Sampoorna Ramayanam Part 29 | సంపూర్ణ రామాయణం - - భాగం 29 | లంకిణి బంజనం - లంకలో అన్వేషణ
Sampoorna Ramayanam Part 29 | సంపూర్ణ రామాయణం - - భాగం 29 | లంకిణి బంజనం - లంకలో అన్వేషణ
🚩 సంపూర్ణ రామాయణం - భాగం 29 🚩
ఓం శ్రీ రామచంద్రాయ నమః 🙏ఓం ఆంజనేయాయ నమః 🙏
కథా వివరణ
లంకిణి బంజనం - లంకలో అన్వేషణ:
త్రికూట పర్వతం పైన దిగిన హనుమ, లంకా నగర ఉత్తర ద్వారాన్ని సమీపించి సముత్తుంగమైన శేత హర్మ్యాలను, స్వర్ణమయ స్వాగత ద్వారాలతో సమలంకృతమైన విశాల వీధులను చూశాడు. అసంఖ్యాకులైన భయంకర వికార రూపులైన రాక్షసులు ఎక్కడ చూచినా గుమికూడి ఉన్నారు. వారు సకల విధాలైన ఆయుధాలను ధరించినవారు. కామరూపులు(కోరిన రూపం పొందగలరు)
“ఈ నగరం దేవతలకు సైతం దుర్బేధ్యంగా కనిపిస్తోంది. ఇక వానర సేన గురించి ఏమని చెప్పాలి? నేను, సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు మాత్రమే సముద్రాన్ని దాటి ఇక్కడకు రాగలిగి ఉండగా ఇక రాక్షసులను రాముడు నిర్జించే ఆశయెక్కడ?అనుకున్నాడు...
అయినా అసలు సీత ఇంకా జీవించే ఉన్నదా అనే విషయాన్ని కనిపెట్టటమే నా మొదటి కర్తవ్యం. ఎంత ఉత్తమమైన పథకాలనైనా అసమర్థులైన దూతలు ఒక్కొక్కప్పుడు నీరుగార్చివేస్తారు. కనుకు ఆమెను నేను కలుసుకోగలగటం ఎలాగనేది నేను జాగ్రత్తగా ఆలోచించాలి. పహరాకాస్తున్నవారు అత్యంత జాగరూకులుగా కనిపిస్తున్నారు. అందువల్ల నా సహజరూపంలో నగరప్రవేశానికి యత్నించలేను. గాలియైనా సరే లంకలో రహస్యంగా ప్రవేశించలేని విధంగా ఉంది. కనుక తేలికగా ఇతరుల దృష్టిలో పడని మారు రూపాన్ని దాల్చి రాత్రివేళ నగరంలో ప్రవేశించాలి" అని తనలో తాను అనుకున్నాడు హనుమంతుడు.
హనుమంతుడు సూర్యాస్తమయం కోసం ఉత్సుకతతో నిరీక్షించాడు. చివరకు చీకటిపడగానే ఒక మార్జాల(పిల్లి పిల్లంత)పరిమాణానికి మారి ఉన్నతమైన ప్రాకారాన్ని దూకి లంకలో ప్రవేశించాడు.
బంగారంతోను, రత్నమాణిక్యాలతోను విస్తారంగా విభూషితమైన ఏడంతస్తుల, ఎనిమిదంతస్తుల సౌధాలతో ఆ నగరం తన ఊహకందని స్థాయిలో ఉండటాన్ని హనుమంతుడు చూశాడు. నగరం యావత్తు మహాద్భుతమైన భవంతులతో నిండి ఉంది.ఆ భవనాలలో సౌందర్య వతులు అయిన యువతులు ఉన్నారు. రక్షణ కోసం నగరమంతా బ్రాహ్మణులు వేద మంత్రాలు వల్లిస్తూ ఉన్నారు.
అంతట చంద్రుడు క్షితిజరేఖపై ఉదయించి తన రజత కాంతులను విరజిమ్ముతూ హనుమంతునికి సహాయం చేశాడు. ఆ సమయంలో లంక నగర దేవత ఒక వికార రాక్షసి రూపంలో మూర్తీభవించి హనుమంతుని ఎదుటకు వచ్చి "ఎవరికంటబడకుండా ఈ నగరంలోకి ఎలా చొరబడ్డావు? రాక్షసుల రాజ్యంలో నీలాంటి వానరానికి ఏమి పని?" అంటూ నిలదీసింది.
"ముందు నీవెవరవో చెబితేనే నీ ప్రశ్నకు సమాధానమిస్తాను" అని బదులిచ్చాడు హనుమంతుడు.
