చిన్నతనంలో మామిడి తోట లో | Telugu lo kathalu stories



చిన్నతనంలో మామిడి తోట లో | Telugu lo kathalu stories

చిన్నతనంలో మామిడి తోటలో రాలిన పళ్ళని తీసుకెలితే మా అమ్మ వాటిని బయటకి విసిరేసి " నీ సోంతం అనుకున్న వాటితోనే ఆనందంగా ఉండాలి" అని చెప్పింది.అప్పటి నుండి అమ్మ మాటకే కట్టుబడి ఉన్నా".

ఇవి తమిళనాడులోని ఒక మద్యతరగతి కుటంబం లో జన్మించి ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ గా ఎదిగిన "సహాయం " మాటలు.

 మాటల్లోనే ఉన్నాడా చేతలు కూడా అలానే ఉన్నాయా అంటే ఈ మద్య అతను ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఒకటి చూద్దాం.


 
" నేను నా ఉద్యోగ బాధ్యతలను సరిగ్గా నిర్వహించడంలేదని మీరు భావిస్తే నన్ను సస్పెండ్ చేయండి.జాతి, కులము అని నేను ఎవరికైనా సహాయం చేసి ఉంటే నన్ను ఖైదు చేయండి.నా 19 సంవత్సరాల ఉద్యోగ కాలంలో ఒక్క నయాపైసా లంచం తీసుకున్నానని నిరూపణ అయితే నాకు ఉరి శిక్ష విధించండి .........

ఇది ఆయన లేఖ సారాంశం.

ఇంకా చెప్పాలంటే ఆయన 19 సంవత్సరాల కెరీర్ లో 18 సార్లు బదిలీ అయ్యారు.ఇవి చాలవ మనలాంటి వారికి ఆయన ఆదర్షంగా నిలవడానికి. .. హాట్సాఫ్ సర్ .


చిన్నతనంలో మామిడి తోట లో | Telugu lo kathalu stories


చిన్నతనంలో మామిడి తోట లో | Telugu lo kathalu stories


 

మేడి పండు  | Telugu lo kathalu stories

         ''అబ్బాయి మహేష్‌ నుంచి వారమైంది ఫోన్‌ వచ్చి'' అనుకుంది సుజాత. తను మాత్రమే ఇలా ఉందా, లోకంలో తల్లులందరూ ఇంతేనా. సుజాత ఆలోచనలను భగంచేస్తూ వీధి తలుపు చప్పుడైంది. ఆమెలేచి తలుపు తీసి, ఎదురుగా నిల్చున్న భర్తతో ''ఆలస్యమైందేమిటి'' అంది. ''రామారావు స్కూలు మూసేశాక మన ప్రెసిడెంటుగారి దగ్గరకు వెళ్ళి వచ్చాను'' అన్నాడు.

సుజాత ప్రశ్నార్థకంగా చూసింది. రామారావు ''మహేష్‌ చేత చిన్న ఇండిస్టీ పెట్టిద్దామ నుకుంటున్నాం కదా. వివరాలు మాట్లాడదామని వెళ్ళాను'' అన్నాడు.

''ఇండిస్టీ పెట్టించాలని మీరనుకుంటున్నారు. పెట్టాలని వాడను కుంటున్నాడా?''

''అదేంమాట? ఆ ఉద్దేశంతోనే కదా ఇంజనీరింగ్‌లో మెకానికల్‌ బ్రాంచ్‌ తీసుకోమని చెప్పాను. అందరూ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ వైపు పరుగులు తీసేవారే. కాలేజి ఎలాంటిదైనా ఫర్వాలేదు. కంప్యూటర్సే చదవాలి. మనవాడలా కాకుండా మంచి కాలేజిలో చదువుతున్నాడు. మన ఊళ్ళోనే ఫ్యాక్టరీ పెడితే పదిమందికి పని కల్పించిన వాడవుతాడు''.


