Sampoorna Ramayanam Part 31 | సంపూర్ణ రామాయణం - సీతమ్మ అనుమానం - 31 వ రోజు
Sampoorna Ramayanam Part 31 | సంపూర్ణ రామాయణం - సీతమ్మ అనుమానం - 31 వ రోజు
🚩 సంపూర్ణ రామాయణం పారాయణం - 31 వ రోజు 🚩
ఓం శ్రీ రామచంద్రాయ నమః 🙏
ఓం ఆంజనేయాయ నమః 🙏
కథా వివరణ
హనుమంతుడు వినిపించిన రామకథను విన్న సీతమ్మ, ఆ మాటలు పలుకుతున్నది ఎవరో తెలుసుకోవాలనే కుతూహలంతో తల పైకెత్తి చెట్టు కొమ్మల్లోకి చూస్తుంది. అక్కడ వినయంగా చేతులు కట్టుకుని ఉన్న ఒక చిన్న వానరాన్ని (హనుమంతుడిని) చూస్తుంది. మొదట ఆమె ఆశ్చర్యానికి, కొంత భయానికి లోనవుతుంది.ఇది కల అని అనుకుంటుంది కలలో వానరం కనిపించడం అశుభం కనుక రామ, లక్ష్మణుల కు శుభ కలగాలి అని కోరుకుంటుంది.కానీ అంతలోనే అసలు నిద్ర పోతే కదా కల వచ్చేది నేను ఈ పది నెలల కాలంలో నిద్రయే పోలేదు కల ఎలా వస్తుంది.నేను ఎల్లప్పుడూ రామ నామ స్మరణ, ధ్యానం లో ఉండటం వల్ల నాకు అలా అనిపించి ఉండవచ్చు అనుకుంది.కానీ వానరాన్ని చూడటం భ్రమ అని అనిపించడం లేదు ఓ సూర్య,చంద్ర, వాయు దేవులారా.ఆ వానరం వాస్తవంగా ఉండేలా చేయండి. శ్రీరాముని గురించి ఆ వానరం చెప్పిన మాటలు నిజం అయ్యేలా చేయండి అని వేడుకుంది.
అదే సమయంలో కొమ్మల చాటున ఉన్న హనుమ క్రిందకి దిగి వచ్చాడు. సీతమ్మ ఎదుట చేతులు జోడించి నిలబడి,అమ్మా నీవెవరవు? ఎవరో దేవత వలె కనపడుతూ ఉన్నావు. నీవు సీతమ్మ సహధర్మచారిణివే అయి ఉండవచ్చు అని తలుస్తూ ఉన్నాను అన్నాడు.
రాముని పేరు వినటంతోనే సీత మహదానందం చెంది హనుమంతుని ప్రశ్నలకు సమాధానంగా దాదాపుగా తన జీవిత వృత్తాంతాన్నంతటిని అతనికి వర్ణించి చెప్పింది. చివరగా నేను జీవించటానికి రావణుడు రెండుమాసాల వ్యవధి మాత్రమే ఇచ్చాడు, ఆ లోగా రాముడు ఇక్కడకు రాకుంటే నా ప్రాణాలు త్యజిస్తాను" అని వివరించింది.
ఆమె నమ్మకాన్ని చూరగొన్న హనుమంతుడు "నేను రాముడు పంపగా వచ్చిన దూతను. ఆయన క్షేమంగానే ఉన్నాడు. నీ జాడ కనిపెట్టటానికై రాముడు నన్ను ఇక్కడకు పంపించాడు. నీ యోగక్షేమాల గురించి ఆయన కుతూహలంతో తెలుసుకొనగోరుతున్నాడు" అని చెప్పాడు.
సీతమ్మ అనుమానం
సీత ఎంతగానో ఆనందించింది. అమితమైన సంతోషంతో వారు పరస్పరం సంభాషించుకొంటూనే ఉన్నారు. అయితే వారు అలా సంభాషణలో నిమగ్నులై ఉండగా హనుమంతుడు క్రమంగా సీతకు మరింత దగ్గరవుతూ వస్తున్నాడు. దీనిని గమనించిన సీతలో ఆకస్మికంగా అతను నిజానికి వానరరూపంలో ఉన్న రావణుడేనేమో అన్న ఆలోచన కలిగింది. అందువల్ల "అయ్యో! నీ మాయకు లోబడి నీతో సంభాషణకు దిగటం ఎంత జుగుప్సాకరంగా ఉంది!" అని అరచింది.
