Yudha Kanda | Indrajith Sampoorna Ramayanam Part 38 | సంపూర్ణ రామాయణం


Yudha Kanda | Indrajith Sampoorna Ramayanam Part 38 | సంపూర్ణ రామాయణం 

Yudha Kanda | Indrajith Sampoorna Ramayanam Part 38| సంపూర్ణ రామాయణం

 🚩 సంపూర్ణ రామాయణం - 38 వ రోజు  🚩


యుద్ధకాండ వైభవం - నికుంబిలా యాగ ధ్వంసం & ఇంద్రజిత్తు అంతం


📍 లంకా దహనం & వీరుల పతనం (క్లుప్తంగా):

హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకురావడంతో రామలక్ష్మణులు, వానర సైన్యం తిరిగి ఉత్సాహవంతులయ్యారు. ఆ తర్వాత సుగ్రీవుడు ఉత్సాహంతో చనిపోయిన రాక్షసుల అందరిని రావణుడు సముద్రంలో పడేస్తూ ఉండటం వల్ల వారి సైన్యం ఎంత కోల్పోయింది, ఇంకా ఎంత ఉన్నది మనం అంచనా వేయలేక పోతున్నాం. ఏది ఏమైనా ప్రస్తుతం రావణ పుత్రుల్లో ఒక్క ఇంద్రజితు మాత్రమే జీవించి ఉన్నాడు.లంకా నగరం ప్రస్తుతం రక్షణ రహితంగా ఉంది మనం కాగడాలు పట్టి రాత్రి వేళనే దాడి చేసి శత్రువుని కలవర పెట్టాలి అని వానర సైన్యాన్ని ఆదేశించాడు. 


వానరులు ఒక్కసారిగా ద్వారాలు దాటి లంకలోకి వచ్చే సరికి రాక్షసులు బెంబేలెత్తి పోయి పారిపోతారు. వానరులు లంక లోని ప్రాసాదాలకు, కుడ్యాలకు, ద్వారాలకు నిప్పు పెట్టారు.అన్ని వైపుల అగ్ని రాజుకుని భవంతులు మొత్తం బూడిద అయ్యాయి, రాక్షసులు హాహాకారాలు చేశారు.లంక నిప్పుల గుండంలా మారింది. 


ఈ క్రమంలో జరిగిన యుద్ధంలో:

 అంగదుడు: రావణుడి సేనాపతులు కంపనుడు, ప్రజంగుడిని సంహరించాడు.

  ద్వివిదుడు: శోనితాక్షుడిని మట్టుబెట్టాడు.

 మైందుడు: తన ధాటికి యూపాక్షుడిని అంతం చేశాడు.

 సుగ్రీవుడు: కుంభకర్ణుడి కుమారుడైన కుంబుడిని భీకర పోరులో చంపాడు.

 హనుమంతుడు: కుంభకర్ణుడి మరో కుమారుడు నికుంబుడిని సంహరించాడు.

 శ్రీరాముడు: ఖర పుత్రుడైన మకరాక్షుడిని తన బాణాలతో హతమార్చాడు.


📍 మాయా సీతా వధ - ఇంద్రజిత్తు కుతంత్రం:

తన వీరులందరూ మరణించడంతో ఇంద్రజిత్తు మళ్లీ రంగంలోకి దిగాడు. ఈసారి రామ లక్ష్మణులు దీటైన సమాధానం ఇచ్చారు.లక్ష్మణ స్వామి బ్రహ్మాస్త్రం వేసి మొత్తం రాక్షస జాతిని సంహరిస్తాను అనగా దాని వల్ల యుద్ధం లో పాల్గొనని లంకలో ఉన్న రాక్షసుకు కూడా పడిపోతారు యుద్ధం లో లేని వారిని సంహరించడం ధర్మం కాదు వద్దు అన్నాడు రాముడు.కానీ రాముడు మాటల్లోని ఉద్దేశ్యం అర్దం చేసుకుని తనను త్వరగా అంతం చేయాలి అనుకుంటూ ఉన్నాడు అని తెలుసుకున్న ఇంద్రజిత్తు మరో మాయ పన్నాడు.


