Sampoorna Ramayanam Part 23 | సంపూర్ణ రామాయణం - Kishkindhakanda

Sampoorna Ramayanam Part 23 |  సంపూర్ణ రామాయణం - Kishkindhakanda 


Sampoorna Ramayanam Part 23 |  సంపూర్ణ రామాయణం - Kishkindhakanda 

Sampoorna Ramayanam Part 23 |  సంపూర్ణ రామాయణం - Kishkindhakanda

🚩 సంపూర్ణ రామాయణం - భాగం 23 🚩


కిష్కింధకాండ - వాలి సుగ్రీవ వైరం - దుందుభి కాయం - సప్తసాల భేదనం


కథా వివరణ


1. వాలి సుగ్రీవ వైర కారణం:

సుగ్రీవుడు తన అన్న వాలితో పగ ఎలా ఏర్పడిందో రాముడికి వివరించాడు.నా తండ్రి మరణించినపుడు పెద్దవాడైన వాలి కిష్కింధకు రాజు కాగా నేను అతని సేవలో నిమగ్నం కావటం తటస్థించింది. దీనికి ముందు మయుడనే దానవుని కుమారుడైన మాయావి ఒక స్త్రీ కారణంగా వాలితో వైరం పెట్టుకున్నాడు. తర్వాత ఒక రాత్రివేళ అందరూ నిద్రిస్తుండగా ఆ మాయావి కిష్కింధకు వచ్చి వాలిని ద్వంద్వ యుద్ధానికి రమ్మని సవాలు చేశాడు. వాలి భార్యలు అతణ్ణి వారించ యత్నించినప్పటికీ ఆగ్రహపరవశుడైన వాలి దాడికి వచ్చిన ప్రత్యర్థితో తలపడటానికి రాజసౌధం నుంచి బయటకు వెళ్లాడు. నేను మా అన్నను అనుసరించి వెళ్లాను. మమ్మల్ని చూడగానే మాయావి భయపడి పారిపోయాడు. మేము మాయావిని తరుముతూ వెంటపడగా అతను దట్టమైన పొదలచేత ఆచ్ఛాదింపబడి ఉన్న అగాధమైన అంధకార బంధురమైన గుహలోకి చొరబడ్డాడు. నన్ను గుహద్వారం వద్ద కావలి ఉండమని చెప్పి వాలి ఆ దానవునితో పోరాడడానికై ఆ గుహలోకి వెళ్ళాడు.


ఆ తర్వాత ఒక పూర్తి సంవత్సరం గడిచింది. అంతకాలం నేను ద్వారం వద్దనే పహరాకాస్తూ నిలిచినప్పటికీ నా సోదరుని జాడ కనిపించలేదు. అకస్మాత్తుగా గుహలోనుండి నురుగుతో కూడిన రక్తం రావటం గమనించాను. పలువురు దానవుల అరుపుల ధ్వని కూడా నాకు వినిపించింది కాని నా సోదరుడి కంఠస్వరం మాత్రం వినిపించనేలేదు. నేను వాలి వధించబడి ఉంటాడన్న నిర్ధారణకు వచ్చాను. అంతట ఒక పెద్ద బండరాతితో గుహ యొక్క ముఖద్వారాన్ని మూసివేసి(మళ్ళీ ఆ రాక్షసుడు వెనక్కి రాకుండా ఏర్పాటు)నా సోదరుడి దివంగత ఆత్మయొక్క శ్రేయస్సుకోసం జలతర్పణం చేశాను. నేను కిష్కింధకు తిరిగిరాగానే సచివులు నన్ను రాజసింహాసనంపై ప్రతిష్ఠించారు. నేను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయసాగాను.


