Amma Cheppina Abaddalu | Telugu Lo Stories kathalu | అమ్మ చెప్పిన అబద్ధాలు | Updated 2026 | Telugu Lo Stories 2026

Amma Cheppina Abaddalu | Telugu Lo Stories kathalu | అమ్మ చెప్పిన అబద్ధాలు | Updated 2026

Amma Cheppina Abaddalu | Telugu Lo Stories kathalu | అమ్మ చెప్పిన అబద్ధాలు


Amma Cheppina Abaddalu | Telugu Lo Stories kathalu | అమ్మ చెప్పిన అబద్ధాలు 

అమ్మలెప్పుడూ నిజం చెప్పరు. వాళ్లను మించిన అబద్ధాలకోర్లు ఈ ఆకాశం కింద లేరు. కావాలంటే చదవండిది. ఈ కథ నా చిన్నప్పుడు మొదలైంది. నేను చాలా పేదరికంలో పుట్టాను. పూటపూటకూ తిండి వెతుక్కునేంత పేదరికం. ఎప్పుడైనా ఇంట్లో అన్నం ఉంటే మా అమ్మ తను తినాల్సిన అన్నం కూడా నాకే పెట్టేది. నా గిన్నెలో అన్నం పెడుతూ- నువ్వు తిను నాన్నా నాకిప్పుడు ఆకలిగా లేదులే అనేది. అది అమ్మ చెప్పిన మొదటి అబద్ధం. అప్పుడప్పుడూ మా అమ్మ ఊరి దగ్గరిలోని వాగులో చేపలు పట్టేది. ఎదిగే బిడ్డకు కాస్తంత పోషకాహరం పెట్టాలని ఆమె ఆశ.

 

కొనలేదు కాబట్టి వాగు దగ్గర గంట్లు గంటలు పడిగాపులు పడేది. ఒకటో రెండో చిన్న చేపలు దొరికేవి. అలాంటప్పుడు నాకు వంటిపెట్టి నేను తిన్నాక మిగిలిన చేపముక్కకు ఏమైనా కండ ఉంటే దాన్ని అమ్మ తినేది. ఊహ తెలిశాక అది చూసి నాకు కష్టమనిపించేది. 

నేను నా గిన్నెలోంచి ఓ చేపముక్క అమ్మకు వేయబోతే చేయి అడ్డంగా పెట్టి వారిస్తూ- వద్దు నాన్నా నాకసలు చేపల వాసనే పడదు అనేది. అది అమ్మ చెప్పిన రెండో అబద్ధం. 

నన్ను బడిలో చేర్పించేందుకు అమ్మ పనిలో కుదిరింది. పాత పేపర్లు తెచ్చి వాటిని జిగురుతో కవర్లు చేసి ఊళ్లో దుకాణాలకు ఇచ్చేది. ఒకసారి నాకు మెలకువ వచ్చి చూస్తే అమ్మ అర్ధరాత్రి కూడా గుడ్డిదీపం వెలుగులో కవర్లు చేస్తూ కనిపించింది. 

నేను ఎందుకమ్మా ఇంత రాత్రయినా కష్టపడతావు అని అడిగితే.. నువ్వు నిద్రపో నేనేమీ అలసి పోలేదు అనేది. అది అమ్మ చెప్పిన మూడో అబద్ధం. నా ఫైనల్ ఎగ్జామ్స్‌కు అమ్మ తోడొచ్చింది. నేను లోపల పరీక్ష రాస్తుంటే తను బయట మండే ఎండలో గంటలు నిరీక్షించింది. బెల్ కొట్టగానే ఎదురొచ్చి నన్ను వాటేసుకుంది. 

ఒడిలో కూర్చోబెట్టుకుని తను తెచ్చిన పళ్లరసం గ్లాసులో పోసి తాగమంది. కానీ ఎండకు అమ్మ ఒడిలిపోయింది. చెంపలమీద కారుతున్న చెమటను చూసి నువ్వూ తాగమ్మా అని నేను గ్లాసు అందించాను. కానీ, అమ్మ తాగలేదు. వద్దు నాన్న, నాకసలు దాహమే లేదు.

Amma Cheppina Abaddalu | Telugu Lo Stories kathalu | అమ్మ చెప్పిన అబద్ధాలు 


 
Amma Cheppina Abaddalu | Telugu Lo Stories kathalu | అమ్మ చెప్పిన అబద్ధాలు
అన్నది. 

అది అమ్మ చెప్పిన నాలుగో అబద్ధం. అమ్మ నన్ను తన శక్తిమేరా చదివించింది. దాంతోనే నేను సిటీకెళ్లి పొట్టనింపుకొనేంత జీతమొచ్చే పనిలో కుదిరాను. అమ్మకు ఇకనైనా కాస్త విశ్రాంతి ఇవ్వాలని కొంతలోకొంత మిగిల్చి ఆమెకు పంపాను. 

