Sampoorna Ramayanam Part 20 | సంపూర్ణ రామాయణం - Rama’s Grief, Jatayu’s Salvation
Sampoorna Ramayanam Part 20 | సంపూర్ణ రామాయణం - Rama’s Grief, Jatayu’s Salvation
🚩 సంపూర్ణ రామాయణం - భాగం 20 🚩 కాండ: అరణ్యకాండ ** - రామ విలాపం - జటాయువు మోక్షం - కబంధ వధ - శబరి ఆశ్రమ మార్గదర్శనం
కథా వివరణ:
1. రాముని శోకం - ప్రకృతితో సంభాషణ:
అలా రావణుడు సీతమ్మను సముద్రం మీదుగా తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి,మొత్తం రాజ్యంలోని రత్నములు,బంగారం, వజ్ర వైడూర్యాలు, దాసీ జనం చూపించి ఇవన్నీ నీకే అన్నాడు.(ఐశ్వర్యం చూపి లోబర్చు కొనే ప్రయత్నం)సీతమ్మ వాటిని చూడటానికి కూడా ఏ మాత్రం ఆసక్తి చూపలేదు,నా హృదయం ఒక్క రామున్ని తప్ప ఏది కోరదు,నీవు నన్ను ఎన్ని హింసలు పెట్టిన, ఏం చేసినా నీకు దక్కను,రావణా...నీ ఈ వెర్రి కామమే నిన్ను అతి త్వరలోనే బూడిద చేయడం ఖాయం, రాముడి చేతిలో పడి పోవడానికి సిద్ధంగా ఉండు అని. బదులిచ్చింది.దాంతో రావణుడు సీతమ్మ నీ తీసుకెళ్లి వాడికి ఎంతో ఇష్టం అయిన అశోక వాటిక లో ఉంచి, భయంకరులు అయిన రాక్షస స్త్రీలను రక్షణగా రక్షణగా పెట్టీ.నా అనుమతి లేకుండా ఈమె ముఖం కూడా ఎవ్వరు చూడకూడదు అని చెప్పాడు.
అటువైపు మారీచుని సంహరించి వెనక్కి వస్తున్న రామునికి ఎన్నో దుశ్శకునాలు కనపడ్డాయి, ఇంతలోనే లక్ష్మణ స్వామి కూడా ఎదురుగా రావడం చూసి రాముడి మరింత ఆందోళన చెందాడు. లక్షణా ఎందుకు సీతమ్మను వదిలి వచ్చావు,నాకు సాకులు చెప్పకు ఇదంతా రాక్షస పన్నాగం లా కనిపిస్తూ ఉంది,సీతను వదించడం లేదా సంహరించడం జరిగి ఉండవచ్చు అని అర్దం అవుతుంది.అయ్యో లక్ష్మణ ఎందుకు సీతను వదిలి వచ్చావు అని విలపించాడు రాముడు.
అలా వేగంగా ఆశ్రమానికి తిరిగి వచ్చిన రాముడికి సీతమ్మ కనిపించలేదు. ఆశ్రమం చుట్టూ మొత్తం వెదికాడు ఎక్కడ జాడలేదు.దుఃఖంతో రాముడు పిచ్చివాడిలా చెట్లను, పువ్వులను, లేళ్లను "నా సీత ఎక్కడ?" అని అడిగాడు. సీత లేని అడవి తనకు శూన్యంలా అనిపించింది. లక్ష్మణుడు రాముడిని ఓదారుస్తూ, ధైర్యం చెబుతూ వెతుకులాట ప్రారంభించాడు.
