Telugu Lo Kathalu Stories | నవ్వులే నవ్వులు - Navvule Navvulu

Telugu Lo Kathalu Stories | నవ్వులే నవ్వులు - Navvule Navvulu



Telugu Lo Kathalu Stories | నవ్వులే నవ్వులు - Navvule Navvulu


oka Clinic mundu chala pedha q undi …
.
oka athanu line thoskoni munduku ravadaniki triy chestunnadu malli venakki nettestunaru janalu
.
malli vastunadu malli nettesaru
. .
.
 .
.
. .
.
.
.
.malli vastunadu malli nettesaru
. .
.
.
.
.
. .
.
.
.
.
malli vastunadu malli nettesaru
. .
.
.
.
.
. .
.
.
.
.
malli vastunadu malli nettesaru
. .
.
.
.
.
. .
.
.
.
.
malli vastunadu malli nettesaru
. .
.
.
.
.
. .
.
.
.
.
e sari kopam vachesindi ayinaku kopam tho gattiga arustunadu emani ante
…. .
.
.
.
.
. .
.
.
.
.
. .
.
.
.
.
. .
.
.
.
.
vedavallara nannu clinic theravanivvandi ra


Telugu Lo Kathalu Stories | నవ్వులే నవ్వులు - Navvule Navvulu


Telugu Lo Kathalu Stories | నవ్వులే నవ్వులు - Navvule Navvulu

Telugu Stories | అంకుశం



                  సమయం ఉదయం తొమ్మిది గంటలు.. పాల్వంచ ఫెర్టిలైజర్స్‌ కంపెనీ సైరన్‌ ''కార్మికులారా! రండహో'' అన్నట్టు మ్రోగింది. జనరల్‌ షిప్ట్‌ వాళ్ళంతా రకరకాల వాహనాల మీద వస్తున్నారు. సరిగ్గా అప్పుడే ''గిరిజన కార్మికుడికి న్యాయం చెయ్యాలి'', ''వెంటనే ఆఫీస్‌ సైడ్‌కి ట్రాన్స్‌ఫర్‌ చెయ్యాలి'' అంటూ.. కంపెనీ మెయిన్‌ గేట్‌ దగ్గర్లోవున్న కొమరం భీమ్‌ విగ్రహం ముందు రోడ్డుకు అడ్డంగా నిల్చున్న కొంతమంది చేస్తున్న నినాదాలతో ఒక్కసారిగా ఆ పరిసరాలు హోరెత్తిపోసాగాయి. దాంతో ఉలిక్కిపడిన సెక్యూరిటీ సిబ్బంది పరుగున వచ్చి వాళ్ళను చుట్టుముట్టారు. 

డ్యూటీకి వెళుతున్న వాళ్ళంతా ఆగిపోయి ''పిట్టన్న విషయంలోనే కావచ్చు!'' అనుకోసాగారు. ''అంగవికలుడైన గిరిజన కార్మికుడికి వెంటనే న్యాయం చేయాలి'' అనుకుంటూ వున్నవాళ్ళకు తోడుగా మరి కొంత మంది గిరిజనులు చేరవచ్చారు. అంతమంది గిరిజనులక్కడ గుమిగూడడం చూసిన కార్మికులు దగ్గరికొచ్చి ''ఏం జరిగింది'' అంటూ పిట్టన్ననే అడిగారు. అసలు జరిగిందేమిటో నలుగురికి తెలియడమే మంచిదనుకున్న పిట్టన్న తన చుట్టూ మూగి వున్న తోటి కార్మికుల వంక చూస్తూ చెప్పడం మొదలుపెట్టాడు.

***

పిట్టన్న వాళ్ళకున్న ఇరవై ఎకరాల భూమి ఫెర్టిలైజర్స్‌ కంపెనీలో కలిసిపోయింది. భూ ములు కోల్పోయిన వాళ్ళందరికీ కంపెనీలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సర్కార్‌ ఆ తరువాత మాట తప్పింది. పదవ తరగతి వరకు చదువుకున్న పిట్టన్న చేతులు ముడుచుకుని కూర్చోకుండా భూములు కోల్పోయిన వాళ్ళందరినీ కూడేసి రకరకాలుగా ఆందోళనలు చేశాడు. ఆ ఆందోళనల ఫలితంగా దిగివచ్చిన ఫెర్టిలైజర్స్‌ కంపెనీ యాజమాన్యం భూములు కోల్పోయిన వాళ్ళందరికీ ఉద్యోగాలిచ్చింది.


