Sampoorna Ramayanam Part 17 | సంపూర్ణ రామాయణం - Surpanakha’s Humiliation
Sampoorna Ramayanam Part 17 | సంపూర్ణ రామాయణం - Surpanakha’s Humiliation
🚩 సంపూర్ణ రామాయణం - భాగం 17 🚩 అరణ్యకాండ - శూర్పణఖ గర్వభంగం - లక్ష్మణుని శిక్ష - 14 వేల మంది రాక్షసుల సంహారం
కథా వివరణ:
1. శూర్పణఖ ఆగమనం:
పంచవటిలో సీతారామలక్ష్మణులు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు, కాలక్రమంలో హేమంతం ప్రవేశించి ప్రాత: కాలపు సూర్యరశ్మియొక్క స్పర్శ పులకింతలు కలుగజేస్తున్నది. ఒక ఉదయాన రామలక్ష్మణులు నదిలో స్నానం ముగించుకొని తిరిగివచ్చి తాము నిర్వర్తించవలసి ఉన్న అనుష్ఠాన విధుల గురించి సంభాషించుకుంటూ ఉన్న సమయంలో ఒక రాక్షసి అక్కడ ప్రత్యక్షమైంది. రాముణ్ణి చూడగానే దాని హృదయం తక్షణమే కామోద్వేగభరితమైపోయింది. శ్యామలవర్ణంతో శోభిస్తూ పద్మదళాయతాక్షుడైన రాముడు మానవరూపందాల్చిన మన్మథునిలా గోచరించాడు. కాని ఆ రాక్షసి అత్యంత అసహ్యమైన ముఖంతో, బాన కడుపుతో, జారిన వక్షోజాలతో, వికృత నేత్రాలతో, తామ్రవర్ణపు శిరోజాలతో భీకరంగా ఉంది. రామునిదేహం యౌవనవంతమై, సమవిభక్తమై, బలిష్ఠమై రాజచిహ్నాలతో రాజిల్లుతుండగా ఆ రాక్షసిదేహం వెగటుపుట్టించేదిగా, నడివయస్సు అంచున ఉంది. ఆమె కామరూపిణి(కోరిన రూపం ధరించ గలదు)కానీ రాముని మొహం లో పడి రూపం మార్చుకోకుండానే రాముని సమీపించి, నిన్ను నేను భర్తగా చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను, అసహ్యమైన, కురూపం తో ఉన్న నీ ఈ భార్యను వదిలి నన్ను చేపట్టు, ఎక్కడంటే అక్కడ విహరిద్దాం అంటూ తనను వివాహం చేసుకోమని కోరింది. కురుపీ అయిన ఆ స్త్రీ సీతను కురూపి అనడం, నన్ను వివాహం చేసుకో అనడం రామునికి పరిహాసంగా తోచింది,రాముడు కూడా పరిహాసంగా, పాపం నా సోదరుడు ఒంటరి వాడు వాడిని చేపట్టు అని లక్ష్మణుడి దగ్గరకు పంపాడు, లక్ష్మణుడు మళ్ళీ రాముడి దగ్గరకు ఆమెను పంపారు.
2. లక్ష్మణుని శిక్ష:
ఇలా ఇద్దరు వద్దు అనే సరికి, అసలే రాక్షసి, పైగా కామం తో ఉంది,తన కోరిక తీరకపోవడానికి సీతమ్మే కారణమని భావించిన శూర్పణఖ,సీతపైకి దూకింది. ఈమెను సంహరిస్తాను మనం హాయిగా విహరిద్దాం అంటూ సీతమ్మ వైపు వెళ్ళబోయింది, వెంటనే రాముడి ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు తన కత్తితో ఆమె ముక్కు, చెవులను కోసి వేసాడు.శూర్పణఖ బాధతో ఆర్తనాదం చేసింది. బొటబొట రక్తం స్రవిస్తుండగా అరణ్యంలోకి పారిపోయింది. ఆమె వేగంగా తన సోదరుడైన ఖరుడు పలువురు ఇతర రాక్షసులతో కలసి నివసిస్తున్న జనస్థానానికి వెళ్ళింది. భీతావహయై, రక్తమోడుతూ శూర్పణఖ పెద్ద పెట్టున రోదిస్తూ,అవమానంతో రగిలిపోతూ,తన సోదరుడి పాదాలవద్ద పడింది. జరిగిన విషయం తనకు అనుకూలంగా మార్చి చెప్పింది.వారు నన్ను తీవ్రంగా అవమానం చేశారు వారి రక్తం తాగితేనె నాకు శాంతి అన్నది.
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
3. ఖరదూషణుల యుద్ధం:
శూర్పణఖకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఖరుడు, దూషణుడు 14 వేల మంది రాక్షస సైన్యంతో పంచవటిపై దాడి చేశారు. రాముడు సీతమ్మను రక్షించమని లక్ష్మణుడికి చెప్పి, తాను ఒక్కడే ఆ మహా సైన్యాన్ని ఎదుర్కొన్నాడు.
4. ఏకవీర విక్రమం:
శ్రీరాముడు అగస్త్యుడిచ్చిన దివ్య కోదండాన్ని ధరించి, ముహూర్త కాలంలో 14 వేల మంది రాక్షసులను అంతం చేశాడు. ఖర, దూషణ, త్రిశిర అనే రాక్షస నాయకులను కూడా సంహరించి దండకారణ్యాన్ని నిష్కంటకం చేశాడు. రాముని పరాక్రమాన్ని చూసి దేవతలు ఆకాశం నుండి పూలవర్షం కురిపించారు.
