Sampoorna Ramayanam Part 19 | సంపూర్ణ రామాయణం - Sita’s Abduction and Jatayu’s Heroic Battle
Sampoorna Ramayanam Part 19 | సంపూర్ణ రామాయణం - Sita’s Abduction and Jatayu’s Heroic Battle
🚩 సంపూర్ణ రామాయణం - భాగం 19 🚩 అరణ్యకాండ - మారీచ వధ - సీతమ్మ కఠిన వాక్యాలు - సీతాపహరణం - జటాయువు పోరాటం
కథా వివరణ:
1. మారీచ వధ - మాయా స్వరం:
మాయలేడి రూపంలో ఉన్న మారీచుడు రాముడిని ఆశ్రమానికి చాలా దూరంగా తీసుకువెళ్లాడు.చివరకు అది రాక్షస మాయ అని గ్రహించిన రాముడు, దీనిని సంహరించాలి అని ఒక బాణంతో ఆ లేడిని కొట్టాడు.ప్రాణాలు వదులుతూ మారీచుడు తన నిజరూపాన్ని పొంది, రావణుడి పథకం ప్రకారం రాముడి గొంతును అనుకరిస్తూ "హా సీత! హా లక్ష్మణా!" అని బిగ్గరగా ఆర్తనాదం చేశాడు.
సీత, లక్ష్మణుడు ఇది విని నిజం అనుకోవచ్చు అని శంకిస్తూ నిస్పృహ చెందాడు. తన హృదయాన్ని ఒక మహాభీతి ఆవరించగా రాముడు అతృతగా తన పర్ణశాలవైపు దారితీశాడు.
2. సీతమ్మ ఆందోళన - అపార్థం:
అంతలోనే ఆ ఆర్తనాదం విన్న సీతమ్మ భయకంపితురాలయ్యింది. రాముడికి ఆపద వచ్చిందని, వెంటనే వెళ్లమని లక్ష్మణుడిని తొందరపెట్టింది. లక్ష్మణుడు "అమ్మా, ముల్లోకాలను జయించగల రాముడికి ఏ ఆపదా,అది అసాధ్యం, ఇది రాక్షస మాయ" అని నచ్చజెప్పబోయాడు.
కానీ ఆందోళనలో ఉన్న సీతమ్మ, "లక్ష్మణా! నీకు అన్నపై ప్రేమ లేదు. నాపై ఆశతోనే నువ్వు అతన్ని రక్షించడానికి వెళ్లడం లేదు. భరతుడి పంపున వచ్చావా?" నీవు మిత్రుని రూపంలో ఉన్న శత్రువువి,అని అత్యంత కఠినమైన మాటలు అంది.
సీతమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూ భయంతో కంపిస్తుండగా లక్ష్మణుడు "నిగ్రహించుకోవటానికి ప్రయత్నించు తల్లి. రాముడికి ఎవరుగానీ హానిచేయలేరని విశ్వసించు. రాక్షసులుగాని, ఇంద్రుడు గాని, దేవతలందరు కలసియైనాగాని ఆయనకు హాని చేయలేరు. నీవు విన్న కంఠస్వరం మనను భయపెట్టటంకోసం మారీచుడు పన్నిన కుతంత్రమని నాకు గట్టి నమ్మకం కలిగింది. నిన్ను సంరక్షిస్తూ వుండమని రాముడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. అందువల్ల నేను ఇక్కడనే వుండి ఆయన ఆజ్ఞను తలదాల్చక తప్పదు" అని బదులిచ్చాడు.
లజాహీనుడవైన దుష్టుడా! రాముడి దురదృష్టానికి బాగా ఆనందిస్తున్నావను కొంటాను. లేకుంటే అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడుతావు?. - నీవు నీ అగ్రజుడికి అణకువగల సేవకుని మాదిరిగా నటిస్తూ వచ్చావు. రాముణ్ణి చంపి నాతో నీ కామవాంఛలు తీర్చుకునే అవకాశంకోసం వేచి వుండటమే నీవు రాముని వెంట అరణ్యాలకు రావటానికి అసలైన కారణం. ఏదైనప్పటికీ నీవు నీ పాప భూయిష్టమైన వాంఛలను ఎన్నటికీ నెరవేర్చుకోలేవు!! అరవిందదళాయతాక్షుడైన రాముని పత్నిగా వుండిన మీదట నిన్ను అంగీకరిస్తానని నిజంగానే అనుకొంటున్నావా? అంతకంటే మరణించటానికే నేను ఇష్టపడతాను! నిజానికి రాముడు లేనిదే నేను ఒక్క క్షణమైనా జీవించటాన్ని భరించలేను."
