Sampoorna Ramayanam Part 13 | సంపూర్ణ రామాయణం - Ayodhya Kanda: Bharata’s Plea
Sampoorna Ramayanam Part 13 | సంపూర్ణ రామాయణం - Ayodhya Kanda: Bharata’s Plea
🚩 సంపూర్ణ రామాయణం - భాగం 13 🚩 అయోధ్యకాండ - భరతుని ప్రార్థన - పాదుకా పట్టాభిషేకం
కథా వివరణ:
1. అన్నదమ్ముల కలయిక:
చిత్రకూటం వద్ద మూడునెలలుగా నివసిస్తున్న ఒకనాడు రాముడు పర్వత పాదం వద్ద ఒక పెద్ద శిలపై కూర్చొని సీతతో కాలక్షేపం చేస్తూ వున్నాడు. ఋషులు భుజించే వివిధ కందమూలాల గురించి రాముడు సీతకు వివరిస్తూ విస్తారంగా వున్న పలురకాలైన వృక్షాలను, పుష్పాలను, వన్యమృగాలను చూపిస్తూ వాటి గురించి చెప్పాడు.
సీతతో మాట్లాడుతూ రాముడు అక్కడ రమ్యమైన పుష్పాలతో విరాజిల్లుతూ హంస, సారసాది అపురూప పక్షిజాతులకు క్రీడాస్థలిగా శోభిస్తున్న మందాకినీ నదిని చూపించాడు. "ప్రియతమా, ఇలాంటి రమణీయమైన ప్రదేశంలో నివసిస్తున్నందున మనము నిజంగా దుఃఖించవలసిన కారణమంటూ ఏమీ లేదు"అన్నాడు రాముడు. కాసేపటికి కుటీరానికి వచ్చారు.
సరిగా అదే సమయంలో సుదూరంగా అటు వస్తున్న భరతుని సైన్యంవల్ల పైకెగసిన ధూళిని రాముడు గమనించాడు. అంతలోనే భయంతో పారిపోతున్న వన్యమృగాల అరుపులు రాముడు వినగలిగాడు. దీనితో రాముడు లక్ష్మణునివైపు తిరిగి "ఈ ధూళిని రేపుతున్నదేమిటో గాని అది వన్యమృగాలకు భయం గొలుపుతోంది. ఈ కలకలానికి కారణమేమిటో తక్షణమే కనుక్కొనిరా" అని చెప్పాడు.
అంతట లక్ష్మణుడు ఒక ఎత్తయిన చెట్టుపైకెక్కి అక్కడ నుంచి ఒక పెద్ద సైన్యం అటు రావటాన్ని గమనించగలిగాడు.ఆ రధం పై ఉన్న కోవిధారా వృక్ష పతాకం చూసి ఇది అయోధ్య సైన్యం... భరతుడు మనమీదకు దాడికి వస్తున్నాడు ధనుర్భాణాలు పట్టుకోనీ సీతమ్మను గుహలో దాచి ఉంచు సోదరా అంటూ
ఆగ్రహపరశుడైన లక్ష్మణుణ్ణి వారిస్తూ, భరతుడు వచ్చే విధానం గురించి అడిగిన దాన్ని అనుసరించి “భరతుడు నన్ను చూడాలన్న గొప్ప ఔత్సుక్యంతో ఇక్కడకు వస్తున్నాడు. మరి ఇక ధనుర్బాణాలతో అవసరమేముంది? కేకయ దేశం నుండి వచ్చాక విషయం తెలుసుకుని చింతించి,రాజ్యాన్ని నాకు అప్పగించటంకోసమే భరతుడు వచ్చాడని నా అభిప్రాయం. అతడు పరమ ధర్మాత్ముడు,లక్షణా ఒకవేళ రాజసింహాసనాన్ని నీవే అనుభవించదలచి భరతుణ్ణి చంపగోరుతున్నట్లయితే ఆ మాటే నాతో చెప్పు. నేను భరతుడికి చెప్పి ప్రశాంతంగా నీకు రాజ్యాన్ని ఇప్పిస్తాను" అన్నాడు.