పోరాడి ఉద్యోగం సంపాదించుకున్న పిట్టన్న, ఉద్యోగం చేసుకుంటూనే ప్రైవేట్‌గా డిగ్రీ చదివాడు. తోటి గిరిజన కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యంతో రాజీలేకుండా పోరాడుతున్నాడు. మిగతా యూనియన్ల నాయకులకు పిట్టన్న కారణంగానే గిరిజన కార్మికులెవ్వరూ తమ దగ్గరికి రావడం లేదన్న ద్వేషాన్ని రగిలించింది. ఎక్కడ వీలైతే అక్కడ పిట్టన్నను తొక్కిపడెయ్యడానికి వాళ్ళంతా కాచుక్కూర్చున్నారు.

ట ట కాల ప్రవాహంలో మరో ఏడు వందల ఇరవై రోజులు కొట్టుకుపోయాయి. ఈ మధ్యకాలంలో పిట్టన్న పేరు గిరిజన కార్మికులతో పాటు గిరిజనేతర కార్మికుల్లో కూడా చొచ్చుకుపోయింది. మిగతా యూనియన్ల నాయకులకు అది మరింత కోపాన్ని తెప్పించింది. ఇక లాభం లేదనుకున్న ఆ ఇతర యూనియన్ల నాయకులంతా ఓరోజు సమావేశమై పిట్టన్నను మట్టుపెట్టడానికి పథకం వేశారు. 

ఓ రోజు ఉదయం ఐదు గంటలకు పిట్టన్న బైక్‌ మీద ఫస్ట్‌ షిఫ్ట్‌ డ్యూటీకి వెళుతున్నాడు. బైక్‌ భగత్‌ సింగ్‌ సెంటర్‌ నుండి కుడి పక్కకు తిరిగి కంపెనీ వైపునకు పోతుంది. అదే సమయంలో కంపెనీ వైపు నుండి వేగంగా వస్తున్న టిప్పర్‌ ఒకటి, బైక్‌ను గుద్దేసి ఆగకుండా వెళ్ళిపోయింది.

టిప్పర్‌ తగలడంతోనే బైక్‌ మీద నుండి బంతి మాదిరిగా గాల్లోకి లేచిన పిట్టన్న అంత దూరాన నడిరోడ్డు మీద స్పృహ కోల్పోయాడు. సరిగ్గా అదే సమయంలో కంపెనీ వైపు నుండి వచ్చిన ఇంకో టిప్పర్‌ పిట్టన్న ఎడమ కాలును నుజ్జునుజ్జుగా తొక్కు కుంటూ వెళ్ళిపోయింది. ఈ మొత్తం వ్యవహారం ఐదే ఐదు నిమిషాల్లో ముగిసిపోయింది. మరో పది నిమిషాలు, పావు గంట తరువాత డ్యూటీకి వస్తున్న కార్మికులు, రక్తం మడుగులో పడివున్న పిట్టన్నను గుర్తించి వెంటనే కంపెనీ అంబులెన్స్‌కి ఫోన్‌ చేశారు. ఆగమేఘాల మీద వచ్చిన అంబులెన్స్‌ పిట్టన్నను ఎక్కించుకొని కొత్తగూడేనికి తీసుకెళ్ళింది. 


అంబులెన్స్‌ లో నుండి అతణ్ణి దించక ముందే ''ఈ కేస్‌ మేం తీసుకోకూడదు మీరు వెంటనే గవర్నమెంట్‌ హాస్పటల్‌కి తీసుకుపోండి!'' అంటూ గేట్‌లో నుండే వెనక్కి పంపించారు ప్రైవేట్‌ హాస్పిటల్‌ వాళ్ళు.గవర్నమెంట్‌ హాస్పిటల్లో ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తై అడ్మిట్‌ చేసుకునే సరికి పక్కా రెండు గంటలు పట్టింది. ఆ తరువాత మరో గంటకు వచ్చిన సంబంధిత డాక్టర్‌ ''ఈ కేస్‌ ఇక్కడ లాభంలేదు వెంటనే ఖమ్మం గానీ, హైదరాబాద్‌ గానీ తీసుకుపోండి! ఆలస్యం చేస్తే బాడీ మొత్తం పాయిజన్‌ అవుతుంది. దాంతో అసలు ప్రాణానికే ముప్పురావచ్చు.'' అంటూ చేతులు దులిపేసుకున్నాడు. ఇంతలో పిట్టన్న భార్య, అన్నదమ్ములు రెండు ఆటోలు వేసుకుని కొత్తగూడెం హాస్పిటల్‌ దగ్గరికి చేరుకున్నారు. అటు నుండి అటే ఖమ్మం బయలుదేరుదామనుకుంటే ''కంపెనీ అంబులెన్స్‌ ఖమ్మం దాకా రావడానికి పర్మిషన్‌ లేదు. మీరేదైనా ప్రైవేట్‌ ఆంబులెన్స్‌ మాట్లాడుకొని వెళ్ళడమే.'' అంటూ ఆంబులెన్స్‌ సిబ్బంది చేతులెత్తేశారు.



Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

దాంతో ఇంక చేసేదేంలేక అప్పటికప్పుడు ప్రైవేట్‌ ఆంబులెన్స్‌ మాట్లాడిన తోటికార్మికులు, తాము ఆగిపోయి కుటుంబ సభ్యులను ఎక్కించి ఖమ్మం మమత హాస్పిటల్‌కి పంపించారు. పిట్టన్నను చూసిన వెంటనే ''మేం ఫస్ట్‌ ఎయిడ్‌ చేసి పంపిస్తాం గాని, మీరు వెంటనే హైదరాబాద్‌ నిమ్స్‌కి తీసుకుపోతే మంచిది.'' అంటూనే ఫస్ట్‌ ఎయిడ్‌ మొదలుపెట్టారు మమత హాస్పిటల్‌ డాక్టర్లు. గంట తరువాత అదే ప్రైవేట్‌ ఆంబులెన్స్‌లో పిట్టన్నను ఎక్కించుకున్న కుటుంబ సభ్యులు నాలుగు గంటల్లో హైదరాబాద్‌ నిమ్స్‌లో చేర్పించారు. పిట్టన్నను చూడ్డంతోనే ''వెంటనే ఆపరేషన్‌ చేసి కాలు తీసెయ్యాలి. లేకుంటే ప్రాణానికే ప్రమాదం.'' అంటూ కొత్తగూడెం డాక్టర్లు చెప్పిన విషయాన్నే నిమ్స్‌ డాక్టర్లు కూడా ఖాయం చేశారు. ఆ మాటలను విన్న కుటుంబ సభ్యులు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక కొట్టుమిట్టాడసాగారు. వాళ్ళ పరిస్థితిని గమనించిన పిట్టన్న ''ఇంక ఆలస్యం అనవసరం. ఆపరేషన్‌ కానివ్వండి సార్‌!'' అంటూ ధైర్యంగా తన అంగీకారాన్ని తెలియజేశాడు. పేషెంట్‌ అంగీకారాన్ని తీసుకున్న డాక్టర్లు చకచకా ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. ఐదు గంటల ఆపరేషన్‌ తరువాత పిట్టన్న కాలు మోకాలు పైకి తీసేశారు.

ట ట ట

ఇరవై రోజుల తరువాత హాస్పిటల్‌ నుండి డిశ్చార్జై ఇల్లు చేరాడు పిట్టన్న. లాస్‌ ఆఫ్‌ పే మీద రెండు నెలలు సిక్‌ లీవ్‌ తీసుకుని ఇంట్లోవున్న పిట్టన్న, మరోసారి హైదరాబాద్‌ హాస్పిటల్‌కి వెళ్ళి చెక్‌ చేయించుకున్నాడు. చెక్‌ చేసిన డాక్టర్లు ఫిట్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. డ్యూటీలో జాయిన్‌ అవుదామని ఫిట్‌ సర్టిఫికెట్‌ తీసుకుని వాకర్‌తోనే కంపెనీకి వెళ్ళిన పిట్టన్న, కంపెనీ డాక్టర్‌తో ఫిట్‌ సర్టిఫికెట్‌ మీద కౌంటర్‌ సైన్‌ చేయించుకుని నేరుగా జి.యం. పర్సనల్‌ ఆఫీస్‌కి వెళ్ళాడు.