3. లక్ష్మణుని ఆవేదన :
తాను కన్నతల్లిలా భావించే వదిన నోటి నుండి అలాంటి మాటలు వచ్చేసరికి లక్ష్మణుడి గుండె పగిలింది. కన్నీళ్లతో చేతులు జోడించి, "అమ్మా! నీ మాటలు నా చెవుల్లో వేడి సీసం పోసినట్లున్నాయి. ఆడవారికి సహజంగా ఉండే చాపల్యం వల్ల ఇలా మాట్లాడుతున్నావు. నేను అన్నగారి ఆజ్ఞను జవదాటలేను, అలాగని నీ మాటలనూ భరించలేను. వనదేవతలు నిన్ను రక్షించెదరు గాక" అని నమస్కరించి, అత్యంత భారమైన హృదయంతో , అయిష్టంగానే రాముడిని వెతుక్కుంటూ వెళ్లాడు.
4. రావణుడి ప్రవేశం - అపహరణ:
ఇంతలోనే అవకాశం కోసం చూస్తున్న రావణుడు, లక్ష్మణ స్వామి వెళ్ళడం చూసి, ఒంటరిగా ఉన్న సీతమ్మ కుటీరం వద్దకు ఒక సన్యాసి వేషంలో వచ్చాడు.భిక్ష కోసం వచ్చిన అతనికి సీతమ్మ ఆతిథ్యం ఇచ్చింది.నా పతి వస్తాడు వేచి ఉండండి అని పలికింది.
కానీ రావణుడు
"ఓ నల్లని కన్నులదానా! వేరొక చోట ఐశ్వర్యంలో తులతూగదగిన నీవు ఇక్కడెందుకున్నావు? నీవు కోటలో అద్వితీయమైన దుస్తులు మరియు రత్నవజ్ర మణి మాణిక్యాలతో అలంకరింపబడి అసంఖ్యాకమైన పరిచారకుల చేత సేవించబడదగినదానవు. నీవు రుద్రులు లేదా మరుత్తులు లేదు వసువుల్లో ఒకరికి భార్యావా? ఓ సుమదుహాసినీ, యోగ్యుడైన భర్తను ఎన్నుకొని ఈ క్రూర మృగాకీర్ణమైన కీకారణ్యాన్ని వదిలివేయి"
అని దుస్సాహసం తో మాట్లాడిన సీతమ్మ అతిధినీ అవమానంగా చూడకూడదు అని అతనికీ అర్ఘ్యం,పాద్యం ఇచ్చింది, భోజనం పెట్టింది. తన వివరాలు, ఎవరి కూతురో, ఎవరి భార్యని, అన్ని చెప్పి,దశరథ మహారాజు తన పత్ని యొక్క ప్రేరణమీద భరతుణ్ణి తన వారసునిగా ప్రతిష్టించి, రాముణ్ణి పధ్నాలుగు సంవత్సరాలపాట అరణ్యాలకు బహిష్కరించాడు. దయచేసి మీ నామదేయం, వంశావళి తెలిపి ఈ దండకారణ్యానికి ఎందుకు వచ్చారో తెలియజేయ గోరుతాను."అని పలికి వాడిని నిజమైన సన్యాసి అని నమ్మి పూజించింది.
కానీ తన మనోభావాలను ఇక ఎంతమాత్రం నిగ్రహించుకోలేక రావణుడు తన నిజరూపాన్ని చూపి.నేను రాక్షసుల రాజైన రావణుణ్ణి నా పేరు విన్నంత మాత్రాన గొప్ప దేవతలు సైతం గజగజలాడుతారు. ఓ నిష్కళంక సుందరీమణీ! ఇప్పుడు నిన్ను చూశాను గనుక ఇక నా అసంఖ్యాకమైన యితర భార్యలతో తిరిగి ఎన్నటికీ ఆనందాన్ని పొందలేను. నా ప్రియమైన సీతా! నీవు నా పట్టపు రాణివికమ్ము. 5,000 మంది దాసీజనం నీ ఆజ్ఞలకోసం ఎదురు చూస్తూవుంటారు.
ఈ అరణ్యాన్ని వదిలిపెట్టి లంకానగరంలోని సుందరమైన ఉద్యానవనాల్లో నాతో కలిసి భోగాలనుభవించు" అని బదులు పలికాడు.
