Sampoorna Ramayanam Part 11 | Ayodhya Kanda సంపూర్ణ రామాయణం - అయోధ్యకాండ

Sampoorna Ramayanam Part 11 |  Ayodhya Kanda: Bharata’s Arrival and His Anger Towards Kaikeyi సంపూర్ణ రామాయణం - అయోధ్యకాండభరతుని ఆగమనం - కైకేయిపై ఆగ్రహం 


Sampoorna Ramayanam Part 11 |  Ayodhya Kanda: Bharata’s Arrival and His Anger Towards Kaikeyi సంపూర్ణ రామాయణం - అయోధ్యకాండభరతుని ఆగమనం - కైకేయిపై ఆగ్రహం  

Sampoorna Ramayanam Part 11 |  Ayodhya Kanda: Bharata’s Arrival and His Anger Towards Kaikeyi సంపూర్ణ రామాయణం - అయోధ్యకాండభరతుని ఆగమనం - కైకేయిపై ఆగ్రహం

🚩 సంపూర్ణ రామాయణం - భాగం 11 🚩 అయోధ్యకాండభరతుని ఆగమనం - కైకేయిపై ఆగ్రహం 


కథా వివరణ:

1. భరతుని దుస్స్వప్నాలు - అయోధ్య ప్రవేశం:

భరతున్ని తీసుకు రావడానికి దూతలు కేకయ దేశం కి భయాలు దేరారు.ఆ రాత్రికే అక్కడికి చేరుకున్నారు.ఈలోగా

కేకయ రాజ్యంలో ఉన్న భరతుడికి వరుసగా పీడకలలు వస్తుంటాయి. భరతుణి విషాదాన్ని చూచి శత్రుఘ్నుడు, భరతుని ఇతర మిత్రులు అతనిలో ఉత్సాహాన్ని పెంపొందింపజేసే ప్రయత్నం చేశారు. కాని వారి హాస్య వచనాలేవి భరతుణ్ణి వినోదింపజేయలేకపోయాయి. అంతట వారు గంభీరంగా ఆయన మనస్సులోని కలవరం గురించి ప్రశ్నించారు.


భరతుడు ఇలా వివరించాడు:

 "గత రాత్రి కొన్ని పీడకలలు వచ్చాయి. నా తండ్రి మాసినబట్టలతో, నిరాశా నిస్పృహలతో ఒక పర్వతశిఖరం నుండి జారి గోమయపు రొచ్చులో పడటం చూశాను. ఆ రొచ్చులో పొర్లాడుతూ మహారాజు దోసిలితో తైలపానం చేసి ఉన్మాదివలె వికటాట్టహాసం చేశాడు. ఆ పైన ఆ తైలం శరీరమంతా అలుముకున్న మీదట మహారాజు అందులో వండబడిన అన్నాన్ని తినసాగాడు.


"అకస్మాత్తుగా ఆ దృశ్యం మారిపోయింది. సాగరంలోని నీరంతా ఇంకిపోవటం, చంద్రుడు భూమిపై రాలిపడటం కనిపించింది. భూమిని అంధకారం ఆవరించగా, అగ్నిపర్వతాలు బద్ధలై విస్ఫులింగాలను విరజిమ్ముతూ లావాలను వెలిగ్రక్కుతుండగా భూతలంమీద రాక్షసులు స్వైరవిహారం చేశారు. అంతట ఆ దృశ్యం మాయమై నా తండ్రిగారి ఏనుగుయొక్క దంతాలు విరిగిపోయి వుండటం చూశాను. నల్లని వస్త్రాలు ధరించి, రక్తచందన లేపనాన్ని దేహమంతా పులుముకొని, రక్తవర్ణపు పుష్పమాలను దాల్చి ఇనుప సింహాసనం మీద కూర్చొని వున్న మహారాజును నల్లని దేహచ్చాయగల ఒక యువతి వేధించసాగింది.


"చివరగా గార్దభాలు లాగుతున్న ఒక రథం నా తండ్రిని అతివేగంగా దక్షిణ దిక్కుగా తీసుకొనిపోవటం చూశాను. ఈ భయానకమైన పీడకలను చూచిన మీదట నా తండ్రిగాని, నా సోదరుల్లో ఒకరుగాని, నేనుగాని మరణించటం తథ్యమన్న అభిప్రాయానికి వచ్చాను. ఇప్పటికీ ఎందుకోగాని నా హృదయం నిరంతర భయగ్రస్తమై ఉంది. నా గొంతు బొంగురుపోయింది. నా శరీరఛాయ తన కాంతిని కోల్పోయింది. నా మనసు గిర్రున తిరుగుతోంది. కారణమేమీ కనిపించకుండానే నాకెందుకో సిగ్గు, ద్వేషం కలుగుతున్నాయి. నిజానికి ఆలోచిస్తున్న కొద్దీ ఈ పీడకల రానున్న ఏదో గొప్ప కీడును సూచిస్తున్నట్లు నాకు నమ్మకం బలపడుతోంది.”