2. జటాయువు అంతిమ శ్వాస:
నా సీతలేని ఈ లోకాలు మనుగడ సాగించడానికి వీలు లేదు అని క్రోధారుణ నేత్రాలతో రాముడు బాణం ఎక్కు పెట్ట బోతూ ఉన్న
సమయంలో లక్ష్మణుడు ఒక మహారాక్షసుని పాదముద్రల ప్రక్కన సీత యొక్క పాదముద్రలు ఉండటాన్ని చూపించాడు.ఆ పాదముద్రలను అనుసరించి వెళ్ళిన రామలక్ష్మణులు కొద్దిసేపట్లోనే రావణుని భగ్నధనుస్సు, తూణీరం, ముక్కలు చెక్కలైన రథభాగాలు, విరిగిపడిన సీత యొక్క ఆభరణాల శకలాలు పడివున్న చోటికి చేరుకున్నారు. ఆపైన రక్తపు చుక్కలు కనిపించగా సీత నిజంగానే రాక్షసుల చేత భక్షింపబడిందన్న నిర్ణయానికి రాముడు వచ్చాడు- ఎందుకంటే ఆ ప్రదేశంలో ఇద్దరు నరభక్షకులు కొట్లాడుకున్నట్లుగా ఉంది.
మృతిచెందిన అశ్వాలను, ధ్వంసమైన రథాన్ని, చిందరవందరగా పడివున్న ఆయుధాలను చూస్తూ రాముడు "ఏ రాక్షసుడూ నా ప్రతీకారంనుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే సీతను హత్య చేసినందుకు ప్రతిక్రియగా ఈ రోజున వారినందరిని నేను సర్వనాశనం చేస్తాను.అని పలికాడు,ఈ గుర్తులు పట్టి చూస్తే కేవలం ఒక్క రాక్షసుడే సీతను అపహరించాడు అని లక్ష్మణుడు భావించాడు.
అలా గుర్తులను అనుసరిస్తూ వెతుకుతుండగా, కొంత దూరంలో రక్తంతో తడిసిన జటాయువు రాముడికి కనిపించాడు.మొదట సీతను భక్షించిన రాక్షసుడే పక్షి రూపం ధరించి పడి ఉన్నాడు అనుకున్నాడు,కానీ బాగా దగ్గరికి వచ్చి చూసాకా ఆ పక్షి జటాయువు అని గుర్తించాడు.
జటాయు మాటలకు రాముడు కరిగిపోయాడు. "రామా! రావణుడు సీతమ్మను ఎత్తుకుపోయాడు, నేను అడ్డుకోబోయి రెక్కలు కోల్పోయాను" "రావణుడు సీతను వింద అనబడే ముహూర్తంలో ఎత్తుకుపోయాడు. ఎవరైనా వ్యక్తి ఆ ముహూర్తంలో దేనినైనా పోగొట్టుకున్నట్లయితే కొద్ది కాలంలోనే అతను దానిని తప్పకుండా తిరిగి పొందుతాడు. ప్రియమైన రామా! సీత కారణంగా మితిమీరి దుఃఖించకు. ఎందుకంటే నీవు ఆ రాక్షసరాజును యుద్ధంలో సంహరించి ఆమెను తప్పకుండా తిరిగి పొందుతావు" అని వ్యాఖ్యానించాడు.
అంతట జటాయువు రావణుని యొక్క ఉన్నతమైన వంశానుక్రమణికను వివరిస్తూ “రామా! రామా!" అంటూ రాముడి చేతుల్లోనే జటాయువు ప్రాణాలు విడిచాడు. రాముడు తన తండ్రికి చేసినట్లే జటాయువుకు అంత్యక్రియలు నిర్వహించి, అతనికి ఉత్తమ గతులను ప్రసాదించాడు.
3. కబంధుడి శాప విమోచనం:
అక్కడి నుండి నైఋతి దిక్కుగా ప్రయాణించి అతి ప్రయాస తో దండకారణ్యం దాటి, క్రౌంచారణ్యం లోకి ప్రవేశించారు.అదే సమయంలో రాముడికి కొన్ని దుశ్శకునాలు,ఒక మంచిశకునం కనపడింది, వాటి ద్వారా లక్ష్మణ ఏదో ప్రమాదం రాబోతుంది కానీ దాని ఫలితం మనకు మంచి చేస్తుంది,అని చెప్తూ ఉందగానే.
