Sampoorna Ramayanam Part 3 | Balakanda Shivadhanurbhangam సంపూర్ణ రామాయణం - భాగం 3 - బాలకాండ - శివధనుర్భంగం - వైభవంగా సీతారామ కళ్యాణం

Sampoorna Ramayanam Part 3 | Balakanda Shivadhanurbhangam సంపూర్ణ రామాయణం - భాగం 3 - బాలకాండ - శివధనుర్భంగం - వైభవంగా సీతారామ కళ్యాణం 


Sampoorna Ramayanam Part 3 | Balakanda Shivadhanurbhangam సంపూర్ణ రామాయణం - భాగం 3 - బాలకాండ - శివధనుర్భంగం - వైభవంగా సీతారామ కళ్యాణం


Sampoorna Ramayanam Part 3 | Balakanda Shivadhanurbhangam సంపూర్ణ రామాయణం - భాగం 3 - బాలకాండ - శివధనుర్భంగం - వైభవంగా సీతారామ కళ్యాణం

🚩 సంపూర్ణ రామాయణం - భాగం 3 🚩 బాలకాండ - శివధనుర్భంగం - వైభవంగా సీతారామ కళ్యాణం


"శ్రీరామ చంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః |

సీతా ముఖాంభోరుహ సంచరీకో నిరంతరం మంగళ మాతనోతు ||"


కథా వివరణ:

1. శివధనుర్భంగం (వీరశుల్క):

విశ్వామిత్రుని వెంట మిథిలకు వచ్చిన రామలక్ష్మణులను చూసి జనక మహారాజు ముగ్ధుడయ్యాడు. ఆ తర్వాత విశ్వామిత్రుని ఆదేశంతో, జనకుడు శివధనస్సును సభలోకి తెప్పించాడు.


ఐదువేల మంది బలశాలురు అతికష్టం మీద ఆ ధనస్సు ఉన్న మంజూషికను (పెట్టెను) మోసుకువచ్చారు.


"రామా! ఈ ధనస్సును చూడు" అని విశ్వామిత్రుడు ఆదేశించగానే, రాముడు గురువుకు నమస్కరించి,మెచ్చుకోలుగా ఆ ధనుస్సు వంక చూస్తుండగా "దేవతలు, దానవులు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు, నాగులు సహితం ఈ మహాశక్తివంతమైన ధనుస్సును కనీసం వంచలేక విఫలమైనారు సుమా! మరి ఒక సాధారణ మర్త్యుడు దీని నారి సంధించటంలో విజయవంతం కాగలుగుతాడా?" అంటూ జనకమహారాజు హెచ్చరించాడు.


అయినప్పటికీ రాముడు నాజూకుగా తన ఎడమచేతిని ధనుస్సు మధ్యభాగంపై ఉంచాడు. ఆ పైన మహాజనసందోహం చూస్తుండగా ధనుస్సును దాని పేటికలో నుంచి అవలలీగా పైకెత్తాడు. ధనుస్సును ఎత్తి పట్టుకొని రాముడు ఒక్క తృటిలో నారి సంధించి గొప్పశక్తితో దానిని వంచి ఏనుగుగున్న చెరకుగడను త్రుంచినట్లు ఫెళ్ళుమని మధ్యకు  మరుక్షణమే...


పిడుగు పడినట్లుగా భయంకరమైన శబ్దం వినిపించింది. పర్వతం బద్దలైనట్లుగా భూమి కంపించింది. ఆ శివధనస్సు మధ్యలోకి విరిగిపోయింది. దేవతలు ఆనందంతో పూలవాన కురిపించారు. జనక మహారాజు ఆనందానికి అవధులు లేవు. వెంటనే జనకుడి కోరిక మేరకు విశ్వామిత్రుడు అయోధ్యకు వర్తమానం పంపగా, దశరథ మహారాజు సంతోషం తో ఉబ్బితబ్బిబ్బు అయి, వశిష్ఠున్నీ,వామదేవుణ్ణి సంప్రదించి మరునాడే సకల పరివారంతో మిథిల చేరుకున్నాడు.


2. సీతారామ కళ్యాణం (పాణిగ్రహణం):

వశిష్ఠ, విశ్వామిత్ర, శతానంద మహర్షుల సమక్షంలో వివాహ ముహూర్తం నిశ్చయమైంది. అగ్నిహోత్రం సాక్షిగా, జనక మహారాజు సర్వాలంకృతయైన సీతాదేవిని తీసుకొని వచ్చి, రాముని ఎదుట నిలబెట్టి పలికిన ఈ శ్లోకం రామాయణంలోనే అత్యంత పవిత్రమైనది:


"ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ |

ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా ||"

(వాల్మీకి రామాయణం: 1-73-26)


భావం: "ఓ రామా! ఇదిగో నా కుమార్తె సీత. ఈమె నీకు సహధర్మచారిణి. ఈమెను స్వీకరించు. నీకు శుభమగుగాక! నీ చేతితో ఈమె చేతిని పట్టుకో (పాణిగ్రహణం చేయి)."

"పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా" - ఈమె మహా పతివ్రత, నీడలా నిన్ను అనుసరించి ఉంటుంది అని జనకుడు రాముడికి సీతమ్మను అప్పగించాడు.