''సార్‌! పర్సనల్‌ ప్రాబ్లమ్స్‌ అన్నీ పన్నెండున్నర తరువాతే చూస్తారు. అప్పటి దాకా మీరక్కడ కూర్చోండి!'' అంటూ ఆ పక్కనేవున్న ఓ బల్ల చూపించాడు ఆఫీస్‌ మెసెంజర్‌. ''ఈ రూల్‌ ఎప్పట్నుంచి!?'' అనుకున్న పిట్టన్న వెళ్ళి ఆ బల్లమీద కూర్చున్నాడు. ఆ బల్లకు దగ్గర్లోనే తన టేబుల్‌ మీదున్న కంప్యూటర్లో గేమ్‌ ఆడుకుంటున్న జి.యమ్‌. సెక్రటరీ వచ్చిందెవరోనని కనీసం తల తిప్పి కూడా చూడలేదు. అర గంట గడచినా జి.యమ్‌. పర్సనల్‌ రాలేదు. సెక్రటరీ కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద నుండి తల తిప్పలేదు. చూసీ చూసీ విసుగొచ్చిన పిట్టన్న తన ముందున్న వాకర్ని కావాలనే గట్టిగా ఎత్తిపడేశాడు. ఆ శబ్దానికి ఉలిక్కిపడ్డ సెక్రటరీ కంప్యూటర్‌ మీద నుండి అప్పుడు తల తిప్పి పిట్టన్న వంక చూశాడు. చూడ్డంతోనే పిట్టన్న కుంటి కాలు కనిపించడంతో గిల్టీగా ఫీలైన సెక్రటరీ ''సారీ! నేనేదో ధ్యాసలో వుండి పట్టించుకోలేదు. సార్‌ రాగానే అందరికన్నా నిన్నే ముందు పంపిస్తా గాని అసలింతకూ నీ కాలుకేమైంది?'' అంటూ సానుభూతిగా అడిగాడు.వివరించాడు పిట్టన్న. ''అయ్యో అలాగా! ఇప్పటిదాకా నాకీ విషయమే తెలియదు.'' అన్నాడు సెక్రటరీ. ఇంతలో జి.యమ్‌.తో పనుందంటూ ఏడదెనిమిది మంది కార్మికులొచ్చారు. మరో అర గంట తరువాత జి.యమ్‌. వచ్చాడు. చెప్పినట్టుగానే అందరికన్నా ముందు పిట్టన్ననే లోపలికి పంపించాడు సెక్రటరీ. పిట్టన్నను చూడగానే ''కాలెలా వుంది?'' అంటూ క్యాజ్‌వల్‌గా అడిగాడు జి.యమ్‌. ''ఫరవా లేదు. డాక్టర్లు లైట్‌ జాబ్‌కి రికమెండ్‌ చేస్తూ లెటర్‌ ఇచ్చారు.'' అంటూ ఫిట్‌ సర్టిఫికెట్‌ తీసి జి.యమ్‌. చేతికందించాడు పిట్టన్న.

పావుగంట పాటు సర్టిఫికెట్‌ను పరిశీలించిన జి.యమ్‌. పర్సనల్‌ ''పాపం పిట్టయ్యా! నీకు మాత్రం చాలా అన్యాయం జరిగింది. కనీసం ఆ వెహికల్‌ ఏదో దొరికినా బావుండేది. ఫిజికల్‌గా ఇంత లాసైనందుకు ఎంతో కొంత ఫైనాన్సియల్‌ బెనిఫిట్‌ అన్నా వచ్చేది.'' అంటూ మోయలేనంత సానుభూతిని వర్షించాడు. ''ఒక్కోసారి అట్లా జరుగుతుందంతే'' అంటూ బదులిచ్చాడు పిట్టన్న జి.యమ్‌.కళ్ళలోకి చూస్తూ. పిట్టన్న రాసుకున్న కవరింగ్‌ లెటర్‌ మీద ఏదో కామెంట్‌ రాసిన జి.యమ్‌. పర్సనల్‌ ''ఈ లెటర్‌ తీసుకెళ్ళి జి.యమ్‌.వర్క్స్‌ని కలవండి.'' తిరిగి ఇస్తూ అన్నాడు.
లెటర్‌ తీసుకున్న పిట్టన్న ''సార్‌! ఈ కాలుతో బాయిలర్‌ పైకెక్కి డ్యూటీ చెయ్యడం కుదరదు. అంతో ఇంతో చదువుకున్నవాణ్ణి కాబట్టి ఎక్కడన్న ఆఫీస్‌లో టేబుల్‌ వర్క్‌ ఇవ్వండి చేస్తాను.'' అంటూ రిక్వెస్ట్‌ చేశాడు. పిట్టన్న రిక్వెస్ట్‌ను విన్న వెంటనే ''అసలిప్పటికే మినిస్టీరియల్‌ స్టాఫ్‌ ఎక్కువయ్యారని హైదరాబాద్‌ ఆఫీస్‌ వాళ్ళు గొడవ చేస్తున్నారు. అయినా నీది జన్యున్‌ కేస్‌ కాబట్టి నాకూ కన్సిడర్‌ చెయ్యాలనే వుంది. కాకపోతే నీకొక్కడికిస్తే మిగతా యూనియన్‌ నాయకులు 'మా క్యాండెట్స్‌ కూడా చాలామంది చాలా రకాల జబ్బులతో బాధపడుతున్నారు. మావాళ్ళ కేస్‌లు కూడా కన్సిడర్‌ చెయ్యండి.' అంటూ మా పీకల మీద కత్తిపెట్టి కూర్చుంటారు. అందుకే నిజంగా అవసరమున్న మీలాంటి వాళ్ళకు సాయం చెయ్యాలని వున్నా చెయ్యలేకపోతున్నాం. సారీ!'' అంటూ ఎంతో లౌక్యంగా మాట్లాడాడు జి.యమ్‌. పర్సనల్‌.



