Sampoorna Ramayanam Part 34 | సంపూర్ణ రామాయణం - Return Hanuma - హనుమ తిరుగు ప్రయాణం

Sampoorna Ramayanam Part 34 | సంపూర్ణ రామాయణం - రోజు 34 - హనుమ తిరుగు ప్రయాణం 


Sampoorna Ramayanam Part 34 | సంపూర్ణ రామాయణం - రోజు 34 - హనుమ తిరుగు ప్రయాణం 


Sampoorna Ramayanam Part 34 | సంపూర్ణ రామాయణం - Return Hanuma - హనుమ తిరుగు ప్రయాణం



🚩 సంపూర్ణ రామాయణం  - రోజు 34 🚩


ఓం శ్రీ రామచంద్రాయ నమః 🙏

ఓం ఆంజనేయాయ నమః 🙏


హనుమ తిరుగు ప్రయాణం 

అతి త్వరలోనే రామ లక్ష్మణులు ఖచ్చితంగా వస్తారు అని సీతమ్మ ను ఊరట పరచి, లంక నుండి సీతమ్మ క్షేమ సమాచారం తో తిరుగు ప్రయాణం మొదలు పెట్టిన హనుమ మరొక్క సారి గౌరవ పూర్వకంగా మైనాకున్నీ తాకి వేగంగా మహేంద్ర పర్వతం వైపు ప్రయాణం కొనసాగించాడు.


సముద్రంలో కొద్ది దూరంలో ఉండగానే హనుమ ఘర్జన చేశాడు,అది విన్న జాంబవంతుడు హనుమ వస్తున్నాడు,విజయం కూడా సాధించి నట్టే అని అతని ఉత్సాహం ద్వారా తెలుస్తుంది అని అన్నాడు.


దృష్ట సీత

వానరాలు ఉత్సాహంతో తమ వస్త్రాలు ఊపుతూ ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టుకు గెంతులు వేయటం ప్రారంభం చేశాయి. హనుమంతుడు తమకు కనపడగానే కేరింతలు కొట్టారు. మహేంద్ర పర్వతం పైన దిగి కిందకు రాగానే చుట్టూ చేరి కంద మూల ఫలాలు ఇచ్చారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ మొదటగా "దృష్టా సీతా" అని చెప్పాడు. సీతమ్మ జీవించే ఉన్నది అని తెలుసుకున్న వానరులు హనుమను పదే పదే ఆలింగనం చేసుకున్నారు.


జాంబవంతుడు సీతను కనుగొన్న యావత్ వృత్తాంతం వివరించమని కోరగా, హనుమ మనసులోనే సీతమ్మకు ప్రణామాలు చేసి.తన లంకాయాత్ర వివరాలు, సీతను కనుగొన్న విధం, నగరాన్ని తాను ధ్వంస చేయటం సవివరంగా వర్ణించి చెప్పాడు. "నిరంతరం భయంకరమైన రాక్షసస్త్రీల చేత పీడించబడుతూ కోమలియైన సీత దుర్భరమైన వేదనను అనుభవిస్తోంది. రావణుడు తనకున్న సర్వస్వాన్ని ఆమెకు అర్పిస్తానంటున్నప్పటికీ సీత తన ప్రాణనాధునిగా రాముణ్ణి అనన్యంగా విశ్వసిస్తున్నందున రావణుణ్ణి తృణీకరిస్తోంది. నిరంతరమైన రాముని ధ్యాసయే సీతను సజీవంగా నిలిపి ఉంచుతున్నప్పటికీ ఆమెను శీఘ్రమే రక్షించకపోతే ఆమె శుష్కించి మరణించటం తథ్యం.


"అందువల్ల మనం తక్షణమే లంకపై దాడిచేసి సీతను తెచ్చి కిష్కింధలో రామునికి అప్పగిద్దాం. నేనొక్కిడినే రాక్షసులనందరినీ మట్టుబెట్టగలనని నాకు తెలుసు. అంగదుడు కూడా అలాంటి సమర్థతగలవాడే. మనం సీతను కనిపెట్టటం మాత్రమేగాకా ఆమెను రక్షించటం కూడా చేస్తే రాముడెంత సంతోషిస్తాడో ఆలోచించండి! నిజానికి నేను అవలీలగా సీతను నా వీపు మీద ఇక్కడకు మోసుకురాగలిగేవున్నాను, కాని అందుకు మీ అనుమతి లేనందున నన్ను నేను నిగ్రహించుకున్నాను" అంటూ ముగించాడు హనుమంతుడు.


అంగదుడు కూడా మనకు మైందుడు, ద్వివిదుడు వంటి వీరులు ఉన్నారు వీరు రావణుని సులభంగా జయించ గలరు అని అన్నాడు.