కానీ కొంత కాలం గడిచిన పిమ్మట వాలి ఆ దానవులను సంహరించి తిరిగి వచ్చాడు,వచ్చి సింహాసనం మీద నేను ఆసీనుడిని అవడం చూసి క్రోధం తో సచివులను బంధించి,నేను నిజం చెప్పిన వినకుండా, రాజ్యం పొందటం కోసమే నేను బయటికి రాకుండా గుహ ద్వారం మూసి వేసి ఈ సుగ్రీవుడు  మోసం చేశాడని నా భార్యను కూడా స్వాధీనం చేసుకుని నన్ను రాజ్యం నుండి తరిమేసాడు. ఆనాటి నుండి నేను ఈ ఋష్యమూఖ పర్వతం మీద నివసిస్తూ ఉన్నాను అని సుగ్రీవుడు తన కథ మొత్తం రాముడికి చెప్పాడు.


అంతట రాముడు "ప్రియమైన సుగ్రీవా! నీవు నీ భార్యను, రాజ్యాన్ని తిరిగి పొందగలిగేలా నేను వాలిని సంహరిస్తాననే విషయమై నిశ్చంతగా ఉండు" అన్నాడు.


2. వాలి శక్తి - సుగ్రీవుని సందేహం:

ఒక్క దెబ్బతో ఏడు సాల వృక్షాలను కూల్చగలడు, కైలాస పర్వతం నే కూల్చ గలిగె శక్తి ఉన్న దుందుంబి నీ సంహరించిన వాడు వాలి అలాంటి వాన్ని రాముడు గెలవగలడా అని సుగ్రీవుడికి చిన్న అనుమానం కలిగింది.


3. దుందుభి కాయం:

అప్పుడు రాముడు తన శక్తిని నిరూపించడానికి, వాలి చంపిన 'దుందుభి' అనే రాక్షసుడి కొండంత అస్థిపంజరాన్ని తన కాలి బొటనవేలితో నూలుపోగులా ఎత్తి పది యోజనాల దూరంలో పడేలా విసిరాడు.


4. సప్తసాల భేదనం:

అయినా సుగ్రీవుడు పూర్తిగా తృప్తి చెందకపోయేసరికి, రాముడు తన బాణాన్ని వదిలాడు. ఆ బాణం ఏడు సాల వృక్షాలను, ఒక పర్వతాన్ని, భూమిని చీల్చుకుంటూ వెళ్లి మళ్ళీ తిరిగి రాముడి బాణాల పొదిలోకి వచ్చి చేరింది. ఈ అద్భుత పరాక్రమాన్ని చూసిన సుగ్రీవుడు రాముడి పాదాలకు నమస్కరించి, "స్వామీ! వాలిని చంపగల వీరుడివి నువ్వే" అని నమ్మాడు.


5. కిష్కింధకు పయనం:

రాముడి ధైర్యవచనాలతో సుగ్రీవుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అందరూ కలిసి వాలితో తలపడడానికి కిష్కింధ వైపు బయలుదేరారు.


(రేపటి భాగంలో: వాలి-సుగ్రీవుల మొదటి యుద్ధం - గజపుష్పి మాల - వాలి వధ)


జయ శ్రీరామ 🚩 🚩 🙏


....సశేషం


బలం విష్ణోః ప్రవర్ధతాం 🚩🚩





 

Read Also:  Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం https://telugulostories.blogspot.com/2026/03/sampoorna-ramayanam-part-1-1.html


 

🚩 రామాయణం భాగం 23: కిష్కింధకాండ వాలి-సుగ్రీవ వైర రహస్యం, దుందుభి కాయం, సప్తసాల భేదన మహాపరాక్రమం 🚩


Sampoorna Ramayanam Part 23 |  సంపూర్ణ రామాయణం - Kishkindhakanda 


5 ప్రశ్నలు & సమాధానాలు (FAQs in Telugu)

1. వాలిసుగ్రీవుల మధ్య వైరం ఎలా ప్రారంభమైంది?
మాయావి అనే దానవుడితో జరిగిన సంఘటన కారణంగా వాలిసుగ్రీవుల మధ్య అపార్థం ఏర్పడింది.