అలా రామునిచే మందలించబడిన లక్ష్మణుడు సిగ్గుతో తలవంచుకొని "మనను చూడటంకోసం మన తండ్రి వస్తున్నాడేమోనని ఆశించాను. అయితే సుపరిచితమైన ఆయన ఏనుగు కనిపించినప్పటికీ దానిమీద సాధారణంగా వుంటుండే శ్వేతఛత్రం లేకపోవటంతో ఆయన రాలేదనే అనుకుంటున్నాను” అన్నాడు.
Read Also: Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం
ఇంతలోనే భరతుడు త్వరితంగా ప్రయాణించి
చిత్రకూట పర్వతంపై పర్ణశాల ను చేరాడు,దాని ముందు కూచుని ఉన్న రాముడిని చూడగానే భరతుడు పరుగు పరుగున వెళ్లి అన్నయ్య పాదాలపై సొమ్మసిల్లి పడిపోయాడు. రాముడు భరతునీ ఒడిలోకి తీసుకుని ఉపచారాలు చేస్తే లేచాడు,లేచి జడలు ధరించి, నారచీరలతో ఉన్న అన్నయ్యను చూసి భరతుడు భోరున విలపించాడు. రాముడు తమ్ముడిని లేవనెత్తి కౌగిలించుకుని,రాజ్య పాలన వదిలేసి ఇక్కడకు ఎందుకు వచ్చావు,పాలన ధర్మం గా సాగుతుందా, మంత్రుల మీద పట్టు సాధించావా, ప్రజలు క్షేమమే కదా,అని ఎన్నో రాజా నీతి ధర్మాలు చెప్తాడు.అయిన నీవెందుకు ఇలా తాపసి లా వస్త్రాలు ధరించావు, రాజ్యానికి హాని కలగలేదు కదా, తల్లులు క్షేమమే కదా, తండ్రి గారు దశరథుడు ఎలా ఉన్నారు అని క్షేమ సమాచారాన్ని అడిగాడు.
(ముందుగా, రాజ్య క్షేమం,ప్రజా క్షేమం, ధర్మం గురించి అడిగి ఆ తర్వాత తల్లి తండ్రుల గురించి అడిగాడు ఇది ఒక పాలకుడు ఆలోచించే విధానం,రాజ్యం ఉన్నా లేకపోయినా ముందూ దేశం, ధర్మం బాగుండాలి,ఆ తర్వాతే కుటుంబం, స్వంత జీవితం...అదీ రాముడు,రామాయణం మొదటి నుండి ప్రతి ఘట్టాన్ని బాగా పరిశీలన చేస్తే చివర్లో ఉన్న సందేహాలకు సమాధానం మనకే లభిస్తుంది)
అప్పుడు భరతుడు కన్నీళ్లతో ఈ ధర్మాలతో నాకు పని ఏమిటి, జ్యేష్టుడు అయిన నీవు ఉండగా నేను రాజు ఎలా అవుతాను,దివంగతుడైన మన తండ్రియొక్క ఆత్మకు జలతర్పణం విడిచిన మీదట నీవు అయోధ్యకు తిరిగి వచ్చి రాజసింహాసనం మీద కూర్చోవాలి" అన్నాడు.
తన తండ్రి మరణించినట్లు వినగానే రాముడు తక్షణమే మూర్చిల్లి నేలపై పడిపోయాడు.లక్ష్మణుడు, శత్రుఘ్నుడు తన దేహంమీద నీళ్ళు చిలకరించిన తర్వాతనే ఆయన తిరిగి స్పృహ లోకి వచ్చాడు. స్పృహ లోకి వచ్చాక కుటీరం లో ఉన్న సీతమ్మ దగ్గరకు వెళ్లి సీతా మీ మామ గారు దేహం విడిచారు అని చెప్పాడు, అప్పుడు సీతమ్మ ఎంతో దుఃఖించింది.అప్పుడు
సీతమ్మ ముందు నడవగా తాను వెనక నడిచి మందాకిని నదిలో తండ్రికి తర్పణాలు వదిలాడు.ఆ తరువాత కుటీరానికి వచ్చిన తర్వాత ఆ సోదరుల రోదన తో లోయ మొత్తం ప్రతి ధ్వనించింది.అది విని కౌసల్య, సుమిత్ర, కైకేయ భయ పడ్డారు వెంటనే..