'కబంధుడు' అనే భయంకరమైన రాక్షసుడు (తల లేనివాడు, కడుపులో ముఖం ఉన్నవాడు) ఎదురయ్యాడు. వాడు సీతారామలక్ష్మణులను తినబోగా, వారు వాడి బాహువులను నరికారు. చనిపోయే ముందు వాడు తన పూర్వగాథను చెప్పి, తనను దహనం చేయమని కోరాడు. రాముడు వాడిని దహనం చేయగా, వాడు దివ్యరూపంతో ప్రత్యక్షమై
"రామా! నీకు సుగ్రీవుడితో మైత్రి జరుగుతుంది, అతడే నీకు సీతమ్మ జాడ చెబుతాడు" మొదట పంపా సరస్సు తీరానికి వెళ్ళు అక్కడే శబరి అనే తపస్విని నీకోసం ఎదురు చూస్తూ ఉంది, అక్కడికి దగ్గరే ఋష్యమూఖ పర్వతం ఉంటుంది దాని మీద నలుగురు వానరుల తో సుగ్రీవుడు ఉంటాడు, అతడే నీకు సహాయ పడగలడు అని మార్గదర్శనం చేశాడు.
4. శబరి ఆశ్రమం వైపు:
కబంధుని సూచన మేరకు రాముడు పంపా సరోవరం వైపు వెళ్తూ, మధ్యలో 'మతంగ మహర్షి' శిష్యురాలైన శబరి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా రాముడి కోసం ఎదురుచూస్తున్న ఆ వృద్ధురాలి భక్తికి రాముడు ముగ్ధుడయ్యాడు. (రేపటి భాగంలో శబరి ఆతిథ్యం గురించి చూద్దాం).
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
జై శ్రీరామ్ 🙏 జై జటాయువు 🙏
(చిన్న చిన్న విషయాలకే జంటలు విడిపోతున్న నేటి కాలంలో భార్య భర్తల బంధం ఎలా ఉండాలో రామాయణం అడుగడుగున చూపిస్తోంది, కుబేరుడి దగ్గర ఉన్నంత సంపద ఆరోజు రావణుడి దగ్గర ఉంది, బెదిరించి తీసుకున్నాడు,వేల మంది దాసీ జనం రత్నాల పాన్పులు ఇవేమీ సీతమ్మను కదిలించ లేకపోయాయి, దీనుడు అవ్వనీ, రాజ్య హీనుడు అవ్వని నా భర్తే నాకు పరమ దైవం,గురువు అంటుంది సీతమ్మ సుందరకాండ లో, సీతమ్మ లేని ఈ చల్లని గాలి కూడా నా శరీరాన్ని నిప్పులా కాలుస్తుంది అంటాడు రాముడు సుందరకాండ లోనే,13 ఏళ్ళ వనవాసం వారికి ఎంతో సౌఖ్యంగా సాగింది, బహు సుఖాలు పొందరు అని వాల్మీకి రామాయణం లో చెప్తాడు ఎందుకు ఇద్దరు కలసి ఉన్నారు కనుక,మనసులు పెనవేసుకు పోవడమే వివాహం, ఒకరిని ఒకరు విడిచి ఉండలేక, ఇద్దరూ కలసి ఒక్కటే అయి అద్వైత స్థితిలో నిలవడమే సనాతన ధర్మం.
ఈ ధర్మం లో విడాకులు లేవు స్త్రీ భోగ వస్తువు,బానిస కాదు, ఇద్దరికి సమాన స్తాయి ఇచ్చిన ఏకైక ధర్మం సనాతన ధర్మం ఒక్కటే,ఈ రామాయణ అధ్యయనం సాక్షిగా అలాంటి ధర్మం మళ్లీ ఈ లోకంలో విశేషంగా ప్రాచుర్యం లోకి రావాలి అని ఈ దేశంలో భార్య, భర్త విడిపోయే స్తితి ఒక్కనాటికి రాకుండా ఉండు గాక అని సీతారాములను అందరం ముక్త కంఠంతో కోరుకుందాం...
