Sampoorna Ramayanam Part 25 | సంపూర్ణ రామాయణం - Tara’s Grief, Sugriva’s Coronation

Sampoorna Ramayanam Part 25 |  సంపూర్ణ రామాయణం - Tara’s Grief, Sugriva’s Coronation


Sampoorna Ramayanam Part 25 |  సంపూర్ణ రామాయణం - Tara’s Grief, Sugriva’s Coronation

Sampoorna Ramayanam Part 25 |  సంపూర్ణ రామాయణం - Tara’s Grief, Sugriva’s Coronation

 🚩 సంపూర్ణ రామాయణం - 25 వ భాగం🚩

ఓం శ్రీ రామచంద్రాయ నమః 🙏 ఈరోజు కథాంశం: తారా విలాపం - సుగ్రీవ పట్టాభిషేకం - వర్ష, శరదృతువుల వర్ణన తారా విలాపం: రాముని బాణానికి మరణానికి చేరువలో ఉన్న వాలిని చూసి అతని భార్య తార కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. హనుమంతుడు మహారాణి దయచేసి లే. దుఃఖానికి వివశురాలివి కాకు. నీవు నీ భర్తకు అంతిమ సంస్కారం చేసి అంగదుణ్ణి సింహాసనంపై ప్రతిష్ఠించిన మీదట అతని సంరక్షణ భారం వహించవలసి ఉంది" అని అభ్యర్థించాడు. అంతట వాలి "ప్రియమైన సుగ్రీవా! నీపట్ల నేను చేసిన అపరాధాలన్నింటికీ నన్ను క్షమించమని వేడుకొంటున్నాను. ఇప్పుడు నానుంచి రాజ్యాన్ని స్వీకరించి నా కుమారుడైన అంగదుణ్ణి జాగ్రత్తగా చూడు. ఎందుకంటే అతను ఎల్లప్పుడు నీపట్ల విశ్వాసపాత్రుడై నిలుస్తాడు" అన్నాడు. ఈ మాటలంటూ వాలి తాను దేవేంద్రుని నుండి పొందిన దివ్యమైన స్వర్ణమాలను సుగ్రీవుని చేతిలో పెట్టాడు. అంతట అంగదునివైపు తిరిగి "ప్రియ కుమారా! ఇప్పుడు నిన్ను వీడిపోతున్నాను గనుక నీవు సర్వదా సుగ్రీవుని పట్ల విధేయుడివై ఉండు. సర్వవిధాల విచారించి పనిచేస్తూ ఉండు. సుఖదు:ఖాలనే ద్వంద్వాలను సమబుద్ధితో స్వీకరిస్తూ ఉండు. అత్యాసక్తి, ద్వేషం రెండూ పతనానికి దారితీస్తాయి కనుక ఆ రెంటినీ వర్ణించు" అని చెప్పి ప్రాణాన్ని త్యజించాడు. అజేయుడైన తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేక శోకసముద్రంలో మునిగిపోతుంది. తార యొక్క వ్యధను గమనించిన సుగ్రీవుడు విషణ్ణవదనుడై ఆవేదనాపూరితమైన స్వరంతో రామునితో, "నా కోరికను నెరవేర్చుకున్నందువల్ల నేను ఆశించిన ఫలితానికి విరుద్ధమైనది లభించటం గమనించాను. నాకు సుఖం కలగడానికి బదులు రాజ్యం పట్ల, జీవితం పట్ల కూడా విరక్తి కలుగుతోంది. నా పాపానికి ప్రాయశ్చిత్తంగా అగ్నిప్రవేశం చేసి నా ప్రాణాలను త్యజిస్తాను. నా ప్రియమైన రామా! ఈ మిగిలిన వానర వీరులంతా నీకు నీ ప్రియపత్నియైన సీత యొక్క అన్వేషణలో సహాయం చేస్తారు” అన్నాడు. రాముడు సుగ్రీవుని ఓదార్చి,నీ సోదరుడి కోసం జారవిడిచిన దుఃఖ ఆశ్రువులే నీ ప్రేమను తెలియ చేస్తూ ఉన్నాయి. అంతా ఈశ్వర నిర్దేశం అని భావించు. అనివార్యం అయిన దానికోసం దుఃఖం పొందటం తగదు అన్నాడు. రాముడి మాటలకు స్థిమిత