2. భరతుని అభ్యర్థన - రాముని ధర్మనిరతి:
దశరథ మహారాజుయొక్క ముగ్గురు భార్యలను ముందుంచుకొని వశిష్ఠుడు వేగంగా రాముణ్ణి చూడవచ్చాడు. వశిష్ఠుడు, ఆ ముగ్గురు స్త్రీలు మందాకినీ గంగాతీరానికి చేరిన సమయంలో అక్కడ రాముడు తన దివంగతుడైన తండ్రికోసం సమర్పించిన పదార్థాల అవశేషాలు వారికి కనిపించాయి.
ఆహారంగా సమర్పించడానికి రామునివద్ద వున్నదల్లా ఒక అరణ్య ఫలపు గుజ్జు మాత్రమే అని గమనించిన కౌసల్య బాధపడింది.
కుటీరానికి చేరుకోగానే వారి ముగ్గురికి రాముడు పాదాభివందనం చేశాడు.వశిష్ఠుని సమీపించి ఆయన పాదాలను స్పర్శించాడు. అంతట రాముడు తన గురువుతోపాటు క్రింద కూర్చొనగా తక్కిన వారంతా కూడా వారి చుట్టూ కూర్చున్నారు. అప్పుడు భరతుడు రామునితో "కోసల రాజ్యాన్ని నీకు తిరిగి ఇచ్చి వేయదలిచాను" అన్నాడు.
కానీ రాముడు సున్నితంగా తిరస్కరించాడు. "భరతా! తండ్రిగారి మాట ప్రకారం నేను 14 ఏళ్లు అరణ్యవాసం చేయాలి. సత్యం కంటే మించిన ధర్మం లేదు. నీవు వెళ్లి అయోధ్యను పాలించు, నేను అడవిని పాలిస్తాను" అని నిశ్చయంగా చెప్పాడు.
(ఇక్కడ కూడా సుదీర్ఘ మైన ధర్మ చర్చ జరుగుతుంది విస్తార భీతి చేత దాన్ని ఇవ్వడం లేదు)
3. పాదుకల ప్రధానం:
రామ నీవు తిరిగి రాక పోతే ప్రాయోపవేశం చేస్తాను నేను కూడా ఇక్కడే ఉంటాను,నీ బదులు నేను వనవాసం చేశాను అని
ఎంత బ్రతిమాలినా రాముడు రాకపోవడంతో...
భరతుడు తప్పించరానిదానికి శరణాగతుడై స్వర్ణఖచితమైన పాదుకలను వెలికితీశాడు.అంతట రాముని పాదపద్మాలను వాటిపై వుంచమని ఆయనను ప్రార్ధించాడు.
శ్లోకం:
"అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే |
ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః ||"
*(వాల్మీకి రామాయణం)*
భావం: "అన్నయ్యా! బంగారు అలంకారాలు కలిగిన ఈ పాదుకలపై నీ పాదాలను ఉంచు. ఇవే లోకానికీ, రాజ్యానికీ యోగక్షేమాలు కలిగిస్తాయి."
