Sampoorna Ramayanam Part 5 | Ayodhya Kanda సంపూర్ణ రామాయణం - భాగం 5 అయోధ్యకాండంలో మంథర కుట్ర & కైకేయి వరాల విషాద ఘట్టం

Sampoorna Ramayanam Part 5 |  Ayodhya Kanda సంపూర్ణ రామాయణం - భాగం 5 అయోధ్యకాండంలో మంథర కుట్ర & కైకేయి వరాల విషాద ఘట్టం


Sampoorna Ramayanam Part 5 |  Ayodhya Kanda సంపూర్ణ రామాయణం - భాగం 5 అయోధ్యకాండంలో మంథర కుట్ర & కైకేయి వరాల విషాద ఘట్టం

Sampoorna Ramayanam Part 5 |  Ayodhya Kanda సంపూర్ణ రామాయణం - భాగం 5 అయోధ్యకాండంలో మంథర కుట్ర & కైకేయి వరాల విషాద ఘట్టం


🚩 సంపూర్ణ రామాయణం - భాగం 5 🚩 అయోధ్యకాండ - సభలో పట్టాభిషేక ప్రతిపాదన - మంథర కుట్ర - కైకేయి వరాలు


కథా వివరణ:

1. సభలో ప్రతిపాదన - ప్రజల ఆమోదం:

వివాహం అనంతరం భరత, శత్రుఘ్నులు మేనమామ కోరిక మేరకు కేకయ దేశం వెళ్లారు. అక్కడే చాలా కాలం ఉన్నారు, అయోధ్యలో శ్రీరాముడు సకల సద్గుణాలతో ప్రజలందరి అపారమైన ప్రేమను చూరగొన్నాడు.అప్పటికి దశరథ మహారాజు తన రాజ్యాన్ని అరవైవేల సంవత్సరాలపాటు పరిపాలించాడు. ఇప్పుడు వృద్ధుడై సత్తువ సన్నగిల్లినందున దేహపతనానంతరం ఊర్ధ్వగతికి తనను తాను సిద్ధం చేసుకునేందుకుగాను ఎట్టకేలకు రాచరికపు విధుల నుండి వైదొలగాలని అభిలషించాడు. కాని దశరథమహారాజుకు రాబోయే దుర్దశను సూచిస్తూ ఎన్నో దుశ్శకునాలు పొడగొట్టసాగాయి. అందువల్ల వీలైనంత త్వరితంగా రాముణ్ణి వారసునిగా ప్రకటించాలని ఆయన ఆతురతతో వున్నాడు. రాముడిని 'యువరాజు'గా చూడాలని నిర్ణయించుకున్నాడు. కానీ రాజుగా ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా, ఒక మహా సభను ఏర్పాటు చేశాడు.

ఆ సభలో మంత్రులు, పురోహితులు,సామంత రాజులు, ప్రజలందరి ముందు తన మనసులోని మాటను చెప్పి, "నా నిర్ణయం సరైనదేనా? మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు. సభలోని వారంతా ఏకగ్రీవంగా, ఎంతో సంతోషంగా శ్రీరాముడి పట్టాభిషేకానికి ఆమోదం తెలిపారు.అప్పటికి రాముడి వయసు 27 ఏళ్లు.శ్రీరాముని సుగుణాలను,పరాక్రమాన్ని కీర్తించారు. దాంతో దశరథుడు ఆనందపడి, వశిష్టాది మునుల సలహా మేరకు మరుసటి రోజే పట్టాభిషేకానికి నిర్ణయం చేసి,ఘనంగా సన్నాహాలు మొదలుపెట్టాడు. రాముణ్ణి సభకు పిలిపించి నిన్ను వారసునిగా చేస్తాను అని అన్నాడు. రాముడి తండ్రి ఆశీర్వాదం తీసుకుని తన గృహానికి వెళుతూ ఉంటే మళ్ళీ రావాల్సింది అని ఆజ్ఞ చేశాడు దశరథుడు.నాయన నాకు అనేక అపశకునాలు కనపడుతూ ఉన్నాయి ప్రస్తుతం నాకు దుర్దశ నడుస్తుంది, అందుకే తొందర పడుతున్నాను నీ సోదరులు భరతశత్రుఘ్నులు లేకున్నా సరే. నీవు సీతతోపాటు ఈ రాత్రి ఉపవాసంతో దీక్ష పూనాలి. ఆపైన రేపు తెల్లవారుతూనే పట్టాభిషేకానికి సన్నద్ధుడివై ఉండాలి" అని చెప్పాడు.


