Sampoorna Ramayanam Part 27 | సంపూర్ణ రామాయణం - Swayamprabha Guha | స్వయంప్రభ గుహ

Sampoorna Ramayanam Part 27 | సంపూర్ణ రామాయణం -  భాగం 27 | స్వయంప్రభ గుహ

Sampoorna Ramayanam Part 27 | సంపూర్ణ రామాయణం -  భాగం 27 | స్వయంప్రభ గుహ


Sampoorna Ramayanam Part 27 | సంపూర్ణ రామాయణం -  భాగం 27 | స్వయంప్రభ గుహ



🚩 సంపూర్ణ రామాయణం -  భాగం 27 🚩 ఓం శ్రీ రామచంద్రాయ నమః 🙏 


కథా వివరణ: 


సీతాన్వేషణలో నిమగ్నులైన వానరులు పగటివేళ విడిపోయి తమకు కేటాయించబడిన ప్రాంతాలలో గాలిస్తూ రాత్రి వేళల్లో బృందమంతా మరల కలిసివిశ్రమిస్తుండేవారు. వినతుడు, శతబలి, సుషేణుడు తమకు నిర్దేశించబడిన ప్రాంతాలలో(తూర్పు,ఉత్తర,పడమర దిక్కుల్లో) క్షుణ్ణంగా గాలింపు జరిపి నెల పూర్తి అయ్యేలోగా తిరిగివచ్చారు. సీత జాడ గురించి ఏ ఒక్క ఆధారాన్ని కూడా తాము కనిపెట్టలేకపోయామని విచారవదనాలతో వారు సుగ్రీవునికి,రాముడికి నివేదించారు.  అందరూ హనుమంతుడే ఇక తమకు ఏకైక ఆశాకిరణమన్న నిర్ధారణకు వచ్చారు.


అంగదుని నేతృత్వంలోని బృందం నిర్జనమైన వింధ్యాచల ప్రాంతమంతా అన్వేషణ జరిపి ఆ ప్రదేశంలో ఎక్కడా నీరు లభ్యం కాకపోవటాన ఆకలి దప్పులతో అలమటించి పోయారు. అంతట ఆ వానరులు ఆ పర్వతప్రాంతాన్ని విడిచి సమీపారణ్యంలోకి ప్రవేశించి అక్కడ వృక్షాలకు ఫలపుష్పాల మాట అటుంచి కనీసం ఆకులైనా లేకపోవటం చూచి నిస్పృహ చెందారు. ఆ ప్రదేశంలోని సెలయేళ్ళన్నీ శోషించిపోవటంతో అక్కడ పశుపక్ష్యాదులు కూడా లేవు.


ఆ అరణ్యంలో ఒకప్పుడు కండు మహర్షి నివసిస్తుండేవాడు. ఆయన కుమారుడు అల్పాయుష్కుడై పది సంవత్సరాల వయసులో మరణించగా ఆయన కోపోద్రిక్తుడై ఆ అరణ్యం మొత్తం మనుష్యులుకాని మృగాలు కాని నివసించటానికి అయోగ్యమయ్యే విధంగా శపించాడు.


ఆ నిర్జనారణ్యంలో తిరుగుతున్న వానరులకు ఒక భయంకర రాక్షసుడు ఎదురుపడ్డాడు. దేవతల నుండి వరాన్ని పొందిన ఆ దానవుడు నిర్భయంగా సంచరిస్తూ అతన్ని రావణునిగా భావించి అంగదుడు సంహరించాడు. కాని సీత ఎక్కడుందో కనిపెట్టాలని అంగదుని బృందం ఆ ప్రాంతాన్నంతటినీ గాలించినా ఫలితం కనిపించకపోవటంతో వారు నిస్పృహచెందారు.


స్వయంప్రభ గుహ:

కాలం త్వరగా గడిచిపోయింది. వింధ్య పర్వతశ్రేణుల పరిసరాల్లో అంగదుని సూచనల ప్రకారం వానరులు అన్వేషణ కొనసాగిస్తుండగానే వారికి కేటాయించబడిన నెలరోజుల గడువు ముగింపుకు వచ్చింది. ఆకలి దప్పులకు లోనైన వానరులు నీటికోసం వెతుకసాగారు. అంతట ఒకేచోట జలసిక్తమైన లతలు దట్టంగా అల్లుకొని జలపక్షులు మూగి వున్న ఒక గుహ ఉండటాన్ని అంగదుడు, తారుడు కనిపెట్టారు. ఆ గుహ లోపల నీరు లభ్యమవు తుందేమోనని వారు వేగంగా గుహ వైపు వెళ్ళారు.


అది మయుని చేత నిర్మితమైన మాయాబిలం. అక్కడ 'స్వయంప్రభ' అనే యోగిని వారిని ఆదరించి, పండ్లు, జలాలను అందిస్తుంది. అందులోకి వెళ్లిన వారు భయట పడటం అసాధ్యం కానీ రామ కార్యము కోసం వెళ్తున్నారు కనుక యోగిని తన తపఃశక్తితో వానరులను క్షణకాలంలో సముద్ర తీరానికి చేరుస్తుంది.


