సద్భావన | Sadbhavana Telugu Lo Stories Kathalu | Goodwill (Sadbhavana) – Moral Story for Kids | Telugu Lo Stories 2026

సద్భావన | Sadbhavana Telugu Lo Stories Kathalu | Goodwill (Sadbhavana) – Moral Story for Kids

సద్భావన | Sadbhavana Telugu Lo Stories Kathalu 


Dear All, here is the Telugu Story about సద్భావన | Sadbhavana Telugu Lo Stories Kathalu 


సిద్ధార్థుడిగా పుట్టటానికి అనేక జన్మల ముందు, బోధిసత్త్వుడు ఒకసారి సెస్సెన్ దోజి అనే సన్యాసిగా జీవించాడు. ఆ రోజుల్లో మోక్షాన్ని కోరేవాళ్ళంతా 'బ్రాహ్మణాలు, అరణ్యకాలు' లాంటి శాస్త్రాలను వల్లె వేస్తుండేవాళ్ళు. సెస్సెన్‌దోజి కూడా వాటినన్నిటినీ చదివాడు, వాటి ప్రకారం పవిత్రంగా జీవిస్తూ, తన పుణ్యసంపదను పెంచుకుంటూ‌ వచ్చాడు. ఇప్పుడు అతని పారమితలు ఏ స్థాయిని చేరుకున్నాయంటే, ఇక అతనికి ఇంకా లోతైన సత్యాలు తెలియవలసి ఉన్నది.
 
 

అయితే అంత గొప్ప సత్యాలు అందరికీ అనుభూతిలోకి రావు. వాటిని తెలుసుకోవాలంటే కొంత అర్హత ఉండాలి. దోజికి ఆ అర్హత ఉన్నదో లేదో తెలుసుకోవాలనుకున్నాడు, దేవతలరాజు ఇంద్రుడు. ఒక రోజున అడవిలో కట్టెపుల్లలు ఏరుకునేందుకు పోయిన దోజి ముందు ప్రత్యక్షమయ్యాడు, భయంకరమైన బ్రహ్మ రాక్షసుడి వేషంలో.

"హహ్హహ్హహ్హ" నవ్వాడు బ్రహ్మ రాక్షసుడు- "నీ పేరు దోజి కదూ! నీకు పరిపూర్ణ జ్ఞానం సంపాదించుకోవాలని ఉన్నదటనే, నిజమేనా?" అన్నాడు దోజితో.

"అవునండి!" అన్నాడు దోజి.

"నువ్వు ఏవేవో శాస్త్రాలన్నీ‌చదివావట గదా, పరమ సత్యాన్ని నేరుగా చూపించే శ్లోకం ఒకటుంది. అదేంటో చెప్పు, చూద్దాం" అన్నాడు రాక్షసుడు.

"నాకు అట్లాంటివేవీ తెలియదండి" ఒప్పుకున్నాడు దోజి.

"అయ్యో! నాకు తెలిసినపాటి సత్యం కూడా‌ తెలీదా, నీకు?!" అన్నాడు బ్రహ్మరాక్షసుడు, ఒకింత వెటకరిస్తున్నట్లు.

"చూడగా తమరు గొప్ప జ్ఞానులనిపిస్తున్నది. మీరు ఆ శ్లోకం ఏదో చెప్పారంటే నేను దాని సారాన్ని అందుకొని, నా‌జన్మను ధన్యం చేసుకుంటాను" అన్నాడు దోజి శ్రద్ధను కనబరుస్తూ.

"సరే, అయితే చెబుతాను కొంచెం. చూడు, ఇప్పుడు నేను చెప్పేది పరమ సత్యమే తప్ప, వేరేమీ కాదు- అర్థం అవుతున్నదా?" అన్నాడు రాక్షసుడు.

దోజి ఆ సరికే తన మనసునంతా రాక్షసుడి మాటలమీద కేంద్రీకరించి ఉన్నాడు.

