Sampoorna Ramayanam Part 4 | Ayodhya Pravesham సంపూర్ణ రామాయణం - భాగం 4 | పరశురాముని గర్వభంగం – శ్రీరాముని దివ్య శౌర్యం మరియు అయోధ్య ప్రవేశ మహోత్సవం

Sampoorna Ramayanam Part 4 |  Ayodhya Pravesham సంపూర్ణ రామాయణం - భాగం 4 | పరశురాముని గర్వభంగం – శ్రీరాముని దివ్య శౌర్యం మరియు అయోధ్య ప్రవేశ మహోత్సవం 


Sampoorna Ramayanam Part 4 |  Ayodhya Pravesham సంపూర్ణ రామాయణం - భాగం 4 | పరశురాముని గర్వభంగం – శ్రీరాముని దివ్య శౌర్యం మరియు అయోధ్య ప్రవేశ మహోత్సవం

Sampoorna Ramayanam Part 4 |  Ayodhya Pravesham సంపూర్ణ రామాయణం - భాగం 4 | పరశురాముని గర్వభంగం – శ్రీరాముని దివ్య శౌర్యం మరియు అయోధ్య ప్రవేశ మహోత్సవం

🚩 సంపూర్ణ రామాయణం - 4వ రోజు 🚩

బాల కాండ - పరశురామ గర్వభంగం - అయోధ్యకు ప్రవేశం


మిథిలా నగరంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా ముగిసింది. జనక మహారాజు అల్లుళ్ళకు, కూతుళ్ళకు ఎన్నో అమూల్యమైన కానుకలు, అపారమైన ధనరాశులు ఇచ్చి ప్రేమగా సాగనంపాడు. దశరథ మహారాజు తన నలుగురు కోడళ్లతో, కుమారులతో, బంధుమిత్ర సపరివారంతో అత్యంత సంతోషంగా అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యాడు.


అపశకునాలు - భార్గవ రాముని ప్రవేశం:

అయోధ్యకు తిరిగి వస్తుండగా భయగ్రస్తమైన అసంఖ్యాకమైన పక్షులు కీచుకీచుమని అరుస్తూ తలమీదుగా ఎగురుతున్న దుశ్శకునం దశరథమహారాజు చూశాడు. అదే సమయంలో తన దారిలో ఒక జింక ఎడమ నుంచి కుడివైపుకు పోతున్న శుభశకునం కూడా ఆయనకు కనిపించింది. ఏదో ప్రమాదం ముంచుకు రానున్నదన్న భయంతో ఆ శకునాలకు ఫలితమేమని మహారాజు వశిష్ఠుణ్ణి వివరణ అడిగాడు. "కీచు కీచుమని రొద చేసిన పక్షులు ఏదో ప్రమాదం రానున్నదని సూచిస్తున్నాయి. అయితే ఆ విషయమై ఆందోళన పడవలసిందేమీ లేదన్న సంగతిని జింక ఎడమ నుంచి కుడికిపోవటం తెలియజేస్తున్నది" అని ఋషి సమాధానమిచ్చాడు.


ఇంతలో ఒక మహా తేజస్సుతో, జటాజూటంతో, భుజాన గొడ్డలి, చేతిలో ప్రకాశిస్తున్న ధనుస్సు ధరించిన పరశురాముడు (భార్గవ రాముడు) వారి దారికి అడ్డుగా నిలిచాడు. కోపంతో బుసలు కొడుతున్న పాములా ఉన్న ఆయనను చూడగానే సైన్యం భయంతో వణికిపోయింది.


Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 

దశరథుని భయం - పరశురాముని సవాలు:

ఇరవై ఒక్క సార్లు భూమండలంపై క్షత్రియులను అంతం చేసిన ఆ పరశురాముడిని చూడగానే దశరథుని గుండె ఆగిపోయినంత పనైంది. తన బిడ్డలకు ఏ హాని తలపెడతాడో అని గడగడలాడుతూ ఆయన పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. కానీ పరశురాముడు దశరథుని వైపు కన్నెత్తి కూడా చూడకుండా, శ్రీరాముని ఉద్దేశించి ఇలా అన్నాడు: "ఓ రామా! నువ్వు శివధనుస్సును విరిచావని విన్నాను. ఆ ధనుస్సు పాతది. దానిని విరిచినంత మాత్రాన నువ్వు గొప్ప వీరుడివి కావు. ధైర్యం ఉంటే, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ 'విష్ణు ధనుస్సు'కు నారి సారించి బాణాన్ని ఎక్కుపెట్టు. అప్పుడు నీ బలాన్ని నేను అంగీకరించి నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను" అని సవాలు విసిరాడు.


శ్రీరాముని సౌమ్యమైన శౌర్యం:

ఆ ప్రగల్భాలకు శ్రీరాముడు ఏమాత్రం చలించలేదు, కోపపడలేదు. ఎంతో ప్రశాంతమైన చిరునవ్వుతో ముందుకు వచ్చి, పరశురాముని చేతిలోని ఆ విష్ణు ధనుస్సును అవలీలగా తీసుకున్నాడు. క్షణంలో దానికి నారి సారించి, బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ దృశ్యం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్య పోయారు.