భరతుడు అడిగినట్టే చేసి రాముడు ఆ పాదుకలను అతనికి తిరిగి ఇచ్చాడు. అంతట పాదుకలను శిరస్సు పై వుంచుకొని భరతుడు రాముడికి ప్రణామం చేసి ఇలా అన్నాడు "రాజ్యపాలనా భారాన్ని ఈ పాదుకలకు అప్పగించిన మీదట నేను జడలను, నారవస్త్రాలను ధరించి అయోధ్యకు వెలుపల వుంటాను. రామా! నీ రాక కోసం నిరీక్షిసూ నేను ఫలాలు, దుంపలను మాత్రమే తింటూ జీవిస్తాను. అయితే పధ్నాలుగు సంవత్సరాల తర్వాత నీవు అయోధ్యకు తిరిగి రాకుంటే అప్పుడు నేను అగ్నిప్రవేశం చేసి ప్రాణాలు త్యజిస్తాను.
"ఈ ప్రకటనకు రాముడు ఆమోదం తెలిపి భరత, శత్రుఘ్నులను ఆలింగనం చేసుకొని, ప్రవాస కాలం పూర్తికాగానే తాను తిరిగి వస్తానని వారికి హామీ ఇచ్చాడు. సోదరులకు వీడ్కోలు చెపుతూ కైకేయ నీ ఏమాత్రం ఇబ్బందీ పెట్టవద్దు అని మరీ మరీ చెప్పి వారిని పంపించాడు. దశరధుడి రాజ గజం మీద పాదుకలు పెట్టీ, ఛత్రం పెట్టుకొని భరతుడు అయోధ్య చేరాడు.
4. నందిగ్రామ నివాసం:
భరతుడు ఆ దివ్య పాదుకలను తన తలపై పెట్టుకుని, కన్నీళ్లతో చిత్రకూటం నుండి తిరుగు ప్రయాణమయ్యాడు. అయోధ్యకు చేరుకున్నాక,రాజభవనంలోకి వెళ్లకుండా నగర శివార్లలోని 'నందిగ్రామం'లో ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు. అన్నయ్య లాగే నారచీరలు ధరించి, గడ్డి పాన్పుపై పడుకుంటూ, రాముని పాదుకలకు పట్టాభిషేకం చేసి, ప్రతి విషయాన్ని ఆ పాదుకలకే నివేదిస్తూ,వాటి ఆజ్ఞ మేరకే రాజ్యపాలన ప్రారంభించాడు.
5. భరతుని శపథం:
"14 ఏళ్లు ముగిసిన మరుక్షణమే అన్నయ్య రాకపోతే, నేను అగ్నిప్రవేశం చేస్తాను" అని భరతుడు శపథం చేశాడు. తన స్వార్థం కోసం కాకుండా, కేవలం అన్నయ్యపై భక్తితో రాజ్యం చేసిన భరతుడు 'త్యాగానికి' మారుపేరుగా నిలిచాడు.
జై శ్రీరామ్ 🙏
అడుగడునా ధర్మం, త్యాగం పొందటం కాదు విడవడం గొప్ప, త్యాగేనైకే అమృతత్వ మానసః, ఇంతటి ధర్మాన్ని బోధించే కావ్యము, ఇలాంటి మహనీయులు ఉన్న దేశంలో, ధర్మంలో పుట్టినందుకు గర్వపడాలి.ఈ త్యాగానికి గుర్తుగా ఒక్కసారి అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి...
బలం విష్ణోః ప్రవర్ధతాం
జయశ్రీరామ
.....సశేషం
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
భరతుని భక్తి పరాకాష్ట: పాదుకా పట్టాభిషేకం మరియు ధర్మ విజయం
Sampoorna Ramayanam Part 13 | సంపూర్ణ రామాయణం - Ayodhya Kanda: Bharata’s Plea
5 FAQs (Telugu)
1. భరతుడు చిత్రకూటంలో రాముడిని ఎందుకు కలిశాడు?
రాముడిని తిరిగి అయోధ్యకు తీసుకువచ్చి రాజుగా పట్టాభిషేకం చేయాలనే ఉద్దేశంతో భరతుడు వచ్చాడు.
2. రాముడు ఎందుకు తిరిగి రావడానికి నిరాకరించాడు?
తండ్రి మాటను నిలబెట్టుకోవడం కోసం 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేయాలనే ధర్మాన్ని పాటించాడు.