భరతుడు మాట్లాడుతుండగా అయోధ్య నుండి వచ్చిన దూతలు గదిలోనికి ప్రవేశించారు. ప్రణామాలు చేసిన మీదట “ఓ రాజకుమారా! సచివులు, వశిష్ఠుడు నిన్ను అయోధ్యకు రమ్మంటున్నారు. అక్కడ అత్యవసరంగా నీ ఉపస్థితి కావలసి వుంది" అన్న సందేశాన్ని చెప్పారు.


భరతుడు తన తల్లిదండ్రుల యోగక్షేమాల గురించి వారిని ప్రశ్నించగా వారు అంతా బాగానే వుందంటూ, తమకు సూచించబడిన విధంగా బదులుపలికారు. వెంటనే వెళ్ళాలన్న ఆత్రుతతో భరతుడు తన మాతామహునివద్ద, మేనమామ వద్ద సెలవు తీసుకున్నాడు


అయోధ్య నుండి వచ్చిన దూతలు వెంటనే బయలుదేరమని కోరడంతో, భరత శత్రుఘ్నులు అత్యంత వేగంగా అయోధ్యకు చేరుకున్నారు. వివిధ ప్రాంతాలు దాటుతూ దాదాపు ఏడవ రోజు భరతుడు అయోధ్యలో ప్రవేశించాడు.కానీ నగరంలోకి అడుగుపెట్టగానే భరతుడికి ఏదో అమంగళం జరిగినట్లు అనిపించింది. వీధులు వెలవెలబోతున్నాయి, ప్రజలు కన్నీళ్లతో చూస్తున్నారు.


2. కైకేయి గర్వం

భరతుడు నేరుగా తండ్రిని చూడటానికి వెళ్తే అక్కడ ఆయన లేరు. అప్పుడు కైకేయి మందిరానికి వెళ్ళాడు. కైకేయి ఎంతో సంతోషించింది. తన తండ్రి గురుంచి క్షేమ సమాచారం అడిగి తెలుసుకుంది. అంతా క్షేమమే అని చెప్పిన భరతుడు తండ్రి గారు ఏరి అని అడుగగా.


"నా ప్రియమైన కుమారా! దశరథ మహారాజు మరణించాడు" అంటు కైకేయి చల్లగా బదులుపలికింది.


ఈ వార్త వింటూ భరతుడు దుఃఖతప్తుడై నేలమీద పడి బిగ్గరగా రోదించసాగాడు. కైకేయి అతనితో "నాయనా, భరతా! దు:ఖంతో వివశుడివి కాకు. పవిత్రులైన, జ్ఞానులైన వ్యక్తులు స్థిరచిత్తంతో నిలుస్తారు తప్ప ఇలాంటి విలాపాలకు లోనుకారు" అంటూ అతణ్ణి ఓదార్చటానికి ప్రయత్నించింది.


అంతట భరతుడు మహారాజు ఎలా మరణించాడని, ఆయన తనకు వదిలివెళ్ళిన సందేశం ఏమిటని తన తల్లిని అడిగాడు. ఆపైన "ఎవరినైనా తక్షణమే రాముని దగ్గరకు పంపి, నా రాక విషయం ఆయనకు తెలియజేయి" అని ప్రార్ధించాడు.


మంచివార్త చెబుతున్నట్లుగా, కైకేయి మొఖమాటం లేకుండా బదులిచ్చింది. “రాముడు పధ్నాలుగు సంవత్సరాల అరణ్యప్రవాసానికి పంపబడి కోసల రాజ్యాన్ని విడిచివెళ్లాడు. ఇప్పుడతను నారవస్త్రాలు ధరిస్తున్నాడు. సీత, లక్ష్మణుడు కూడా అతనిని అనుసరించి వెళ్ళారు. అయితే నీ తండ్రి కౌసల్యానందనుడి విరహంలో జీవించడాన్ని భరించలేక 'హా రామా! హా సీతా! హా లక్ష్మణా! అని ఎలుగెత్తి విలపిస్తూ తన జీవితాన్ని త్యజించాడు."


Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

రాయుడు ఏం తప్పు చేశాడు, బ్రాహ్మణ హత్య వంటి మహాపరాధం చేస్తేనే అంత తీవ్ర శిక్ష వేస్తారు కదా అని అడిగితే జరిగిన విషయం చాలా చాక చక్యంగా నీకోసం ఇంత గొప్ప పని చేసాను అన్నట్టుచెప్పింది కైకేయి. " ఆమె చెప్పిన మాటలు విని భరతుడు పిడుగు తగిలినట్లు కూలిపోయాడు.


3. కైకేయిపై భరతుని ఆగ్రహం:

తన తల్లి చేసిన కుతంత్రాన్ని తెలుసుకున్న భరతుడు ఉగ్రుడయ్యాడు. "ఓ పాపాత్మురాలా! నా తండ్రి ప్రాణాలు తీసి, నాకు దైవ సమానుడైన అన్నయ్యను అడవికి పంపి, నాకు రాజ్యం ఇస్తావా? ఈ రాజ్యకాంక్షతో నువ్వు వంశాన్ని నాశనం చేశావు. నిన్ను తల్లి అని పిలవడానికి కూడా నేను బాధపడుతున్నాను,నీకు కొడుకే ను అయినందుకు నన్ను నేనే అసహ్యించుకుంటున్నాను" అని గర్జించాడు.


4. భరతుని ధర్మనిరతి:

"రాముడు ఉండగా ఈ రాజ్యానికి వేరే వారు రాజు ఎలా అవుతాడు?నీ వెర్రి కోరిక నెరవేరదు.నేను ఇప్పుడే అడవికి వెళ్లి అన్నయ్య కాళ్లపై పడి ఆయన్ని తిరిగి తీసుకువస్తాను. నువ్వు కోరుకున్న ఈ రాజ్యం నాకు నరకంతో సమానం" అని కైకేయిని అక్కడే వదిలేసి, కౌసల్యా మాత దగ్గరకు పరుగెత్తాడు. కౌసల్య మొదట భరతుడిని అనుమానించినా, అతని నిష్కల్మషమైన ప్రేమని చూసి హత్తుకుని విలపించింది.అలా ఆ రాతి గడిచింది మరునాడు...


5. దశరథుని అంత్యక్రియలు:

వశిష్ఠ మహర్షి ఆజ్ఞతో, తైల ద్రోణిలో భద్రపరిచిన దశరథుని దేహానికి భరతుడు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించాడు. తండ్రిని కోల్పోయిన దుఃఖం ఒకవైపు, అన్నయ్య అడవిలో ఉన్నాడన్న వేదన మరోవైపు భరతుడిని దహించివేస్తుంది.మరో పక్క సింహాసనం ఖాళీగా ఉండకూడదు, రాజు లేని రాజ్యం భద్రంగా ఉండదు, ఇప్పటికే మహారాజు భరతుని రాజుగా నిర్ణయించాడు కనుక పట్టాభిషేకానికి ఏర్పాటు చేయాలి అని వశిష్టుడు మంత్రులు నిర్ణయించారు.అది భరతుడికి మరింత దుఃఖం కలగ చేసింది.....


జై శ్రీరామ్ 🙏


(నిజంగా ఒక్కో  ఘట్టము గుండెను పిండేసేవే ఇక్కడ తన నిజాయితి నిరూపించు కోవడం కోసం భరతుడు చేసే ప్రతిజ్ఞలు చాలా ఉంటాయి ఒక సర్గ మొత్తం ప్రతిజ్ఞలే నేను తప్పు చేస్తే ఈ ఘోర కుతంత్రం లో నా పాత్ర ఉండి ఉంటే ఆ అన్ని పాపాలు నన్ను చుట్టుకొను గాక అంటాడు నిజంగా భరతుడు వంటి తమ్ముడూ ఈ లోకానికి ఆదర్శ ప్రాయుడు.అయిదు రూపాయిల కోసం హత్యలు చేసుకునే రోజుల్లో రాజ్యాన్ని తృణ ప్రాయంగా వదిలిన ఈ మహా గాథ అవసరం ప్రచారం ఎంతైనా ఉంది.)..


....సశేషం


బలం విష్ణోః ప్రవర్ధతాం..... 



