Dear All, neethi kathalu in Telugu | కోపం తెచ్చే అనర్ధం | Kids Moral Stories In Telugu
కోపం తెచ్చే అనర్ధం
రంగమ్మ పరమ కోపిష్టి, ఆవిడ కోపానికి ఆగలేక ఎవ్వరూ కూడా ఇంట్లో పనిచేయలేక పోయేవారు. నెలకు నలుగురు వంట మనుషులు మారేవారు.
కొంత కాలానికి రంగమ్మ ఇంటికి మారయ్య అనే వంటవాడు చేరాడు. మారయ్య, తెలివైనవాడు. వంటలుకన్నా వాడి మాటలు గమ్మత్తుగా ఉండేవి. ఒకనాడు వాడు కాఫీ కోపాలో పోసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. రంగమ్మ కాఫీ తాగేముందు దాని మీద మూత తీసివేసి. చాలాసేపు పేపరు చదువుతూ కొద్దికొద్దిగా కాఫీ పుచ్చుకుంటోంది.
ఇంతలో ఒక ఈగ వచ్చి కాఫీలో పడి చచ్చింది.
ఆ కాఫీ పారబోయించి వేరే కాఫీ తెప్పించుకోవలసి వచ్చింది రంగమ్మకు. అయితే తన అజాగ్రత్తవల్ల కాఫీలో ఈగ పడిందని అనిపించుకోవడం రంగమ్మకు సుతారమూ ఇష్టంలేదు. అందువల్ల ఆ నెపం వంటవాడి మీద వెయ్యాలని నిశ్చయించుకుందామె.
వెంటనే మారయ్యని పిలచి ‘ఏమోయ్! ఇంత అజాగ్రత్త అయితే ఎలా? కాఫీ కోపాలో ఈగపడింది’ అంది కోపంగా..
దానికి వెంటనే మారయ్య తడుముకోకుండా “అమ్మా! కాఫీలో ఈగ పడకపోతే ఏనుగు పడుతుందా?” అన్నాడు..
“ఏనుగు పడదని నాకు తెలుసుకొని ఈగపడేలాగు పాలమీద మూత లేకుండా వుంచి, ఇంకా పెంకిమాటలు మాట్లాడతావేం” అని చాలా కోపంగా అడిగింది రంగమ్మ.
“అమ్మా! ఇందులో నా తప్పేమీ లేదు. మీ పాలు మంచివికావు. అందువల్ల ఇంత అవస్థ వచ్చి పడింది’ అని చమత్కరించాడు.
దానికి రంగమ్మ నొచ్చుకుంటూ “పని బాగా చేయమంటే కథలు చెబుతా వేమిటి? మర్యాదగా తప్పు ఒప్పుకో…” అంది.
ఆ మాటలకు మారయ్య “అమ్మా నీ దగ్గర పనిచేయడం నావల్ల కాదు.. అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.”
రంగమ్మకు నోటమాట రాలేదు. తానొకటి తలిస్తే ఒకటి జరిగింది. ఉన్నట్టుండి. పనివాడే మానేసేసరికి ఇబ్బంది పడిందామె.
అయితే ఆ తర్వాత రంగమ్మ గురించి తెలిసిన వారెవ్వరూ ఆమె దగ్గర పనిచేయడానికి రాలేదు.
ఒకనాడు రంగమ్మకు జబ్బు చేసింది. మాట సహాయానికిగాని, వంట చేయడానికి గాని ఎవ్వరూ లేకపోవడంతో, అలాగే నీరసంతో వెళ్ళి పొయ్యి మీద కాఫీ పెట్టుకోబోయి పొయ్యిమీదపడి కాలిపోయి మరణించింది.
Moral of the Story : తన కోపమే తన శత్రువనడానికి ఇదొక ఉదాహరణ.
Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html
Kids Moral Stories In Telugu | Telugu Moral Stories For Kids | Neethi Kathalu In Telugu
Best Telugu Story about Friendship Stories : https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
neethi kathalu in Telugu | కోపం తెచ్చే అనర్ధం | Kids Moral Stories In Telugu
అతి చిన్న చెట్టు
ఒక ఊరిలో, చిన్న, అతి చిన్న చెట్టు ఒక వైపుకి విస్మరించబడింది. దాని చిన్నతనం, నాజూకైన ఆకులు, కొద్దిగా వేరు ఉండటం కారణంగా, అందరు దాని వైపు దృష్టి పెట్టే అవకాశం లేకుండా నిర్లక్ష్యం చేయడం మొదలెట్టారు. దాని వాసనలు, చెట్టు కంటే ఎక్కువ విలువ తెలియదు అనిపించింది.
అప్పుడే, చెరట దగ్గర కూర్చున్న జ్ఞాని, చిన్నారి వలె, మృదువుగా చెప్పాడు:
“చిన్నదేమీ తక్కువ కాదు. ప్రతి జీవికి జీవం, శక్తి, మరియు అందం మనం ఇచ్చే ప్రేమ, దయ, మరియు శ్రద్ధలో ఉంది.”
గ్రామస్తులు ఆ మాటలు అర్థం చేసుకున్నారు. వారు ఆ చిన్న చెట్టును ప్రేమతో నీటిచ్చి, కాపాడి, సూర్యరశ్మిని, తీపి గాలి అందిస్తూ జాగ్రత్తగా చూసుకున్నారు. కొన్ని నెలల్లో ఆ చిన్న చెట్టు పెద్దగా పెరిగి, అందమైన ఆకులు, పూలు పండించింది. ఇప్పుడు అది గ్రామంలో అందరికి సంతోషం, శాంతి, మరియు గౌరవం ఇచ్చే చెట్టు అయ్యింది.
పాఠం: ప్రతి జీవికి ప్రేమ, శ్రద్ధ, మరియు గౌరవం అవసరం.
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
The Tiny Tree
In a small village, there stood a tiny little tree. Because it was small and delicate, villagers often overlooked it. Its leaves were few, its branches frail, and many thought it wasn’t important. The tree felt ignored, almost invisible.
One day, the wise sage, sitting by the pond, spoke gently, almost like a child:
“Nothing small is ever truly insignificant. Every life gains strength, beauty, and purpose through the love, care, and attention we give it.”
The villagers took his words to heart. They watered the little tree, shielded it from harsh winds, and tended to it with care. In a few months, the tiny tree grew tall and strong, its leaves abundant, and flowers blooming beautifully. It became a source of joy, peace, and respect for the entire village.
Moral: Every living being deserves love, care, and respect.
కథ సమాచారం
| కథ రకం | Telugu Moral Stories |
|---|---|
| ప్రధాన అంశం | నీతి మరియు మంచి ప్రవర్తన |
| ఎవరికి ఉపయోగకరం | పిల్లలు, కుటుంబ సభ్యులు మరియు తెలుగు కథలను ఇష్టపడే పాఠకులు |
| ముఖ్యమైన సందేశం | కథలోని సంఘటనలను ఆలోచించి, అందులోని మంచి పాఠాన్ని జీవితంలో ఉపయోగించుకోవచ్చు. |
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?
Dear All, in Telugu | కోపం తెచ్చే అనర్ధం | Kids In Telugu కోపం తెచ్చే అనర్ధం రంగమ్మ పరమ కోపిష్టి, ఆవిడ కోపానికి ఆగలేక ఎవ్వరూ కూడా ఇంట్లో...
ఈ కథను పిల్లలు చదవవచ్చా?
అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.
ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?
కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.
ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?
ఇది Telugu Moral Stories విభాగానికి చెందిన తెలుగు కథ.
ఈ కథకు సంబంధించిన అంశాలు: Neethi kathalu in Telugu | కోపం తెచ్చే అనర్ధం | Kids Moral Stories In Telugu, Telugu moral stories, Neethi Kathalu, Telugu Kathalu
ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు
- IndianInQ8 — Latest Jobs, News & Entertainment
- Kuwait Bus Routes — Kuwait City Bus Routes & Information
- ITIL Course — ITIL Learning & Course Resources
Post a Comment