3. పాదుకా పట్టాభిషేకం అంటే ఏమిటి?
రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి,
వాటి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించడం.
4. భరతుడు నందిగ్రామంలో ఎందుకు నివసించాడు?
రాజసుఖాలను వదిలి,
తపస్విలా జీవిస్తూ రాముడి రాక కోసం ఎదురుచూడటానికి.
5. భరతుడు చేసిన శపథం ఏమిటి?
14 సంవత్సరాల తర్వాత రాముడు రాకపోతే అగ్నిప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.
Bharata’s Supreme Devotion: The Sandal Coronation and the
Triumph of Dharma
🚩 Sampoorna Ramayana –
Part 13 🚩
Ayodhya Kanda: Bharata’s Plea – The Coronation of the
Sandals (Paduka Pattabhishekam)
Story Summary:
While residing in Chitrakoot, Rama was once sitting with
Sita, describing the beauty of the forest—the trees, flowers, animals, and the
serene Mandakini River. He reassured Sita that despite being in exile, they had
no reason to feel sorrow in such a peaceful environment.
Soon, Rama noticed a cloud of dust rising in the distance
and heard the frightened cries of animals. Lakshmana climbed a tree and saw a
massive army approaching. Mistaking it for an attack led by Bharata, he grew
angry. However, Rama calmed him, expressing his faith in Bharata’s
righteousness and love.
Moments later, Bharata arrived and, upon seeing Rama, fell
at his feet in deep emotion. Seeing Rama dressed in bark garments and matted
hair, Bharata wept uncontrollably. Rama embraced him and inquired first about
the welfare of the kingdom and its people, demonstrating the mindset of an
ideal ruler.
Bharata then pleaded with Rama to return to Ayodhya and take
his rightful place as king. When Rama learned of their father Dasharatha’s
death, he was overwhelmed with grief. After performing the necessary rituals
for his father, the brothers mourned deeply.
In the presence of Sage Vashishta and the queens, Bharata
again requested Rama to accept the throne. However, Rama firmly refused,
stating that he must honor their father’s word and complete the fourteen-year
exile. He advised Bharata to rule Ayodhya in his place.
Unable to convince him, Bharata asked Rama to place his feet
on a pair of golden sandals. Accepting the request, Rama blessed them. Bharata
then declared that he would rule the kingdom only as a representative of those
sandals, symbolizing Rama’s authority.
Carrying the sandals on his head, Bharata returned to
Ayodhya but chose to live in Nandigrama instead of the palace. Living like an
ascetic, he ruled the kingdom in Rama’s name, awaiting his return.
Bharata also took a solemn vow that if Rama did not return
after fourteen years, he would enter fire and end his life. His sacrifice,
humility, and unwavering devotion stand as one of the greatest examples of
righteousness and brotherly love in the Ramayana.
Sampoorna Ramayanam Part 13 | సంపూర్ణ రామాయణం - Ayodhya Kanda: Bharata’s Plea
Top 5 FAQs (English)
1. Why did Bharata meet Rama at Chitrakoot?
To request Rama to return and rule Ayodhya as the rightful king.
2. Why did Rama refuse to return?
He chose to honor his father’s promise and complete the exile.
3. What is Paduka Pattabhishekam?
It is the symbolic coronation of Rama’s sandals as the ruling authority.
4. Why did Bharata live in Nandigrama?
He renounced royal comforts and lived simply while ruling on behalf of Rama.
5. What vow did Bharata take?
He vowed to sacrifice his life if Rama did not return after fourteen years.
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Paduka Pattabhishekam story, Bharata devotion Ramayana,
Ramayana Part 13 summary, Bharata and Rama meeting, Nandigrama story Bharata,
Ayodhya Kanda Paduka coronation, Bharata sacrifice story, Rama exile Bharata
role, Indian epics Ramayana Telugu, Bharata vow story
#Ramayana, #PadukaPattabhishekam, #Bharata, #Dharma,
#IndianEpics
Post a Comment