2. మంథర దుర్భోధ:

రాముడు రాజు కాబోతున్నాడు అని ప్రజల ఆనందానికి అవధులు లేవు,అయోధ్య నగరం మొత్తం తోరణాలతో పండుగలా ముస్తాబైంది. ఎక్కడ చూసినా ఆనందమే ఈ కోలాహలాన్ని కైకేయి దాసి అయిన 'మంథర' చూసింది.రాముడి పట్టాభిషేకం అని తెలియగానే ఆమె మనసు విషపూరితమైంది. వెంటనే కైకేయి దగ్గరికి వెళ్లి, "రాముడు రాజు అయితే నీవు కౌసల్యకు దాసివి అవుతావు. నీ కొడుకు భరతుడికి రాజ్యంలో స్థానం ఉండదు. నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు" అంటూ నూరిపోసింది.


3. ఆ రెండు వరాల నేపథ్యం:

మొదట రాముడి మీద ప్రేమతో మంథర మాటలను కొట్టిపారేసిన కైకేయి, మంథర పదే పదే చెప్పిన మాయమాటలకు లొంగిపోయింది. అప్పుడు మంథర... గతంలో దశరథుడు ఇచ్చిన 'రెండు వరాలను' ఇప్పుడు వాడుకోమని సలహా ఇచ్చింది.

(గతంలో దేవాసుర యుద్ధం జరిగినప్పుడు, దశరథుడు 'శంబరాసురుడు' అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ తీవ్రంగా గాయపడి మూర్ఛపోయాడు. అప్పుడు ఆయనతో పాటే రథంపై ఉన్న కైకేయి, తన ప్రాణాలకు తెగించి ఆయన ప్రాణాలు కాపాడింది. సంతోషించిన దశరథుడు రెండు వరాలు కోరుకోమనగా, 'అవసరమైనప్పుడు అడుగుతాను' అని కైకేయి వాటిని దాచుకుంది.)


4. కైకేయి కోపగృహం - వరాలు అడిగిన తీరు:

మంథర సలహాతో కైకేయి తన ఆభరణాలను తీసివేసి, మాసిన బట్టలతో 'కోపగృహం' (అలిగి ఉండే గది) లోకి వెళ్లి పడుకుంది. దశరథుడు వచ్చి ఎంత బ్రతిమాలినా వినలేదు. చివరగా రాముని మీద ఒట్టు వేయించుకుని ఆ దాచుకున్న రెండు వరాలను అడిగింది:

 మొదటి వరం: రాముడి కోసం చేసిన ఏర్పాట్లతోనే నా కుమారుడు 'భరతుడికి పట్టాభిషేకం' జరగాలి.

 

రెండవ వరం: రాముడు నారచీరలు కట్టుకుని పద్నాలుగేళ్ల పాటు 'దండకారణ్యానికి (వనవాసానికి)' వెళ్లాలి.

రాముడిపై ప్రాణాలకంటే మిన్నగా ప్రేమ ఉన్న దశరథుడు ఆ కఠినమైన మాటలు విని గుండె పగిలి స్పృహతప్పి కుప్పకూలిపోయాడు.


...... సశేషం......

Read Also:  Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం https://telugulostories.blogspot.com/2026/03/sampoorna-ramayanam-part-1-1.html



"జై శ్రీరామ్" అని కామెంట్ చేసి, తోటి భక్తులతో పంచుకోండి. 🙏

బలం విష్ణోర్ ప్రవర్ధతామ్...


జై శ్రీరామ్ 🙏  

 

సంపూర్ణ రామాయణం అయోధ్యకాండంలో మంథర కుట్ర & కైకేయి వరాల విషాద ఘట్టం

 

  టాప్ 5 FAQs (తెలుగులో):

1. రాముడి పట్టాభిషేకం ఎందుకు త్వరగా నిర్ణయించారు?
దశరథుడు వృద్ధాప్యానికి చేరుకుని అపశకునాలు కనిపించడం వల్ల త్వరగా రాముణ్ణి యువరాజుగా చేయాలని భావించాడు.

