చిన్ని చిన్ని కరుణ ! Chinni Chinni Karuna Telugu Lo Stories Kathalu | Little Acts of Kindness (Chinni Chinni Karuna) – Moral Story for Kids | Telugu Lo Stories 2026

చిన్ని చిన్ని కరుణ ! Chinni Chinni Karuna Telugu Lo Stories Kathalu | Little Acts of Kindness (Chinni Chinni Karuna) – Moral Story for Kids

చిన్ని చిన్ని కరుణ ! Chinni Chinni Karuna Telugu Lo Stories Kathalu 



Dear All, చిన్ని చిన్ని కరుణ ! Chinni Chinni Karuna Telugu Lo Stories Kathalu 



చిన్ని చిన్ని కరుణ ! Chinni Chinni Karuna Telugu Lo Stories Kathalu


 
వేకువజామువేళ - పక్షులు కిలకిలమంటూ ప్రపంచాన్ని నిద్ర లేపుతున్నాయి. పూజ చదువుకుంటున్నది. అప్పుడే రెండు పిచ్చుకలు పూజవాళ్ల ఇంటి వసారాలోకి వచ్చాయి. పూజ దృష్టి ఆ పిచ్చుకల వైపుకు మళ్ళింది. అదే సమయానికి ఇంట్లోంచి వసారాలోకి వచ్చాడు, పూజ వాళ్ళ నాన్న. పూజ పిచ్చుకలను చూడటం గమనించి, తన చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్నాడు-

“ఊళ్లో అలాంటి పిచ్చుకలు చాలా ఉండేవి. ఊళ్ళోవాళ్ళు ఈ ఊర పిచ్చుకల కోసమే జొన్నకంకులూ, సొద్ద(సజ్జ)కంకులూ తమ మొగసాలల్లో వేలాడదీసేవాళ్ళు. ఏటి గట్టున చెట్లమీద ఇంకా ఎన్నోరకాల పక్షులు ఉండేవి- వాటిని చూడటానికి ఊరి పిల్లలం అందరం ఏటిగట్టుకు వెళ్ళేవాళ్ళం. ” చెప్పాడు ఆయన.

“ఊళ్ళో పిల్లలు ఇప్పుడు కూడా ఏటి గట్టుకు వెళ్తుంటారు కదూ, నాన్నా?”అడిగింది పూజ.

"ఇప్పటి పిల్లలా ?! ఎవరూ వెళ్ళటం లేదు!” అన్నాడు నాన్న.“అదేమి?! ఎందుకు వెళ్ళట్లేదు ఎవ్వరూ!?” ఆశ్చర్యంగా అడిగింది పూజ.

"చాలా కారణాలు ఉన్నై పాపా. ఒకటి, ఈ మధ్య పిల్లలకు తమదంటూ ఒక్క గంట సమయాన్నికూడా వదలటం లేదు పెద్దవాళ్ళు. ఎప్పుడూ ఏవేవో క్లాసులనీ, స్టడీ అవర్లనీ వాళ్లని బిజీగా ఉంచేస్తున్నారు. ఇంక వాళ్ళు ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించేదెన్నడు?

ఇక రెండోది, ఇప్పుడు అలాంటి పక్షులు చాలా వరకూ అంతరించి పోయాయి. మిగిలినవి అక్కడక్కడా తమకు నచ్చిన చోట్లు వెతుక్కొని దాక్కొని కూర్చుంటున్నాయి. అవి కూడా చాలా తక్కువే అని చెప్పాలి" 

Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 


"అయ్యో, అలా ఎందుకు జరిగింది నాన్నా?" అడిగింది కరుణ.

"నానాటికీ లోపిస్తున్న పర్యావరణ సమతౌల్యం దీనికి ప్రధాన కారణం. మనుషులు తమ స్వార్థం కోసం ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు.

ప్రకృతిలోని ఎన్నో అరుదైన జంతువులు, పక్షులు, వృక్షాలు అంతరించిపోతున్నాయి. అలా అంతరించి-పోతున్న పక్షుల్లో- ఇవిగో, ఈ పిచ్చుకలు మొదటి వరుసలో ఉన్నాయి. సెల్‌ఫోన్ టవర్ల నుండి వచ్చే రేడియేషన్ కారణంగా ఊర పిచ్చుకలు అధిక సంఖ్యలో చనిపో-తున్నాయట. 

