బతకడానికి దారి | అత్యాశ చివర కు ఏమైంది? | Chandamama Telugu Story
బతకడానికి దారి | అత్యాశ చివర కు ఏమైంది? | Chandamama Telugu Story | జగపతి తన పెళ్ళాం, పిల్లల బాధ్యత ఏమీ పట్టించుకునే వాడుకాడు. అతని పూర్వీకులు ఒకప్పుడు బాగా బతికారు. ఆ వాసన జగపతిని పూర్తిగా వదలలేదు. అతను తెలిసిన వాళ్లందరి దగ్గిరా అప్పులు చేసి, కొంతకాలం నెట్టు కొచ్చాడు. ఆ అప్పులు మితిమీరిపోయి, అవి తీరే దారి కనబడక, అప్పులవాళ్ళ కంట పడకుండా ఉండటానికి జగపతి చీకటితోటే ఇల్లు వదిలి, అడవిలో రోజంతా తిరిగి, చాలా చీకటిపడి ఇంటికి రాసాగాడు.
ఈ లోపల అప్పులవాళ్ళు వచ్చి, జగపతి భార్యను నానా మాటలూ అని వెళుతూండే వారు. చూసి, చూసి, ఆమె విసిగిపోయి, “నీకేం మగమహారాజువు ! అడ్డమైన తిరుగుళ్ళూ తిరిగి అర్ధరాత్రి ఇల్లు చేరుతావు. అప్పుల వాళ్ళకు సమాధానం చెప్పలేక నేను చచ్చిపోతున్నాను.
అందరూ రేపు తెల్లవారగానే వస్తారట. ఇంటిపట్టున ఉండు," అన్నది.
ఆ రాత్రి జగపతికి నిద్ర పట్టలేదు. రేపు అప్పుల వాళ్ళకు ఏం చెప్పుకోవాలి? వాళ్ళ బాకీలు ఎలా తీర్చాలి? వాళ్ళంతా కలిసి తనను చితకతన్నితే తన పరువు ఏమవుతుంది? అంతదాకా ఎందుకు ? అతనికి అప్పుల వాళ్ళ ముఖాలు చూచే ధైర్యం కూడా లేదు. తన మీద తనకే రోత పుట్టింది. అతను చీకట్లోనే ఇంటి నుంచి బయలుదేరి, ఊరి చివర మర్రి చెట్టు దగ్గిర పాడుబడిన బావి దగ్గిరికి వెళ్ళాడు. అందులో దూకి ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు.
అతను బావిలోకి దూక బోతూండగా ఆ బావిలో నుంచి ఒక పిశాచం బయటికి వచ్చి, జగపతిని ఎగాదిగా చూసి, “నీకు మతి ఉన్నదా, లేదా? భూతప్రేతాలు తిరిగేవేళ ఈ వైపు వచ్చావు దేనికి ?” అని అడిగింది.
జగపతి పిశానికి తన కధ అంతా చెప్పి. '' బతకటం ఎలాగూ సాధ్యం కాకనే చావటానికి వచ్చాను. పక్కకు తప్పుకో !'' అన్నాడు.
పిశాచం కంగారుగా అతన్ని ఆపి, అంతపని చెయ్యకు! నేను కూడా క్షణికావేశంలో నీ లాగే ఇందులో దూకి, ఇలా మారాను. తరవాత నా భార్యా, పిల్లలూ పడ్డ కష్టాలు ఇంతా అంతాకాదు. నా మాటవిని తిరిగివెళ్ళిపో !" అన్నది.
"ఇప్పుడు నేను చావకపోయినా, తెల్ల వారి అప్పులవాళ్ళు నా ప్రాణాలు తీసేస్తారు.'' అన్నాడు జగపతి.
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
పిశాచం చప్పున బావిలోకి దూకి, వెంటనే పెద్ద బంగారు నాణెంతో తిరిగి వచ్చి, "దీంతో నీ అప్పులు తీర్చుకో. మళ్ళీ ఈ చాయలకు రాకు!" అన్నది.
జగపతి ఆ నాణెం తీసుకుని, ఆనందంతో ఇంటికి వెళ్ళి, జరిగినదంతా తన భార్యకు చెప్పాడు.
ఆమె అంతా విని, " నీ తెలివి తెల్లవారా! ఇచ్చిందే చాలునని ఒక్క నాణెం తెచ్చావా? ఇంకాసిని అడిగి తీసుకు రాకూడదూ?" అన్నది.
జగపతి, "అవును సుమా!" అన్నాడు. ఆ నాణెంతో జగపతి అప్పులన్నీ తీరిపోగా, మూడు రోజులపాటు ఇంటిల్లిపాదికి రాజవైభోగంగా జరిగిపోయింది.
నాలుగో రోజు జగపతితో అతని భార్య, " ఈ రాత్రికి నువు మళ్ళీ చావటానికి బావి దగ్గిరికి వెళ్ళు." అన్నది.