అంతట సీత నేలమీదికి ఒరిగింది. దుఃఖంతో అలసిపోయిన ఆమె “ఇలా మారువేషంతో నా దగ్గరకు వచ్చిన నీవెంత నీచుడవు?" అంటూ హనుమంతుణ్ణి నిందించింది. కాని మరుక్షణం “ఈ వానరాన్ని చూస్తే నా హృదయంలో నిశ్చయంగా ఆనందం కలుగుతోంది. బహుశా నా అనుమానాలు అవాస్తవమై ఉండవచ్చు. బహుశా అతను నిజంగానే రాముని నుండి వచ్చిన దూతయై ఉండవచ్చును" అని భావించింది. అలా స్థిమితపడిన సీత తిరిగిహనుమంతుని పట్ల మరింత అనుకూల దోరణి కనబరుస్తూ "దయచేసి నాకు రాముణ్ణి గురించి మరింతగా చెప్పు, ఆయన గురించి నీవు చేసిన వర్ణనలు నా వీనులకు, హృదయానికి అత్యంత సంతోషదాయకంగా ఉన్నాయి" అంది
రామ లక్ష్మణ వర్ణన
సీతమ్మ స్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న హనుమ రామ లక్ష్మణుల యొక్క ప్రతి అంగాన్ని, లక్షణాన్ని వర్ణించి చెప్పి,వారు సుగ్రీవుని ఎలా కలుసుకున్నారు.తాను ఇక్కడికి ఎలా వచ్చింది అన్ని పూస గుచ్చినట్టు చెప్పాడు.
(ఇక్కడ అనుమానం రావచ్చు ఇంత జరుగుతుంటే రాక్షస స్త్రీలు ఏం చేస్తున్నారు అని త్రిజట కల గురించి చెప్పాక వారు భయంతో నిద్రించారు కొందరు మేల్కొని ఉన్న వారికి అర్థం కాకుండా నే సంభాషణ జరిగేలా హనుమ ప్రవర్తించాడు అని ముందే చెప్పుకున్నాం కదా)
అలా మొత్తం వివరణ చెప్పి చివరగా తన గురించి కూడా చెప్పాడు"నేను వానరుల్లో మహాబలవంతుడైన కేసరి నందనుడను. నా తండ్రి తొలుత మలయపర్వతాల్లో నివసిస్తూ తదనంతరం గోకర్ణ పర్వతానికి మారాడు. శంబసాదనుడు దేవర్షులను పీడిస్తుండగా వారి ప్రార్ధన మీద కేసరి ఆ మహాదానవుణ్ణి సంహరించాడు. ఆ తర్వాత కేసరి పత్ని యొక్క గర్భంలో వాయుదేవుని వల్ల నేను జన్మించటం జరిగింది" అని చెప్పాడు.
అంగుళీయక ప్రదానం
రాముని గురించి హనుమ చేసిన వర్ణన తో సీతమ్మకు నమ్మకం కుదిరింది. ఆనందంతో పొంగి పోయి పది నెలల తర్వాత కన్నీరు కాకుండా ఆనంద భాష్పాలు కార్చింది.ఇదే సరైన సమయం అని హనుమ రాముడు ఇచ్చిన అంగుళీయకం సీతమ్మకు ఇచ్చాడు హనుమ.దానిని గుర్తించి దాని బంధనములోపల తన ప్రియతముని నామాన్ని చూచి, రాముడే స్వయంగా వచ్చిన అనుభూతి కలిగినట్లు సీతముఖం ఆనందంతో వికసించింది. "ఓ హనుమంతా! ఈ కానుక ఇచ్చినందుకుగాను నీకు శాశ్వతంగా ఋణపడి ఉన్నాను.. నా కోసమై నీవిక్కడకు రావటం నీ ఔదార్యాన్ని చాటుతోంది. ఇప్పుడు దయతో మరింతగా రాముని గురించి నాకు చెప్పు" అన్నదామె.
హనుమంతుడు చేతులు జోడించి "నీవు ఎక్కడున్నావో రామునికి తెలియనందువల్లనే ఆయన నిన్ను రక్షించటానికి ఇక్కడకు రాలేదు. నీవు లేక రాముడు ఒక క్షణమైనా మనశ్శాంతి ఎరుగడు.
Read Also: Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
కథ సమాచారం
| కథ రకం | Devotional Stories |
|---|---|
| ప్రధాన అంశం | భక్తి, ధర్మం మరియు ఆధ్యాత్మిక సందేశం |
| ఎవరికి ఉపయోగకరం | పిల్లలు, కుటుంబ సభ్యులు మరియు తెలుగు కథలను ఇష్టపడే పాఠకులు |
| ముఖ్యమైన సందేశం | కథలోని సంఘటనలను ఆలోచించి, అందులోని మంచి పాఠాన్ని జీవితంలో ఉపయోగించుకోవచ్చు. |
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?
Sampoorna Ramayanam Part 31 | సంపూర్ణ రామాయణం - సీతమ్మ అనుమానం - 31 వ రోజు Sampoorna Ramayanam Part 31 | సంపూర్ణ రామాయణం - సీతమ్మ అనుమానం - 31 వ రోజు 🚩...
ఈ కథను పిల్లలు చదవవచ్చా?
అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.
ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?
కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.
ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?
ఇది Devotional Stories విభాగానికి చెందిన తెలుగు కథ.
ఈ కథకు సంబంధించిన అంశాలు: Sampoorna Ramayanam Part 31 | సంపూర్ణ రామాయణం - సీతమ్మ అనుమానం Seethamma, Devotional stories in Telugu, Bhakti Kathalu, Spiritual stories in Telugu
ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు
- IndianInQ8 — Latest Jobs, News & Entertainment
- Kuwait Bus Routes — Kuwait City Bus Routes & Information
- ITIL Course — ITIL Learning & Course Resources
Post a Comment