 ఇంక ఏమనాలి? అంతేకాదు, పూర్వం పూరిళ్ళ చూర్లలోను, ఇంటి పై కప్పు దంతెల మాటున, గోడలకు ఏర్పాటు చేసిన గూళ్ళలోను ఇవి నివాసం ఏర్పరచుకుని జీవిస్తూ ఉండేవి. ఇప్పుడు స్లాబు ఇళ్ళు వచ్చాయి కదా, పిచ్చుకలకు ఇవి అనువుగా ఉండవు; ఏతావాతా వాటి మనుగడకే ముప్పు ఏర్పడింది!” 

పూజ వాళ్ళనాన్న చెప్పాడు.ఇది విని పూజ చిన్ని మనసుకు చాలా కష్టం కలిగింది. ఆరోజునే చెక్కలతో ఒక గూడును తయారు చేసి, వాళ్ల ఇంటి వసారా కప్పుకు కట్టింది పూజ . పిచ్చుకలు రోజూ ఆ గూటి చుట్టూ ఎగిరేవి; కానీ ఆ గూట్లోకి మాత్రం వెళ్ళలేదు! అదేమైనా వల అనుకున్నాయేమో, అవి. అయితే అటు తర్వాత మెల్ల మెల్లగా అవి గూట్లోకి వెళ్ళటం, రాత్రంతా అక్కడే ఉండిపోయి ఉదయాన్నే రివ్వున ఎగిరిపోవటం మొదలు పెట్టాయి. అది చూసి పూజ ఎంతగానో సంతోషపడింది.


'ఈ రేడియేషన్లు-అవీ లేకుండా ఉంటే ఎంత బాగుంటుందో! మన ఇళ్ళు కొంచెం పిచ్చుకలకు కూడా అనువుగా ఉంటే ఎంత బాగుంటుందో కదా!" అనుకున్నది పూజ.


Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 

 

 చిన్ని చిన్ని కరుణ ! Chinni Chinni Karuna Telugu Lo Stories Kathalu | Little Acts of Kindness (Chinni Chinni Karuna) – Moral Story for Kids


Little Acts of Kindness (Chinni Chinni Karuna) – Moral Story for Kids

Early in the morning, the world was waking up as birds chirped and fluttered about. Puja was reading her prayers when suddenly, two sparrows flew into the balcony of her house. Puja’s attention shifted to the birds just as her father came out onto the balcony.

 Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Seeing the sparrows, he was reminded of his own childhood.

“There used to be so many sparrows in our village,” he said. “People in the village would shake the millet and sorghum in their granaries for the sparrows. Trees were full of birds, and all the village children would climb the trees to watch them. It was a joy to see so many different kinds of birds!”

 

Puja asked, “Even now, children go up trees like that, right, Dad?”

“Like in those days? No one goes anymore!” her father replied.

“Why? Why doesn’t anyone go?” Puja asked, surprised.

“There are many reasons, my dear. First, these days, children don’t even get one hour of free time. They are kept busy with classes and study schedules. When do they get to enjoy nature quietly?”

“Second, many of those birds have disappeared. The few that remain hide themselves in corners, wherever they feel safe. There aren’t many left,” he explained.

 

“Why did this happen, Dad?” Puja asked sadly.

“The main reason is the imbalance in our environment today. Humans, driven by selfishness, are destroying nature. Many rare animals, birds, and trees are disappearing. Among the birds that are vanishing quickly, these little sparrows are among the first. Radiation from cell phone towers is causing many village sparrows to die,” her father said.

“Not just that,” he continued. “Earlier, sparrows made their nests in tree hollows, under roof eaves, and in holes built into walls. Now, with concrete slab houses, these homes are no longer suitable for them. Their survival is under threat!”

 

Hearing this, Puja felt very sad in her little heart. The very next day, she made a small birdhouse out of sticks and tied it to the roof of their balcony. The sparrows flew around the birdhouse daily but didn’t go inside at first. Perhaps they thought it was a trap.

But slowly, they began to enter the birdhouse, spending the night there and flying out again in the morning. Seeing this, Puja felt immense joy.

“If only there were no harmful radiation! If our houses were even a little more welcoming to sparrows, it would be wonderful,” she thought.

 

Moral of the Story:

Even small acts of kindness, like building a birdhouse, can make a big difference. Caring for nature and the creatures around us helps protect the environment and brings joy to both humans and animals.

 

 

Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 


friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,  pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu

 

#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

#DevotionalStories 


కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories

చిన్ని చిన్ని కరుణ ! Chinni Chinni Karuna Telugu Lo Stories Kathalu | Little Acts of Kindness (Chinni Chinni Karuna) – Moral Story for Kids

Best Telugu Story about Friendship Stories :  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html



Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu  

 

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories

Post a Comment

0 Comments