"నేను లంకకు అధిష్ఠానదేవతను. రావణుని తరఫున ఈ నగరాన్ని అప్రమత్తంగా సంరక్షిస్తుంటాను. నీవు అనుమతి లేకుండా చొరబడ్డావు కనుక ఇవాళ నా చేతుల్లో నీకు మూడినట్లే" అని ఆ రాక్షసి కోపంగా బదలుపలికింది.
"నేను ఊరికే ఈ నగరం చూద్దామని వచ్చాను. మహాద్భుతమైన ఉద్యానవనాలను, ప్రాసాదాలను అన్నింటిని చూడాలనుకొంటున్నాను" అని హనుమంతుడు అన్నాడు.
"రాక్షసులు మాత్రమే నివసించే నగరమిది. కోతులు వచ్చి వీధుల్లో తిరగటానికి వీల్లేదు. నీకు లంకా వైభవాన్ని చూడాలని ఉంటే ముందుగా నన్ను దాటాలి" అంటూ లంక నిర్లక్ష్యంగా పలికింది.
అందుకు హనుమంతుడు "నేను నా ఇష్టం వచ్చినట్లు నగరాన్ని చూచి, వచ్చిన త్రోవనే వెళ్ళిపోతాను" అని చెప్పాడు.
క్రుద్దురాలైన లంకిణి వీల్లేదు అంటూ ఎడమ చేతితో హనుమను చరిచింది. హనుమంతుడు బిగ్గరగా గర్జించి స్త్రీ అయినందున హింసాత్మకముగ కాకుండా ఎడమ పిడికితో ఒక్క గుద్దు గుద్దాడు లంకిణి నేలకొరిగి, బాధతో మూలుగుతూ నిజమైన వీరుడు స్త్రీలను ఎన్నడు కొట్టడు గనుక దయచేసి నన్ను వదిలివేయి. ఒకప్పుడు, చాలాకాలం క్రిందట బ్రహ్మదేవుడు నాతో 'ఒక వానరం నిన్ను లొంగ దీసుకొన్నపుడు కొద్ది రోజుల్లోనే నీ నగరానికి సకల రాక్షసులకు వినాశనం వస్తుంది అని చెప్పాడు. రావణుడు మృత్యువుకు చేరువై ఉంటాడు అందుకే నేను ఓడి పోయాను నన్ను వదిలేయ్ అన్నది. హనుమ వెంటనే ఒక భవనం మీది నుండి మరో భవనం మీదకు దూకుతూ ఆ రాత్రి పూటే మొత్తం నగరం వెతికాడు.
లంకలోని ప్రతి వీధి, ప్రతి ఇల్లు, ప్రతి అంతఃపురాన్ని నిశితంగా వెతికాడు.బహిరంగ స్థలాలు, రావణుని అంతఃపురంలో కూడా ప్రతి అణువు వెతికాడు.
రావణుని పడకగదిలో ఎంతో పవిత్రంగా ఉన్న మండోదరిని చూసి సీతమ్మ అనుకుని పొరపడ్డాడు, గెంతులు వేసాడు కానీ వెంటనే ఆమె రూపురేఖలు సీతమ్మతో సరిపోలడం లేదని గ్రహించి, అయినా సీతమ్మ ఈ రాక్షసుడి అంతః పురంలో ఉంటుందా అనుకుని అన్వేషణ కొనసాగించాడు.
ఆ సమయంలో రావణుడు కొన్ని వేల మంది యువతుల తో భోగించి అలసి, నిద్రలో వారితో సన్నిహితంగా ఉన్నాడు. అక్కడే వేదిక పై ఉన్న పుష్పక విమానం చూసాడు .మొత్తం లంకను,రావణ ప్రాసాదం లో కూడా మళ్ళీ మళ్ళీ ఎంత వెతికిన ఎక్కడ చూసినా సీతమ్మ జాడ లేదు.ఇక సీతమ్మ జీవించి ఉండకపోవచ్చు అని నిర్ధారణకు వచ్చాడు.
అతని హృదయం దుఃఖం తో నిండి పోయింది. నామీదే ఆశలు పెట్టుకున్న వానరులకు ఏం చెప్పాలి,ఈ విషయం చెపితే వారు బ్రతుకుతారా. రాముడు జీవించి ఉంటాడ, లక్ష్మణ స్వామి బతికి ఉంటాడా, వారు లేనిది సుగ్రీవుడు కూడా జీవించి ఉండడు.
Read Also: Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Post a Comment