్క నీతి ఏమిటి?
స్నేహానికి నియమాలు లేవు — ఆకారం,
రూపం లేదా పరిమాణం చూసి స్నేహం నిర్ణయం చేసుకోవద్దు.
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
🌟 FAQs in English (For Kids)
1. Who is the main character in the story?
The main character in the story is an elephant looking for friends.
2. Why did the elephant want friends?
Because she was alone and wanted good friends to be with.
3. Why did the monkeys, rabbit, and frog refuse to be friends?
They said the elephant was too big and couldn’t do what they do (swing on trees, fit in burrows, jump high).
4. What problem were the animals facing in the forest?
They were scared because a tiger was hunting them.
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
5. How did the elephant help the other animals?
The elephant bravely confronted the tiger and scared it away to save everyone.
6. Why did all the animals finally accept the elephant as a friend?
Because she was brave and helped protect them, they realized she was a true friend.
7. What is the moral of the story?
Friendship doesn’t follow rules — people (or animals) of all shapes and sizes can be good friends.
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, friendship story, friendship kathalu
Elephant - Friends ఏనుగు – స్నేహితులు | Friendship Story |
నీతి కథల మీద మీ అభిప్రాయం ఏంటి? క్రింద కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు. What is your opinion on fables? Can be specified in the comment section below.
#pedaraasipeddamma #stories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu

Post a Comment