ఆరు రాళ్ల కథ (6 Rallu Story): రైతుల ప్రాముఖ్యతను చెప్పే Moral Story for Kids | Inspirational Telugu Story

ఆరు రాళ్ల కథ (6 Rallu Story): రైతుల ప్రాముఖ్యతను చెప్పే Moral Story for Kids | Inspirational Telugu Story


ఆరు రాళ్ల కథ (6 Rallu Story): రైతుల ప్రాముఖ్యతను చెప్పే Moral Story for Kids | Inspirational Telugu Story


అనగా అనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు కొత్త విషయాలను తెలుసుకోవటం అంటే చాలా ఇష్టం. కనపడిన వాళ్లనల్లా "కొత్త విషయాలు చెప్పండి- కొత్త విషయాలు చెప్పండి" అని వేధించేవాడాయన. 

ఎవరైనా గొప్ప విషయాన్ని చెబితే వాళ్ళకు ఏదో ఒక బహుమానం ఇచ్చేవాడు. ఒకరోజున ఆయన ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను పిలిపించాడు- "మీరు కనుగొన్న క్రొత్త క్రొత్త పరికరాలను, పదార్థాలను, ప్రయోగాలను వివరించండి" అన్నాడు.

ఆరు రాళ్ల కథ  | 6 Rallu Telugu Lo Stories Kathalu

ఆరు రాళ్ల కథ (6 Rallu Story): రైతుల ప్రాముఖ్యతను చెప్పే Moral Story for Kids | Inspirational Telugu Story


అందరూ ఎవరికి వారు తాము కనుగొన్న విషయాలను చూపి, వివరించారు. రాజుగారికి అవన్నీ చాలా సంతోషాన్నిచ్చాయి- కానీ వాటిని ఉపయోగించి ఏమి చేయాలో మాత్రం ఆయనకు అర్థం కాలేదు.


శాస్త్రవేత్తలు అందరినీ పంపించివేశాక, రాజుగారు ఆలోచనలో పడ్డారు: "ఇవన్నీ కొత్త సంగతులు- సరే- కానీ, మామూలు ప్రజలకు పనికివచ్చేవి ఇందులో ఎన్ని ఉన్నాయి? అసలు నా రాజ్యపు ప్రజల అవసరాలను ప్రతిబింబించేవిగా ఈ ప్రయోగాలు ఎందుకు లేవు?" అని.




అప్పుడు మంత్రి "ప్రభూ! నాకు తెలిసిన శాస్త్రవేత్త ఒకరున్నారు. ప్రజల మధ్యనే జీవిస్తుంటాడాయన. ఆయన ప్రయోగాలు అందరికీ సులభంగా అర్థమౌతుంటాయి. మీరు కోరితే ఆయనను ఒకసారి రమ్మంటాను" అన్నాడు రాజుతో.


రాజుగారు సంతోషంగా 'సరే'అనగానే, మంత్రి శాస్త్రవేత్తను పిలిపించాడు.

శాస్త్రవేత్త బల్లమీద ఒక గాజు కుప్పెను పెట్టాడు. ఆ కుప్పెలో ఒక ఈగ ఎగురుతున్నది. దానికి ఆరు కాళ్ళు ఉన్నాయి. రాజుగారికి ఈగను చూపించి, శాస్త్రవేత్త ఆ ఈగకు ఒక కాలు తీసేసాడు. ఈగ కొంచెం సేపు బాధపడి, ఆపైన మళ్ళీ ఎగరసాగింది. శాస్త్రవేత్త ఒక్కటొక్కటిగా దాని కాళ్ళు తీసేస్తూ వచ్చాడు. చివరికి అది ఇక ఎగరలేక ఒకే చోట కూలబడింది.

రాజుగారికి ఈగ పరిస్థితిని చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడు శాస్త్రవేత్త -"ప్రభూ! ఈ ఈగ పరిస్థితిని చూసి తమకు బాధ కలిగిందని తెలుస్తూనే ఉన్నది. 

అయితే తమరు గమనించాల్సింది వేరే ఉన్నది. ఈ ఈగ మన రాజ్యంలో రైతును సూచిస్తున్నది. 

