Sampoorna Ramayanam Part 9 | Ayodhya Kanda – Visit to Bharadwaja Ashram – Entry into Chitrakoot – Building the Leaf Hut సంపూర్ణ రామాయణం - భరద్వాజ ఆశ్రమం, చిత్రకూట ప్రవాసం మరియు పర్ణశాల నిర్మాణం

Sampoorna Ramayanam Part 9 | Ayodhya Kanda – Visit to Bharadwaja Ashram – Entry into Chitrakoot – Building the Leaf Hut సంపూర్ణ రామాయణం - భరద్వాజ ఆశ్రమం, చిత్రకూట ప్రవాసం మరియు పర్ణశాల నిర్మాణం    


Sampoorna Ramayanam Part 9 | Ayodhya Kanda – Visit to Bharadwaja Ashram – Entry into Chitrakoot – Building the Leaf Hut సంపూర్ణ రామాయణం - భరద్వాజ ఆశ్రమం, చిత్రకూట ప్రవాసం మరియు పర్ణశాల నిర్మాణం   

Sampoorna Ramayanam Part 9 | Ayodhya Kanda – Visit to Bharadwaja Ashram – Entry into Chitrakoot – Building the Leaf Hut సంపూర్ణ రామాయణం - భరద్వాజ ఆశ్రమం, చిత్రకూట ప్రవాసం మరియు పర్ణశాల నిర్మాణం


🚩 సంపూర్ణ రామాయణం - భాగం 9 🚩 అయోధ్యకాండ - భరద్వాజ ఆశ్రమ సందర్శనం - చిత్రకూట ప్రవేశం - పర్ణశాల నిర్మాణం


కథా వివరణ:

1. భరద్వాజ మహర్షి ఆశీస్సులు:

గంగను దాటిన తర్వాత సీతారామలక్ష్మణులు నడుచుకుంటూ ప్రయాణించి ప్రయాగలోని భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ మహర్షి రాముని చూసి ఎంతో సంతోషించి, "రామా! నీ వనవాస విషయం నాకు ముందే తెలుసు. మీరు ఇక్కడే ఈ ఆశ్రమంలో ప్రశాంతంగా ఉండవచ్చు" అని కోరారు. కానీ రాముడు వినయంగా, "మహర్షి! ఇక్కడ ఉంటే అయోధ్య ప్రజలు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు.మీకు ఇబ్బంది మా వనవాస నియమానికి విరుద్ధం,కనుక మాకు ఏకాంతంగా, ప్రశాంతంగా ఉండే చోటు చూపండి" అని కోరారు.


2. చిత్రకూట మార్గదర్శనం:

అప్పుడు భరద్వాజుడు... పది క్రోసుల దూరంలో ఉన్న 'చిత్రకూట పర్వతం' గురించి చెప్పారు. "అక్కడ పక్షుల కిలకిలరావాలు, స్వచ్ఛమైన మందాకిని నది, ఎంతోమంది మునుల తపస్సుతో ఆ ప్రదేశం ఎంతో పవిత్రంగా ఉంటుంది. సీతమ్మకు కూడా ఆ ప్రకృతి ఎంతో నచ్చుతుంది" అని మార్గాన్ని వివరించారు.ఆ రాత్రికి అక్కడే ఉండి మరునాడు ఉదయం మహర్షి దగ్గర సెలవు తీసుకుని వారు యమునా నదిని దాటి చిత్రకూట ప్రాంతానికి చేరుకున్నారు.


3. వాల్మీకి మహర్షి దర్శనం:

చిత్రకూట ప్రాంతంలో వారు వాల్మీకి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. లోకమాత సీతమ్మతో కలిసి వచ్చిన రాముడిని చూసి వాల్మీకి పులకించిపోయారు. వారిని సాదరంగా ఆహ్వానించి, ఆ పర్వతంపై నివసించమని సూచించారు. (రామాయణ కర్త అయిన వాల్మీకిని రామచంద్రుడు స్వయంగా కలవడం ఈ ఘట్టంలోని విశేషం).


4. పర్ణశాల నిర్మాణం - లక్ష్మణుని కార్యదక్షత:

పర్వత సానువుల్లో, మందాకిని నది తీరంలో ఒక చక్కని ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నారు. అక్కడ లక్ష్మణుడు తన చేతులతో వెదురు బొంగులు, గడ్డి, మట్టితో ఒక అందమైన పర్ణశాలను (కుటీరాన్ని) నిర్మించాడు. లక్ష్మణుడి నైపుణ్యాన్ని చూసి రాముడు ముచ్చటపడి, తమ్ముడిని మనసారా కౌగిలించుకున్నాడు.


5. ప్రకృతి ఒడిలో సీతారాములు:

అయోధ్యలోని బంగారు పడకలను వదిలి, అడవిలోని గడ్డి పరకలపై పడుకున్నా... సీతారాములు పరమ సంతోషంగా ఉన్నారు. ప్రకృతి ఒడిలో లక్ష్మణుని కాపలాలో వారు చిత్రకూట నివాసాన్ని ప్రారంభించారు. వారి రాకతో చిత్రకూటం ఒక దివ్యలోకంలా మారిపోయింది.


Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


జై శ్రీరామ్ 🙏

(వెంట నడిచే భార్య ఉంటే అరణ్యం లో కూడా హాయిగా ఉండవచ్చు అని రామాయణం చెపుతుంది, సంసారమే అరణ్యం ఇందులో ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకొని, ప్రేమ పెంచుకునీ, బాధలు తుంచుకుని ముందుకు సాగడమే జీవితం, వివాహం అంటే రెండు కుటుంబాల మధ్య జరిగే అగ్రిమెంట్ కాదు, రెండు జీవితాలు కలసి నిర్మించుకొనే జీవిత ప్రయాణం అదే రామాయణం లోకానికి చెప్పే గొప్ప సత్యం)


బలం విష్ణోః ప్రవర్ధతాం


 

సంపూర్ణ రామాయణం భాగం 9: భరద్వాజ ఆశ్రమం, చిత్రకూట ప్రవాసం మరియు పర్ణశాల నిర్మాణం

 

 

Top 5 FAQs in Telugu

రాముడు భరద్వాజ ఆశ్రమంలో ఎందుకు ఉండలేదు?
రాముడు ఎంచుకున్నది ఏకాంతం, ప్రజలు రాముని వెతుక్కోవడం వల్ల ఆశ్రమంలో మహర్షి కష్టపడవద్దు అని.


చిత్రకూట ప్రాంతం ఎందుకు ప్రత్యేకం?
పక్షుల కిలకిలరావులు, శుద్ధి జలాలు, మునుల తపస్సు పర్వతం శాంతి, ప్రకృతి ప్రేమ కోసం అత్యంత అనుకూలం.


రాముడు వాల్మీకి మహర్షిని ఎందుకు కలవడం విశేషం?
వాల్మీకి స్వయంగా రామాయణ రచయిత; రామచంద్రుడు అతన్ని కలవడం ఘట్టాన్ని ప్రత్యేకంగా చేస్తుంది.


లక్ష్మణుడు పర్ణశాల ఎలా నిర్మించాడు?
గడ్డి, వెదురు, మట్టి ఉపయోగించి లక్ష్మణుడు శ్రద్ధగా ఒక అందమైన పర్ణశాల కూటీరాన్ని నిర్మించాడు.


చిత్రకూటలో రామసీతులు ఎలా ఉండేవారు?
ప్రకృతి ఒడిలో, లక్ష్మణుని రక్షణలో సంతోషంగా నివసించి, అరణ్య జీవితం వారి సుఖమైన పర్వత ਿਵాసంగా మారింది.

 

Sampoorna Ramayana – Part 9: Bharadwaja Ashram, Chitrakoot Entry, and Construction of the Leaf Hut

 

Read Also:  Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం https://telugulostories.blogspot.com/2026/03/sampoorna-ramayanam-part-1-1.html



🚩 Sampoorna Ramayana – Part 9 🚩 Ayodhya Kanda – Visit to Bharadwaja Ashram – Entry into Chitrakoot – Building the Leaf Hut


Sampoorna Ramayanam Part 9 | Ayodhya Kanda – Visit to Bharadwaja Ashram – Entry into Chitrakoot – Building the Leaf Hut సంపూర్ణ రామాయణం - భరద్వాజ ఆశ్రమం, చిత్రకూట ప్రవాసం మరియు పర్ణశాల నిర్మాణం   


Story Overview:
Blessings from Sage Bharadwaja:

After crossing the Ganga, Rama, Sita, and Lakshmana traveled to the ashram of Sage Bharadwaja at Prayag. The sage welcomed Rama warmly, saying he could stay peacefully there. Rama, however, humbly requested, “Maharshi, if we stay here, the citizens of Ayodhya will search for us, causing you inconvenience. Please guide us to a secluded, serene place suitable for our forest life.”


Guidance to Chitrakoot:
Bharadwaja described the Chitrakoot hills, a sacred place ten kroshas away. With chirping birds, the pure Mandakini river, and sages engaged in penance, it was perfect for Sita’s love of nature. Rama and his companions spent the night near the ashram and departed the next morning, crossing the Yamuna to reach Chitrakoot.


Visit to Sage Valmiki:
In Chitrakoot, they visited Sage Valmiki’s ashram. Valmiki was delighted to see Rama with Sita, personally welcoming them and inviting them to reside on the hill. (It is notable that Rama met Valmiki, the author of Ramayana, in person.)


Construction of the Leaf Hut – Lakshmana’s Skill:
Along the Mandakini river, Lakshmana selected a suitable spot and, with grass, hay, and mud, built a beautiful leaf hut (parnashala). Rama admired his brother’s craftsmanship and affectionately praised him.


Rama and Sita in Nature’s Embrace:
Leaving the comforts of Ayodhya, Rama and Sita were content sleeping on the grass of the forest, with Lakshmana keeping watch. Their arrival transformed Chitrakoot into a divine realm.

 
The Ramayana shows that with companionship, love, and shared responsibility, even forest life can be joyful. Marriage is not just an agreement between families but a journey of two lives building together—a truth vividly illustrated in this episode.

Jai Shri Ram 🙏

Balam Vishnuḥ Pravardhatām

 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Top 5 FAQs in English

Why didn’t Rama stay at Bharadwaja Ashram?
To avoid disturbing the sage and to maintain solitude, Rama requested a more secluded location.


Why is Chitrakoot special?
With its birds, clean rivers, and meditating sages, Chitrakoot provided a peaceful and nature-filled environment suitable for Sita and Rama.


Why is meeting Sage Valmiki significant?
Valmiki, the author of the Ramayana, personally welcomed Rama and Sita, marking a historic moment in the epic.


How did Lakshmana build the leaf hut?
Using grass, hay, and mud, Lakshmana skillfully constructed a beautiful and functional hut for their stay.


How did Rama and Sita live in Chitrakoot?
They lived joyfully amidst nature, protected by Lakshmana, turning Chitrakoot into a divine abode.

 

Ramayana Part 9, Rama forest journey, Bharadwaja Ashram visit, Chitrakoot entry, leaf hut construction, Lakshmana craftsmanship, Sita in nature, Valmiki meeting Rama, Ramayana English translation, Hindu epic stories

 

#Ramayana, #RamaExile, #Chitrakoot, #BharadwajaAshram, #LeafHut

 

 

Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Post a Comment

Previous Post Next Post