Sampoorna Ramayanam Part 33 | సంపూర్ణ రామాయణం - సుందరకాండ - Ravana Sabha Hanuma


Sampoorna Ramayanam Part 33 | సంపూర్ణ రామాయణం - సుందరకాండ - Ravana Sabha Hanuma


Sampoorna Ramayanam Part 33 | సంపూర్ణ రామాయణం - సుందరకాండ - Ravana Sabha Hanuma


🚩 సంపూర్ణ రామాయణం - సుందరకాండ - రోజు 33 🚩


ఓం శ్రీ రామచంద్రాయ నమః 🙏

ఓం ఆంజనేయాయ నమః 🙏


కథా వివరణ:


రావణ సభలో హనుమ:

ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి గౌరవమిస్తూ దానికి కట్టుబడిన హనుమంతుడిని, రాక్షసులు రావణుని సభకు తీసుకు వెళ్ళారు. రాక్షసుల చర్య వల్ల బ్రహ్మాస్త్రం విడిపోయినా తన లక్ష్యం రావణుని కలవడం కాబట్టి వారికి కట్టుబడ్డట్టు ప్రవర్తించి సభకు వెళ్ళాడు 


రావణున్ని చూడగానే సీతమ్మను అపహరించినందుకు విపరీత కోపం ఉన్న.. అతడి ఆకర్షణ, సమయస్ఫూర్తి, ధైర్యం, తేజస్సు,శారీరకంగా శుభలక్షణాలు చూసి...ఈతడు ధర్మవిముఖుడై ఉండకపోతే యశో వైభావలలో ఇంద్రుణ్ణి సైతం తలదన్ని ఉండేవాడు గదా" అనుకొన్నాడు.


అలాగే రావణుడు కూడా క్రుద్ధుడై ఉన్నప్పటికీ హనుమంతుణ్ణి చూసి సంశయంలోకి వెళ్లారు. "ఇదివరలో తనను చూసి నేను గేలిచేసినందుకు నన్ను శపించిన శివుని వాహనమైన నందియా ఇతడు? లేక వానరరూపంలో వచ్చిన అసురరాజైన బానాసురుడా?" అనుకొన్నాడు.


అంతట రావణుని సచివులలో ప్రధానుడైన ప్రహస్తుడు "నీవు ఇక్కడకు వచ్చిన నిజమైన కారణమేమిటో చెబితో చాలు నిన్ను వదిలివేస్తాం" అని హనుమంతునికి అభయమిచ్చాడు.


అందుకు హనుమంతుడు ఇలా సమాధానమిచ్చాడు: "కౌతుకం గల వానరునిగా నేను కేవలం రావణుణ్ణి కలుసుకోవాలన్న కోరికతో మాత్రమే ఇక్కడకు వచ్చాను. నా వంటి ప్రాముఖ్యంలేని వ్యక్తికి రాజదర్శనం లభించటం సుదుర్లభమని నాకు తెలుసు. అందువల్ల వన్ను బందీగా చేసి రాజసభకు పట్టుకువెళతారన్న ఆశతో వినోదవనాన్ని ధ్వంసం చేశాను. ఎవరికిగాని హాని చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. కాని రాక్షసయోధులు నా మీద దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం వారిని వధించక తప్పలేదు.


ఇక నేను ఇక్కడకు వచ్చిన అసలు కారణమేమిటో చెబుతాను. దయచేసి వినండి. నా పేరు హనుమంతుడు. దశరథ మహారాజు యొక్క పుత్రుడైన శ్రీరాముని దూతగా నన్సు ఇక్కడకు పంపారు. అపహరించబడిన రాముని పత్ని సీత కోసం నేను ఎప్పటినుంచో అన్వేషిస్తున్నాను. నా అదృష్టం వల్ల ఆమెను ఇక్కడ కనుగొన్నాను. ఓ రాక్షసేంద్రా! రామలక్ష్మణుల శరాఘాతాల నుండి తప్పించుకొనగలవాడు ఎవడూ లేడనే సత్యాన్ని దయచేసి గ్రహించు. స్వయంభూవు అయిన బ్రహ్మ, పరమశివుడు. దేవేంద్రుడు సైతం రణరంగంలో రాముని ఎదిరించి నిలువలేరు.


"ఓ రావణా! నీవు ధర్మసూత్రాలను లెస్సగా ఎరిగినవాడవు. వివేకవంతుడైన వాడెవడుగాని ధర్మమార్గాన్ని విడనాడి వినాశనాన్ని కొని తెచ్చుకోదు. దయచేసి నా సలహా పాటించి సమయం మించిపోకముందే రామునికి సీతను తిరిగి అప్పగించు. గతంలో నీవు ఉగ్రమైన తపస్సాధనలు ఆచరించి దేవతల చేతుల్లోగాని, దానవుల చేతుల్లోగాని మృత్యువు సంభవించ కుండా చేసుకోగలిగావు. అలాగే సీతను అపహరించటమనే నీ అధార్మిక కృత్యం నీకు వినాశనాన్ని తెచ్చుపెడుతుందని ఇప్పటికైనా నీవు గ్రహిస్తే మంచిది. యావత్తు లంకను నేనైనా సరే సర్వనాశనం చేసివేయగలను ఇక సమస్త విశ్వాన్ని లయంచేసి పునః సృష్టి చేయగల రాముని గురించి చెప్పవలసిందేముంది?”.అని పలికాడు.