జగపతి అలాగే బావి వద్దకు వెళ్ళి, అందులో పడబోయినట్టు నటించాడు. పిశాచం బయటికివచ్చి, “మళ్ళీ నీకు ఈ పాడుబుద్ధి పుట్టిందేం?" అని అడిగింది.
'ఏం చెయ్యమంటావు? అప్పులైతే తీర్చగలిగాను గాని, బతకడానికి మార్గం ఏదీ కనిపించటం లేదు." అన్నాడు జగపతి.
పిశాచం మారు మాట్లాడకుండా బావిలోకి వెళ్ళి, మరో బంగారు నాణెం తెచ్చి జగపతికి ఇచ్చింది. జగపతి దానితో ఇంటికి చేరుకుని, పది రోజులు జల్సాగా గడిపి, మళ్ళీ బావి దగ్గిరికి వచ్చి. "నా ఖర్మ! నాకు ఏమీ పని దొరకటం లేదు. పెళ్ళాన్నీ, పిల్లల్ని పోషించలేకుండా ఉన్నాను!" అని పిశాచానికి చెప్పి, మూడో సారి బంగారు నాణెం పట్టుకుపోయాడు.
ఈసారి జగపతి భార్య దాన్ని కరిగించి చేతులకు గాజులు చేయించుకున్నది.
మర్నాడే మళ్ళీ జగపతి బావి దగ్గిర హాజరయాడు. పిశాచం కనిపించి, అప్పుడే వచ్చావేమని అడిగింది.
"నాకు విసుగెత్తి పోతున్నది. చేద్దా మంటే ఏపనీ దొరకదు!" అన్నాడు జగపతి.
"నాకూ విసుగుగానే ఉంది. నువు ఈ కుళ్ళు మనుషుల మధ్య బతకలేవు. బావిలోకి దూకెయ్యి. హాయిగా ఇద్దరమూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దాం!" అన్నది పిశాచం.
జగపతి పై ప్రాణాలు పైకి ఎగిరాయి. అతను కంగారుగా వెనక్కుపోయి, "పని దొరుకుతుందేమో మరోసారి చూస్తాను." అంటూ ఇంటి కేసి పరిగెత్తాడు.
“నేను సహాయం చేస్తున్నంత కాలమూ నీకు పని దొరకదు. ఇప్పుడిక తప్పకుండా దొరుకుతుంది. బతకడానికి దారి కనిపించి తీరుతుంది." అనుకున్నది పిశాచం.
Moral (నీతి)
"సులభంగా వచ్చిన సంపద శాశ్వతం కాదు. కష్టపడి సంపాదించినదే నిజమైన సంపద. అత్యాశ మనిషిని నాశనం చేస్తుంది; బాధ్యతతో శ్రమిస్తేనే బతకడానికి నిజమైన దారి కనిపిస్తుంది."
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
-ఎం. కామేశ్వరరావు
చందమామ కథలు-Chandamama story books
బతకడానికి దారి | అత్యాశ చివర కు ఏమైంది? | Chandamama Telugu Story
#తెలుగుకథలు
#చందమామకథలు
#తెలుగుసాహిత్యం
#పిల్లలకథలు
#తెలుగుపుస్తకాలు
#తెలుగు
#భక్తి
#TeluguKathalu
#TeluguStories
#TeluguStory
#Chandamama
#ChandamamaStories
#AndhraPradesh
Read Also: Sampoorna Ramayanam Part 1 | సంపూర్ణ రామాయణం - భాగం 1 | బాలకాండ - శ్రీరామ జననం - విద్యాభ్యాసం
బతకడానికి దారి,
Batakadaniki Daari, తెలుగు కథలు,
Telugu Kathalu, Telugu Stories, Telugu Moral Stories, Chandamama Kathalu,
Chandamama Stories, Telugu Kids Stories, Telugu Fairy Tales, Telugu Literature,
Telugu Storytelling, Moral Stories in Telugu, Inspirational Telugu Stories,
Telugu Village Stories, Telugu Folk Tales, అప్పుల కథ, పిశాచం కథ,
బంగారు నాణెం కథ, జీవిత పాఠాలు, తెలుగు నీతి కథలు, పిల్లల కథలు, Telugu Bedtime Stories,
Telugu Audio Stories, Best Telugu Stories, Telugu Classic Stories, Telugu Book
Stories, Chandamama Telugu Story, Andhra Pradesh Stories, Telugu Educational
Stories, Family Moral Story, Motivational Telugu Story, Telugu Culture, Telugu
Books, Story in Telugu, తెలుగు సాహిత్యం,
తెలుగు పుస్తకాలు,
చందమామ కథలు, పిల్లల నీతి కథలు, తెలుగు ఆడియో కథలు, తెలుగు జానపద కథలు, తెలుగు ప్రేరణాత్మక కథలు, తెలుగు కుటుంబ కథలు, తెలుగు కథలు 2026.
Post a Comment