Sampoorna Ramayanam Part 26 | సంపూర్ణ రామాయణం - 26వ రోజు | కిష్కింధాకాండ -సుగ్రీవుని జాప్యం
Sampoorna Ramayanam Part 26 | సంపూర్ణ రామాయణం - 26వ రోజు | కిష్కింధాకాండ -సుగ్రీవుని జాప్యం
🚩 సంపూర్ణ రామాయణం - 26వ రోజు 🚩
కిష్కింధాకాండ -సుగ్రీవుని జాప్యం - లక్ష్మణుని ఆగ్రహం - వానర సైన్య సమీకరణ - శ్రీరాముని అంగుళీయక ప్రదానం
కథా వివరణ:
శ్రీరాముని నిరీక్షణ - సుగ్రీవుని మరుపు:
వర్షాకాలం వెళ్లి ఆకాశం నిర్మలంగా మారి శరదృతువు వచ్చింది. ప్రకృతి వికసిస్తున్నా రాముని హృదయం మాత్రం శోకంతోనే ఉంది.
కానీ కిష్కింధలో సుగ్రీవుడు మాత్రం రాజ్యభోగాలలో, తార మత్తులో పడిపోయి శ్రీరాముడికిచ్చిన మాటను పూర్తిగా మరిచిపోయాడు.కార్యసాధకుడైన హనుమంతుడు సుగ్రీవుడిని హెచ్చరిస్తే, సైన్యాన్ని సమీకరించమని మంత్రులకు ఆదేశాలు ఇచ్చి మళ్ళీ అంతఃపుర భోగాల్లోకి వెళ్ళిపోయాడు సుగ్రీవుడు.
లక్ష్మణుని కోపాగ్ని - తార సమయస్ఫూర్తి:
శరదృతువు వచ్చిన కదలిక లేని సుగ్రీవుని తీరు చూసి శ్రీరాముడికి కోపం వచ్చింది.అన్న బాధను చూడలేని లక్ష్మణుడు తన ధనుస్సును ధరించి కాలాగ్ని రుద్రుడిలా కిష్కింధకు బయలుదేరాడు. లక్ష్మణుడు విసవిసా బయలుదేరుతుండగా రాముడు 'ముందుగా సుగ్రీవునితో స్నేహపూర్వక ధోరణితో మాట్లాడు. అతనిలో వివేకాన్ని మేలుకొల్పటానికి అది చాలునని నమ్ముతున్నాను' అంటూ తమ్ముని ఆగ్రహాన్ని అదుపుచేయటానికి ప్రయత్నించాడు.
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
ఒక సువిశాలమైన గుహాంతర్భాగంలో నిర్మించబడిన శోభాయమానమైన కిష్కింధానగరంలోకి లక్ష్మణుడు ఆగ్రహోదగ్రుడై ప్రవేశించాడు. సుగ్రీవుని ప్రాసాదంవైపు మత్తగజంలా దూసుకుపోతూ లక్ష్మణుడు మార్గమధ్యంలోని వృక్షాలను కూల్చివేశాడు. ప్రాసాద ద్వారానికి కావలిగా ఉన్న భయంకర వానరులు లక్ష్మణుడు క్రోధంతో కంపిస్తున్న పెదవులతో వస్తూ ఉండటం గమనించి వృక్షాలను పెకలించటం ద్వారాను, పర్వతశిఖరాలను కూల్చటంద్వారాను ఆయుధాలను సేకరించటం ప్రారంభించారు. వానర భటులు అలా సాయుధులు కావటాన్ని చూచిన లక్ష్మణుడు మహోగ్రుడు కాగా వానర భటులు భీతావహులై పారిపోయారు.
భోగాలలో మునిగిన సుగ్రీవుడు లక్ష్మణ స్వామి రాకను చెప్పటానికి మంత్రులు వస్తె కనీసం పట్టించుకోలేదు. లక్ష్మణుడు అంగదుని కలుసుకుని తన రాక గురించి సుగ్రీవునికి చెప్పమని చెప్పాడు.కానీ మద్యం మత్తులో ఉన్న సుగ్రీవుడికి ఆ మాటలు చెవికెక్కలేదు. సేవకులు కేకలు వేయగా స్పృహ లోకి లక్ష్మణుని కోపం చూసి హడలి పోయాడు.
లక్ష్మణుడి కోపం గమనించిన తార,ముందుగా అంగదుడిని వెంటబెట్టుకుని ఎదురువెళ్లి అత్యంత సమయస్ఫూర్తితో మాట్లాడి ఆయన కోపాన్ని శాంతింపజేసింది. భయంతో వణికిపోతూ వచ్చిన సుగ్రీవుడు లక్ష్మణుని పాదాలపై పడి క్షమాపణలు వేడుకున్నాడు.
వానర సైన్య సమీకరణ - సీతాన్వేషణ:
తప్పు తెలుసుకున్న సుగ్రీవుడు వెంటనే లక్ష్మణుడితో కలిసి ప్రస్రవణ పర్వతానికి వెళ్లి శ్రీరాముని పాదాలపై పడ్డాడు. కరుణామయుడైన రాముడు అతడిని క్షమించి ఆలింగనం చేసుకున్నాడు. అతనిని తగ్గ ఆసనం ఇచ్చి రాజ ధర్మాలు బోధించాడు.ఆ తదుపరి సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ప్రపంచం నలుమూలల నుండి కోట్ల కొద్దీ వానర వీరులు కిష్కింధకు చేరుకున్నారు.