జై శ్రీ రామ్)
......సశేషం
బలం విష్ణోః ప్రవర్ధతాం
Read Also: Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం
రాముని విలాపం నుండి జటాయువు మోక్షం వరకు – కబంధ వధతో శబరి దర్శన మార్గం
టాప్ 5 FAQs (తెలుగులో):
- సీతాపహరణం తర్వాత రాముడు ఎలా స్పందించాడు?
సీతను కనుగొనలేక దుఃఖంతో ప్రకృతినే ప్రశ్నిస్తూ విలపించాడు.
- జటాయువు రాముడికి ఏమి చెప్పాడు?
రావణుడు సీతను అపహరించాడని తెలిపి, రాముడి చేతుల్లోనే ప్రాణాలు విడిచాడు.
- జటాయువుకు రాముడు ఏమి చేశాడు?
తన తండ్రిలా భావించి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి మోక్షం ప్రసాదించాడు.
- కబంధుడు ఎవరు?
శాపగ్రస్తుడైన రాక్షసుడు, రాముడు సంహరించిన తరువాత దివ్యరూపం పొంది మార్గదర్శనం చేశాడు.
- శబరి ఆశ్రమానికి రాముడు ఎందుకు వెళ్లాడు?
కబంధుడి సూచనతో, ఆమె భక్తిని స్వీకరించడానికి మరియు తదుపరి మార్గం తెలుసుకోవడానికి వెళ్లాడు.
Rama’s Grief, Jatayu’s Salvation & Kabandha’s Guidance – The Path to Shabari in Aranya Kanda
Complete Ramayana – Part 20
Aranya Kanda – Rama’s Lament, Jatayu’s Liberation, Kabandha’s Slaying, Guidance to Shabari
Story Summary:
After abducting Sita, Ravana took her to Lanka and tried to tempt her with wealth and luxury. However, Sita firmly rejected him, declaring her unwavering devotion to Rama. Ravana then placed her in Ashoka Vatika under strict guard.
Meanwhile, Rama, after killing Maricha, sensed bad omens and grew anxious upon seeing Lakshmana returning alone. Rushing back to the hermitage, he found Sita missing. Overcome with grief, Rama wandered like a madman, asking trees, animals, and nature about Sita’s whereabouts.
While searching, Rama and Lakshmana discovered signs of a struggle—broken chariots, scattered weapons, and Sita’s ornaments. Following the trail, they found the wounded Jatayu. Initially suspecting him, Rama soon realized the truth.
Jatayu informed Rama that Ravana had abducted Sita and that he fought bravely but was defeated. Consoling Rama, he assured that Sita would be recovered. Speaking these final words, Jatayu died in Rama’s arms. Rama performed his last rites with great honor, granting him liberation.
Continuing their journey, they encountered Kabandha, a cursed demon with a grotesque form. After killing him and performing his cremation, Kabandha regained his divine form and advised Rama to seek Sugriva’s help. He directed them toward Pampa Lake and the hermitage of Shabari.
Following his guidance, Rama reached the ashram of Shabari, a devoted disciple who had been waiting for years to receive him.
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
Top 5 FAQs in English:
- How did Rama react after Sita’s abduction?
He was overwhelmed with grief and searched desperately, questioning nature itself.
- What did Jatayu tell Rama before dying?
He revealed that Ravana abducted Sita and died in Rama’s arms.
- How did Rama honor Jatayu?
He performed his अंतिम rites like a son and granted him liberation.
- Who was Kabandha?
A cursed demon who, after being slain, guided Rama toward Sugriva.
- Why did Rama go to Shabari’s ashram?
To meet the devoted ascetic and continue his search with proper guidance.
Ramayan Part 20, Rama grief Sita search, Jatayu moksha story, Kabandha vadh Ramayana, Shabari ashram story, Aranya Kanda summary, Rama emotional scenes, Sugriva introduction Ramayana, Hindu epic Ramayana lessons, Sita in Ashoka Vatika
#Ramayana #Jatayu #LordRama #Kabandha #HinduMythology
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
Post a Comment