రావణుని మాటలు విని సీత అగ్రహోదగ్రురాలైంది. తిరస్కార భావంతో యిలా బదులిచ్చింది. "పర్వతంవలె సుస్థిరుడు, సాగరంవలె గంభీరుడు, వటవృక్షం మాదిరి ఆశ్రయ ప్రదాతయైన రాముడికి నేను సంపూర్ణంగా అంకితమైనదానిని.రాముడు నరులలో సింహము వంటివాడు. జంబుకం(నక్క) వంటివాడవైన నీవు సింహికలాంటి నన్ను చేపట్టగొరుతున్నావు.నీ కళ్ళను సూదితో పొడుచుకుంటావా? ప్రజ్వలించే అగ్నిని నీ వస్త్రంలో మోసుకుపోతావా? నీ మెడకు గుదిబండ కట్టుకొని సముద్రానికి అడ్డంగా ఈదుతావా? మరి రాముని భార్యని తీసుకు పోదామని ఎందుకు సాహసిస్తావు?"
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
చివరకు రావణుడు సహనాన్ని పూర్తిగా కోల్పోయాడు. క్రోధావేశంతో పదితలలు, ఇరవై చేతులు వాడియైన కోరలుగల భీకరరాక్షసునిగా తన మహోగ్రరూపాన్ని పొంది
ఆమెను బలాత్కారంగా పట్టుకున్నాడు. ఏడుస్తున్న సీతమ్మను తన రథంలోకి ఎక్కించుకుని ఆకాశమార్గాన లంక వైపు బయలుదేరాడు.
5. జటాయువు వీరోచిత పోరాటం:
దిక్కుతోచని సీత వృక్షాలను, నదిని,
పక్షులను, జంతువులను ఎలుగెత్తి పిలిచి తాను అపహరణకు గురైనట్లు రామునికి చెప్పమని వేడుకుంది. సరిగా అదే సమయంలో
సీతమ్మ ఆర్తనాదాలు విన్న వృద్ధ పక్షిరాజైన జటాయువు రావణుడిని అడ్డుకున్నాడు. మహావీరుడిలా పోరాడి రావణుడి రథాన్ని, విల్లును విరిచేశాడు. కానీ రావణుడు కత్తితో జటాయువు రెక్కలను నరికేయడంతో, ఆ మహా పక్షి నేలకొరిగింది.
తదనంతరం రావణుడి రథం ఆకాశం లోకి లేవగా,సీత ఆభరణాలు తెగి పోయాయి, అతన్ని పదే, పదే నిందిస్తూ విడిపించు కోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది తల్లి.
తన శిరోజాలు గాలికి ఊగులాడుతుండగా, తన కుంకుమ తిలకం చెరిగిపోగా, తన ముఖం సంతోషవిహీనం కాగా సీత "ఓ రామా! ఓ లక్ష్మణా!" అని ఆక్రందించింది.
దిక్కుతోచని సీతమ్మ.... సరిగా అప్పుడే ఐదుగురు వానర ముఖ్యులు ఒక పర్వతాగ్రాన కూర్చొని ఉండటం చూసింది. రావణుడు గమనించకుండా తన పట్టు ఉత్తరీయాన్ని కొన్ని ఆభరణాలను తీసి ఆ అరణ్యవాసులు రామునికి సమాచారం అందిస్తారన్న ఆశతో వారి మధ్య పడేలా జారవిడిచింది. వానరులు రెప్పవేయని కన్నులతో చూస్తుండగా రావణుడు సీతను లంకవైపు తీసుకువెళ్ళాడు.
...సశేషం
(ఎంత బలం ఉండనీయండి, ఎంత బలగం ఉండనీయండి స్త్రీ కంట కన్నీరు పెట్టించిన వాడిని ఆ కన్నీరే అగ్నిజ్వాల వలె మారి బూడిద చేస్తుంది, రావణుడు సాక్షాత్ బ్రహ్మ పులస్త్య బ్రహ్మ పుత్రుడు, కుబేరుడి కి సోదరుడు, శివ భక్తుడు కానీ పర స్త్రీ గమనం అనే వ్యసనం వాడిని చరిత్ర హీనుడీగ మార్చింది, వ్యసనాలు అదుపు చేసుకోలేక పోతే,అవే జీవితాన్ని అంతం చేస్తాయి.రాగం(అందరూ నాకే కావాలి అనే వెర్రి కామము)చేత పడిపోయిన వాడు రావణుడు,ద్వేషం(నేను తప్ప ఇంకెవ్వరు రాజుగా ఉండొద్దు)చేత పడిపోయిన వాడు దుర్యోధనుడు. రాగ ద్వేషాలే మనిషికి పెద్ద శత్రువులు..)