''అప్పుడప్పుడు అందరిలా కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదవడం లేదనుకుంటూ ఉంటాడు''

''చిన్నపిల్లాడు. వాడికేం తెలుస్తుంది. నాలుగేళ్ళయ్యాక వాడికే మంచీ చెడూ తెలిసి వస్తాయి. అన్నట్లు ఈ మధ్య ఫోనేమీ చెయ్యలేదెందుకో'' అంటూండగానే మహేష్‌ నుంచి ఫోను వచ్చింది. కాల్‌ రిసీవ్‌ చేసుకున్నాడు. ''హలో మహేష్‌ ఏమిటి సంగతులు?''


''క్యాంపస్‌ ఇంటర్వ్యూలు అవుతున్నాయి. అందుకే చెయ్యలేకపోయాను. నాకు ఉద్యోగం వచ్చింది''.

''ఉద్యోగమా? ఎక్కడ వచ్చింది? వివరంగా చెప్పు''


 


''చాలామంచి ఉద్యోగం. నెలకు యాభైవేల జీతం. ఈ ఆదివారం ఇంటికొచ్చినప్పుడు అన్నీ చెప్తాను''. మహేష్‌ ఫోన్‌ పెట్టేశాడు. రామారావు మాట్లాడకుండా కూచున్నాడు. సుజాత భర్తను పలకరించే ధైర్యం చెయ్యలేకపోయింది.

***

మహేష్‌ ఆదివారం ప్రొద్దుటే వచ్చాడు. స్నానం చేసి టిఫిన్‌ తిన్నాక తండ్రి, కొడుకులిద్దరూ మాట్లాడుకోవడం మొదలెట్టారు. సుజాత అక్కడే కూచుని కూరలు తరుగుతోంది.

''చెప్పు మహేష్‌ ఉద్యోగం వచ్చిందనీ, యాభైవేల జీతమనీ చెప్పావు. అంతకన్నా ఏం చెప్పలేదు. ఏమిటి జాబ్‌? ''

'' సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌''

''అదేమిటి, నువ్వు మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నావు కదా''

''నిజమే. కానీ కొన్ని స్పెషల్‌ కోర్సులు కూడా చేశాను. అందుకే సెలక్షన్‌ వచ్చింది.''

''నువ్వు చేరడానికి ఒప్పేసుకోలేదు కదా''

మహేష్‌ ఆశ్చర్యంగా చూసి ''అదేమిటి అలా అంటున్నారు? ఇంతకన్నా మంచి ఉద్యోగం నాకు దొరుకుతుందా?'' అన్నాడు.

''ఉద్యోగం మంచిదా కాదా అని నేను ఆలోచించడం లేదు. నీ చదువయ్యాక నువ్వు మన ఊళ్ళోనే ఇండిస్టీ పెట్టాలనుకున్నాను. అందుకే మెకానికల్‌ బ్రాంచి చదవమన్నాను.''

''ఈ ఊళ్ళోనా? ఈ చిన్న చోట ఏ ఫ్యాక్టరీ పెడతాం? ఏం తయారుచేస్తాం? ఎక్కడకి పట్టికెళ్ళి అమ్ముతాం?''

''ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగావు. ఇక్కడ కష్టసుఖాలూ, లాభనష్టాలూ తెలియవా? మన

రైతులందరూ ఎక్కువగా టొమాటో పండిస్తున్నారు. ఒక్కొక్కసారి లాభం వస్తుంది. ఒక్కొక్కసారి టొమాటోలు రోడ్డు మీదనే పారపొయ్యాల్సి వస్తుంది. మనకున్న రెండెకరాలలోనూ అదే పండిస్తున్నాం. నాకు ఉద్యోగముంది కాబట్టి నెలకింత అని జీతమొస్తోంది కాబట్టి తిండికీ, బట్టకీ, నీ చదువుకీ ఇబ్బంది లేకుండా ఉంది''.