''మీరెన్నన్నా చెప్పండి సార్‌! నేను మాత్రం ఈ కాలుతో పైకెక్కి ఆ బాయిలర్ల మీద పని చెయ్యలేను.'' అంటూ గట్టిగానే చెప్పాడు పిట్టన్న. ''సరే చూద్దాం! ముందు మీరీ లెటర్‌ తీసుకుని జి.యమ్‌. వర్క్స్‌ దగ్గరికెళ్ళండి. మీకక్కడ ఆయనే ఏదో ఒక సూటబుల్‌ ప్లేస్‌ చూపిస్తాడు. కావాలంటే నేను కూడా ఆయనకు ఫోన్‌ చేసి పర్సనల్‌గా చెబుతాను.'' అంటూనే తరువాత వాళ్ళను పంపించమన్నట్టు బయటవున్న సెక్రటరీకి కాలింగ్‌ బెల్‌ కొట్టాడు జి.యమ్‌.పర్సనల్‌. ఇక తప్పదన్నట్టు మెల్లగా లేచి బయటకొచ్చాడు పిట్టన్న.

ట ట ట ''సారీ పిట్టన్నా! వ్యక్తిగతంగా నీకు సాయం చెయ్యాలని వున్నా చెయ్యలేని పరిస్థితి మాది. అయినా ఆల్‌ సెక్షనల్‌ హెడ్స్‌ను నీ ముందే పిలిపించి మాట్లాడుతానుండు వాళ్ళేం చెబుతారో విందువు గాని..'' అంటూ ఇంటర్‌కాంలో ఫోన్లు చేసి వెంటనే తన చాంబర్‌కి రమ్మన్నాడు జి.యమ్‌.వర్క్స్‌. ''మీరు డెసిషన్‌ తీసుకొని పంపిస్తే వద్దనేదెవరు సార్‌!'' జి.యమ్‌. వర్క్స్‌ కావాలనే ఏదో డ్రామా ఆడుతున్నాడన్న విషయం అర్థమైపోతుంటే వస్తున్న కోపాన్ని దిగమింగుకుంటూ అన్నాడు పిట్టన్న.