5. రావణుడికి వార్త:
ఈ ఘోర పరాజయాన్ని చూసిన 'అకంపనుడు' అనే రాక్షసుడు తప్పించుకుని వెళ్లి రావణుడికి విషయం చెప్పాడు. రాముడిని నేరుగా గెలవడం అసాధ్యమని, సీతను అపహరిస్తేనే రాముడు బలహీనపడతాడని రావణుడికి దుర్భోధ చేశాడు.
జై శ్రీరామ్ 🙏
(రామాయణం లో ఇద్దరు స్త్రీలు కథని మొత్తం మార్చివేశారు వారే మందర,శూర్పణఖ, తెల్లవారితే రాజు అవుతాడు అనగా మందర పన్నిన పన్నాగం రాముణ్ణి అడవుల వైపు నడిపిస్తే,13 సంవత్సరాల వనవాసం ఎలాంటి సమస్య లేకుండా ఎంతో సౌఖ్యంగా సాగింది మరొక్క పది, పదకొండు నెలలు అంతే రాముడు అయోధ్య చేరతాడు, పట్టాభిషేకం అవుతుంది అంతా క్షేమమే అనే సమయంలో శూర్పణఖ వచ్చి రాక్షస సంహారం వైపు రాముని అడుగులు పడేలా చేసింది.నిజానికి శూర్పణఖ అనే స్త్రీ లేకపోతే రావణుడు ఇప్పటికీ పడిపోయే వాడు కాదేమో, రాముడు అకారణంగా ఎవరిని సంహరించడు కాబట్టే ఇంత కథ నడవాలి రావణుడు పడి పోవాలి అని నిర్ణయం జరిగింది కనుకే ఈ ఇద్దరు స్త్రీలు అలా ప్రవర్తించి ఉండవచ్చు )
....సశేషం
బలం విష్ణోః ప్రవర్ధతాం
జయశ్రీరామ
Read Also: Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం
శూర్పణఖ గర్వభంగం నుండి ఖరదూషణ సంహారం వరకు – అరణ్యకాండలో శ్రీరాముడి ఏకవీర పరాక్రమం
టాప్ 5 FAQs (తెలుగులో):
- శూర్పణఖ ఎందుకు రాముణ్ణి వివాహం చేసుకోవాలని కోరింది?
రాముడి సౌందర్యానికి ఆకర్షితురాలై, కామోద్వేగంతో అతన్ని కోరింది.
- లక్ష్మణుడు శూర్పణఖకు ఏ శిక్ష విధించాడు?
ఆమె సీతపై దాడి చేయబోయినప్పుడు ముక్కు, చెవులను కోశాడు.
- ఖరుడు,
దూషణుడు ఎందుకు యుద్ధానికి వచ్చారు?
శూర్పణఖకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చారు.
- రాముడు 14
వేల రాక్షసులను ఎలా సంహరించాడు?
అగస్త్యుడు ఇచ్చిన దివ్య కోదండంతో ఒక్కడే యుద్ధం చేసి సంహరించాడు.
- రావణుడికి ఈ సంఘటన ఎలా తెలిసింది?
అకంపనుడు అనే రాక్షసుడు తప్పించుకుని వెళ్లి వివరించాడు.
Surpanakha’s Humiliation to the Slaying of 14,000 Demons
– Rama’s Unmatched Valor in Aranya Kanda
Aranya Kanda – Humbling of Surpanakha, Lakshmana’s
Punishment, Slaying of 14,000 Demons
Story Summary:
In Panchavati, Rama, Sita, and Lakshmana were living
peacefully. With the onset of winter, one morning after completing their
rituals, a demoness named Surpanakha appeared. Enchanted by Rama’s divine
beauty, she expressed her desire to marry him and insulted Sita.
Rama playfully redirected her to Lakshmana, and Lakshmana in
turn sent her back to Rama. Enraged and humiliated, Surpanakha attempted to
attack Sita. Acting on Rama’s command, Lakshmana punished her by cutting off
her nose and ears.
Filled with anger and humiliation, she went to her brother
Khara and narrated the incident in a distorted manner. Seeking revenge, Khara
and Dushana marched with an army of 14,000 demons to attack Rama.
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Rama asked Lakshmana to protect Sita and faced the army
alone. Wielding the divine bow gifted by Sage Agastya, Rama destroyed all
14,000 demons in a short time, including Khara, Dushana, and Trishira. The gods
praised him by showering flowers from the heavens.
A demon named Akampana escaped and informed Ravana about the
defeat. He advised that defeating Rama directly was impossible and suggested
abducting Sita as a strategy.
❓ Top 5 FAQs in English:
- Why
did Surpanakha approach Rama?
She was attracted to his beauty and desired to marry him.
- What
punishment did Lakshmana give Surpanakha?
He cut off her nose and ears when she attacked Sita.
- Why
did Khara and Dushana attack Rama?
To avenge the humiliation of Surpanakha.
- How
did Rama defeat 14,000 demons?
He fought अकेला using divine weapons and destroyed them swiftly.
- How
did Ravana learn about this incident?
Through the demon Akampana who escaped the battle.
Ramayan Part 17, Surpanakha story, Lakshmana punishment,
Khara Dushana war, Rama kills 14000 demons, Aranya Kanda summary, Panchavati
events, Ravana Sita abduction plan, Ramayana Telugu explanation, Hindu epic
stories
#Ramayana #Surpanakha #LordRama #AranyaKanda #HinduMythology
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
Post a Comment