''ఇదంతా మళ్ళీ ఎందుకు చెప్తున్నారో తెలియడంలేదు. మీరు రిటైర్‌ అయినా ఏ ఇబ్బందీ ఉండదు. నెలకి యాభైవేలు నాకు వస్తాయి. మిమ్మల్ని ఏ ఇబ్బందీ లేకుండా నేను చూసుకుంటాను''

''నా ఒక్కడి విషయం కాదు. మన ఊరి గురించి ఆలోచించు. నువ్విక్కడ టొమాటోలతో పల్ప్‌ కానీ సాస్‌ కానీ చేసే ఫ్యాక్టరీ పెడితే బాగుంటుందని నాకుంది. రైతుకీ నష్ట భయముండదు. పదిమందికి ఉపాధి. నీకు సొంత ఇండిస్టీని పెంచి పెద్దదిగా చేసుకునే తృప్తి.''

''ఇక్కడా, ఈ ఊళ్ళోనా?''

''అవునిక్కడే, ఇది నీ సొంతూరు'' రామారావు గొంతుక పెద్దదయింది.

సుజాత కల్పించుకుని ''ఇప్పటికిప్పుడు వాడు మాత్రం ఏం చెప్తాడు? పరీక్షలయ్యేసరికి ఆలోచిం చుకోవచ్చు. ఇంకా మూడు నెలలుందిగా'' అంది.

ఆరోజు సాయంత్రం రామారావు బయటకు వెళ్ళిన సమయంలో మహేష్‌ తల్లితో అది కాదమ్మా. నాన్న ఈ ఊళ్ళో ఫ్యాక్టరీ అంటారేమిటి? మనకే కరెంటు సరిగ్గా రావడం లేదు. ఒకవేళ సప్లై ఉన్నా మిషన్ల మధ్య పని. హాయిగా ఎ.సి. రూంలో కంప్యూటర్‌ ముందు కూచుంటే నెల తిరిగే సరికి యాభైవేల రూపాయలు చేతిలో పడతాయి. అందరం సుఖంగా బతకవచ్చు'' అన్నాడు.

సుజాత అటూ ఇటూ కాకుండా ''సరేలే, ఇంకా టైముందిగా ఆలోచించేందుకు'' అంది.

మహేష్‌ ఆలోచించుకోలేదు. తన ఫ్రెండ్స్‌ అందరిలాగానే తనూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరేందుకే నిర్ణయించుకున్నాడు.

***

 


ఏడాది గడిచింది. మహేష్‌ బలవంతపెట్టగా, పెట్టగా సుజాతా, రామారావులు అతను పనిచేసే సిటీకి వచ్చారు. వాళ్ళను రిసీవ్‌ చేసుకునేందుకు కారులో స్టేషనుకి వచ్చాడు మహేష్‌.

''కారెప్పుడు కొన్నావు?'' సంబరంగా అడిగింది సుజాత.

''రెండు నెలలయిందమ్మా. మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేద్దామని ఇంతవరకూ చెప్పలేదు.''

లిఫ్టులో పైకి వెళ్ళాక ''ఇదే మనముండే ఫ్లాట్‌. నేనూ, నా కొలీగ్‌ కల్సి ఉంటున్నాం. డబుల్‌ బెడ్రూం, హాల్‌, కిచెన్‌. ఇద్దరమూ వంట చేసుకోం. కిచెన్‌ కాఫీ పెట్టుకుందుకే''. అంటూ తలుపు తీశాడు.

మార్బుల్‌ ఫ్లోర్‌తో, ట్రాన్స్పరెంట్‌ గాజు కిటికీలతో, సిఎఫ్‌ఎల్‌ లాంప్స్‌తో ఇల్లు అందంగా ఉంది.

''అద్దె ఎంత?'' అడిగాడు రామారావు

''ఇరవై వేలు''

''అమ్మ బాబోరు'' అంది సుజాత.

''ఇద్దరం చెరిసగం పెట్టుకుంటాంగా. యాభైవేలలో అయిదోవంతేకదా. మన ఊళ్ళో మాత్రం ఆ మాత్రం ఇవ్వకుండా ఇల్లొస్తుందా?''

