Shiva Bhakti kathalu telugu lo stories kathalu | తిరుకురిప్పు తొండనాయనారు (శివభక్తులు) చరిత్రలు


Shiva Bhakti kathalu telugu lo stories kathalu | తిరుకురిప్పు తొండనాయనారు (శివభక్తులు) చరిత్రలు - తొండైమండలం ఒక భాగ్యసీమ. దానికి కంచి ముఖ్యపట్టణము. ఆగమముల ప్రకారము ఇచ్చటనే పార్వతీదేవి శివుని గూర్చి తపమొనరించినది. ఇచ్చట శివుడు ఏకామ్రనాథుడుగా పిలువబడుతాడు.




Shiva Bhakti kathalu telugu lo stories kathalu | తిరుకురిప్పు తొండనాయనారు (శివభక్తులు) చరిత్రలు

తిరుత్తొండారు ఇచ్చటనే జన్మించినాడు. రజకుడుగా పుట్టాడు. శివధ్యానైక తత్పరుడు. 

శివభక్తులను ఆదరించేవాడు. సేవించేవాడు. వారి ముఖాల్ని చూచి, వారల అవసరములు గుర్తెరిగి వాళ్ళకు సహాయ మందించేవాడు. 

అందుకని అతనికి తిరుకురిప్పు తొండనాయనారు అని పేరు వచ్చింది. శివభక్తుల బట్టలను ఉతికేవాడు. 


శివుడు ఇతని భక్తికి మెచ్చి - అందరికి అతని విశేషము తెలియబరచాలనుకున్నాడు.


శివుడు ఒక పేదవానిగా రూపొంది, మెడకు రుద్రాక్షలతో, దేహమంతా విభూతి పుండ్రములతో , చిరిగిపోయిన దుస్తులతో తిరుత్తొండారుకు ప్రత్యక్షమయ్యాడు. 


అతనిని చూడగానే తిరుత్తొండారుకు మైకం కమ్మింది. తేరుకుని, అతనిని కొలిచాడు. అతనిని ప్రశ్నించాడు. 

"స్వామీ! మా ఇల్లు, మీ రాకతో పావనమయింది. ఎందుకని మీరు చిక్కిపోయారు? మీ దుస్తులను ఉతికి పెట్టనీయండి. మీకు సేవ చేయనీయండి" అని అర్థించాడు.


ఆ శివ భక్తుడు ఒక షరతుతో ఆ బట్టలను ఉతుకుటకు అనుమతిచ్చాడు. 

ఆ షరతు: 

ఆ బట్టలు ఉతికి, ఆరవేసి తనకు సూర్యాస్తమయంలోపల అందజేయాలి. లేని యెడల ఒక్కచిక్కిన తను, చలికి చనిపోతాడు అని:"


తొండారు ఇందుకు అంగీకరించాడు. 

అంగీకరించే సమయానికి ఎండ బాగానే వుంది. వెంటనే ఆ బట్టలను ఉతికాడు. 

ఆరవేసే సమయానికి పెద్దవాన మొదలిడింది. 



సూర్యుడస్తమించే సమయం వచ్చింది. ఆ బట్టలు ఆరే పరిస్థితి కనబడలేదు. తొండారు తబ్బిబ్బయ్యాడు. 


శివభక్తునికి తాను సహాయము చేసే బదులు అతనిని కష్టాలపాలు చేసే స్థితికి వచ్చింది. 

ఈ పాపాన్ని తలుస్తూ ఆ బట్టలుతికే రాయికి తన తలను వేసి కొట్టుకున్నాడు. దేవుని ప్రార్థించాడు. పరిస్థితిని చూచి ఆక్రందించాడు.

శివుడు ఆ ఆక్రందనకి కరిగి ప్రత్యక్షమై తొండారును అభినందించి, భక్తికి మెచ్చుకొని - 'త్వరలో నన్ను చేరగలవు. 


నా దగ్గరే వుండగలవు' అని అనునయంగా పల్కాడు.


తొరుత్తొండారు పరవశించి, శివుని పాదములై బడి తన్మయత్వంతో శివుని నుతించాడు.

 

 

Thirukurippu Thondanayanar – Story of a Devotee of Lord Shiva

Thondai Mandalam was a blessed land. Kanchi was its main city. According to the Agamas, Goddess Parvati performed penance for Lord Shiva in this place. Here, Lord Shiva is worshipped as Ekambaranathar.

Thirukurippu Thondanayanar was born in this land. He was born into a washerman’s family. He was deeply devoted to Lord Shiva and always meditated on Him.

He loved and served Shiva devotees. By looking at their faces, he understood their needs and helped them. Because of this nature, he came to be known as Thirukurippu Thondanayanar. He washed the clothes of Shiva devotees as a service to God.

Lord Shiva was pleased with his devotion and wanted the world to know about his greatness.

So, Shiva appeared before Thondanayanar in the form of a poor man. He wore rudraksha beads around his neck, sacred ash all over his body, and torn clothes.

As soon as Thondanayanar saw him, he felt overwhelmed. After regaining himself, he bowed and worshipped him. He said,
“Swami, my house has become pure by your visit. Why are you in such a poor condition? Please allow me to wash your clothes and serve you.”

That Shiva devotee agreed, but with one condition.

The condition was:
The clothes must be washed, dried, and returned before sunset. Otherwise, he said he would suffer from the cold and die.

Thondanayanar agreed. At that time, the weather was sunny, and he immediately washed the clothes. But when it was time to dry them, heavy rain started.

Soon, sunset approached. The clothes did not dry. Thondanayanar became very worried.

Instead of helping a devotee of Shiva, he felt he was causing him suffering. Feeling guilty, he beat his head against the washing stone, prayed to God, cried loudly, and begged for forgiveness.

Moved by his sorrow, Lord Shiva appeared before him. Shiva praised Thondanayanar for his devotion and said gently,
“You will soon reach Me. You will stay with Me forever.”

Thondanayanar was filled with joy. He fell at Lord Shiva’s feet and praised Him with complete surrender and devotion.

  

The moral of the story is:

True devotion is shown through selfless service, compassion, and complete surrender to God.

More simply:

  • Serving God’s devotees with love is the same as serving God Himself.

  • True bhakti (devotion) is not in words or rituals, but in pure intention and selfless action.

  • God tests sincere devotees, but He is always moved by honest effort and heartfelt faith, even when success seems impossible.

  • When a devotee puts God and others before himself, God protects and rewards that devotion.

కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


Best Telugu Story about Friendship Stories :  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html



Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu  

 


తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?

Shiva Bhakti kathalu telugu lo stories kathalu | తిరుకురిప్పు తొండనాయనారు (శివభక్తులు) చరిత్రలు - తొండైమండలం ఒక భాగ్యసీమ. దానికి కంచి ముఖ్యపట్టణము....

ఈ కథను పిల్లలు చదవవచ్చా?

అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.

ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?

కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.

ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?

ఇది Devotional Stories విభాగానికి చెందిన తెలుగు కథ.

ఈ కథకు సంబంధించిన అంశాలు: Shiva Bhakti kathalu telugu lo stories kathalu | తిరుకురిప్పు తొండనాయనారు (శివభక్తులు) చరిత్రలు, Devotional stories in Telugu, Bhakti Kathalu, Spiritual stories in Telugu

#TeluguStories #DevotionalStories #BhaktiKathalu #SpiritualStories #TeluguKathalu

ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు

Post a Comment

Previous Post Next Post