విభీషణుని జోక్యం:

కోపంతో రగిలిపోయిన రావణుడు, దూతను చంపడం సబబని ఆదేశిస్తాడు. అప్పుడు రావణుని తమ్ముడైన, ధర్మాత్ముడైన విభీషణుడు జోక్యం చేసుకుంటాడు. దూతను చంపడం రాజధర్మానికి విరుద్ధమని, దూతకు ఏదైనా శిక్ష విధించవచ్చని (ఉదాహరణకు, అవమానించడం లేదా బంధించడం) సలహా ఇస్తాడు. రావణుడు ఈ సలహాను అంగీకరించి, హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని, తద్వారా అతనికి అవమానం కలిగించాలని నిర్ణయిస్తాడు.


లంకా దహనం:

రాక్షసులు హనుమంతుని తోకకు వస్త్రాలు చుట్టి, నూనెతో తడిపి, దానికి నిప్పు పెడతారు. (ఈ సమయంలో సీతమ్మ విషయం తెలుసుకుని అగ్నిదేవుడిని ప్రార్థించి,హనుమ తోక కాలకుండా చల్లగా ఉండాలని కోరుకుంటుంది, సీతమ్మ తల్లి తపో మహిమ చేత అగ్ని కూడా హాయి కలిగించింది). 


అంతట హనుమంతుడు మొత్తం లంకా నగరం మరొక్క సారి పరికించి వారి పూర్తి బలాబలాలు అర్థం అయ్యాయి అనుకొన్న వెంటనే" కనురెప్పపాటు సమయంలో అకస్మాత్తుగా తన శరీరాన్ని కుదించుకొని చిన్నగా చేసి బంధనాలనుంచి జారిపోయాడు. బంధనం విడగానే ఒక పెద్ద కేక పెడుతూ గాలిలోకి ఎగిరిన హనుమంతుడు తక్షణమే తన మహాకాయాన్ని ధరించి నగర ద్వారం వద్ద పడివున్న ఇనుప గుదియను తీసుకున్నాడు. క్షణంలో కావలివాళ్ళను చంపివేసి అంతట "రాముని వద్దకు తిరిగివెళ్ళేలోగా రావణుణ్ణి, రాక్షసులను వ్యధకు గురిచేయాలంటే ఇంకా నేను చేయవలసిందేమిటి? నా వాలం జ్వలిస్తూ ఉంది కనుక లంకనంతటినీ మహాగ్నికీలలో ముంచెత్తటానికి దీనినెందుకు ఉపయోగించుకోకూడదు?" అనుకొన్నాడు.


అలా నిశ్చయించుకున్న హనుమంతుడు ప్రధాన సచివుని ప్రాసాదాగ్రం మీరకు లంఘించి దానికి నిప్పంటించాడు. అంతట ఒక ఇంటి కప్పు మీదనుండి మరొక ఇంటి కప్పుకు దుముకుతూ, పవిత్రమూర్తియైన ఒక్క విభీషణుని ప్రాసాదం మాత్రం వదలి అందరి ప్రాసాదాలకు నిప్పంటించగా లంకా నగరమంతటా మహాగ్నిజ్వాలలు వ్యాపించాయి.




రావణుని ప్రాసాదంతో సహా అనేక ప్రాసాదాలలోనికి కూడా హనుమంతుడు ప్రవేశించాడు. ఉద్భతమైన ప్రభంజనం కారణంగా అగ్నిజ్వాలలు అదుపు దాటి పోవటంతో ప్రాసాబాలపై అంతస్తులు శిథిలమై కుప్పకూలాయి. అమితమైన ఉష్ణోగ్రతలవల్ల స్వర్ణ, రజతాలు ద్రవీభవించి ముత్యాలతోను, రత్నాలతోను మిళితమై లావా వలె వీధుల్లోకి ప్రవహించింది.లంక మొత్తం మంటలలో తగలబడుతుంది. రాక్షసులు హాహా కారాలు చేశారు.


సీతమ్మకు అభయం - తిరుగు ప్రయాణం:

లంకను దహించిన తర్వాత, హనుమంతుడు తన తోకను సముద్రంలో ఆర్పేసుకుంటాడు. సీతమ్మ క్షేమాన్ని గురించి చింతిస్తూ,అయ్యో వానర బుద్ధితో ఎంత ఘోరం చేశాను అని దుఃఖించాడు. ఎంతటి మహా పాపం చేశాను తొందర పాటులో స్వామి కార్యాన్ని మొత్తం చెడగొట్టాను అని విలపించాడు,అదే సమయంలో హనుమకు కొన్ని శుభ శకునాలు కనిపించాయి.సిద్ధులు, చారనులు హనుమ పరాక్రమం గానం చేస్తూ, ఆశ్చర్య కరంగా అశోక వనం ఒక్కటే క్షేమం గా ఉండి అని పలికారు.