సంపాతి సందేశం:

సముద్ర తీరానికి చేరుకున్న వానరులకు అంతులేని మహా సముద్రం కనిపిస్తుంది. గడువు ముగిసిపోవడంతో అంగదుడు దిగులు చెంది ప్రాయోపవేశానికి (మరణానికి సిద్ధపడటం) సిద్ధపడతారు.అప్పుడు జటాయువు అన్నయైన 'సంపాతి' అక్కడకు వస్తాడు. రెక్కలు కాలి పోయిన ఆ పక్షి ఆహారం దొరికిందని అనుకుంది కానీ.వానరుల మాటల ద్వారా తన తమ్ముడు జటాయువు మరణ వార్త విని దుఃఖిస్తాడు. 


వానరులు, హనుమ రామ కథను సీతాపహరణ మొత్తం సంపాతి కి చెప్తే, నేను ఒకనాడు పెద్ద రాక్షసుడు యువతిని పట్టుకుని తీసుకు వెళ్తూ ఉండటం నేను చూశాను .నా కుమారుడు అతన్ని పట్టి చంపి నాకు ఆహారం గా తేవాలి అనుకున్నాడు కానీ. అతడు మర్యాదగా నాకు దారి ఇవ్వు అని అడగడం తో వదిలి వేశాడు.ఆ తరువాత మునులు అతడు క్రూరుడు అయిన రాక్షసుడు ఈరోజు మీ అదృష్టం బాగుంది లేదంటే వాడికి ఎదురు తిరిగి బతికే వాడు ఉండరూ అన్నారు.ఆ యువతి సీతమ్మ యే అని నేను చెప్పగలను.


తన అద్భుతమైన దృష్టితో వంద యోజనాల దూరంలో ఉన్న లంకలో, సీతమ్మ ఉన్నదని వానరులకు సంపాతి దివ్య సమాచారాన్ని అందిస్తాడు.


అలా చెప్పిన వెంటనే సంపాతి కి కాలి పోయిన రెక్కలు తిరిగి వచ్చాయి. అదీ రామ మహిమ.రామ కార్యంలో ఎవడు పాల్గొంటారో వారికి ఏది దక్కాలో అది దక్కి తీరుతుంది.


మహేంద్రగిరి చేరిక:

సీతమ్మ జాడ తెలియడంతో వానరులలో కొత్త ఉత్సాహం వస్తుంది. కానీ ఆ నూరు యోజనాల సముద్రాన్ని ఎలా దాటాలో అన్న సందేహం అందరినీ వెంటాడుతుంది. అంగదుడు నేను వెళ్ళగలను కానీ తిరిగి మళ్ళీ రాగాలనో లేదో తెలియదు అన్నాడు. జాంబవంతుడు నేను 1000 యోజనాలు కూడా ఎగర గలను కానీ ఇప్పుడు అంత జవసత్వం నాలో లేదు అన్నాడు. దాంతో అందరూ మళ్ళీ నిరాశలో మునిగి పోతే.హనుమ మాత్రం మౌనంగా కూచుని ఉన్నాడు.


జాంబవంతుడు ఎవరూ చింతించ వద్దు ఈ కార్యాన్ని అలవోకగా చేయగల సమర్ధుడు మన హనుమ అని హనుమ జన్మ వివరాలు, ముని శాపం చెప్పు, హనుమ శక్తిని గుర్తు చేశాడు. పుట్టిన 5 వ రోజే 3 వేల యోజనాల ఎత్తు ఎగిరి సూర్యున్నే పండులా పట్టబోయిన హనుమకు అసాధ్యం ఏది లేదు.అంటూ


చివరకు జాంబవంతుడు ఇలా ముగించాడు. "హనుమంతుడు ఒక్కడే మన కార్యాన్ని నిర్వహించగల సమర్థుడని నేను భావిస్తున్నాను. వెనుకటిరోజుల్లోనైతే ఈపాటి లంఘనం నాకొక లెక్కలోనిది అయివుండేది కాదు. 


Read Also:  Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం https://telugulostories.blogspot.com/2026/03/sampoorna-ramayanam-part-1-1.html



Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


 

తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?

Sampoorna Ramayanam Part 27 | సంపూర్ణ రామాయణం - భాగం 27 | స్వయంప్రభ గుహ Sampoorna Ramayanam Part 27 | సంపూర్ణ రామాయణం - భాగం 27 | స్వయంప్రభ గుహ 🚩...

ఈ కథను పిల్లలు చదవవచ్చా?

అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.

ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?

కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.

ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?

ఇది Devotional Stories విభాగానికి చెందిన తెలుగు కథ.

ఈ కథకు సంబంధించిన అంశాలు: Sampoorna Ramayanam Part 27 | సంపూర్ణ రామాయణం - Swayamprabha Guha | స్వయంప్రభ గుహ, Devotional stories in Telugu, Bhakti Kathalu, Spiritual stories in Telugu

#TeluguStories #DevotionalStories #BhaktiKathalu #SpiritualStories #TeluguKathalu

ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు

Post a Comment

Previous Post Next Post