సిటీలోని మాల్స్‌, థిóయేటర్స్‌, మ్యూజియమ్స్‌, పార్క్స్‌ అన్నీ చూపించి రైలెక్కిస్తూ మహేష్‌ ''చూశారా నాన్నా ఇక్కడ లైఫ్‌ ఎలా ఉందో. గ్లోబలైజేషన్‌ తర్వాత మన దేశంలోనూ అన్ని సౌకర్యాలూ అమర్చుకోవచ్చు. అన్ని వస్తువులూ కొనుక్కోవచ్చు. ప్రపంచమే కుగ్రామంగా మారిపోయాక ఒక్క గ్రామం గురించి ఆలోచిస్తూండడం విశాల దృక్పథం కాదు'' అన్నాడు.

రామారావు ఏమీ మాట్లాడలేదు.

***

ఆరు నెలల తర్వాత మహేష్‌ తల్లితండ్రులను చూడ్డానికి స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చాడు.

''ఓసారి సురేష్‌ మాస్టార్ని చూసిరా, నీ చదువు విషయంలో ఆయనెంతో శ్రద్ధ తీసుకున్నారు. మ్యాథమాటిక్స్‌కి ట్యూషన్‌ పెట్టించడం నా జీతంలో అయ్యే పనికాదు''. అన్నాడు రామారావు.

మహేష్‌ తన లెక్కల మాష్టారింటికి వెళ్ళి, పళ్ళ బుట్టను ఆయన దగ్గరపెట్టి నమస్కరించాడు.

''రావోరు మహేష్‌రా, ఎలా ఉంది ఉద్యోగం, ఏమిటి విశేషాలు?''

మహేష్‌ తన ఉద్యోగ వివరాలు చెప్పి ''అంతా మీ చలవే సార్‌'' అన్నాడు.

''నేను చేసిందేముంది? నువ్వు తెలివైన కుర్రాడివి. బాగా చదువుకున్నావు. సిటీలో ఉన్నన్ని సదుపాయాలూ, అవకాశాలూ పల్లెటూళ్ళలో లేవు. అందుకే స్టూడెంట్స్‌కి నా వీలైన సాయం చేస్తానంతే''

''సిటీలో కార్పొరేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండుంటే లక్షలు గడించే వారు సార్‌''

''డబ్బే సర్వస్వంకాదు. నలుగురికి ఉపయోగ పడాలన్నదే నా ఆశ. అమ్మారు రేఖా! కొంచెం కాఫీ తేమ్మా''

''అబ్బే ఎందుకు సార్‌'' అని మహేష్‌ అంటూం డగానే రేఖ లోపల నుంచి కాఫీ తెచ్చి ఇచ్చింది.

''మా అమ్మాయి రేఖ గుర్తుందిగా. రేఖా ఇతను మహేష్‌. రామారావు మాస్టారి అబ్బాయి. మర్చి పోయావా'' లేదన్నట్లు తల ఊపి రేఖ లోపలకు వెళ్ళిపోయింది.

***

రాత్రి భోజనాల దగ్గర రామారావు కొడుకు పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు. సుజాత కూడా ''అవున్రా అబ్బారు. చదువు పూర్తయింది. మంచి ఉద్యోగ మొచ్చింది. నువ్వో ఇంటివాడివయితే మాకు నిశ్చింత''. అంది.

''ఇప్పుడే పెళ్ళికి తొందరేముందమ్మా''.

''అది కాదు మహేష్‌. ఈ రోజు వెళ్ళినప్పుడు సురేష్‌ మాస్టారింట్లో వాళ్ళమ్మాయి రేఖను చూశావుగా. ఆ పిల్లయితే బాగుంటుందను కుంటున్నాం'' అన్నాడు రామారావు.

''కృతజ్ఞతా భావమా?'' ఎన్నడూ లేనిది మహేష్‌ కొంత కటువుగా అడిగినట్లనిపించింది అతని తల్లితండ్రులకి.

