Sampoorna Ramayanam Part 18 | సంపూర్ణ రామాయణం - Ravana’s Plot, Maricha’s Illusion

Sampoorna Ramayanam Part 18 |  సంపూర్ణ రామాయణం - Ravana’s Plot, Maricha’s Illusion


Sampoorna Ramayanam Part 18 |  సంపూర్ణ రామాయణం - Ravana’s Plot, Maricha’s Illusion

Sampoorna Ramayanam Part 18 |  సంపూర్ణ రామాయణం - Ravana’s Plot, Maricha’s Illusion

🚩 సంపూర్ణ రామాయణం - భాగం 18 🚩


అరణ్యకాండ - రావణుడి కుతంత్రం - మారీచుని మాయ - సీతమ్మ కోరిక


కథా వివరణ:


1. రావణుడి పగ - సూర్పణఖ ప్రేరణ:

అఖంపనునీ ద్వారా ఖరదూషణాదుల మరణవార్త విన్న రావణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే జనస్థానానికి వెళ్లి ఆ రామలక్ష్మణుల సంహరిస్తాను.వారు ఎంతటి యోధులో నేనూ చూస్తాను అన్నాడు.కానీ అకంపనుడు వారిస్తూ ప్రభు ఆవేశ పడకండి వారు ఇద్దరు సామాన్యుల వలె కనిపించటం లేదు,ఒక్క రాముడే మొత్తం విశ్వాన్నీ జయించగలడు అంతటి శక్తి ఉంది,బాగా ఆలోచించండి, ఏదేని పన్నాగం ద్వారా వారిని బలహీన పరచి సంహరించాలి అన్నాడు, వెంటనే రావణుడికి మారీచుడు గుర్తుకు వచ్చాడు, పుష్పక విమానం లో మారీచునీ దగ్గరికి వెళ్ళి రాముని సంహరించుటకు ఒక పన్నాగం పన్నాను నీవు సహకరించూ అన్నాడు,కానీ రాముడి పేరు వింటేనే ఉలిక్కి పడుతున్నాడు మారీచుడు, వద్దు రావణా రాముడితో పెట్టుకోకు నీతో పాటు మొత్తం రాజ్యం బూడిద చేయగల సమర్ధుడు అని నచ్చచెప్పాడు, కాస్త కోపం తగ్గించుకుని అవకాశం వచ్చినపుడు చూద్దాం అనుకుని తిరిగి లంకకు వెళ్లాడు.


ఇంతలోనే సూర్పణఖ గగ్గోలు పెడుతూ లంకకు చేరింది, సభలో ఉన్న రావణుడికి తన అవమానాన్ని వివరిస్తూ,ఆ అవమానం తనకోసం జరిగినట్టు కాకుండా..సీత సౌందర్యాన్ని వర్ణించి, అంతటి సౌందర్య వతి లోకంలోనే లేదు, ఆమెను నీకోసం తీసుకుని వద్దాం అని ప్రయత్నం చేస్తే ఇలా జరిగింది అని

ఆమెను అపహరించమని రావణుడిని ప్రేరేపించింది. శూర్పణఖ మాటలు రావణుడి హృదయాన్ని తాకాయి,రాముడిని నేరుగా గెలవడం అసాధ్యమని గ్రహించిన రావణుడు, కపటోపాయంతో సీతను అపహరించాలని నిశ్చయించుకున్నాడు.


2. మారీచుని సాయం:

రావణుడు మళ్లీ మారీచుని దగ్గరకు వెళ్లాడు. మారీచుడు పూర్వం రాముడి బాణం రుచి చూసినవాడు కాబట్టి, రాముడితో పెట్టుకోవద్దని మళ్ళీ రావణుడికి ఎంతో హితవు పలికాడు. కానీ రావణుడు ఈసారి వినలేదు,నేను చెప్పినట్టు చేయకపోతే చంపుతానని బెదిరించాడు. చావక తప్పదని గ్రహించిన మారీచుడు, రావణుడి చేతిలో చావడం కంటే రాముడి చేతిలో చావడం మేలని భావించి, రావణుడి పన్నాగానికి ఒప్పుకుని మాయ లేడి రూపం ధరించడానికి అంగీకరించాడు.


Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


3. బంగారు లేడి:

మారీచుడు అద్భుతమైన బంగారు లేడి రూపం ధరించి పంచవటి ఆశ్రమ పరిసరాలలో తిరగసాగాడు. ఆ లేడి శరీరం బంగారంలా మెరిసిపోతూ, రత్నాల చారలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది.


4. సీతమ్మ కోరిక:

పూలు కోయడానికి వచ్చిన సీతమ్మ ఆ మాయ లేడిని చూసి ముగ్ధురాలైంది. అప్పటివరకు అలాంటి ప్రాణిని ఎప్పుడూ చూడని సీత, దానిపై మోజు పెంచుకుంది. "రామా! ఆ బంగారు లేడి ఎంతో బాగుంది. దాన్ని ప్రాణంతో పట్టుకుని ఇవ్వు, మనం అయోధ్యకు వెళ్ళాక అంతఃపురంలో ఉంచుకుందాం. ఒకవేళ చనిపోతే దాని చర్మాన్ని అయినా తీసుకురా, నేను దానిపై కూర్చుంటాను" అని రాముడిని కోరింది.