పశువులు, నీళ్లు, విత్తనాలు, శ్రమ శక్తి, భూమి, గిట్టుబాటు ధర- ఈ ఆరూ రైతుకు ఆరు కాళ్ల లాంటివి. ప్రస్తుతం మన రాజ్యంలో రైతుకు ఇవన్నీ ఒక్కటొక్కటిగా దూరమైపోతున్నాయి. రైతులు ఏమీ చేయలేక చతికిలబడి-పోతున్నారు. దీన్ని మీ దృష్టికి తేవటంకోసం ఇలా చేయవలసి వచ్చింది- క్షమించాలి" అన్నాడు.


తన రాజ్యంలో రైతుల కష్టాలేంటో తెలుసుకున్న రాజుగారు వెంటనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. రైతుల స్థితిని మెరుగుపరచారు.



ఆరు రాళ్ల కథ (6 Rallu Story): రైతుల ప్రాముఖ్యతను చెప్పే Moral Story for Kids | Inspirational Telugu Story



Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 

 

రైతులను నిర్లక్ష్యం చేస్తే సమాజం నిలవదు.

కథ మనకు చెప్పేది ఏమిటంటే:

  • ఈగ తన కాళ్లన్నీ కోల్పోతే ఎలా కూలిపోతుందో, అలాగే రైతు అవసరమైన వనరులు (నీరు, విత్తనాలు, భూమి, పశువులు, శ్రమ, గిట్టుబాటు ధర) లేకపోతే బలహీనపడతాడు
  • నిజమైన జ్ఞానం అనేది కేవలం కొత్త విషయాలు తెలుసుకోవడం కాదు, ప్రజల సమస్యలను పరిష్కరించడం
  • నాయకులు ప్రజల అవసరాలను అర్థం చేసుకుని వారికి సహాయం చేయాలి

👉 సారాంశం:
రైతు బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుంది.

 


Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

 ఆరు రాళ్ల కథ (6 Rallu Story): రైతుల ప్రాముఖ్యతను చెప్పే Moral Story for Kids | Inspirational Telugu Story

📖 The Story of the Six Stones (6 Rallu)

Once upon a time, there was a king who loved learning new things. He would ask everyone he met,
“Tell me something new! Tell me something new!”

If someone told him something interesting, he would give them a reward.

One day, the king invited great scientists from all over the world and said,
“Show me your new inventions, discoveries, and experiments.”

All the scientists showed their ideas and explained them. The king felt happy seeing all these new things, but he did not understand how they were useful in real life.

After sending them away, the king started thinking:
“These are all new ideas, but how many of them are useful to ordinary people? Why don’t they reflect the needs of my people?”



Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 

 

At that moment, his minister said,
“Your Majesty, I know a scientist who lives among common people. His ideas are easy to understand and useful. Shall I call him?”

The king agreed happily, and the scientist was invited.

The scientist placed a glass jar on the table. Inside it, there was a fly with six legs. He showed the fly to the king and removed one of its legs. The fly struggled for a while but then started flying again.

Then, one by one, he removed all its legs. Finally, the fly could not fly anymore and fell down.

The king felt very sad seeing this and had tears in his eyes.



Best Telugu Story about Friendship Stories :  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


The scientist said,
“Your Majesty, I can see that you feel sad for the fly. But there is something important you must understand.”

“This fly represents the farmers in your kingdom.”

“Cattle, water, seeds, labor, land, and fair price — these six are like the six legs of a farmer. But in your kingdom, farmers are losing these one by one. That is why they are helpless and suffering. I did this experiment to show you their condition. Please forgive me.”

The king understood the problem of the farmers. Immediately, he started welfare programs, gave importance to agriculture, and improved the lives of farmers.

 

🌾 Moral of the Story (for kids)

👉 When we ignore the needs of important people, everything falls apart.

👉 Farmers are the backbone of society — if they suffer, everyone suffers.

👉 True knowledge is using ideas to help people in real life.

 

#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

#DevotionalStories 


కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories

ఆరు రాళ్ల కథ (6 Rallu Story): రైతుల ప్రాముఖ్యతను చెప్పే Moral Story for Kids | Inspirational Telugu Story



Post a Comment

Previous Post Next Post