రామాయణం లో మనసును మెలి పెట్టే ఘట్టాలు ఇవి నిజంగా చదివే ప్రతిసారి కన్నీరు వస్తాయి, ఒక్కోసారి ఈ సర్గలు దాటేసి వెళ్తాను నేను అయితే అస్సలు బుద్ధి పుట్టదు సీతాపహరణ చదవడానికి😔
జయశ్రీరామ
బలం విష్ణోః ప్రవర్ధతాం 🚩🚩🙏🙏
Read Also: Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం
సీతాపహరణం నుండి జటాయువు వీరమరణం వరకు – అరణ్యకాండలో హృదయ విదారక ఘట్టాలు
టాప్ 5 FAQs (తెలుగులో):
- మారీచుడు ఎందుకు “హా సీత! హా లక్ష్మణా!” అని అరిచాడు?
రావణుడి పన్నాగం ప్రకారం రాముడి స్వరాన్ని అనుకరించి సీత, లక్ష్మణులను మోసం చేయడానికి అలా చేశాడు.
- సీతమ్మ లక్ష్మణుడిపై ఎందుకు కఠినంగా మాట్లాడింది?
రాముడికి ప్రమాదం జరిగిందని భయంతో అపార్థం చేసుకుని ఆవేశంలో అలాంటి మాటలు చెప్పింది.
- రావణుడు సీతను ఎలా అపహరించాడు?
సన్యాసి వేషంలో వచ్చి, తరువాత తన అసలు రూపం చూపి బలవంతంగా తీసుకెళ్లాడు.
- జటాయువు ఏమి చేశాడు?
సీతను రక్షించేందుకు రావణుడితో వీరోచితంగా పోరాడి గాయపడ్డాడు.
- సీతమ్మ ఆభరణాలు ఎందుకు పడవేసింది?
తన అపహరణకు సంబంధించిన సమాచారాన్ని రాముడికి చేరవేయాలనే ఆశతో వానరుల మధ్య పడవేసింది.
Sita’s Abduction and Jatayu’s Heroic Battle – The Most
Emotional Episode of Aranya Kanda
Complete Ramayana – Part 19
Aranya Kanda – Slaying of Maricha, Sita’s Harsh Words,
Abduction of Sita, Jatayu’s Battle
Story Summary:
Maricha, disguised as the golden deer, led Rama far away
from the hermitage. Realizing the deception, Rama killed him with a single
arrow. As he died, Maricha imitated Rama’s voice and cried out, “O Sita! O
Lakshmana!” as part of Ravana’s plan.
Hearing this, Sita was filled with fear and urged Lakshmana
to go help Rama. Despite Lakshmana’s assurance that Rama was invincible, Sita,
overcome with anxiety, spoke harsh and painful words, accusing him unjustly.
Deeply hurt, Lakshmana reluctantly left in search of Rama
after praying for Sita’s safety.
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
Seizing the opportunity, Ravana arrived in disguise as a
sage. Sita welcomed him with hospitality, but Ravana soon revealed his true
form and attempted to persuade her to come with him. When she firmly refused
and rebuked him, Ravana forcibly abducted her and flew toward Lanka.
As Sita cried out for help, the noble bird Jatayu
intervened. He fought bravely, destroying Ravana’s chariot and weapons, but was
ultimately overpowered, and his wings were severed.
While being carried away, Sita dropped her ornaments among a
group of vanaras, hoping they would inform Rama. Crying out “O Rama! O
Lakshmana!”, she was taken away toward Lanka.
❓ Top 5 FAQs in English:
- Why
did Maricha imitate Rama’s voice?
To deceive Sita and Lakshmana as part of Ravana’s plan.
- Why
did Sita speak harshly to Lakshmana?
She was overwhelmed with fear and misunderstood the situation.
- How
did Ravana abduct Sita?
He came disguised as a sage and then forcefully took her away.
- What
role did Jatayu play?
He bravely fought Ravana to rescue Sita but was fatally wounded.
- Why
did Sita drop her ornaments?
To leave clues for Rama about her abduction.
Ramayan Part 19, Sita abduction story, Maricha death
Ramayana, Ravana kidnapping Sita, Jatayu fight Ravana, Aranya Kanda emotional
story, Lakshmana and Sita argument, Ramayana Telugu summary, Hindu epic
emotional scenes, Sita haran story
#Ramayana #SitaHarana #Jatayu #LordRama #HinduMythology
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
Post a Comment