పడ్డ సుగ్రీవుడు లక్ష్మణునీ సహాయంతో సోదరునీ దహన సంస్కార ఏర్పాట్లు ప్రారంభం చేశాడు. సుగ్రీవుడు, అంగదుడు వాలి దేహాన్ని కిష్కింధకు తీసుకెళ్లి దహనం చేసి, తుంగభద్ర నుండి తెచ్చిన జలాలతో తర్పణాలు విడిచారు. సుగ్రీవ పట్టాభిషేకం: అంతిమ సంస్కారాలు పూర్తి అవ్వగానే రాముడు హనుమ తో నీవే దగ్గర ఉండి సుగ్రీవుని రాజుగా, అంగదుని యువ రాజుగా పట్టాభిషేకం జరిపించు నేను నగరంలోకి రాను అన్నాడు. శ్రీరాముని ఆజ్ఞ మేరకు కిష్కింధలో సుగ్రీవుడికి శాస్త్రోక్తంగా రాజ్యాభిషేకం జరుగుతుంది. వాలి కుమారుడైన అంగదుడిని యువరాజుగా ప్రకటిస్తారు. రాజ్యంతో పాటు భార్య రుమను కూడా తిరిగి పొందిన సుగ్రీవుడు, వర్షాకాలం ముగియగానే సీతాన్వేషణలో శ్రీరామునికి తప్పక సాయం చేస్తానని మాట ఇస్తాడు. వర్ష, శరదృతువుల వర్ణన - రాముని విరహ వేదన: అప్పటికే వర్షాకాలం ప్రారంభం కావడంతో నాలుగు నెలలు రామలక్ష్మణులు కిష్కింధకు సమీపంలోని ప్రస్రవణ పర్వతంపై ఉన్న ఒక గుహలో ఆశ్రయం పొందుతారు.ఆ పర్వత ప్రాంతం ప్రకృతి సౌందర్యం లో నిండి పోయిన రాముడు ఆనందం పొందలేక పోయాడు.సీతమ్మ ఎక్కడ ఉందో, ఏ ఆపదలో ఉందో అన్న తలంపులతో శ్రీరాముడు రాత్రుళ్లు నిద్ర కూడా పోలేక పోయాడు. నిరంతరం వేదనాశ్రువులు జాలు వారుస్తూ ఉన్నాడు. శోకం మనిషిని బలహీనుడినీ చేస్తుంది, దుఃఖమగ్నుడు అయిన మనిషి తన లక్ష్యం ఒక్కనాటికి చేరుకోలేడు.కనుక రామ దుఃఖం వీడు అని రాముని లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసాడు లక్ష్మణ స్వామి. సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందటానికి తాను సహాయపడినప్పుడు తన సీతాన్వేషణలో సహాయపడవలసిన కర్తవ్యాన్ని సుగ్రీవుడు గుర్తుంచుకుంటాడనే రాముడు భావించాడు. కాని శరదృతువు కూడా వచ్చి ఆకాశం నిర్మేఘమైనప్పటికీ రాముణ్ణి కలిసేందుకు సుగ్రీవుడు ముందుకు రాలేదు. తన లక్ష్యం సాధించుకున్న సుగ్రీవుడు ఇక భయపడవలసిన కారణమంటూ ఏదీ లేకపోవటంతో రహస్యంగా యువతుల యొక్క విశేషించి తన భార్య రుమ, క్రొత్తగా లభించిన తారల యొక్క సాహచర్యాన్ని అనుభవించటంలోనే పూర్తిగా మునిగితేలుతూ కాలక్షేపం చేయసాగాడు. అలా అతను రాజ్యపాలనా నిర్వహణ యొక్క కర్తవ్యాచరణను సహితం నిర్లక్ష్యం చేశాడు. తన మాట నిలబెట్టుకోని సుగ్రీవుని జాగు చూసి శ్రీరామునికి తీవ్ర ఆగ్రహం వస్తుంది. సుగ్రీవునికి తన కర్తవ్యం గుర్తు చేసి అవసరం అయితే హెచ్చరించి రమ్మని లక్ష్మణుడిని కిష్కింధకు పంపుతాడు... రేపటి భాగంలో కిష్కింధలో అడుగుపెట్టిన లక్ష్మణుని ఆగ్రహం, సీతాన్వేషణ కోసం వానర వీరుల పయనం గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్! 🚩 .....సశేషం బలం విష్ణోః ప్రవర్ధతాం.... జయ శ్రీరామ.