"ఈ విశ్వంలో ప్రతీదీ మార్పు చెందుతూనే ఉన్నది. స్థిరంగా ఉన్నదంటూ ఏదీ లేదు. జనన మరణాల రహస్యం ఇదే" అని శ్లోకంలో మొదటిభాగం చెప్పాడు రాక్షసుడు.

"ఓహో!" అనుకున్నాడు దోజి, రెండవ భాగం కోసం ఎదురు చూస్తూ.



సద్భావన | Sadbhavana Telugu Lo Stories Kathalu

సద్భావన | Sadbhavana Telugu Lo Stories Kathalu 



బ్రహ్మరాక్షసుడు రెండో భాగాన్ని చెప్పనే లేదు!

కొంచెం సేపటికి తేరుకున్న దోజి మిగిలిన ముక్కను చెప్పమన్నాడు.

"ఉహుఁ. ఊరికే నేనెందుకు చెబుతాను?" అన్నాడు బ్రహ్మరాక్షసుడు, మొండికేస్తున్నట్లు.

దోజి హతాశుడయ్యాడు- "అయ్యో! ఇంతకాలంగా నేను వెతుకున్నది దానికోసమే. దానికోసం నేను ఏమైనా ఇచ్చేస్తాను. మీకు ఏం కావాలో అడగండి" అని ప్రాధేయపడ్డాడు.

"సరే, నేను నీకు ఆ శ్లోకంలో రెండో భాగాన్ని చెప్పినందుకుగాను నీ శరీరాన్ని నాకు ఆహారంగా ఇచ్చెయ్యాలి నువ్వు" అన్నాడు రాక్షసుడు, ఆశగా.

"దానిదేముంది, ఇచ్చేస్తాను" అని మాట ఇచ్చేశాడు దోజి.

"అయితే విను- జననమరణాల చక్రం నుండి బయటపడిన వాళ్లకు నిర్వాణం లభిస్తుంది" అని శ్లోకాన్ని పూర్తిచేశాడు రాక్షసుడు.

దోజి ఆ శ్లోకాన్ని, దాని భావాన్ని చాలాసార్లు మననం చేసుకున్నాడు. దాన్ని అర్థం చేసుకున్నకొద్దీ అతనికి మరింత లోతైన సత్యం ఏదో తెలుస్తున్నట్లు అనిపించింది.అయితే తను ఇప్పుడు రాక్షసుడికి ఆహారం అవ్వవలసి ఉన్నది. "ఇంత గొప్ప రహస్యాన్ని తెలుసుకున్నాక, వెంటనే వృధాగా మరణిస్తే ఏం ప్రయోజనం? ఆ సత్యాన్ని నాలోకి ఇంకించుకోవాలి గద! అయినా ఏమీ పరవాలేదు- ఈ శ్లోకాన్ని పదిమందికీ‌అందేలా చెట్లమీద, బండలమీద రాస్తాను. నాకు ఇప్పుడు అంత అదృష్టం లేకపోయినా, మరెవ్వరికో దీనివల్ల మేలు కలిగితే చాలు" అనుకున్నాడు దోజి.

అనుకున్నదే తడవు, దాన్ని అమలు పరచాడు. దగ్గర్లో ఉన్న బండలమీదా, చెట్లమీదా ఈ శ్లోకాన్ని చెక్కాక, అతను ఒక ఎత్తైన చెట్టు ఎక్కి, నేరుగా బ్రహ్మరాక్షసుడి నోట్లోకి దూకాడు.

సద్భావన | Sadbhavana Telugu Lo Stories Kathalu 



మరుక్షణం అసలు రూపాన్ని ధరించిన ఇంద్రుడు దోజిని క్రిందపడకుండా పట్టుకొని నిలబెట్టాడు. "నిర్వాణం సాధించాలంటే చాలా పుణ్యం చేసుకోవాలి. 'నాకు కాకపోతే పోయె- ఇతరులకు ఏ కొంచెం మేలు కలిగినా చాలు' అన్న సద్భావనతో నువ్వు చేసిన ఈ పని వల్ల నీ అర్హత నిరూపితం అయ్యింది. నీ యీ పుణ్యఫలంగా ఏదో ఒక జన్మలో నువు తప్పక పరిపూర్ణ జ్ఞానివి అవుతావు!" అని ఆశీర్వదించి అంతర్ధానం అయిపోయాడు .

