Sampoorna Ramayanam Part 16 | Aranya Kanda సంపూర్ణ రామాయణం - అగస్త్య దర్శనం
Sampoorna Ramayanam Part 16 | Aranya Kanda సంపూర్ణ రామాయణం - అగస్త్య దర్శనం
🚩 సంపూర్ణ రామాయణం - భాగం 16 🚩 అరణ్యకాండ - అగస్త్య దర్శనం - దివ్య ఆయుధాల ప్రాప్తి - జటాయువు పరిచయం - పంచవటి ప్రవేశం
కథా వివరణ:
1. సుతీక్షణ మహర్షి ఆశ్రమం:
శరభంగ మహర్షి సూచన మేరకు రాముడు సుతీక్షణ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు.వారిని మాకోసం అరణ్యంలో చక్కటి స్థలం సూచించండి అని అడిగితే ఇక్కడ ఉండు రామా అన్నారు. ఇక్కడ ఉంటే మీకు అసౌకర్యం కలగవచ్చు వేరొక చోటు సూచించండి అన్నాడు. ఆరోజు రాత్రి అక్కడే ఉండి మరునాడు వీడ్కోలు పలికారు, అప్పుడు మహర్షి అన్నాడు రామా అరణ్యంలో ఉన్న ఋషి ఆశ్రమాలు అన్ని దర్శించి మళ్ళీ మా వద్దకు రావాల్సింది అని చెప్పాడు, అలాగే అని వారు బయలు దేరారు.అలా వారు పదేళ్ల పాటు ఆ అడవిలోని వివిధ ప్రాంతాలలో సంచరిస్తూ. మునులందరికీ రాక్షస భయం లేకుండా రక్షణ కల్పిస్తు.సంచరించారు, వారు ఒక్కో ఆశ్రమంలో వారం,నెల, కొన్ని చోట్ల సంవత్సరం కూడా ఉన్నారు,ఇలా ప్రవాసంలో పది సంవత్సరాలు ఎంతో సంతృప్తి గా,సుఖంగా గడిచిపోయాయి.పదేళ్ల తర్వాత మళ్ళీ తిరిగి సుతీక్షణ మహర్షి ఆశ్రమం కి వచ్చారు.
అక్కడ కూడా చాలా కాలం నివసించిన తదుపరి ఒకరోజు..రాముడు సుతీక్షణునితో సంభాషిస్తూ "అగస్త్యమహర్షి దండకారణ్యంలోనే ఎక్కడనో ఉంటున్నాడని విన్నాను, కాని ఈ సువిశాల మహారణ్యంలో ఎక్కడా ఆయనను కనుగొనలేకపోయాను. ఆ ఋషికి నా గౌరవ ప్రణామాలు సమర్పించి ఆయన ఆశీస్సులు పొందుదామనుకుంటున్నాను. దయచేసి ఆయన ఆశ్రమానికి దారి తెలియజేయండి" అన్నాడు.
సుతీక్షుణుని నుంచి సూచనలు పొంది సీతా, లక్ష్మణులు వెంటరాగా రాముడు బయలుదేరాడు. అంతట వారు అగస్త్యాశ్రమ పరిసరాలకు చేరగానే రాముడు ఈ క్రింది చరిత్రను వివరించాడు: "ఒకప్పుడు వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షస సోదరులుండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి సంస్కృతంలో సంభాషిస్తూ కొందరు నిజమైన బ్రాహ్మణులను శ్రాద్ధకర్మపేరుతో భోజనానికి ఆహ్వానిస్తుండేవాడు. బ్రాహ్మణులు వచ్చేలోగా ఇల్వలుడు వాతాపిని ఒక మేకరూపంలోకి మార్చేవాడు. అంతట తన సోదరుణ్ణి కోసి వండి వచ్చిన బ్రాహ్మణులకు ఆహారంతోపాటు పెడుతుండేవాడు. అలా వాతాపి బ్రాహ్మణుల ఉదరాల్లోకి ప్రవేశించగానే ఇల్వలుడు "సోదరా దయచేసి ఇక బయటకు రా" అని బిగ్గరగా పిలిచేవాడు. అలా పిలువగానే వాతాపి బ్రాహ్మణుల ఉదరాన్ని చీల్చుకొని మేకలా అరుస్తూబయటకు వచ్చేవాడు. ఈ పద్ధతిలో ఆ రాక్షసులిద్దరూ వేలాదిమంది బ్రాహ్మణులను చంపివేశారు.