అందకు జాంబవంతుడు "ఓ యువరాజా! నీ పథకంలో వివేకం కొరవడింది. సీత జాడను కనిపెట్టమని మాత్రమే నీకు ఆదేశం ఇవ్వబడింది తప్ప ఆమె స్వాధీనం కోసం పోరాడటానికి కాదని నీవు విస్మరిస్తున్నావు. ఒకవేళ మనం ఇందులో సఫలీకృతులమైనప్పటికీ అందుకు రాముడు అసంతుష్టి చెందుతాడనే అనుకొంటున్నాను. ఎందుకంటే రావణుణ్ణి తాను సంహరించి సీతను స్వాధీనం చేసుకుంటానని వానరులందరియెదుట ఆయన శపథం చేసి ఉన్నాడు.


మధువన ఘట్టం

జాంబవంతుని సలహాను అంగదడు, హనుమంతుడు, ఇతర వానరులు సమ్మతించారు. ఇక ఆలస్యంలేకుండా వారు కిష్కింధకు బయలుదేరారు. మార్గమధ్యంలో వానరులు సుగ్రీవుని స్వంతమైన మధువనం అనే దివ్యవనానికి చేరారు. మధుపానం చేయాలన్న ఉత్సుకతతో వారు అంగదుణ్ణి కొంచెం ఆగమని అభ్యర్థించారు. ఉత్సాహం తో మొత్తం మధు వనాన్ని పాడు చేశారు. కాపలా ఉండే దదిముఖుడు అనే రాక్షసుని కూడా కొట్టారు. అతను వేగంగా వెళ్లి విషయం సుగ్రీవునికి చెపితే ఇంత చేశారు అంటే వానరులు తమ కార్యంలో సఫలం చెందినట్టే,హనుమంతుడు సీత జాడ కనిపెట్టే ఉంటాడని నేను గట్టిగా చెప్పగలను. లేకుంటే వానరులు ఇంత కల్లోలంచేయటానికి సాహసించరు"అని సుగ్రీవుడు లక్ష్మణ స్వామి తో అన్నాడు.


"నీ ఫిర్యాదు పరోక్షంగా నాకు శుభవార్తను అందజేస్తున్నది. అందవల్ల వానరుల ఆగడాన్ని సహించాల్సి ఉంది. దయచేసి ఇప్పుడు మధువనానికి తిరిగివెళ్లి అంగదుణ్ణి, ఇతరులను నేను తక్షణమే చూడదలుస్తున్నానని తెలియజేయి" అని చెప్పాడు. సుగ్రీవుడు


ఈ ఆదేశాన్ని శిరసావహిస్తూ దధిముఖుడు, అంగదుడునీ క్షమాపణ కోరి వేగంగా కిష్కింధ కు రమ్మని మహారాజు ఆదేశం అన్నాడు.వారు వెంటనే అతి వేగంగా భయలు దేరి వెళ్ళారు.


రాముని కి సీత సందేశం

కొద్దిసేపట్లోనే అంగదుని బృందమంతా రాముని సమక్షానికి తిరిగి వచ్చారు. "సీత క్షేమంగా ఉంది. రావణుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కసారైనా వాటికి లొంగకుండా ఆమె తన పాతివ్రత్య దీక్షలో స్థిరంగా నిలిచి ఉంది" అంటూ హనుమంతుడు ఉత్సాహంగా చెప్పాడు. రాముడు ప్రేమాదరపూరితమైన నేత్రాలతో హనుమంతుణ్ణి వీక్షించాడు.


వానరులంతా సుగ్రీవునికి, రామలక్ష్మణులకు ప్రణామాలు చేశారు. తమను తాము సంబాళించుకోలేక వారిలో ప్రతి ఒక్కరు హనుమంతుడు చెప్పిన విషయాన్నంతటిని తిరిగి చెప్పారు. చివరకు వానరులంతా చెప్పటం ముగించాక రాముడు "రావణుని నివాసం ఖచ్చితంగా ఎక్కడ ఉందో నాకు వివరించండి. సీత గురించి ఇంకా చెప్పండి. ఇప్పుడు నా గురించి ఆమె నిజంగా ఏమనుకుంటోంది?" అన్నాడు. 


చూడామణి ప్రధానం 

హనుమను ముందుకు తోసారు వారు, హనుమ సీతను కనుగొన్న విధానం మొత్తం వివరించి చెప్పి. సీతమ్మ ఇచ్చిన చూడామణి రామునికి ఇస్తూ జనకరాజ పుత్రి యొక్క భక్తి అంతా నీ మీదనే స్థిరంగా నిలిచివుంది. వియోగంలో ఆమెకు జీవితం గడపటమే కష్టంగా ఉంది" అని చెప్పాడు. అంతట హనుమంతుడు సీత సందేశాలను వివరించాడు. కాకిరూపంలోని ఇంద్ర పుత్రుడు ఆమె స్థనాలను రక్కిన విషయాన్ని అరుణవర్ణ ధాతువుతో రాముడు ఆమె ముఖాన్ని శృంగారించిన విషయాన్ని, తనను రాక్షసస్త్రీలు పీడిస్తున్నందున నెలలోగా తనను రక్షించటానికి రాముడు రాకుంటే తాను జీవితాన్ని త్యజించటం తథ్యమని ఆమె చెప్పిన విషయాన్ని చెప్పాడు.