5. లక్ష్మణుని హెచ్చరిక - రాముని నిర్ణయం:

లక్ష్మణుడు ఆ లేడిని చూసి, "అన్నా! ఇది రాక్షస మాయ. అడవిలో బంగారు లేళ్ళు ఉండవు, ఇది మారీచుడే అయి ఉంటాడు" వాడు ఇలాంటి మాయలు గతంలో చేసి ఋషులను చంపి తిన్నట్టు విని ఉన్నాం అని హెచ్చరించాడు.కానీ రాముడు సీత కోరికను కాదనలేకపోయాడు. "లక్ష్మణ! సీత అంతగా కోరుతోంది, ఎన్నడు నోరు తెరిచి ఇది కావాలి అని అడగలేదు కదా. ఒకవేళ ఇది రాక్షసుడే అయితే చంపి మునులను కాపాడతాను.నేను వచ్చే వరకు సీతకు తోడుగా ఉండు" అని చెప్పి, ధనస్సు పట్టుకుని ఆ లేడి వెనుక పడ్డాడు.


జయ శ్రీరామ🙏 జయ సీతామాత 🙏


(ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యకర్మల ఫలితం గా మానవ జన్మ లబిస్తుంది,దీన్ని సరిగ్గా వాడుకుని సాధన చేస్తే తిరుగులేని మోక్షం వస్తుంది,అలా కాకుండా మాయలో పడితే కష్టాలు వస్తాయి ఇదే రామాయణం చెప్పే సత్యం,సీతమ్మ లేని బంగారు లేడీ ఉన్నది అని భ్రమ పడి కావాలి అని కోరింది ఇదే మాయ, మాయలో పడి తన స్వస్వరూపం మరచి జీవునికి దూరం అయినది, దూరం అయి పది ఇంద్రియాల చేత పాలింపబడే లంకలో బంది అయినది,కానీ మళ్ళీ తనను తాను తెలుసుకుని జీవుని యందు(రాముడి యందు) మనసు నిలివి తపస్సు చేసి(పది నెలలు సీతమ్మ రామ నామమే స్మరిస్తూ ఉన్నది) తిరిగి స్వస్వరూపం పొందింది. అలాగే మాయలో పడి ఇంద్రియాలే నేను అనే భావన లో నిలిచి నారాయణుడికి దూరం అయిన మనం కూడా రామాయణ శ్రవణ, పఠన, అధ్యయన చేత మళ్ళీ ఆ నారాయణుడిని చేరాలి)


.......సశేషం


బలం విష్ణోః ప్రవర్ధతాం.. 

 

Read Also:  Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం https://telugulostories.blogspot.com/2026/03/sampoorna-ramayanam-part-1-1.html


 

రావణుడి కుతంత్రం నుండి సీతమ్మ మాయలో పడటం వరకు బంగారు లేడి కథ విశేషం

  టాప్ 5 FAQs (తెలుగులో):

  1. రావణుడు సీతను అపహరించాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు?
    శూర్పణఖ ప్రేరణతో పాటు రాముడిని నేరుగా గెలవలేనని గ్రహించి కపటంతో ప్రయత్నించాడు.

  1. మారీచుడు రావణుడికి ఎందుకు సహాయం చేశాడు?
    రావణుడి బెదిరింపుతో, రాముడి చేతిలో చావడం మేలని భావించి ఒప్పుకున్నాడు.

  1. బంగారు లేడి నిజంగా ఏమిటి?
  2. అది మారీచుడు ధరించిన మాయ రూపం.

  1. సీతమ్మ ఎందుకు బంగారు లేడిని కోరింది?
    దాని అందానికి ఆకర్షితురాలై, దాన్ని పొందాలనే కోరిక కలిగింది.

  1. లక్ష్మణుడు ఎందుకు రాముడిని ఆపడానికి ప్రయత్నించాడు?
    అది రాక్షస మాయ

Ravana’s Plot, Maricha’s Illusion & Sita’s Desire – The Golden Deer Episode in Aranya Kanda

 

Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


Complete Ramayana – Part 18

Aranya Kanda – Ravana’s Conspiracy, Maricha’s Illusion, Sita’s Desire

Story Summary:

After hearing about the death of Khara and Dushana through Akampana, Ravana was enraged. Initially, he planned a direct attack but was advised against it, realizing Rama’s immense power. Instead, he chose a cunning strategy to abduct Sita.

Ravana approached Maricha for help. Maricha, who had previously faced Rama’s power, strongly warned Ravana not to proceed. However, under threat of death, Maricha agreed, preferring to die at Rama’s hands rather than Ravana’s.

Maricha then transformed into a mesmerizing golden deer and wandered near Panchavati. Its radiant, jewel-like appearance captivated Sita when she saw it while gathering flowers.

Sita requested Rama to capture the deer for her, either alive or at least its skin. Despite Lakshmana’s warning that it was likely a demon’s illusion, Rama agreed to fulfill Sita’s wish. He instructed Lakshmana to guard Sita and went after the deer.

 

Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

❓ Top 5 FAQs in English:

  1. Why did Ravana plan to abduct Sita?
    He realized he couldn’t defeat Rama directly and chose deception.

  1. Who was Maricha and what role did he play?
    A demon who disguised himself as the golden deer to lure Rama away.

  1. What is the golden deer in the story?
    It is an illusion created by Maricha.

  1. Why did Sita want the golden deer?
    She was enchanted by its beauty and desired it.

  1. Why did Lakshmana warn Rama?
    He suspected it was a demon’s trick and foresaw danger.

 

Ramayan Part 18, Golden deer story Ramayana, Maricha illusion, Ravana Sita abduction plan, Aranya Kanda golden deer, Sita desire story, Lakshmana warning, Ramayana Telugu summary, Hindu epic lessons, Panchavati golden deer episode

 

#Ramayana #GoldenDeer #Ravana #Sita #HinduMythology

 

Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 

Post a Comment

Previous Post Next Post