2. సుగ్రీవుడు కిష్కింధ నుండి ఎందుకు బయటకు వచ్చాడు?
వాలి తిరిగి వచ్చి తనను ద్రోహిగా భావించడంతో సుగ్రీవుడు రాజ్యం కోల్పోయి ఋష్యమూక పర్వతానికి వెళ్లాడు.

3. దుందుభి కాయం అంటే ఏమిటి?
వాలి సంహరించిన దుందుభి అనే రాక్షసుడి మహా శరీర అవశేషం.

4. సప్తసాల భేదనం అంటే ఏమిటి?
Rama వదిలిన బాణం ఏడు సాల వృక్షాలను మరియు భూమిని ఛేదించి తిరిగి వచ్చుటను సప్తసాల భేదనం అంటారు.

5. రాముడు తన శక్తిని ఎలా నిరూపించాడు?
దుందుభి కాయాన్ని ఒకే కాలితో ఎత్తి విసరడం మరియు సప్తసాల వృక్షాలను ఛేదించడం ద్వారా తన పరాక్రమాన్ని చూపించాడు.

 

Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Ramayana Part 23: Kishkindhakanda – Vali-Sugriva Conflict, Dundubhi’s Corpse, and the Miracle of the Seven Sala Trees

 

Story Overview:

Sugriva narrated to Rama the origin of his enmity with Vali. After their father’s death, Vali became the king of Kishkindha while Sugriva served him loyally.

A demon named Mayavi, son of Maya, once challenged Vali to a duel. Vali pursued him into a deep cave, instructing Sugriva to guard the entrance. A year passed with no sign of Vali. When Sugriva saw blood and heard terrifying sounds from inside, he assumed Vali had been killed. He sealed the cave and performed funeral rites. The ministers later crowned him king.

However, Vali later returned alive after killing the demon. Seeing Sugriva on the throne, Vali misunderstood the situation and banished him, also taking his wife. Since then, Sugriva had been living on Mount Rishyamuka.

Vali’s Strength and Sugriva’s Doubt

Sugriva expressed doubt about whether Rama could defeat Vali, who possessed immense strength—capable of uprooting seven sala trees and defeating the mighty demon Dundubhi.

Rama’s Demonstration of Power

To dispel Sugriva’s doubts, Rama lifted the gigantic skeleton of Dundubhi with his toe and threw it a great distance with ease.

The Miracle of the Seven Sala Trees

Even then, Sugriva remained uncertain. Rama then shot an arrow that pierced seven sala trees, the ground, and even a mountain, before returning to his quiver. Witnessing this unimaginable feat, Sugriva bowed before Rama and accepted his strength.

Journey to Kishkindha

Convinced of Rama’s power, Sugriva prepared for battle, and they all proceeded toward Kishkindha to confront Vali.

 

 Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


5 FAQs in English

1. How did the conflict between Vali and Sugriva begin?
It began due to a misunderstanding involving the demon Mayavi.

2. Why was Sugriva exiled from Kishkindha?
Vali wrongly believed Sugriva betrayed him and seized the throne.

3. What is Dundubhi’s corpse episode?
It refers to the remains of a demon killed by Vali, which Rama effortlessly lifted and threw.

4. What is the Seven Sala Trees miracle?
Rama pierced seven sala trees, the earth, and a mountain with a single arrow.

5. How did Sugriva become convinced of Rama’s strength?
By witnessing Rama’s superhuman feats, including lifting Dundubhi’s skeleton and the arrow miracle.

 

Ramayana Part 23, Vali Sugriva conflict, Kishkindhakanda story, Dundubhi skeleton episode, seven sala trees miracle, Rama arrow feat, Sugriva exile story, Vali strength description, Ramayana Telugu summary, Rishyamuka mountain story, Rama demonstrates power, Hindu epic Kishkindha

 

#Ramayana, #KishkindhaKanda, #RamaPower, #ValiSugriva, #SevenSalaTrees

 


Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Post a Comment

Previous Post Next Post