వానర సైన్యాన్ని,రాముణ్ణి నిర్వీర్యం చేయడానికి ఒక భయంకరమైన మాయ చేశాడు. రథంపై ఒక మాయా సీతను సృష్టించి, హనుమంతుడి కళ్లెదుటే ఆమెకుత్తుక కత్తితో నరికి చంపాడు.దాంతో సీతమ్మ చనిపోయిందని భావించిన హనుమంతుడు శోకంతో రాముడి వద్దకు వెళ్ళాడు.అది విన్న రాముడు కుప్ప కూలిపోయి దుఃఖం లో మునిగిపోయాడు.ఇక యుద్ధం వల్ల లాభం ఏమిటి అని విలపించాడు.

 

కానీ విభీషణుడు అది ఇంద్రజిత్తు పన్నాగమని, తన 'నికుంబిలా హోమం' నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి ఇంద్రజిత్తు ఆడిన నాటకమని, మన దృష్టి మరల్చి తన శక్తి పెంచుకునే యత్నం ఇది జాగ్రత్త పడాలి అని చెప్పి.


📍 నికుంబిలా యాగ ధ్వంసం & ఇంద్రజిత్తు వధ:

"నికుంబిలా చైత్యం" లో ఇంద్రజిత్తు చేసే హోమం పూర్తయితే అతడిని ఎవరూ ఈ సృష్టిలో ఎవరూ జయించలేరు. కనుక నేనూ లక్ష్మణుడు వానర సైన్యంతో కలిసి అక్కడికి వెళ్ళి హోమం జరగ కుండ చేసి ఇంద్రజిత్ ను సంహరించి వస్తాం అన్నాడు.


లక్ష్మణుడు రాముని పాదాలకు నమస్కారం చేసి ఇంద్రజిత్తు నీ సంహరించిన తదుపరే మళ్ళీ వస్తాను అని శపథం చేసి యుద్ధానికి వెళ్ళాడు.


 నికుంబిలా వనంలో మూడు రోజులు,అహోరాత్రులు భీకర యుద్ధం జరిగింది. మాయల తో, జిత్తులతో యుద్ధం చేసిన ఇంద్రజిత్తు, లక్ష్మణుని శరీరం మొత్తం బాణాల తో నింపేసాడు. అయిన లక్ష్మణ స్వామి ఏమాత్రం తొనకక  ఎదురు నిలిచి ప్రతి దాడి చేశాడు.లక్ష్మణుడి ధాటికి ఇంద్రజిత్తు తట్టుకోలేకపోయాడు.


 లక్ష్మణుడు హనుమంతుడి భుజాలపై ఎక్కి ఇంద్రజిత్తుతో తలపడ్డాడు.


 యుద్ధం సాగుతుంది ఎన్ని అస్త్రాలు వేసినా ఇంద్రజిత్  మరణించడం లేదు చివరకు లక్ష్మణుడు ఐంద్రాస్త్రాన్ని సంధించి, "ధర్మమూర్తి, సత్యసంధుడు రాముడే అయితే ఈ బాణం ఇంద్రజిత్తును సంహరించుగాక!" అని రామ నామం తో బాణం ప్రయోగించాడు. ఆ బాణం ఇంద్రజిత్తు శిరస్సును ఖండించింది.


దాంతో బీతావహలైన రాక్షసులు తలావొక దిక్కుగా పరుగులు తీయగా వానరులు హర్షధ్వానాలు చేస్తూ గంతులు వేశారు. ఆకాశంలో దేవతలు, ఋషులు లక్ష్మణుని ఘనవిజయాన్ని కీర్తిసూ హర్షోన్మాదంతో నినదించారు. అంతట దివౌకసులు వీరుల మీద పుష్పవర్గాన్ని కురిపించగా. వానరులు ఆనందోత్సాహాలతో నాట్యం చేస్తూ, తమ వాలాలను ఝుళిపిస్తూ "జయరామా! జయలక్ష్మణా!" అంటూ ఎలుగెత్తి నినాదాలు చేశారు.