హనుమంతుని పలుకులను ఆకర్ణిస్తూ రాముడు సీత పంపిన చూడామణిని తన హృదయానికి హత్తుకున్నాడు. రాముడు, లక్ష్మణుడు నిరంతరాయంగా కన్నీరు కార్చారు. 'ఈ చూడామణిని మా వివాహ సమయంలో సీతకు ఆమె తండ్రి బహూకరించాడు. చాలాకాలం క్రిందట జనకమహారాజు నిర్వహించిన యజ్ఞాలకు సంతుష్టుడై ఆయనకు దేవేంద్రుడు ఈ మణిని ప్రసాదించాడు. ఓ హనుమంతా, దుఃఖతీవ్రతతో నేను దాదాపుగా అచేతనుడయి పోయాను. అందువల్ల దయచేసి సీత సందేశాలను మరోసారి నాకు వినిపించు.అవి నా శిరస్సుపై వెదజల్లిన శీతల జలబిందువుల్లా పనిచేస్తున్నాయి" అన్నాడు రాముడు.


హనుమంతుడు ఇంకా ఇలా చెప్పాడు "నేను సీతతో నా వీపుపై ఆమెను మోసుకు వేళతానని చెప్పాను. కాని పరపురుషుణ్ణి స్పర్శించటానికి ఇష్టంలేనందున ఆమె తిరస్కరించింది. తన్ను రక్షించటానికి శీఘ్రమే ఇక్కడకు రావాలని నీవు రాముడికి నచ్చజెప్పాలి. నా దుఃఖం దాదాపుగా దుర్భరంగా ఉంది. నేనెంతకాలం జీవించగలనో చెప్పలేను. ఓ హనుమంతా! రాముడు, లక్ష్మణుడు, వానరులు సముద్రాన్ని దాటి లంకకు ఎలా రాగలరు? నీవు రావణుణ్ణి చంపి నన్ను రామునికి అప్పగించగల సమర్థుడవని నాకు తెలుసు. కాని తన నిష్కళంకమైన యశస్సుకు మరింత వన్నె తెచ్చే విధంగా రాముడే స్వయంగా వచ్చి నన్ను రక్షించాలనేది నా. అభిమతం. నేను లంకకు తీసుకురాబడిన పద్దతిలో ఇతరుల చేత మోయబడుతూ రాముని వద్దకు తిరిగి వెళ్ళాలని కోరుకోవటం లేదు" అని ఆమె పదే పదే చెప్పింది 


"ఇతర వానరులు నాకంటే శ్రేష్ఠులని, వారు సముద్రాన్ని అవలీలగా లంఘించి లంకకు రాగలరని నేను సీతకు ధైర్యం చెప్పాను. అవసరమైతే నేను మిమ్ములను, లక్ష్మణుణ్ణి కూడా నా వీపుపై మోసుకురాగలననికూడా ఆమెకు చెప్పాను. ఇలా నేను సీతను ఒకింత సాంత్వన పరిచాను. కాని ఆమె ఉన్న అనిశ్చిత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇక ఎంతమాత్రం ఆలస్యం లేకుండా మనం లంకపై దాడిచేయటానికి తగిన మార్గమేదైనా శీఘ్రమే యోజన చేయవలసిందిగా నిన్ను అభ్యర్థిస్తున్నాను" అంటూ ముగించాడు హనుమంతుడు.


ఈ మాట విని రామలక్ష్మణులు ఉత్సాహభరితులైనారు. అలాగే సుగ్రీవుడు కూడా అమితానందం పొంది దధిముఖునితో "నీ ఫిర్యాదు పరోక్షంగా నాకు శుభవార్తను అందజేస్తున్నది. అందవల్ల వానరుల ఆగడాన్ని సహించాల్సి ఉంది. దయచేసి ఇప్పుడు మధువనానికి తిరిగివెళ్లి అంగదుణ్ణి, ఇతరులను నేను తక్షణమే చూడదలుస్తున్నానని తెలియజేయి" అని చెప్పాడు...


ఇంతటితో సుందర కాండ సంపూర్ణం..


✨ ఈరోజు విశేషం: రామాయణంలో "దృష్టా సీతా" అనే మాట అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది కేవలం ఒక సమాచారం కాదు, రాముడికి ప్రాణం పోసిన మాట, రామాయణ కథను మలుపు తిప్పిన మాట. కష్టకాలంలో భగవంతునిపై నమ్మకం ఉంచితే, ఆయన దూత ఏదో ఒక రూపంలో మనకు సహాయం అందిస్తాడని ఈ ఘట్టం తెలుపుతుంది. హనుమంతుని వాక్చాతుర్యం, వినయం మరియు భక్తి మనకు ఆదర్శం.


బలం విష్ణోః ప్రవర్ధతాం 


జయ శ్రీరామ! 🚩

జయ ఆంజనేయ! 🙏


....సశేషం  

Read Also:  Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం https://telugulostories.blogspot.com/2026/03/sampoorna-ramayanam-part-1-1.html


Sampoorna Ramayanam Part 34 | సంపూర్ణ రామాయణం - Return Hanuma - హనుమ తిరుగు ప్రయాణం 


Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Post a Comment

Previous Post Next Post