''అదేం మాట మహేష్‌ అలా అంటున్నావు? ఆ కుటుంబం చాలా మంచిది. రేఖ వినయం, వందనం ఉన్న పిల్ల. బాగా చదువుకున్న అమ్మాయి. అంతేకానీ నీకు చదువు చెప్పడానికీ, ఈనాడు సంబంధం కలుపుకోడానికీ లింకు లేదు.''

''ఇప్పుడే పెళ్ళి గురించి నేనేం అనుకోడం లేదు. కొంచెం ఆలోచించుకోనివ్వండి'' అన్న మహేష్‌ కొంతసేపయ్యాక తల్లి దగ్గర గునిగాడు.'' సిటీలో ఒక్క జీతం మీద బతకడం కష్టమమ్మా. రేఖ ఉద్యోగం చెయ్యడం లేదు. ఒకవేళ చేద్దామనుకున్నా పెద్ద జీతం రాదు. కనీసం ముప్ఫై, నలభై వేలయినా అమ్మాయి సంపాదించకపోతే బతకడం కష్టమైపోతుంది. ఏం చెయ్యాలిప్పుడు?''

సుజాత ఏమీ మాట్లాడలేదు, మహేష్‌ రెట్టించి ఆమెను ఏమీ అడగలేదు.

***

ఆరు నెలల తర్వాత మహేష్‌ వివాహం అతను కోరుకున్నట్లుగా కొలీగ్‌ ఉషతో జరిగింది. హనీమూన్‌ వెళ్ళి వచ్చిన మూడో రోజున అతని బాస్‌ పిలిచి ''నెక్ట్స్‌ వీక్‌ నుంచి రాత్రి మూడు గంటల నుంచి పని చెయ్యవలసి ఉంటుంది''. అన్నాడు.

మహేష్‌ కొంత ఆశ్యర్యంగా, కొంత నిరుత్సాహంగా ''ఎందుకు'' అన్నాడు.

''ప్రస్తుతం ఆస్ట్రేలియన్‌ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్‌ చెయ్యాలి. అంటే వాళ్ళ టైమింగ్స్‌కి సరిపోయేలా మనం పనిచెయ్యాలి. మీ టీంలో అందరికీ అవే టైమింగ్స్‌''

రెండు, మూడేళ్ళుగా పనిచేస్తున్నా మహేష్‌లో అమాయకత్వం పూర్తిగా పోలేదేమో. అతను ''వాళ్ళే టైమింగ్స్‌ అడ్జస్ట్‌ చేసుకోవచ్చుగా. మనకి ఎనిమిది నుంచి అయిదు గంటలంటే వాళ్ళకి ఒంటిగంట నుంచి రాత్రి పది దాకా సుమారుగా కదా. అంత కష్టంకాదు''. అన్నాడు.

బాస్‌ గట్టిగా నవ్వాడు. ''డబ్బిచ్చేది వాళ్ళు, పని చేసేది మనం''.

***

మహేష్‌ తన కొత్త టైమింగ్స్‌ చెప్తే ఉష ఏ మాత్రం కంగారుపడలేదు. ''ఇటీజ్‌ ఆల్‌రైట్‌. నువ్వు ఉదయం మూడు గంటల నుంచి పన్నెండు గంటలదాకా ఆఫీసులో ఉంటావు. నేను ఈవెనింగ్‌ అయిదు దాకా ఉంటాను. సాయంత్రమంతా ఇద్దరం ఎంజారు చెయ్యొచ్చు. నో ప్రాబ్లం''.

ఉష రియాక్షన్‌ మహేష్‌కి వింతగా అన్పించింది కానీ ఏమీ మాట్లాడలేదు.

''అసలు ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. మన ఇంటిని ఫర్నిష్‌ చేసుకోవాలి. డ్రాయింగ్‌ రూం, డైనింగ్‌ రూం, రెండు బెడ్రూమ్స్‌, స్టడీకి ఏవేం కొనాలి ఇప్పుడే ఇంటర్నెట్‌లో చూద్దాం. టివి కూడా పెద్దది కొనాలి. ఫ్రిజ్‌ ఫైవ్‌ హండ్రడ్‌ లీటర్స్‌ది బెటర్‌''.

