Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం

Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం


Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం

Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం

🚩 సంపూర్ణ రామాయణం - భాగం 1 🚩 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం | 


ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః


కథా ప్రారంభం:


సరయు నదీ తీరాన, కోసల దేశంలో అయోధ్య అనే మహానగరం ఉంది. దానిని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు. రాజ్యం సుభిక్షంగా ఉన్నా, తనకు సంతానం లేదన్న చింత దశరథుని వేధించేది.

కులగురువు వశిష్ఠుని సలహా మేరకు, దశరథుడు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో 'పుత్రకామేష్టి యాగం' నిర్వహించాడు. యజ్ఞఫలంగా అగ్నిదేవుడు ఇచ్చిన పాయసాన్ని ముగ్గురు భార్యలకు పంచాడు.

తత్ఫలితంగా... చైత్ర మాసం, శుక్ల పక్షం, నవమి తిథిన, పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నమందు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు.

ఈ నలుగురు అన్నదమ్ములు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతూ, వశిష్ఠుని వద్ద సకల వేదాలు, యుద్ధ విద్యలు అభ్యసించారు. రాముడు తండ్రికి ఇష్టుడిగా, ప్రజలందరికీ ఆప్తుడిగా పెరిగాడు. లక్ష్మణుడు ఎప్పుడూ రాముని వెన్నంటి ఉండేవాడు.

ఇలా ఆనందంగా సాగుతుండగా, ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని సభకు వచ్చాడు. తన యజ్ఞానికి రాక్షసుల నుండి రక్షణ కల్పించడానికి రాముని పంపమని కోరాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న రాముని పంపడానికి దశరథుడు మొదట అంగీకరించకపోయినా, వశిష్ఠుని మాటతో రాముని, అతనితో పాటు లక్ష్మణుని విశ్వామిత్రుని వెంట పంపాడు.


....సశేషం


నేటి నుండి లెక్క పెడితే శ్రీ రామ నవమి 37 రోజులు ఉంది ఈ ముప్పై ఏడు రోజులు రాముని గురించి చెప్పుకుంటే బాగుంది అనిపించింది, రాముని గురించి రామాయణం కంటే ఏది గొప్పగా చెప్పదు,ఇది అతి పెద్ద కావ్యం ఎలా సాధ్యం అనిపించింది,రాముని దయ ఉంటే అదే పూర్తి అవుతుంది, అవసరం లేకపోతే రాయనివ్వడు నాదేమి ఉంది అని రాముని ఆజ్ఞగా ప్రారంభం చేశాను,స్వామి సంకల్పం,స్వామి ఎంత వరకు,ఎన్ని రోజులు రాయిస్తే అన్ని రోజులు పోస్ట్ చేసుకుందాం, చదువుకొని తరిద్దాం....

జై శ్రీరామ్ 🙏


క్రెడిట్స్ : రామాయణం గ్రూప్.


Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 

 

1. దశరథ మహారాజుకు సంతానం ఎలా కలిగింది?
దశరథుడు కులగురువు వశిష్ఠుని సలహా మేరకు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. యజ్ఞ ఫలంగా అగ్నిదేవుడు ఇచ్చిన పాయసాన్ని తన భార్యలకు పంచడంతో శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నులు జన్మించారు.

 

2. శ్రీరాముడు ఎప్పుడు మరియు ఎలాంటి నక్షత్రంలో జన్మించాడు?
శ్రీరాముడు చైత్ర మాసం శుక్ల పక్షం నవమి తిథిన, పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు.

 

3. విశ్వామిత్ర మహర్షి ఎందుకు రాముడు, లక్ష్మణులను తనతో తీసుకెళ్లాడు?
విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞాన్ని రాక్షసుల నుండి రక్షించడానికి రాముడు, లక్ష్మణులను తనతో తీసుకెళ్లాడు.

