Sampoorna Ramayanam Part 28 | సంపూర్ణ రామాయణం - Sundara Kanda | - సుందరకాండ ప్రారంభం

Sampoorna Ramayanam Part 28 | సంపూర్ణ రామాయణం - 28 వ రోజు | - సుందరకాండ ప్రారంభం


Sampoorna Ramayanam Part 28 | సంపూర్ణ రామాయణం - 28 వ రోజు | - సుందరకాండ ప్రారంభం


Sampoorna Ramayanam Part 28 | సంపూర్ణ రామాయణం - 28 వ రోజు | - సుందరకాండ ప్రారంభం



🚩 సంపూర్ణ రామాయణం - 28 వ రోజు - సుందరకాండ ప్రారంభం 🚩


ఓం శ్రీ రామచంద్రాయ నమః 🙏

ఓం ఆంజనేయాయ నమః 🙏


కథా వివరణ 


సంపాతి ద్వారా సీతమ్మ జాడ తెలుసుకున్న వానరులకు, నూరు యోజనాల సముద్రాన్ని దాటడం ఎలా అన్న ప్రశ్న మిగిలింది.జాంబవంతుడు హనుమంతుని శక్తిని గుర్తుచేసి,ఆయనను నిద్రలేపాడు. తన అనంతమైన శక్తిని తెలుసుకున్న హనుమంతుడు విశ్వరూపాన్ని దాల్చాడు. తన శరీరాన్ని అపరిమితమైన పరిమాణానికి విస్తరించి మహేంద్రగిరి పర్వతాన్ని అధిరోహించి. రాముని ధనుస్సు నుండి విడవబడిన బాణం లా ఒక్క ఉదుటున గాలిలోకి లేచాడు. హనుమంతుని లంఘన శక్తి ప్రభావం చేత మహేంద్రగిరి మీద ఉన్న వృక్షాలు అన్ని పెకిలించ బడి ఆకాశంలోకి లేచి సముద్రంలో పడ్డాయి.


 తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః |

ఇయేష పద మన్వేష్టుం చారణా చరితే పథి ||

*(సుందరకాండ - 1వ సర్గ)*


తాత్పర్యం:

హనుమంతుడు (శత్రువులను నిర్మూలించేవాడు), రావణునిచే అపహరించబడిన సీతాదేవిని వెతకడానికి, చారణులచే సంచరించబడిన ఆకాశ మార్గంలో వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు.


హనుమంతుని గగనయానం చేత ఉత్పన్నమైన పెను తుఫాను సాగరాన్ని అల్లకల్లోలం చేయగా పర్వతాల ఎత్తుకు ఎగసిన తరంగాలు ఆయన వక్షస్థలాన్ని ఢీకొన్నాయి.సముద్ర జలాల మీద హనుమంతుని నీడ 240 మైళ్ళ పొడవున, 80 మైళ్ళ వెడల్పున ఆక్రమించింది. వాయుమండలంలో ఆయన ప్రయాణం చేస్తున్నందువల్ల ఏర్పడిన శూన్యావరణ ఫలితంగా పరిసర మేఘాలన్నీ ఆయనవైపు మళ్ళాయి. హనుమంతుడు మేఘసమూహాల వెనుక దాగుడుమూతలాడుతూ చంద్రుణ్ణి పోలి ఉన్నాడు.మింటికెగసిన హనుమంతుణ్ణి చూసి సకల జాతులకు చెందిన ప్రాణులు ఆయనను వేనోళ్ళ కొనియాడారు. 


మార్గమధ్యంలోని అడ్డంకులు:

శ్రీరాముని ఎడల గల పూజ్యభావం కారణంగా సముద్రుడు సైతం హనుమకు సాయం చేయదలచి. హనుమ విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా,ఇంద్రుడి వజ్రాయుధం కి భయపడి తనలో ఉన్న మైనాకున్ని నీటి పైకి రావలసిందిగా కోరాడు.అయితే ఆ మహాపర్వత శిఖరం సముద్రంలో నుంచి ఆవిర్భవించటాన్సి చూచిన హనుమంతుడు దానినొక అవరోదంగా భావించి తన వక్షస్థలంతో దానిని క్రిందికి కుమ్మాడు.హనుమంతుని బలపరాక్రమాలను అభినందిస్తూ మైనకుడు మానవ రూపంలో తన శిఖరాగ్రం పై నిలిచి. వాయు నందనా నీవు కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ నీ ప్రయాణం కొనసాగించు అన్నాడు.కానీ రామకార్యం ముఖ్యం,"నేను ఆగేందుకు సాహసించలేను కనుక దయచేసి నన్ను క్షమించు. నా ప్రయాణంలో ఎక్కడా ఆగనని నేను ఇతర వానరులకు వాగ్దానం చేశాను. నాకు సమయం చాలా తక్కువగా ఉంది" అన్నాడు.