చివరకు దేవతల ప్రార్ధనమీద అగస్త్యమహర్షి అక్కడకు ఆహ్వానించబడిన అతిధిగా వెళ్ళి మేక రూపంలో ఉన్న వాతాపిని భుజించాడు. కాని అప్పుడు ఇల్వలుడు తన సోదరుడ్డి పిలువగా ఋషి వాడితో 'నేను ఇప్పటికే వాతాపిని జీర్ణంచేసుకొని యమరాజ సదనానికి పంపించి వేశాను' అన్నాడు. ఈ మాటలు విన్న ఇల్వలుడు కోపావేశంతో అగస్త్యునిమీద దాడి చేయాలని ప్రయత్నించాడు. కాని అగస్త్యఋషి తన క్రోధ దృక్కులు ప్రసరించి వాడిని కాల్చి బూడిద చేశాడు. ఆ తర్వాత అగస్త్యముని అంటే రాక్షసులకు భయం ఏర్పడటంతో ఆయన ఆశ్రమం జోలికి వారుపోలేదు."
2. అగస్త్య మహర్షి దర్శనం:
చివరకు రాముడు లోక ప్రసిద్ధుడైన అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. సముద్రాన్ని ఆపోశనం పట్టిన, వింధ్య పర్వత గర్వాన్ని అణచిన అగస్త్యుడు రాముడిని చూసి పరవశించిపోయాడు. రాముడు రాబోయే మహా యుద్ధాన్ని ముందుగానే ఊహించిన మహర్షి, రాముడికి అత్యంత శక్తివంతమైన దివ్య ఆయుధాలను బహుకరించాడు:
* వైష్ణవ ధనుస్సు: సాక్షాత్తూ విష్ణుమూర్తి ధనుస్సు.
* బ్రహ్మదత్త బాణం: సూర్యప్రకాశంతో వెలిగిపోయే అమోఘమైన బాణం.
* అక్షయ తూణీరాలు: ఎన్ని బాణాలు వేసినా తరగని రెండు బాణాల పొదులు.
* ఖడ్గం: బంగారు పిడి కలిగిన దివ్యమైన కత్తి.
**3. పంచవటి మార్గదర్శనం:*
అప్పుడు రాముడు మహర్షి మా వనవాస కాలం దాదాపు చివరికి వచ్చాడు,ఈ మిగిలిన కాలం మేము నివసించుటకు అనువుగా ఉండే స్థలం సూచించండి అని కోరాడు.
అగస్త్యుడు ఒకింత ఆలోచించిన మీదట అక్కడకు పదహారు మైళ్ళ దూరాన గోదావరీ నదీ తీరం వద్దనున్న పంచవటికి వెళ్ళమని చెప్పాడు.
అంతట సరిగా రాముడు బయలుదేరేముందు అగస్త్యుడు “నీ పట్ల నాకున్న ప్రేమచేత మరింతగా పెంపొందిన యోగదృష్టితో నీ జీవిత సర్వస్వాన్ని నేనిప్పటికే ఎరిగివున్నాను" అని వెల్లడించాడు.(అన్ని తెలిసే అవతార కార్యం నెరవేరటం కోసమే ఆయుధములు ఇచ్చాడు, ఎక్కడ ఉంటే రాక్షసుల తో వైరం వస్తుందో అక్కడే ఉంచాడు లేదంటే రావణ సంహారం ఎలా జరుగుతుంది మరి)
4. జటాయువుతో పరిచయం:
పంచవటి వైపు వెళ్తుండగా, మార్గమధ్యంలో ఒక పెద్ద పర్వతం లాంటి పక్షి కనిపించింది. రాముడు దాన్ని రాక్షసుడనుకుని విల్లు ఎక్కుపెట్టగా, ఆ పక్షి "నాయనా! నేను మీ తండ్రి దశరథుని మిత్రుడిని, నా పేరు జటాయువు" అని పరిచయం చేసుకుంది. సీతమ్మకు రక్షణగా ఉంటానని మాట ఇచ్చిన జటాయువును రాముడు తండ్రిలా గౌరవించాడు.