అప్పుడు శ్రీరాముడు, "మునివర్యా! మీరు బ్రాహ్మణోత్తములు, నాకు పూజ్యులు. కాబట్టి ఈ బాణాన్ని మీ ప్రాణాలు తీయడానికి ప్రయోగించలేను. కానీ ఒక్కసారి ఎక్కుపెట్టిన ఈ బాణం వృథా పోకూడదు కదా! దీనితో మీ పాదాల గమనాన్ని (సంచరించే శక్తిని) నిలువరించమంటారా? లేదా మీరు కఠోర తపస్సు ద్వారా సంపాదించిన పుణ్యరాశిని నాశనం చేయమంటారా?" అని గంభీరంగా అడిగాడు.


గర్వభంగం - ఆత్మజ్ఞానం:

అత్యంత శక్తివంతమైన ఆ ధనుస్సును రాముడు పూలచెట్టు కొమ్మను పట్టుకున్నంత సునాయాసంగా పట్టుకోవడం చూసి పరశురాముని గర్వం పూర్తిగా అణిగిపోయింది. ఆ క్షణంలో తన ఎదురుగా ఉన్నది సామాన్య మానవుడు కాదని, సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువేనని, పరమాత్మ అంశ తన నుండి శ్రీరామునిలోకి బదిలీ అయిపోయిందని పరశురామునికి అర్థమైంది. "రామా! నీ చేతిలో పరాజయం నాకు గర్వకారణమే. నా పుణ్యరాశిని దహించివెయ్యి. నేను తపస్సు చేసుకోవడానికి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాను"నీ చేతిలో పరజితున్ని అయినందుకు నాకు ఏ మాత్రం బాధ లేదు అని చెప్పి, శ్రీరామునికి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.


Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


అయోధ్యలో ఆనందోత్సాహాలు:

పరశురాముడు వెళ్ళిపోవడంతో గండం గడిచిందని దశరథుడు ఊపిరి పీల్చుకున్నాడు. తన కుమారుని పరాక్రమాన్ని చూసి మురిసిపోయాడు. ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరూ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య వాసులు పూల వర్షం కురిపిస్తూ తమ యువరాజులకు, నూతన కోడళ్ళకు బ్రహ్మరథం పట్టారు. 


స్వగృహానికి చేరిన మీదట దశరథ మహారాజు నందనులు నలుగురు తమ తమ పత్నులతో ఎంతో సుఖంగా గడపసాగారు. తరువాత కొంతకాలానికి కేకయ రాజు పుత్రుడు భరత శత్రుఘ్నులకు మేనమామ అయిన యుధాజిత్తు మహారాజు అయోధ్యకు వచ్చి తప మేనల్లుళ్ళను తనతో వచ్చి ఉండవలసిందిగా ఆహ్వానించాడు.


తన సోదరులిద్దరు కేకేయ రాజ్యానికి వెళ్ళిన మీదట రాముడు తన తండ్రిని, ముగ్గురు తల్లులను ఎంతో శ్రద్ధతో సేవించసాగాడు. రాజ్యపాలనా వ్యవహారాలను కూడా ఎంతో నిజాయితీగా చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఉన్నందున పౌరులందరు రాముణ్ణి అమితంగా ప్రేమించసాగారు.


సీతారాముల పరస్పర సహజ ప్రేమానురాగాలు దినదిన ప్రవర్ధమానమైనాయి. పరస్పర సౌందర్య సద్గుణాలకు బద్ధులై వారు సంపూర్ణంగా ఒకరికొకరు అంకితమైనారు. వాస్తవానికి సాక్షాత్తుగా భాగ్యాధిదేవతయైన లక్ష్మీదేవియే అయినందున సీత సౌందర్యమే అవతరించినట్లుగా ఉండేది. రాముని హృదయాంతర్గత భావాలనన్నింటిని సీత మనస్సుతోనే చదువగలిగేది.


2)భర్తకు ప్రీతి కలిగించడానికే నిరంతరం కృతనిశ్చయురాలైవున్న సీత, శ్రీ సహజమైన మృదుల స్వభావానికీ, పాతివ్రత్యానికీ ప్రతీకలా వ్యవహరించేది. అనతికాలంలోనే సీత శ్రీరాముని హృదయాన్ని తను నియంత్రించగలిగే స్థితికి వచ్చింది.....


దీనితో శ్రీమద్రామాయణంలో మొదటిదైన 'బాలకాండ' దిగ్విజయంగా పూర్తయింది!


చూస్తుండగానే బాలకాండ పూర్తి అయింది సీత రాములు ఒకరిని విడచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు,వారి కథ వినకుండా ఉండలేని స్థితికి మన హృదయం కూడా వచ్చేలా ఆశీర్వదించమని సీతారాముల పాదాలు పట్టి కోరుతూ, రేపటి నుండి అయోధ్య కాండ..