కానీ నీ ఆతిధ్యం వద్దు అనకూడదూ కనుక హనుమంతుడు గౌరవ పురస్సరంగా మైనాక పర్వత శిఖరాన్ని స్పర్శించి తన ఆకాశ గమనాన్ని కొనసాగిస్తూ పైకి దూసుకుపోయాడు


రామ కార్యంలో వెళ్ళే హనుమకు సహకరించావు కనుక మైనాక ఇక నీకు నా వజ్రాయుధం తో భయం లేదు. నీవు యదేచ్చగా విహరించూ అన్నాడు ఇంద్రుడు.


సురస:

ఈలోగా దేవర్షులు, దేవతలు, గంధర్వులు నాగమాతయైన సురసను సమీపించి "హనుమంతుడి యధార్థమైన శక్తి ఎంతటిదో మేము లెక్కవేయదలిచాం. అందువల్ల నీవోక పెద్ద రాక్షసి రూపాన్ని ధరించి ఆయనను ఆటంకపరచటానికి ప్రయత్నించు.హనుమంతుడు నిన్ను శీఘ్రమే ఓడించటమో లేక నిస్పృహకు లోనుకావటమో చేస్తాడు” అని అభ్యర్థించారు


ఒక పర్వతమంత పెద్ద వికృత రూప రాక్షసి లా హఠాత్తుగా సముద్రం లోనుండి సురస ఆవిర్భవించి హనుమకు ఆటంకం కలిగించింది.ఓ వానరొత్తమ దైవ సంకల్పం కొద్ది నీవు నాకు ఆహారం గా లభించావు నా నోటిలోకి ప్రవేశించు అని అంది.నేను రామ కార్యం కోసం,సీతమ్మ జాడ వెతకడానికి వెళ్తున్నా తిరిగి వచ్చే సమయంలో నీకు ఆహారం అవుతా అన్నాడు.ఓరీ మూర్ఖుడా బ్రహ్మ వరం చేత నీవు ఈ క్షణమే నాకు ఆహారం అవుతావు అన్నది. అయితే నా శరీరం కంటే నీ నోరు పెద్దగా చేయు అన్నది హనుమ.


సురస పదియోజనాల మేరకు తన నోటిని తెరిచింది. అంతట హనుమంతుడు తన దేహాన్ని పది యోజనాల మేరకు విస్తరించి "నేను నీ నోటిలో ప్రవేశించాలంటే నీవు దానిని మరింత పెద్దది చేయాలి" అని సవాలు చేశాడు.


అంతట సురస తన నోటిని ఇరవై యోజనాల మేరకు విస్తరించగా కోపితుడైన హనుమంతుడు ముప్ఫైయోజనాలకు విస్తరించాడు. అందుకు ప్రతిగా సురస తన నోటిని నలభై యోజనాలు చేస్తే దానికి స్పందనగా హనుమంతుడు యాభై యోజనాలకు విస్తరించాడు. అంతట సురస తన నోటిని అరవై యోజనాలకు పెంచింది ఇలా 100 యోజనాలు పెద్దదిగా చేయగానే, హనుమ ఒక్కసారిగా  సూక్ష్మరూపం  దాల్చి ఆమె నోట్లోకి ప్రవేశించి వెంటనే బయటకు వచ్చాడు.నీవు పొందిన వరంలోని షరతు నెరవేరింది కదా అనగానే ఇక అడ్డు తొలగు నా ప్రయాణం కొనసాగిస్తూ అన్నాడు.హనుమంతుని బుద్ధిబలాన్ని మెచ్చుకుని, సురస అతన్ని ఆశీర్వదించింది. అంతట ఉవ్వెత్తున ఆకాశానికి లేచి తన మార్గాన వేగంగా సాగిపోతున్నాడు హనుమ. అంతలోనే...


సింహిక: ఆకస్మికంగా సింహిక అనే రాక్షసి ఆయన నీడను ఒడిసి పట్టుకొంది. జరిగినదేమిటో తెలియని హనుమంతుడు తన శక్తి సన్నగిల్లుతోందేమోనని తొలుత భావించాడు.కాని అటుఇటు చూడగా ఒక పెనురక్కసి సముద్రంలో నుంచి పైకి వస్తూ కనిపించింది. 


 

Read Also:  Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం https://telugulostories.blogspot.com/2026/03/sampoorna-ramayanam-part-1-1.html

Sampoorna Ramayanam Part 28 | సంపూర్ణ రామాయణం - Sundara Kanda | - సుందరకాండ ప్రారంభం


Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Post a Comment

Previous Post Next Post