Read Also:  Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం https://telugulostories.blogspot.com/2026/03/sampoorna-ramayanam-part-1-1.html

Sampoorna Ramayanam Part 25 |  సంపూర్ణ రామాయణం - Tara’s Grief, Sugriva’s Coronation

 

🚩 రామాయణం భాగం 25: తారా విలాపం, సుగ్రీవ పట్టాభిషేకం, వర్షశరదృతు వర్ణన మరియు రాముని విరహ వేదన 🚩

 

 

5 ప్రశ్నలు & సమాధానాలు (FAQs in Telugu)

1. తారా ఎందుకు విలపించింది?
వాలి మరణాన్ని చూసి అతని భార్య తారా తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

2. వాలి చివరి మాటలు ఏమిటి?
తన కుమారుడు అంగదుడిని జాగ్రత్తగా చూసుకోవాలని, సుగ్రీవుని రాజుగా అంగీకరించాలని వాలి కోరాడు.

3. సుగ్రీవుడు ఎందుకు విచారంలో పడిపోయాడు?
వాలి మరణం తర్వాత వచ్చిన బాధను చూసి, తన విజయం కూడా ఆనందాన్ని ఇవ్వలేదని భావించాడు.

4. సుగ్రీవ పట్టాభిషేకం ఎలా జరిగింది?
Rama ఆదేశంతో హనుమంతుడు సహాయంతో సుగ్రీవుని రాజుగా పట్టాభిషేకం చేశారు.

5. రాముడు ఎందుకు బాధలో ఉన్నాడు?
సీతమ్మ వియోగం మరియు సుగ్రీవుని ఆలస్యం కారణంగా Rama తీవ్ర విరహ వేదనలో ఉన్నాడు.

 

Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Ramayana Part 25: Tara’s Grief, Sugriva’s Coronation, Seasonal Changes, and Rama’s Sorrow

 

 

Story Overview:

Seeing Vali on the verge of death due to Rama’s arrow, his wife Tara was overwhelmed with grief. Hanuman comforted her, urging her to perform the final rites and support her son Angada’s future responsibilities.

Vali, before dying, sought forgiveness from Sugriva and requested him to rule the kingdom while taking care of Angada. He also advised Angada to remain disciplined, balanced, and free from attachment and hatred. After speaking these words, Vali left his mortal body.

Unable to bear her husband’s death, Tara drowned in deep sorrow.

Sugriva, witnessing Tara’s grief, became distressed and told Rama that his victory had brought sorrow instead of happiness. He even expressed a desire to renounce his life, but Rama consoled him, reminding him that everything happens according to divine will.

After the cremation rites, Sugriva and Angada performed Vali’s final rituals with proper respect. Sugriva was then formally crowned king of Kishkindha, and Angada was appointed crown prince, as per Rama’s instructions through Hanuman.

Sugriva regained his kingdom and wife, but promised to assist in the search for Sita once the monsoon season ended.

Seasonal Description and Rama’s Sorrow

During the rainy season, Rama and Lakshmana stayed in a cave on Mount Prasravana. Despite the beauty of nature, Rama remained deeply sorrowful due to separation from Sita. He could not sleep and constantly shed tears.

Lakshmana tried to console him, urging him not to succumb to grief.

However, even after the monsoon ended and autumn arrived, Sugriva failed to meet Rama. Having regained his kingdom, he became absorbed in pleasures and neglected his promise.

Rama, angered by this delay, instructed Lakshmana to go to Kishkindha and remind Sugriva of his duty.

 

 

Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


5 FAQs in English

1. Why did Tara grieve?
She was devastated by the death of Vali.

2. What were Vali’s final wishes?
He asked Sugriva to rule and take care of his son Angada.

3. Why did Sugriva feel sorrow despite victory?
He felt his success was overshadowed by loss and grief around him.

4. How was Sugriva crowned?
Rama ordered Hanuman to perform the coronation rituals.

5. Why was Rama angry later?
Because Sugriva delayed his promise to help search for Sita.

 

Ramayana Part 25, Tara lamentation, Vali death final words, Sugriva coronation, Kishkindha coronation story, Rama Lakshmana forest exile, seasonal description Ramayana, monsoon Ramayana story, Rama anger Sugriva delay, Sita search preparation, Angada story Ramayana, Hindu epic Kishkindha

 

#Ramayana, #TaraLamentation, #SugrivaCoronation, #RamaInExile, #KishkindhaKanda

 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Post a Comment

Previous Post Next Post