 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html

Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం

 

🚩 Complete Ramayana – Part 1 🚩 Bālakāṇḍa – Birth of Lord Rama – Education

Best Telugu Story about Friendship Stories :  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Om Shri Sitaramachandra Parabrahmane Namah


Story Begins:

On the banks of the Sarayu River, in the kingdom of Kosala, there was a great city called Ayodhya. It was ruled by King Dasharatha. He had three queens: Kausalya, Sumitra, and Kaikeyi. Although the kingdom was prosperous, Dasharatha was troubled by the fact that he had no children.


On the advice of the royal guru Vashishta, Dasharatha performed the “Putrakameshti Yajna” under the guidance of Sage Rishyashringa. As a result of the ritual, Agni Deva gave divine payasam, which was shared among the three queens.


Consequently, in the month of Chaitra, on the ninth day (Navami) of the bright fortnight (Shukla Paksha), under the Punarvasu Nakshatra and Cancer (Karkataka) ascendant, Lord Rama was born to Kausalya. Bharata was born to Kaikeyi, and Lakshmana and Shatrughna were born to Sumitra.


These four brothers grew like the waxing moon, learning all the Vedas and martial arts under Sage Vashishta. Rama grew up to be dear to his father and beloved by all the people. Lakshmana was always at Rama’s side.


One day, while life continued happily, Sage Vishwamitra came to King Dasharatha’s court. He requested that Rama be sent with him to protect his yajna from demons. Although Dasharatha was initially reluctant to send the dearly raised Rama, on Vashishta’s advice, he sent Rama along with Lakshmana to accompany Vishwamitra.


…to be continued


Counting from today, Sri Rama Navami is 37 days away. I thought it would be good to talk about Rama during these thirty-seven days. Nothing can describe Rama’s greatness more than the Ramayana itself. Writing such a grand epic seemed impossible, but with Rama’s grace, it will be accomplished. 


If not necessary, nothing will be written; this has been started as per Rama’s command. Swami’s determination, Swami’s limits, and how many days we will write—all the days will be posted. Let’s read and reflect.


Jai Shri Ram 🙏

 

 

1. How did King Dasharatha get children?


On the advice of his royal guru Vashishta, King Dasharatha performed the Putrakameshti Yajna under the guidance of Sage Rishyashringa. As a result of the ritual, Agni Deva gave divine payasam, which was distributed among his wives. This led to the birth of Rama, Bharata, Lakshmana, and Shatrughna.

 

2. When and under which star was Lord Rama born?


Lord Rama was born on the ninth day (Navami) of the bright fortnight (Shukla Paksha) in the month of Chaitra, under the Punarvasu Nakshatra and Cancer (Karkataka) ascendant.

 

3. Why did Sage Vishwamitra take Rama and Lakshmana with him?


Sage Vishwamitra took Rama and Lakshmana with him to protect his yajna (sacred ritual) from demons.

 

Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 


Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 

  A నుంచి Z వరకు… 

ప్రతి అక్షరంలో ఒకే నామం — రామ 🔱❤️


A - అయోధ్య రామ

B - భార్గవ రామ

C - చిన్మయ రామ

D - దశరథ రామ

E - ఈశ్వర రామ

F - ఫల్గుణ రామ

G - గుణాత్మక రామ

H - హనుమంత రామ

I - ఇనాయ రామ

J - జగదభి రామ

K - కౌసల్య రామ

L - లక్ష్మణ రామ

M - మర్యాద రామ

N - నరహరి రామ

O - ఓంకార రామ

P - పురుషోత్తమ రామ

Q - కుశ-లవ రామ

R - రఘుకుల రామ

S - సీతా రామ

T - తారక రామ

U - ఉదాత్త రామ

V - వశిష్ట రామ

W - వైకుంఠ రామ

X - జితేంద్ర రామ

Y - యోగిత రామ

Z - జనహిత రామ 


జైశ్రీరామ్ 🙏

శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🛐❤️ 

#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

#DevotionalStories 

#storyintelugu​​​ #storiesintelugu #teluguneethikathalu #neethikathalu #telugufairytales #telugumoralstories #telugulostories

 

Post a Comment

Previous Post Next Post