Read Also:  Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం https://telugulostories.blogspot.com/2026/03/sampoorna-ramayanam-part-1-1.html

 

భరతుని ధర్మగర్జన: కైకేయిపై ఆగ్రహం మరియు రామాయణంలోని హృదయ విదారక ఘట్టం

 

టాప్ 5 FAQs (Telugu)

1. భరతునికి వచ్చిన దుస్స్వప్నాల అర్థం ఏమిటి?
భరతుని కలలు రాబోయే అనర్థాలను సూచిస్తున్నాయి, ముఖ్యంగా దశరథ మహారాజు మరణం మరియు రాముడి వనవాసం.

2. కైకేయి ఎందుకు రాముడిని వనవాసానికి పంపించింది?
తన కుమారుడు భరతుడు రాజ్యాన్ని పొందాలని కోరుకుని, కైకేయి దశరథుని నుండి వరాలు పొందింది.

3. భరతుడు కైకేయిపై ఎందుకు కోపగించాడు?
తండ్రి మరణానికి మరియు అన్నయ్య రాముడి వనవాసానికి కైకేయే కారణమని తెలుసుకుని భరతుడు తీవ్రంగా ఆగ్రహించాడు.

4. భరతుడు రాజ్యాన్ని ఎందుకు తిరస్కరించాడు?
రాముడు జీవించి ఉండగా తాను రాజుగా ఉండటం ధర్మానికి విరుద్ధమని భావించాడు.

5. దశరథుని అంత్యక్రియలను ఎవరు నిర్వహించారు?
వశిష్ఠ మహర్షి ఆజ్ఞతో భరతుడు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించాడు.

 

Bharata’s Righteous Fury: His Anger at Kaikeyi and a Heartbreaking Episode from the Ramayana

 

Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 

Sampoorna Ramayanam Part 11 |  Ayodhya Kanda: Bharata’s Arrival and His Anger Towards Kaikeyi సంపూర్ణ రామాయణం - అయోధ్యకాండభరతుని ఆగమనం - కైకేయిపై ఆగ్రహం 

🚩 Sampoorna Ramayana – Part 11 🚩

Ayodhya Kanda: Bharata’s Arrival and His Anger Towards Kaikeyi

Story Summary:

Bharata, who was in the kingdom of Kekaya, began experiencing a series of terrifying dreams. These dreams deeply disturbed him, and despite attempts by Shatrughna and his companions to console him, he remained uneasy. He described horrifying visions of his father, King Dasharatha, in distress and ominous cosmic disturbances—signs that indicated an impending tragedy.

Soon, messengers from Ayodhya arrived and urged Bharata to return immediately. Though they reassured him that all was well, Bharata sensed something was wrong. Upon reaching Ayodhya, he found the city unusually silent and filled with sorrow.

When Bharata approached his mother Kaikeyi, she calmly informed him of King Dasharatha’s death. Shocked and grief-stricken, Bharata collapsed in anguish. Kaikeyi then revealed, without remorse, that she had secured two boons: sending Rama to exile for fourteen years and securing the throne for Bharata.

Hearing this, Bharata was devastated and enraged. He condemned his mother for her selfishness, blaming her for their father’s death and Rama’s exile. Refusing the throne, Bharata declared that only Rama was the rightful king. He vowed to go to the forest, bring Rama back, and restore him to the throne.

Later, under the guidance of Sage Vashishta, Bharata performed the last rites of his father with due rituals. Despite pressure from ministers to ascend the throne, Bharata remained steadfast in his righteousness, determined to uphold dharma.

This episode highlights Bharata’s unwavering integrity, devotion to his brother, and his commitment to righteousness, making him an eternal symbol of ideal brotherhood.

 

Top 5 FAQs (English)

1. What do Bharata’s dreams symbolize?
They foreshadow misfortune, including Dasharatha’s death and Rama’s exile.

2. Why did Kaikeyi send Rama to exile?
She wanted Bharata to become king and used her boons to make it happen.

3. How did Bharata react to Kaikeyi’s actions?
He was furious and deeply saddened, condemning her decisions.

4. Why did Bharata refuse the throne?
He believed Rama was the rightful king and chose to uphold dharma.

5. Who performed Dasharatha’s last rites?
Bharata performed them under Sage Vashishta’s guidance.

 

Ramayana Bharata story, Bharata anger on Kaikeyi, Ayodhya Kanda summary, Rama exile story, Dasharatha death episode, Bharata dharma story, Indian epics Ramayana summary, Telugu Ramayana content, Bharata character analysis, Ramayana Part 11

 

#Ramayana, #Bharata, #AyodhyaKanda, #IndianEpics, #Dharma

 


Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Post a Comment

Previous Post Next Post