అదే శుభలగ్నంలో లక్ష్మణునకు ఊర్మిళతో, భరతునకు మాండవితో, శత్రుఘ్నునకు శ్రుతకీర్తితో వివాహం జరిగింది. నాలుగు జంటల వివాహంతో మిథిలా నగరమంతా ఆనందంతో మునిగిపోయింది.


.....సశేషం


జై సీతారామ్ 🙏

(కళ్యాణ ఘట్టానికి ముందు సుదీర్ఘ మైన ఇరు వంశాల చరిత్ర వివరిస్తారు వివాహానికి ముందు ఇరు వంశాల వారి పూర్వీకుల గురించి పురోహితులు చెపుతారు వ్యాసం నిడివి అతి సుదీర్ధం అవుతుంది కనుక ప్రధాన ఘట్టాల తో ఈ 40 రోజుల అధ్యయనం చేసుకుని,మరొక మారు కచ్చితంగా ప్రతి సర్గ లోని విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ అధ్యయనం చేద్దాం🙏)


అందరూ జయ శ్రీరామ అని కామెంట్ చేయండి 

శ్రీ రామ నామం సర్వ పాప హరణం ... 


Sampoorna Ramayanam Part 2 | Balakanda సంపూర్ణ రామాయణం - భాగం 2 | బాలకాండ - తాటక వధ - సిద్ధాశ్రమ రక్షణ - అహల్య శాప విమోచనం https://telugulostories.blogspot.com/2026/03/sampoorna-ramayanam-part-2-balakanda-2.html


 
బాలకాండ శివధనుర్భంగం & సీతారామ కళ్యాణం

  తెలుగు FAQs (Top 5)

1. శివధనుస్సు ఏమిటి?
శివునికి చెందిన దివ్యమైన ధనుస్సు, దానిని ఎవరూ వంచలేకపోయారు.


2. శ్రీరాముడు శివధనుస్సును ఎలా విరిచాడు?
అతను సులభంగా ఎత్తి, నారి సంధించి వంచగా అది విరిగిపోయింది.


3. సీతారామ కళ్యాణం ఎక్కడ జరిగింది?
మిథిలా నగరంలో జనక మహారాజు సమక్షంలో జరిగింది.


4. పాణిగ్రహణం అంటే ఏమిటి?
వధువు చేతిని వరుడు పట్టుకుని వివాహ బంధంలోకి ప్రవేశించడం.


5. ఇతర ఎవరి వివాహాలు అదే సమయంలో జరిగాయి?
లక్ష్మణుడుఊర్మిళ, భరతుడుమాండవి, శత్రుఘ్నుడుశ్రుతకీర్తి వివాహాలు జరిగాయి.


Read Also:  Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం https://telugulostories.blogspot.com/2026/03/sampoorna-ramayanam-part-1-1.html


Sampoorna Ramayanam Part 3: The Breaking of Shiva’s Bow & the Divine Wedding of Sita and Rama

 

 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


🚩 Complete Ramayanam – Part 3 🚩
Balakanda – Shiva Dhanurbhangam & Sita-Rama Kalyanam


This part beautifully narrates the valor of Lord Rama, the legendary breaking of Lord Shiva’s divine bow, and the grand celestial wedding of Sita and Rama.


When Rama and Lakshmana arrived in Mithila with Sage Vishwamitra, King Janaka was deeply impressed. Upon the sage’s instruction, the mighty bow of Lord Shiva was brought into the royal court. It was so heavy that thousands of strong men struggled to carry it.


With humility, Rama saluted his guru and effortlessly lifted the bow. In a swift moment, he strung it and bent it with such शक्ति that it broke into two with a thunderous sound. The earth trembled, and the gods showered flowers in celebration.


Following this, King Janaka offered his daughter Sita to Rama with the sacred verse:


“Iyam Sita mama suta…” — declaring her as his daughter and a devoted life partner to Rama.


At the same auspicious moment, the marriages of Lakshmana–Urmila, Bharata–Mandavi, and Shatrughna–Shrutakirti were also solemnized, filling Mithila with immense joy.

This episode highlights devotion, righteousness, divine will, and unmatched heroism.

 


 

Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


5. English FAQs (Top 5)

1. What is Shiva Dhanush?
It is the divine bow of Lord Shiva, known for its immense power and weight.


2. How did Rama break the bow?
Rama lifted, strung, and bent it effortlessly, causing it to break instantly.


3. Where did Sita and Rama’s wedding take place?
It took place in Mithila, in the presence of King Janaka.


4. What is Panigrahanam?
It is the sacred ritual where the groom holds the bride’s hand during marriage.


5. Were there other weddings at the same time?
Yes, Lakshmana–Urmila, Bharata–Mandavi, and Shatrughna–Shrutakirti were also married.

 

Sampoorna Ramayanam Part 3, Shiva Dhanurbhangam, Sita Rama Kalyanam, Balakanda Ramayanam, Lord Rama Story Telugu, Ramayanam Telugu Content, Sita Rama Marriage Story, Hindu Mythology Ramayanam, Vishwamitra Rama Story, Janaka Sita Kalyanam

 

#SampoornaRamayanam
#SitaRamaKalyanam
#ShivaDhanurbhangam
#LordRama
#HinduMythology

Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Post a Comment

Previous Post Next Post