''లేదు.. లేదు.. ఏదైనా వాళ్ళిష్టంతోనే చెయ్యాలి తప్ప నా అభిప్రాయం వాళ్ళ మీద రుద్దకూడదు.'' అంటూ అతనింకేదో మాట్లాడుతుండగానే హెచ్‌.ఒ.డి.లందరూ వచ్చేశారు. వాళ్ళంతా పిట్టన్నను చూస్తూనే ''ఈ తద్దినాన్ని మన మీద రుద్దడానికి పిలవలేదు కదా?'' అనుకుని ముఖాలు ముడుచుకుంటూ జి.యమ్‌. ఎదురుగా కూర్చున్నారు. ఒకరిద్దరు తప్ప మిగతా హెచ్‌.ఒ.డిలు అందరూ వచ్చారని నిర్థారించుకున్న జి.యమ్‌. వర్క్స్‌ ''చూడండీ! మన పిట్టన్నకు చాలా ఘోరం జరిగిపోయింది. పోయిన కాలును మనమెలాగూ తీసుకురాలేం. ఆ కాలుతో తానిక బాయిలర్‌ పైకెక్కి పని చేయలేనంటున్నాడు. తను చదువుకున్నవాడే కాబట్టి ఏ టేబుల్‌ వర్కో ఇవ్వడం మన ధర్మం. మీలో ఎవరో ఒకరు అతణ్ణి తీసుకుని పేపర్‌ వర్క్‌ చేయించుకోండీ!'' నిజానికి మీరెవ్వరూ అతణ్ణి తీసుకోనవసరం లేదు అన్న ఓ సంకేతాన్ని ఆపద్ధర్మంగా అందజేస్తూ తెలివిగా విషయాన్ని వెల్లడించాడు.



సూది దూరేంత సందిస్తే చాలు ఏనుగును గూడా లాక్కుపోయే తెలివితేటలున్న హెచ్‌.ఒ.డి.లంతా జి.యమ్‌. సంకేతాన్ని సునాయాసంగా అందిపుచ్చుకుని ''నిజంగా ఈ పరిస్థితిలో మీరన్నట్టు పిట్టన్నకు టేబుల్‌ వర్క్‌ ఇవ్వడం న్యాయమే. మాక్కూడా ఇవ్వాలనే వుంది. కాకపోతే ఇప్పటికే మా సెక్షన్స్‌లో క్లరికల్‌ స్టాఫ్‌ ఇబ్బడిముబ్బడిగా వున్నారు. కాబట్టి సారీ సార్‌!'' అంటూ ప్రతి ఒక్కరూ పిట్టన్నను నాకొద్దంటే నాకొద్దని సున్నితంగా తిరస్కరించారు.

''అందరూ అట్లాగే అంటే ఎట్లా మరి?'' నీళ్ళు నమిలినట్టుగా మాట్లాడాడు జి.యమ్‌. వర్క్స్‌. ''ఏమో సార్‌! మీరేమన్నా చేసుకోండది. మాకు మాత్రం అవసరం లేదు.'' అంటూ ఎవరి మానాన వాళ్ళు లేచిపోయారు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తరువాత పిట్టన్న వంక తిరిగిచూస్తూ ''ఎలా మాట్లాడారో చూశావు గదా? ఎవ్వరూ వద్దంటుంటే మరి నేను మాత్రం ఏం చెయ్యగలను చెప్పు?'' అంటూ తనూ మెల్లగా తప్పుకోవాలన్నట్టు మాట్లాడాడు జి.యమ్‌. వర్క్స్‌.

''అదంతా నాకు తెలియదు సార్‌! నేనైతే బాయిలర్‌ మీదికి పోయి పని చేయటమనేది జరిగేది కాదు. మీరేంజేసుకుంటారో ఏమో నేను మాత్రం రోజూ వచ్చి మీ ఆఫీస్‌ ముందు కూర్చొని పోతాను.'' వున్న విషయం తెగేసినట్టు చెప్పి మెల్లగా లేచి బయటికి నడిచాడు పిట్టన్న.
ట ట ట మరునాడు ఉదయం పది గంటలకు తను చెప్పినట్టే వచ్చి జి.యమ్‌.వర్క్స్‌ ఆఫీస్‌ ముందు కూర్చున్నాడు పిట్టన్న. పదిన్నరకు ఆఫీస్‌కి వచ్చిన జి.యమ్‌. వర్క్స్‌ పిట్టన్నను చూస్తూనే ''లోపలికి రా!'' అంటూ తన చాంబర్లోకి వెళ్ళాడు. అతని వెనుకనే లోపలికెళ్ళిన పిట్టన్న చేతికి ఓ కాగితం ఇచ్చిన జి.యమ్‌. ''నువ్వెళ్ళి కెమికల్‌ డివిజన్‌లో వుండే రామిరెడ్డి డి.ఈ.కి రిపోర్ట్‌ చెయ్యి.'' అంటూ నిన్న హెచ్‌వోడీల మీటింగ్‌కి అటెండ్‌ కాని కెమికల్‌ డివిజన్‌ ఇన్‌చార్జి డి.ఈ. దగ్గరికి పంపించాడు. మెల్లగా కెమికల్‌ డివిజన్‌కి వెళ్ళి జి.యమ్‌. ఇచ్చిన లెటర్‌ డి.ఈ. రామిరెడ్డి చేతికిచ్చాడు పిట్టన్న. ఆ లెటర్‌ చూస్తూనే ''అరె.. నేను నిన్న ఫోన్‌లోనే వద్దని చెప్పాను కదా. మళ్ళీ నిన్నెందుకు పంపించాడు?'' అంటూ విసుక్కున్న డి.ఈ. ''మీరు మళ్ళీ వెళ్ళి ఆ జి.యమ్‌.నే కలవండీ!'' పిట్టన్నతో నిర్మొహమాటంగా అన్నాడు. అతని మాట తీరుకు మనస్సు చివుక్కుమంటుంటే వస్తున్న కోపాన్ని దిగమింగుకున్న పిట్టన్న అతను చెప్పినట్టే తిరిగి జి.యమ్‌.వర్క్స్‌ ఆఫీస్‌కి వెళ్ళాడు.