ఇద్దరూ కూచుని నెట్‌లో వరసగా ఏవేం కొనాలో చూసి సెలెక్ట్‌ చేసే సరికి అర్ధరాత్రయింది. డబ్బున్నప్పుడు కొనుక్కుందాం అనుకుంటే మల్టీనేషనల్‌ కంపెనీలు కానీ, క్రెడిట్‌ కార్డులిచ్చే బ్యాంకులు కానీ ఊరుకోవు. అవి ఊరుకున్నా యువత ఊరుకుంటుందా?

***

కొత్త కాపురం చూడ్డానికి వచ్చిన సుజాత, రామారావులు ఆశ్చర్యపోయారు.

''ఇన్ని వస్తువులు ఒక్కసారే ఎలా కొన్నావు? అవునులే ఇద్దరి జీతాలున్నాయిగా. నెలకో వస్తువు కొన్నా సరిపోతుంది. నేనూ, అమ్మా ఏడాదికొకటిగా నెమ్మది నెమ్మదిగా అమర్చుకున్నాం''.

మహేష్‌ సన్నగా నవ్వాడు. ''ఇప్పుడలా దేనికీ ఆగే అవసరం లేనే లేదు నాన్న. అన్నీ ఒకేసారి కొనెయ్యొచ్చు. ప్రతినెలా అకౌంట్‌లోంచి వాళ్ళకి చెల్లింపు చెయ్యొచ్చు'' అన్నాడు.

***

రాత్రి ఎప్పటికీ నిద్రపోకుండా దొర్లుతున్న రామారావుతో సుజాత ''ఏమిటి ఆలోచిస్తున్నారు. హాయిగా పడుకునే ప్రయత్నం చెయ్యండి'' అంది.

''అది కాదు సుజాతా. మన ఎంత పొదుపుగా బతికాం. ఇప్పుడన్నీ ఒకేసారి కొనేశారు. ఇద్దరూ ఇన్‌కమ్‌టాక్స్‌ కట్టద్దా, కొంతైనా పొదుపు చెయ్యద్దా''

''వాళ్ళ జమాఖర్చులు మీకెందుకు? పిల్లల్ని కనిపెంచి పెద్దచేశాం. మన బాధ్యత అయిపోయింది'' ''సుజాతా! బాధ్యత తీరిపోవడమేమిటి? పిల్లల పట్ల బాధ్యత, చుట్టూ ఉన్న వారి పట్ల బాధ్యత, దేశం పట్ల బాధ్యత ఎప్పటికీ ఉంటాయి. కొన్న వస్తువులని చూడు. అన్నీ విదేశీవే. ఇందుకేనా స్వాతంత్య్ర పోరాటం చేసింది. ఆనాడు ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఈనాడు మల్టీనేషనల్స్‌, మన రైతులూ, కార్మికులూ మట్టికొట్టుకు పోవలసినదే.''

''ఒకటి, రెండేళ్ళు పోనివ్వండి. పిల్లలు పుడతారు. అప్పుడు నెమ్మదిగా చెప్దురుగానీ''.

ఎ ఎ ఎ మహేష్‌ తల్లితండ్రులను రైలెక్కించి ఇంటికొచ్చేసరికి ఉష టివి చూస్తోంది. ఏమిటి విశేషాలంటూ అతను ఆమె పక్కనే కూచున్నాడు. ''ఇప్పుడే మా ఫ్రెండ్‌ ఫోనుచేసి కన్నీళ్ళు పెట్టుకుంది. వాళ్ళ ఆఫీసులో మాస్‌ స్కేల్లో రిట్రెంచ్‌మెంట్‌ అవుతోంది. తన ఉద్యోగం కూడా పోయిందట. మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో అని భయపడుతోంది''.

''మనకా ప్రాబ్లం లేదులే. నాకు పోయినా నీకుంటుంది. నీకు పోతే నాకుంటుంది.''