పూర్తిగా అలసిపోయి, తీవ్రంగా గాయపడిన లక్ష్మణుడు విభీషణ, హనుమంతుల మీదకు ఒరిగి రామునికి ప్రదక్షిణ నమస్కారాలు చేయటానికై ఆయన యెదుటకు వచ్చాడు. అంతట విభీషణుడు ఇంద్రజిత్తు యొక్క పరాజయ వృత్తాంతాన్నంతటినీ వివరంగా వర్ణించి చెప్పాడు. దానిని శ్రద్ధగా ఆలకిస్తూ రాముడు అలౌకికమైన ఆనందాన్ని అనుభవించాడు. లక్ష్మణుణ్ణి అభినందించి, అమిత వాత్సల్యంతో అతని తలని ఆఘ్రాణించి రాముడు “ఇంద్రజిత్తు రావణునికి కుడిభుజం వంటివాడు. 


మూడు దివారాత్రాల యుద్ధానంతరం అతనిప్పుడు వధించబడ్డాడు కనుక ఇక రాక్షసరాజు పోరాటానికి రావటం తథ్యం" అన్నాడు.


📍 రావణుడి ప్రవేశం:

తన ప్రియపుత్రుడు ఇంద్రజిత్తు మరణించాడన్న వార్త విని రావణుడు మూర్ఛపోయాడు. దుఃఖం కాస్తా మహా కోపంగా మారింది. పిచ్చివాడిలా సీతమ్మను చంపడానికి వెళ్లగా, సుపార్శ్వుడు రాముణ్ణి చంపితే సీత నీదేరా అని అతడిని వారించాడు.(ఎవడి భావాలు తగ్గట్టు అలాంటి దొరుకుతారు అనుకుంట)చివరకు తన సర్వ సైన్యాన్ని సమీకరించి, తాను ఉండగానైనా లేదా రాముడు ఉండగానైనా యుద్ధం ముగియాలని నిర్ణయించుకుని రావణుడు స్వయంగా రణరంగంలోకి ప్రవేశించాడు.


రేపు రామ రావణ యుద్ధం.. ఆ తర్వాత పట్టాభిషేకం.. 

నిన్న మొన్ననే ప్రారంభం చేసినట్టు అనిపిస్తుంది అప్పుడే 38 రోజులా రామ కథ, రామ నామం ఎంత చదివినా తనివి తీరదు. సమయమే తెలియదు...


✨ నేటి పాఠం: మాయలు ఎన్ని చేసినా సత్యం మరియు ధర్మం ముందు అవి నిలబడవు. లక్ష్మణుడి బాణం ఇంద్రజిత్తును తాకడం అంటే అది రాముడి సత్యవాక్పరిపాలనకు సాక్ష్యం. ధర్మం ముందు అధర్మం, మాయ ఎప్పుడూ నిలబడవు అని ఈ ఘట్టం వివరిస్తుంది.


శ్రీరామ జయమ్! లక్ష్మణ జయం!


బలం విష్ణోః ప్రవర్ధతాం..


Yudha Kanda | Indrajith Sampoorna Ramayanam Part 38| సంపూర్ణ రామాయణం 


Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 

🙏🙏🚩🚩🚩

...సశేషం 

తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?

Yudha Kanda | Indrajith Sampoorna Ramayanam Part 38 | సంపూర్ణ రామాయణం 🚩 సంపూర్ణ రామాయణం - 38 వ రోజు 🚩 యుద్ధకాండ వైభవం - నికుంబిలా యాగ ధ్వంసం &...

ఈ కథను పిల్లలు చదవవచ్చా?

అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.

ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?

కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.

ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?

ఇది Devotional Stories విభాగానికి చెందిన తెలుగు కథ.

ఈ కథకు సంబంధించిన అంశాలు: Yudha Kanda | Indrajith Sampoorna Ramayanam Part 38 | సంపూర్ణ రామాయణం, Devotional stories in Telugu, Bhakti Kathalu, Spiritual stories in Telugu

#TeluguStories #DevotionalStories #BhaktiKathalu #SpiritualStories #TeluguKathalu

ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు

Post a Comment

Previous Post Next Post