........
Read Also: Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం
టాప్ 5 FAQs (తెలుగులో):
- అగస్త్య మహర్షి రాముడికి ఇచ్చిన దివ్య ఆయుధాలు ఏమిటి?
వైష్ణవ ధనుస్సు, బ్రహ్మదత్త బాణం, అక్షయ తూణీరాలు, ఖడ్గం ఇచ్చారు.
- పంచవటి ఎందుకు ముఖ్యమైన స్థలం?
ఇది గోదావరి తీరంలో ఉండి, రాముడి వనవాసంలో కీలక సంఘటనలు జరిగిన ప్రదేశం.
- జటాయువు ఎవరు?
జటాయువు దశరథ మహారాజు స్నేహితుడు, సీతకు రక్షణగా నిలిచిన గొప్ప పక్షి.
- అగస్త్యుడు ఎందుకు రాముడికి ఆయుధాలు ఇచ్చాడు?
రాబోయే రాక్షస యుద్ధానికి సిద్ధం చేయడానికి ఇచ్చాడు.
- వాతాపి,
ఇల్వల కథ ఏమి చెబుతుంది?
అగస్త్య మహర్షి మహిమను, ఆయన శక్తిని తెలియజేసే కథ.
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
Agastya’s Blessings, Divine Weapons & Entry into Panchavati – Aranya Kanda Highlights
Sampoorna Ramayana – Part 16
Aranya Kanda – Meeting Sage Agastya, Receiving Divine Weapons, Introduction to Jatayu, Entry into Panchavati
Story Summary:
Following the guidance of Sage Sharabhanga, Rama reached the hermitage of Sage Sutikshna. Though invited to stay, Rama chose to explore the forest further. Along with Sita and Lakshmana, he spent nearly ten years wandering through various hermitages, protecting sages from demons and living peacefully.
Later, Rama expressed his desire to meet the great Sage Agastya. With directions from Sutikshna, they journeyed toward his hermitage. On the way, Rama narrated the story of the demons Vatapi and Ilvala, who deceived and killed Brahmins. Sage Agastya ultimately destroyed them with his immense power.
Upon reaching Agastya’s hermitage, the sage warmly welcomed Rama. Foreseeing the upcoming battles, Agastya gifted Rama powerful divine weapons:
Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing
- Vaishnava Bow (belonging to Lord Vishnu)
- Brahmadatta Arrow (radiant and unfailing)
- Inexhaustible quivers
- A divine sword with a golden hilt
When Rama requested a suitable place to complete his exile, Agastya suggested Panchavati on the banks of the Godavari River.
On the way to Panchavati, Rama encountered a विशाल bird. Initially suspecting danger, he soon learned it was Jatayu, a loyal friend of King Dasharatha. Jatayu promised to protect Sita, earning Rama’s deep respect.
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
❓ Top 5 FAQs in English:
- What weapons did Sage Agastya give Rama?
The Vaishnava bow, Brahmadatta arrow, inexhaustible quivers, and a divine sword.
- Why is Panchavati important?
It is the place where major events of the Ramayana unfold during exile.
- Who is Jatayu?
A noble bird and friend of Dasharatha who vows to protect Sita.
- Why did Agastya help Rama?
He foresaw the upcoming battles and prepared Rama for them.
- What is the story of Vatapi and Ilvala?
A tale showing Agastya’s power in defeating deceptive demons.
Ramayan Part 16, Aranya Kanda summary, Agastya story Ramayana, Panchavati significance, Jatayu story, Rama divine weapons, Vatapi Ilvala story, Ramayana Telugu summary, Hindu epics Ramayana, Lord Rama exile story
#Ramayana #AranyaKanda #LordRama #IndianEpics #HinduMythology
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
Post a Comment