🙏 ఈ అద్భుతమైన ఘట్టాన్ని చదివిన వారు "జై శ్రీరామ్" అని కామెంట్ చేసి, తోటి భక్తులతో పంచుకోండి. 🙏

బలం విష్ణోర్ ప్రవర్ధతామ్...


Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

.....సశేషం

  FAQs :

1. పరశురాముడు ఎందుకు శ్రీరామునికి సవాలు విసిరాడు?
శివధనుస్సును విరిచిన విషయం విని, రాముని శౌర్యాన్ని పరీక్షించడానికి పరశురాముడు సవాలు విసిరాడు.

2. విష్ణు ధనుస్సుతో శ్రీరాముడు ఏమి చేశాడు?
శ్రీరాముడు ధనుస్సును సులభంగా ఎత్తి, నారి సారించి బాణాన్ని ఎక్కుపెట్టాడు.

3. పరశురాముని గర్వం ఎలా తగ్గింది?
రాముని దివ్యశక్తిని చూసి, ఆయన విష్ణువు అవతారం అని తెలుసుకుని గర్వం విడిచాడు.

4. పరశురాముడు చివరకు ఏమి కోరుకున్నాడు?
తన పుణ్యాన్ని నాశనం చేయమని కోరుకుని, తపస్సు కోసం వెళ్లిపోయాడు.

5. అయోధ్యలో ప్రజలు ఎలా స్వాగతించారు?
పూల వర్షం కురిపిస్తూ, ఆనందంతో యువరాజులను స్వాగతించారు.

 

The Humbling of Parashurama – Lord Rama’s Divine Valor and Grand Return to Ayodhya

 

Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


🚩 Complete Ramayana – Day 4 🚩
Bala Kanda – The Humbling of Parashurama & Entry into Ayodhya

The grand wedding of Sita and Rama in Mithila concluded magnificently. King Janaka lovingly sent his daughters and sons-in-law with abundant wealth and precious gifts. King Dasharatha, along with his sons, daughters-in-law, and relatives, began their joyful journey back to Ayodhya.

Omens and the Arrival of Parashurama

On their way, Dasharatha noticed inauspicious signs—flocks of birds screeching fearfully overhead. At the same time, a deer crossing from left to right appeared as a शुभ omen. Concerned, he consulted Sage Vashishta, who reassured him that while danger may arise, it would not cause harm.

Soon, the powerful sage-warrior Parashurama appeared, radiant, carrying an axe and a divine bow. His presence terrified the entire army.

Dasharatha’s Fear and the Challenge

Having destroyed Kshatriyas multiple times, Parashurama was a fearsome figure. Dasharatha trembled for his sons’ safety and pleaded for mercy. Ignoring him, Parashurama challenged Rama to string the Vishnu bow and prove his strength.

Rama’s Calm Valor

Unshaken, Rama calmly took the bow, strung it effortlessly, and fixed an arrow, astonishing everyone present.

Rama respectfully said he could not harm a revered Brahmin but asked whether the arrow should destroy Parashurama’s mobility or his accumulated spiritual merit.

The Fall of Pride and Realization

Witnessing Rama’s power, Parashurama realized he was no ordinary human but Lord Vishnu incarnate. His pride dissolved instantly. Accepting defeat with humility, he requested Rama to destroy his merit and departed for penance.

Joy in Ayodhya

With danger gone, Dasharatha rejoiced. The royal family reached Ayodhya safely, where citizens welcomed them with showers of flowers and celebrations.

Rama began fulfilling his duties with sincerity, earning the love of all citizens. The bond between Rama and Sita grew deeper, symbolizing divine love and harmony.

Soon, Bharata and Shatrughna left for their maternal kingdom, while Rama continued serving his parents and ruling responsibilities with dedication.

Thus, the Bala Kanda of the Ramayana concludes gloriously.

 

🟡 5. Top 5 FAQs (English)

1. Why did Parashurama challenge Lord Rama?
He wanted to test Rama’s strength after hearing about the breaking of Shiva’s bow.

2. What did Rama do with the Vishnu bow?
He effortlessly lifted, strung, and mounted an arrow on it.

3. How was Parashurama’s pride broken?
He realized Rama was the incarnation of Lord Vishnu after witnessing his power.

4. What did Parashurama request at the end?
He asked Rama to destroy his accumulated spiritual merit.

5. How were Rama and Sita received in Ayodhya?
They were welcomed with great joy, celebrations, and showers of flowers.

 Read Also:  Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం https://telugulostories.blogspot.com/2026/03/sampoorna-ramayanam-part-1-1.html



Ramayana Bala Kanda summary, Parashurama vs Rama story, Vishnu bow story, Ramayana Telugu content, Rama Sita marriage story, Ayodhya return celebration, Hindu mythology stories, Bala Kanda explanation, Ramayana English summary, Lord Rama valor story

 

#Ramayana, #LordRama, #Parashurama, #HinduMythology, #BalaKanda

 


Post a Comment

Previous Post Next Post