''అయినా మన బిపి ఓ లో ప్రాజెక్టులు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడిద్దరినీ సింగపూర్‌కి సంబంధించిన ప్రాజెక్టులోనే వేశారు. కల్సి వెళ్ళి కల్సి వచ్చేస్తున్నాం. ఇద్దరికీ హాయిగా ఉంది.''

మర్నాడు 'హాయిగా ఉన్నాం' అన్న మాట ఇద్దరి నోట్లో వచ్చే ఛాన్స్‌ లేకపోయింది. ఇద్దరి టీబిల్స్‌ మీద పింక్‌స్లిప్స్‌ ఉన్నాయి. తలెత్తి చూసేసరికి చాలామంది ముఖాల్లో ఆందోళన. అందరికీ అదే పరిస్థితా?

నెమ్మదిగా కారణం తెలిసింది. ఇండియాలో కన్నా ఫిలిప్ఫైన్స్‌లో చవగ్గా పని జరిగే సూచనలు కన్పించాయి. ఇండియాలో బిపిఓ మూసేసి ఫిలిప్పైన్స్‌లో తెరుస్తున్నారు. ఎక్కడ చవగ్గా పని చేసేవాళ్ళు దొరికితే అక్కడే పని చేయించుకోడం వ్యాపార విజయ రహస్యం. మరి ఎంప్లాయీల మాట ఏమిటి?

వాళ్ళ గోడు ఎవరికిపడుతుంది? ఇప్పుడేం చెయ్యాలి? అన్ని వస్తువులూ లోన్‌ చేసికొన్నారు. లోన్‌ తీర్చకపోతే క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీలు ఊరుకోవు. మనిషిని చూసి అప్పు ఇచ్చామంటారు. మనిషి రక్తాన్ని జలగలా పీల్చుకుంటారు. ఏం చెయ్యాలి, ఎవరికి తనగోడు పడుతుంది?

మహేష్‌ ఆలోచనలని భగం చేస్తూ ఫోను మోగింది. తన తండ్రి క్షేమంగా చేరినట్లు చెప్పడానికి చేసినట్లున్నారు.

''నాన్నా, నా ఉద్యోగం పోయింది'' ఆ ఒక్క వాక్యం వెనక ఎంతో ఉంది... ''నాన్నా, మీరు ఆనాడు చెప్పారు. భూమి తల్లిని నమ్ముకుని బతుకుతున్న రైతులకు ఉపయోగంగా ఏదైనా చెయ్యమన్నారు. చిన్న ఫ్యాక్టరీ పెట్టి పదిమందికి ఉపాధి కల్పించ మన్నారు. అవేవీ నేను పట్టించుకోలేదు. ధనం కోసం వెంపర్లాడాను. నాకు పెద్ద జీతమిస్తున్న వాడు నన్ను మించి డబ్బు కోసం అంగలారుస్తున్నాడని ఇప్పుడే తెలిసింది. కంపెనీకి కావల్సింది లాభం మాత్రమే. ఉద్యోగులను పట్టించుకోదు. ప్రపంచం కుగ్రామమంటున్నారు. కుగ్రామం అంటే చెడ్డవాళ్ళ లాభానికి ఏర్పడ్డ గ్రామం. నన్ను క్షమించండి నాన్నా''

 



''బాబూ మహేష్‌, భయపడకు, వర్రీకాకు'' రామారావు అన్న ఆ వాక్యం వెనక ఎంతో ఉంది... ''మహేష్‌, తెలియక తప్పుచేశావు. బిపిఓ అంటే మాయామృగమైన బంగారు జింక అని తెల్సుకోలేకపోయావు. నువ్వే కాదు యువతీ యువకుల్లో చాలా మందికి తెలియడం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుకున్నావు. నీ చదువుకి తగిన ఉద్యోగం దొరకడం కష్టం కాదు. ఇంత జీతం ఉండకపోవచ్చు. లేదా నేను సూచించినట్లుగా ఇండిస్టీ పెట్టినా సరే, భయపడే పనిలేదు.''