కానీ అమ్మ ఆ డబ్బులు వద్దంది. నన్ను కడుపు కాల్చుకోవద్దంది. పుట్టిన రోజుకు బట్టలు కొనుక్కోమంది. కూరగాయలతో, కవర్లు చేయడంతో నాకొచ్చే పైసలు చాలు నాన్న, నాకే లోటూ లేదు అన్నది. అది అమ్మ చెప్పిన అయిదో అబద్ధం. చివరకు అమ్మకు జబ్బు చేసింది. 

ఊళ్లో హాస్పిటల్లో చేర్చి నాకు కబురు చేశారు. నేను సముద్రం దాటి ఆగమేఘాలమీద ఊరికి వచ్చాను.

 అమ్మ మంచాన పడింది. ఎముకల పోగులా మిగిలింది. నన్ను చూసి నవ్వాలనుకుంది. కానీ, ఆ నవ్వు లోతుకుపోయిన కళ్లను దాటి బయటకు రాలేదు. 

నాకు ఏడుపు తన్నుకొచ్చింది. ఆ మంచం మీద కూలబడ్డాను. అమ్మ నా తల మీద చేయి పెట్టి నిమురుతూ ఏడవకు నాన్నా, నాకేమీ కాలేదు. నేను బాగానే ఉన్నా కదా అన్నది. 

అది అమ్మ చెప్పిన ఆరో అబద్ధం. ఆఖరి అబద్ధం. 

ఏడో అబద్ధం చెప్పడానికి అమ్మ బతికి లేదు.




Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


 

The Lies My Mother Told Me

A Moral Story for Children

People say mothers always tell the truth.
But I think… mothers tell the sweetest lies in the world.

Let me tell you why.

This story began when I was very young. I was born into a poor family. We were so poor that sometimes we didn’t even know where our next meal would come from.

Whenever there was a little rice at home, my mother would put most of it into my plate. As she served me, she would smile and say,
“Eat well, my child. I’m not hungry right now.”

That was the first lie my mother told me.

Sometimes, my mother went to the nearby stream to catch fish. She wanted to give her growing child some nutritious food. Since we couldn’t afford to buy fish, she would sit by the stream for hours. On lucky days, she caught one or two small fish.

She cooked them carefully and served them to me. After I finished eating, if there was a tiny piece left with some flesh on it, she would eat that.



Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 


When I grew old enough to understand, it made my heart ache.

One day, I tried to give her a piece of fish from my plate. She gently stopped my hand and said,
“No, dear. I don’t even like the smell of fish.”

That was the second lie my mother told me.

To send me to school, my mother took up small jobs. She collected old newspapers, made paper covers using glue, and sold them to nearby shops.

One night, I woke up and saw her working even at midnight, under the dim light of an oil lamp.

“Why are you working so late, Amma?” I asked.

She smiled and said,
“Go back to sleep. I’m not tired at all.”

That was the third lie my mother told me.

During my final exams, my mother came with me to the exam center. While I was writing my exam inside, she waited outside for hours in the burning sun.

When the bell rang, she hugged me tightly. She made me sit on her lap and gave me a glass of fruit juice she had brought.

She looked exhausted. Sweat was running down her face.


Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


I offered her the glass and said, “You drink too, Amma.”

She shook her head and said,
“No, dear. I’m not thirsty.”

That was the fourth lie my mother told me.

My mother did everything she could to educate me. Because of her, I got a job in the city and earned enough to live.

I sent her some money, hoping she could finally rest.

But she refused it.

“Don’t trouble yourself,” she said.
“Buy clothes for your birthday. The little money I earn is enough. I don’t lack anything.”

That was the fifth lie my mother told me.

Then one day, my mother fell seriously ill. She was admitted to a hospital in our village, and I was informed.

I rushed home immediately.

She was lying on the bed, thin like a bundle of bones. She tried to smile when she saw me, but the smile never reached her tired eyes.

I broke down and cried.

She placed her hand on my head, stroked it gently, and said,
“Don’t cry, my child. Nothing has happened to me. I’m perfectly fine.”

That was the sixth lie my mother told me.

Her last lie.

She didn’t live long enough to tell the seventh one.


🌼 Moral of the Story

A mother’s love often speaks through silent sacrifices and gentle lies.
Those lies are not meant to deceive — they are meant to protect, nourish, and love.

👉 Respect your parents. Love them while you can.
Because their love is priceless… and once gone, it can never be replaced. 💛


Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,  pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu

 

#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

#DevotionalStories 


కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


Best Telugu Story about Friendship Stories :  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html



Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu  

 Amma Cheppina Abaddalu | Telugu Lo Stories kathalu | అమ్మ చెప్పిన అబద్ధాలు | Updated 2026


Post a Comment

0 Comments