పరిసరాల్లోని అరణ్య, పర్వతప్రాంతం యావత్తు కోట్లాది మంది వానరులతో నిండిపోయింది. సుగ్రీవుడు వానరుల్లోని వివిధ దళాలను వివరించి చూపుతూ రామునితో 'ప్రియమైన ప్రభూ! ఈ వానర యోధులను నీ స్వంత సైన్యంగానే నీవు పరిగణించాలి. దయచేసి ఇక నుంచి నీకు సముచితమనిపించిన రీతిలో వారిని ఆదేశించు' అన్నాడు.
'రావణుడి నివాస స్థానం ఎక్కడుందో కనిపెట్టి, సీత ఇంకా జీవించి ఉన్నదా అనే విషయాన్ని నిర్ధారించటమే మనం ముందుగా చేయవలసిన కార్యం. ప్రియమైన సుగ్రీవా! నీవు అన్వేషక బృందాలను ఏర్పాటు చేయాలి. సీతను కనుగొనటం జరిగినప్పుడు నేను అవసరమైన ఆదేశాలనిస్తాను' అన్నాడు రాముడు.
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
సుగ్రీవుడు తక్షణమే వానర రాజైన విందుణ్ణి పిలిచి ఇలా ఆదేశించాడు:
నీవు నీ సైనికులు తూర్పు దిక్కున అంతటా సప్తసముద్రాలు, సప్త ద్వీపాలతో సహా వెతుక గోరుతాను. క్షీరసముద్రానికి ఆవల స్వచ్ఛజల సాగరం ఒకటుంది. అందులో బడబాగ్ని ఉంటుంది. స్వచ్ఛజలసాగరపు తూర్పు తీరం నుంచి పదమూడు యోజనాల దూరంలో పూర్తిగా స్వర్ణమయశిలలతో నిర్మితమైన జాతరూశిల అనే పేరుగల పర్వతముంటుంది. అక్కడనే అనంత శేషస్వామి యావత్ భూతలాన్ని వహిస్తూ ఉంటాడు. అది తూర్పు దిక్కు యొక్క బయటి సరిహద్దు. అంతవరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని గాలించటానికి మీకు ఒక మాసం గడువిస్తున్నాను.అది ముగిసిన తర్వాత వచ్చిన వాడికి రాజాజ్ఞ ధిక్కరణ కింద మరణ దండన విధించ బడును.
తరువాత సుగ్రీవుడు వాలి తనయుడైన అంగదుని నేతృత్వంలో నీలుడు. హనుమంతుడు. జాంబవంతుడు, మైందుడు, ద్వివిదుడు తదితరులను దక్షిణ దిక్కుకు పంపించాడు. దక్షిణ ప్రాంతాన్ని వర్ణించిన మీదట సుగ్రీవుడు ఆ వానరులను ఇలా ఆదేశించాడు, 'లవణ సముద్రపు ఉత్తర తీరానికి ఎనిమిది వందల మైళ్ళ ఆవల ఒక ద్వీపముంది. అదే రావణుని నివాసం అయి ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంకా దక్షిణానికి వెళ్తే వాసుకి చేత పాలించబడుతున్న రసాతల రాజధానియైన భోగవతి వస్తుంది. ఆపైన భూమండలపు అంతిమ సరిహద్దు అయిన ఋషభ పర్వతానికి ఆవల యమరాజు నివాసముంటుంది.
బలం విష్ణోః ప్రవర్ధతాం
Read Also: Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం
Sampoorna Ramayanam Part 26 | సంపూర్ణ రామాయణం - Kishkinda Kanda | కిష్కింధాకాండ -సుగ్రీవుని జాప్యం
కథ సమాచారం
| కథ రకం | Devotional Stories |
|---|---|
| ప్రధాన అంశం | భక్తి, ధర్మం మరియు ఆధ్యాత్మిక సందేశం |
| ఎవరికి ఉపయోగకరం | పిల్లలు, కుటుంబ సభ్యులు మరియు తెలుగు కథలను ఇష్టపడే పాఠకులు |
| ముఖ్యమైన సందేశం | కథలోని సంఘటనలను ఆలోచించి, అందులోని మంచి పాఠాన్ని జీవితంలో ఉపయోగించుకోవచ్చు. |
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?
Sampoorna Ramayanam Part 26 | సంపూర్ణ రామాయణం - 26వ రోజు | కిష్కింధాకాండ -సుగ్రీవుని జాప్యం Sampoorna Ramayanam Part 26 | సంపూర్ణ రామాయణం - 26వ రోజు |...
ఈ కథను పిల్లలు చదవవచ్చా?
అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.
ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?
కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.
ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?
ఇది Devotional Stories విభాగానికి చెందిన తెలుగు కథ.
ఈ కథకు సంబంధించిన అంశాలు: Sampoorna Ramayanam Part 26 | సంపూర్ణ రామాయణం - Kishkinda Kanda | కిష్కింధాకాండ -సుగ్రీవుని జాప్యం, Devotional stories in Telugu, Bhakti Kathalu, Spiritual stories in Telugu
ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు
- IndianInQ8 — Latest Jobs, News & Entertainment
- Kuwait Bus Routes — Kuwait City Bus Routes & Information
- ITIL Course — ITIL Learning & Course Resources
Post a Comment