నిజంగానే అనేక జన్మల అనంతరం సిద్ధార్థుడు బుద్ధత్వాన్ని సాధించాడు!



సద్భావన | Sadbhavana Telugu Lo Stories Kathalu

Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 

Goodwill (Sadbhavana) – Moral Story for Kids:

 

Long before he was born as Siddhartha, the Bodhisattva once lived as a sage named Sessendoji. In those days, everyone who sought liberation studied sacred texts called Brahmanas and Aranyakas. Sessendoji too studied all these scriptures carefully, lived a disciplined and virtuous life, and gradually accumulated spiritual merit. By this point, he had developed remarkable virtues, yet there were still deeper truths he had yet to discover.

However, such profound truths don’t reveal themselves to everyone. One must be qualified to perceive them. Indra, the king of the gods, wanted to see if Sessendoji was ready.

One day, as Sessendoji went into the forest to gather grass, a terrifying figure appeared before him—a Brahmarakshasa (a fearsome demon).

“Ha! Ha! Ha!” laughed the demon. “You are Sessendoji, right? I hear you seek perfect knowledge. Is it true?”

“Yes, it is!” replied Sessendoji.

“You’ve studied many scriptures, haven’t you? Tell me, can you recite the one verse that directly reveals the ultimate truth?” challenged the demon.

“I don’t know such a verse,” admitted Sessendoji humbly.

“Oh! You don’t even know the truth that I know?” the demon teased, with a hint of mockery.

Sessendoji, showing respect and sincerity, said, “Even if you reveal that verse, I will absorb its meaning and make my life worthwhile.”

“Very well, I will tell you a little. Listen carefully—what I tell you is the ultimate truth, nothing else. Understand?” said the demon.

Sessendoji focused all his mind on the demon’s words.

“In this universe, everything is constantly changing. Nothing remains permanent. This is the secret of birth and death,” the demon began.

“Ah!” thought Sessendoji, eagerly awaiting the next part.

But the demon did not continue. Sessendoji waited patiently and then requested, “Please tell me the second part.”

“Why should I tell you?” replied the demon, pretending to be stubborn.

Sessendoji, feeling desperate, said, “I have sought this truth for so long. I will give anything in return. Ask for whatever you wish!”

“Very well,” said the demon. “If I reveal the second part of the verse, you must offer your body as my food.”

Sessendoji did not hesitate. “I will give it,” he promised.

“Then listen,” said the demon, “those who escape the cycle of birth and death attain Nirvana.” And with that, the demon completed the verse.

Sessendoji reflected deeply on the verse and its meaning. With every contemplation, he felt he was touching even deeper truths. But now he had to fulfill his promise and become the demon’s food. “What use is dying immediately after learning such a great secret? I must spread this truth first. Even if I am not fortunate enough to survive, if others benefit from this knowledge, it is enough,” thought Sessendoji.

True to his word, he inscribed the verse on nearby trees and stones. Then, climbing a tall tree, he prepared to leap into the demon’s mouth.

At that moment, Indra revealed his true form and held Sessendoji safely. “To attain Nirvana, one must accumulate great merit. Your selfless act—thinking not of yourself, but of benefiting others—proves your worthiness. Because of this merit, in one of your future lives, you will surely attain perfect enlightenment!”

And so, after many lifetimes, Siddhartha finally became the Buddha.

 

Moral of the Story:

True goodwill and selflessness are the greatest virtues. When we act for the benefit of others without selfish desire, we earn the merit and wisdom that lead to ultimate enlightenment.

 

Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,  pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu

 

#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

#DevotionalStories 


కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


Best Telugu Story about Friendship Stories :  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html



Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu  

 



monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi 
Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories

Post a Comment

0 Comments