2. మంథర ఎందుకు కుట్ర పన్నింది?
రాముడు రాజు అయితే కైకేయి స్థానం తగ్గిపోతుందని భావించి మంథర దుష్ప్రేరణ చేసింది.

3. కైకేయికి వచ్చిన రెండు వరాలు ఏమిటి?
భరతుడిని రాజుగా చేయడం మరియు రాముడిని 14 సంవత్సరాలు వనవాసానికి పంపడం.

4. రెండు వరాలు ఎలా వచ్చాయి?
దేవాసుర యుద్ధంలో కైకేయి దశరథుడి ప్రాణాలు కాపాడినప్పుడు ఆయన ఇచ్చిన వరాలు అవి.

5. దశరథుడు ఎలా స్పందించాడు?
రాముడిపై అపారమైన ప్రేమ ఉన్న దశరథుడు వరాలు విని తీవ్రంగా బాధపడి మూర్ఛపోయాడు.

 

 

Sampoorna Ramayana – Ayodhya Kanda: Manthara’s Plot & Kaikeyi’s Boons Tragedy

 

Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


🚩 Sampoorna Ramayana – Part 5 🚩

Ayodhya Kanda – Proposal of Coronation, Manthara’s Conspiracy, and Kaikeyi’s Boons

Story Summary:

After the marriage, Bharata and Shatrughna went to their maternal uncle’s kingdom and stayed there for a long time. Meanwhile, in Ayodhya, Lord Rama won the hearts of all people with his noble virtues.


King Dasharatha, having ruled for many years, had grown old and wished to retire from royal duties and prepare for spiritual liberation. However, he began noticing several bad omens, which made him anxious. He decided to crown Rama as his successor as soon as possible.


Instead of making a unilateral decision, Dasharatha convened a grand सभा (assembly) and sought the opinion of ministers, sages, and citizens. Everyone unanimously approved Rama’s coronation and praised his qualities. With great joy, preparations for the coronation were initiated for the very next day.


Meanwhile, the entire city of Ayodhya was filled with celebration. Manthara, the maid of Kaikeyi, upon seeing the festivities, became envious. She poisoned Kaikeyi’s mind by saying that if Rama became king, Kaikeyi would lose her status and Bharata would be sidelined.


Initially, Kaikeyi ignored her, but eventually fell into her trap. Manthara reminded her of the two boons granted by Dasharatha in the past, when Kaikeyi had once saved his life during a battle.


Following Manthara’s advice, Kaikeyi entered the anger chamber and demanded her boons:

  • First boon: Bharata should be crowned king instead of Rama.
  • Second boon: Rama should be exiled to the forest for fourteen years.

Hearing this, Dasharatha, who loved Rama deeply, was devastated and collapsed in shock.

…To be continued…


Sampoorna Ramayanam Part 5 | Ayodhya Kanda సంపూర్ణ రామాయణం - భాగం 5 అయోధ్యకాండంలో మంథర కుట్ర & కైకేయి వరాల విషాద ఘట్టం


Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids 

5. Top 5 FAQs (English):

1. Why did Dasharatha decide to crown Rama quickly?
Due to old age and bad omens, he wanted to ensure a smooth succession.

2. Why did Manthara oppose Rama’s coronation?
She feared Kaikeyi would lose her influence and Bharata would be sidelined.

3. What were the two boons asked by Kaikeyi?
Bharata’s coronation and Rama’s exile for 14 years.

4. How did Kaikeyi receive the boons?
Dasharatha granted them when she saved his life during a past battle.

5. What was Dasharatha’s reaction?
He was heartbroken and fainted upon hearing Kaikeyi’s demands.

 Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Ramayana Ayodhya Kanda, Rama coronation story, Kaikeyi boons story, Manthara conspiracy, Dasharatha Rama exile, Bharata coronation, Ramayana Telugu story, Hindu mythology stories, Lord Rama exile कथा, Ramayana summary English

 

#Ramayana, #LordRama, #AyodhyaKanda, #HinduMythology, #IndianEpics

 


Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ...

Post a Comment

Previous Post Next Post