తండ్రీ కొడుకుల మధ్య మాటలు సెల్‌టవర్స్‌ ట్రాన్స్మిట్‌ చేసి ఉండచ్చుకానీ వారి హృదయ సంవాదాన్ని ఏ వేవ్స్‌ ట్రాన్స్మిట్‌ చేశాయో తెలియదు. ఇద్దరి మధ్యా దూరం తరిగి ప్రపంచం ఆర్థ్ధికంగా కాకా హార్ధికంగా కుగ్రామమైనట్లు వారికి అన్పించింది.


పశ్చాత్తాపం!



 తిమ్మాపురం అనే గ్రామంలో రామోజీ అనే భూస్వామి ఉండేవాడు. ఆ ఊరి మొత్తంలో అతనే ధనవంతుడు కావడంతో అతనికి చాలా గర్వంగా ఉండేది. ఓ రోజున రామోజీ పొరుగూరుకు వెళ్లవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్ళాలంటే మధ్యలో ఉన్న నదిని దాటాల్సిందే. అందువల్ల రామోజీ ఓ పడవ ఎక్కి కూర్చున్నాడు. పడవ నడిపేవాడు మరో మనిషి వస్తే బయలుదేరుదామని ఎదురు చూడసాగాడు. అంతలో అదే గ్రామానికి చెందిన చెప్పులు కుట్టే చంద్రయ్య వచ్చాడు. రామోజీ కూర్చున్న పడవలోకి ఎక్కి కూర్చోబోయాడు. 


అంతే! రామోజీ శివాలెత్తిపోయాడు. నాలాంటి ధనవంతుని పక్కన చెప్పులు కుట్టే నీలాంటి వాడు కోర్చోవడం ఏంటి? ఒరేరు! ఇద్దరు మనుషులకు అయ్యే కిరాయి నేనే చెల్లిస్తాను. ఇంకెవ్వరినీ పడవ ఎక్కించుకు పద అని కోపంగా పడవ నడిపేవాడితో అన్నాడు రామోజీ. అందుకు పడవనడిపేవాడు సరేనని పడవని ముందుకు తీసుకెళ్ళాడు. చంద్రయ్య మౌనంగా ఒడ్డుపై ఉండిపోయాడు.


 కొద్దిసేపటికి రామోజీ ప్రయాణిస్తున్న పడవ పెనుగాలికి బోర్లా పడింది. ఈత రాని రామోజీ నన్ను కాపాడండి! రక్షించండి! అంటూ కేకలు వేశాడు. అది గమనించిన చంద్రయ్య ధైర్యంగా నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళి రామోజీని ఒడ్డుకు చేర్చాడు. స్పృహ కోల్పోయిన రామోజీ కడుపుపై నొక్కి నీళ్ళు బయటకు కక్కించాడు. కొద్ది సేపటికి స్పృహలోకి వచ్చిన రామోజీ చంద్రయ్యను హత్తుకొని చంద్రయ్యా నన్ను క్షమించు. ధనవంతుడిని అనే అహంకారంతో నిన్ను అవమానించాను అంటూ పశ్చాత్తాపపడ్డాడు. రామోజీలో మార్పు కలిగినందుకు చంద్రయ్య సంతోషించాడు.


 


Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu  


తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?

చిన్నతనంలో మామిడి తోట లో | Telugu lo kathalu stories చిన్నతనంలో మామిడి తోటలో రాలిన పళ్ళని తీసుకెలితే మా అమ్మ వాటిని బయటకి విసిరేసి " నీ సోంతం అనుకున్న...

ఈ కథను పిల్లలు చదవవచ్చా?

అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.

ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?

కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.

ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?

ఇది Comedy Stories విభాగానికి చెందిన తెలుగు కథ.

ఈ కథకు సంబంధించిన అంశాలు: చిన్నతనంలో మామిడి తోట లో | Telugu lo kathalu stories, Funny stories in Telugu, Comedy Kathalu, Telugu joke stories

#TeluguStories #ComedyStories #FunnyStories #TeluguJokes #TeluguKathalu

ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు

Post a Comment

Previous Post Next Post