అప్పటికే ఫోన్‌లో జి.యమ్‌. వర్క్స్‌కి కెమికల్‌ డివిజన్‌ డి.ఈ.కి గొడవేదో పెద్దగానే జరిగినట్టుంది. అతను పిట్టన్నను చూస్తూనే ''చూడండి! ఈ వ్యవహారాలన్నీ చూడాల్సిన జి.యమ్‌. పర్సనల్‌, మ్యాటర్ని మెల్లగా నా మీదకు తోసి డ్రామా చూస్తున్నాడు. మీరేమో వచ్చి నా పీకల మీద కూర్చుంటున్నారు. ఎవ్వడూ వద్దంటుంటే నేనేం చెయ్యాలి?'' అన్నాడు కోపంగా.


బదులు మాట్లాడకుండా అరగంట పాటు అక్కడే కూర్చు న్నాడు పిట్టన్న. ఆఖరికి పిట్ట న్నను మళ్ళీ తన చాంబర్‌లోకి పిలిపించుకున్న జి.యమ్‌. వర్క్స్‌ ''ఒక పని చేస్తారా?'' అన్నాడు. ''చెప్పండేంటో?'' అన్నట్టు చూశాడు పిట్టన్న.
''కంపెనీలో వుండే అన్ని యూనియన్ల నాయకుల దగ్గరకి వెళ్ళి మిమ్మల్ని ఆఫీస్‌ సైడ్‌కి పంపిస్తే వాళ్ళకేమీ అభ్యంతరం లేదన్నట్టు ఒక లెటర్‌ రాయించుకు రండి. అప్పుడిక మిమ్మల్ని ఎటు మార్చినా అడిగేవాడుండడు.'' అంటూ సాధ్యంకాని సలహాను ఇచ్చాడు జి.యమ్‌.వర్క్స్‌.

***

''ఇదీ జరిగిన సంగతి. నాకు న్యాయం జరగాలంటే రోడ్డెక్కక తప్పని పరిస్థితి కల్పించారు.'' అంటూ తన చుట్టూ చేరినవాళ్ళకు అప్పటిదాకా జరిగిన ప్రతి విషయాన్నీ పూసగుచ్చినట్టు వివరించాడు పిట్టన్న. ఆ తరువాత మరో గంటకు
''పాల్వంచ ఫెర్టిలైజర్స్‌ కంపెనీలో అంగవైకల్యంతో బాధపడుతున్న గిరిజన కార్మికుడికి తగిన పోస్టింగ్‌ ఇవ్వకుండా ఏడిపిస్తున్న అధికారగణం. కొమరం భీమ్‌ విగ్రహం సాక్షిగా కంపెనీ గేట్‌ ముందు గిరిజనుల ఆందోళన.'' అన్న బ్రేకింగ్‌ న్యూస్‌ అన్ని చానల్స్‌లోనూ వచ్చింది.
అంతే!

ఇతర యూనియన్ల నాయకులంతా ఎక్కడివాళ్ళక్కడే గప్‌చుప్‌ అయిపోయారు.
అధికార గణం ఆగమేఘాల మీద కదిలింది.

Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,  pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu

 

#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

#DevotionalStories 


కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


Best Telugu Story about Friendship Stories :  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


 

Post a Comment

0 Comments