 అది విన్న హనుమ వెంటనే అశోకవనానికి తిరిగి వస్తాడు. సీతమ్మ భద్రంగా ఉందని గ్రహించి, ఆమెకు నమస్కరించి, రాముడు త్వరలోనే లంకకు వచ్చి ఆమెను రక్షిస్తాడని అభయం ఇస్తాడు. ఆమె నుండి ఆశీర్వాదాలు పొంది, తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతాడు "ప్రియమైన హనుమంతా! దయచేసి ఒక్కరోజు ఇక్కడనే ఉండు. నీ సాంగత్యం వల్ల నా దుఃఖతాపం నుండి అమితమైన ఉపశమనాన్ని పొందుతున్నాను. నిజానికి నీవు మళ్ళీ రావటమనేది అనిశ్చితం. నా దుఃఖాతిశయం వల్ల నేను జీవించటంకూడా అనిశ్చితమే. రాముడు, లక్ష్మణుడు. వానరులు మహాసాగరాన్ని ఎలా దాటివస్తారో నాకు అర్థం కావటం లేదు. అయినప్పటికి ఈ పరిస్థితుల్లో నేను జీవించగలిగివుండనని అనుకోలేకపోతున్నాను గనుక వారిని శీఘ్రమే వచ్చి నన్ను రక్షించమని నీవు గట్టిగా చెప్పాలి" అని సీత మరోమారు అభ్యర్థించింది.


హనుమంతుడు సీతను సాంత్వన పరచయత్నించాడు. ఆమెను రక్షించటంలో రాముని సమర్థతను గురించి సంశయం పోగొట్టాడు. తిరిగి వెళ్ళటానికి నిశ్చయించుకున్న హనుమంతుడు అర్శిత పర్వతాన్ని అధిరోహించాడు. తన కార్యాన్ని పూర్తిచేసుకున్న అనంతరం రాముణ్ణి చూడాలన్న ఉత్సుకత వల్ల హనుమంతుడు పర్వత శిఖరాన్ని తన పాదాలతో అణగద్రొక్కసాగాడు. అంతట హనుమంతుడు తన పరిమాణాన్ని విస్తరించగా పర్వతం చూర్ణం కాసాగింది. అక్కడ నివసిస్తున్న గంధర్వులు, జంతువులు భయంతో పారిపోసాగారు. నిజానికి హనుమంతుడు మహాలంఘన చేయడంతోనే ముప్పై యోజనాల ఎత్తువున్న ఆ మహాపర్వతం దిగబడుతూ భూతలంతో సమానమైంది.


ఆకాశంలో ప్రయాణిస్తూ హనుమంతుడు మరోసారి గౌరవపురస్సరంగా మైనాక పర్వతాన్ని స్పర్శించాడు. చివరకు మహేంద్రపర్వతాన్ని సమీపిస్తూ హనుమంతుడు తన వానరమిత్రులను కలుసుకునే ఉత్సుకతతో వాలసంచాలనం చేస్తూ విజయోత్సాహంతో గర్జించసాగాడు.


✨ ధర్మ సూక్ష్మం: ధర్మబోధను ఎంతటి బలవంతుడైనా, అహంకారియైనా సరే, ఆచరించకపోతే వినాశనం తప్పదని ఈ ఘట్టం తెలుపుతుంది. హనుమంతుని పరాక్రమం, యుక్తి, మరియు సీతమ్మ భద్రత పట్ల ఆయన చూపిన సహనం, భక్తి మనకు ఆదర్శం.


జయ శ్రీరామ! 🚩

జయ ఆంజనేయ! 🙏


....సశేషం

#Ramayana #SampoornaRamayanam

బలం విష్ణోః ప్రవర్ధతాం 🚩 🚩 🚩 

Read Also:  Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం https://telugulostories.blogspot.com/2026/03/sampoorna-ramayanam-part-1-1.html


Sampoorna Ramayanam Part 33 | సంపూర్ణ రామాయణం - సుందరకాండ - Ravana Sabha Hanuma


Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?

Sampoorna Ramayanam Part 33 | సంపూర్ణ రామాయణం - సుందరకాండ - Ravana Sabha Hanuma 🚩 సంపూర్ణ రామాయణం - సుందరకాండ - రోజు 33 🚩 ఓం శ్రీ రామచంద్రాయ నమః 🙏 ఓం...

ఈ కథను పిల్లలు చదవవచ్చా?

అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.

ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?

కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.

ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?

ఇది Devotional Stories విభాగానికి చెందిన తెలుగు కథ.

ఈ కథకు సంబంధించిన అంశాలు: Sampoorna Ramayanam Part 33 | సంపూర్ణ రామాయణం - సుందరకాండ - Ravana Sabha Hanuma, Devotional stories in Telugu, Bhakti Kathalu, Spiritual stories in Telugu

#TeluguStories #DevotionalStories #BhaktiKathalu #SpiritualStories #TeluguKathalu

ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు

Post a Comment

Previous Post Next Post