About India Telugu Lo Stories Kathalu | భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి
భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి. వీటిని చదువుతుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆ నిజాలు మీకోసం...
1. ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. తొలి దేశం అమెరికా.
2. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది.
3. ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే.
4. ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40 శాతం భారతీయులు మాంసాహారం ముట్టరు.
5. ఇండియాలోని రోడ్లతో భూమి అంతటినీ 117 సార్లు చుట్టేయొచ్చు.
6. భారత సాఫ్ట్ వేర్ కంపెనీలు 90 దేశాలకు తమ ప్రొడక్టులను ఎగుమతి చేస్తాయి. అమెరికా సహా మరే దేశానికీ ఈ ఘనత దక్కలేదు.
7. మార్స్ పరిశీలనకు ఉపగ్రహాలను పంపేందుకు ఇతర దేశాలు వెచ్చించిన మొత్తంలో 75 శాతం తక్కువకే ఇస్రో విజయం సాధించింది.
8. యూఎస్, జపాన్ ల తరువాత సూపర్ కంప్యూటర్లను తయారు చేసిన, చేస్తున్న ఏకైక దేశం ఇండియానే.
9. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇండియాలో ఓట్లు వేసిన వారి సంఖ్య 54 కోట్లు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల మొత్తం జనాభా కన్నా ఇదే అధికం.
10. మరో ఏడాది నాటికి ప్రపంచంలోని కార్మిక శక్తిలో 25 శాతం ఇండియా నుంచే వెళుతుందని అంచనా.
11. జాతీయ క్రీడ అంటూలేని దేశాల్లో ఇండియా ఒకటి
12. ఇండియాలో సుమారు 1000 భాషలున్నాయి. జాతీయ భాష కూడా లేదు. హిందీ, ఇంగ్లీష్ లు అధికార భాషలుగా గుర్తింపు పొందాయి.
13. అన్ని యూరోపియల్ భాషలకూ మూలమైన సంస్కృతం ఇండియాలో పుట్టిందే.
14. ప్రపంచ తొలి యూనివర్శిటీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఇండియాలో మొదలైంది. అదే తక్షశిల. ఇక్కడ ప్రపంచ నలుమూలల నుంచి
10,500 మంది విద్యార్థులకు 60 సబ్జెక్టుల్లో బోధనలు సాగాయనడానికి ఆధారాలున్నాయి.
15. గతంలో భారత రూపాయి ఎన్నో దేశాల్లో అధికారిక కరెన్సీగా చలామణి అయింది. ఒమన్, దుబాయ్, కువైట్, బహ్రయిన్, ఖతార్, కెన్యా, ఉగాండా, సీషల్స్, మారిషస్ దేశాలు అధికారిక కరెన్సీగా రూపాయిని వాడాయి.
16. ఇప్పటివరకూ జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో ఓటమెరుగని జట్టుగా భారత కబడ్డీ జట్టు నిలిచింది. భారత కబడ్డీ ఆటగాళ్లు తామాడిన అన్ని వరల్డ్ కప్ పోటీల్లో విజేతలుగా నిలిచారు.
17. వరల్డ్ రికార్డులను క్రియేట్ చేయడంలో ప్రపంచంలో మూడో స్థానం మనది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్ ఉన్నాయి.
18. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో ఇండియా రెండవది.
19. ప్రపంచంలోనే సుగంధ ద్రవ్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియానే.
20. 1990లో జరిగిన గల్ఫ్ వార్ సమయంలో అతిపెద్ద ప్రజల తరలింపును భారత్ చేపట్టింది. ఆ దేశాల్లో ఉన్న సుమారు 1.7 లక్షల మందిని 488 ఎయిర్ ఇండియా విమానాలు 59 రోజులు శ్రమించి దేశం దాటించాయి.
21. ఐక్యరాజ్యసమితి నిర్వహించే శాంతి దళాల్లో అత్యధికులు భారతీయులే.
22. గడచిన 1000 సంవత్సరాల్లో భారత్ స్వయంగా ఏ దేశంపైనా దాడి చేయలేదు.
23. 1896 వరకూ ప్రపంచానికి వజ్రాలను అందించిన ఏకైక దేశం ఇండియా మాత్రమే. కృష్ణా నది డెల్టా, ముఖ్యంగా ఇప్పటి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలెన్నో లభించాయి.
24. చైనా, అమెరికాల తరువాత అతిపెద్ద సైనిక శక్తి మనదే.
About India Telugu Lo Stories Kathalu | భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి
25. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫాం ఖరగ్ పూర్ లో ఉంది. దీని పొడవు 2.773 కిలోమీటర్లు.
26. ప్రపంచంలో తొలిసారిగా పర్సనలైజ్డ్ స్టాంపులను అందించిన దేశం ఇండియానే.
27. ఇండియాలో రోజుకు 14,300 రైళ్లు తిరుగుతుండగా, అవి ప్రయాణించే దూరం చంద్రడికి, భూమికి మధ్య ఉన్న దూరానికి మూడున్నర రెట్లు అధికం.
28. ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు తీసే దేశం కూడా ఇండియానే.
29. ప్రపంచంలో అత్యంత పురాతన నగరం మనదేశంలోనే ఉంది. అదే వారణాసి.
30. ఇసియాలోనే అత్యంత పరిశుభ్ర గ్రామం మేఘాలయాలో ఉంది. దాని పేరు మౌలినాంగ్. ప్రపంచంలోనే అత్యధికంగా వర్షం పడే ప్రాంతమూ మేఘాలయాలో ఉంది. అదే చిరపుంజి. ఇక్కడ ప్రతియేటా సరాసరిన 467 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది.
31. అత్యధిక విద్యార్థులు ఉన్న స్కూలు కూడా మనదే. లక్నోలోని సిటీ మాంటిస్సోరి పాఠశాలలో ఏటా 45 వేల మంది విద్యను అభ్యసిస్తుంటారు.
32. పన్నెండేళ్లకు ఓసారి జరిగే గంగానది కుంభమేళాకు వచ్చే ప్రజల సంఖ్య అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత ఎక్కువగా ఉంటుంది.
33. సంఖ్యాశాస్రాన్ని ఆర్యభట్ట కనుగొంటే, బ్రహ్మగుప్త సున్నా విలువ ప్రపంచానికి తెలిపారు.
34. ఆల్ జీబ్రా, త్రికోణమితిలను ప్రపంచానికి అందించింది ఇండియానే.
35. మానవ చరిత్రలో తొలి వైద్య విధానం 'ఆయుర్వేద'ను అందించింది ఇండియానే.
ఇవే కాదు, ఇంకెన్నో ఘనతలను ఇండియా సాధించింది, సాధిస్తూ ఉంది
If You like share it !!!
కథ సమాచారం
| కథ రకం | Hard Work Stories |
|---|---|
| ప్రధాన అంశం | కష్టపడి పనిచేయడం మరియు ఫలితం |
| ఎవరికి ఉపయోగకరం | పిల్లలు, కుటుంబ సభ్యులు మరియు తెలుగు కథలను ఇష్టపడే పాఠకులు |
| ముఖ్యమైన సందేశం | కథలోని సంఘటనలను ఆలోచించి, అందులోని మంచి పాఠాన్ని జీవితంలో ఉపయోగించుకోవచ్చు. |
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?
About India Telugu Lo Stories Kathalu | భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి. వీటిని చదువుతుంటేనే...
ఈ కథను పిల్లలు చదవవచ్చా?
అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.
ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?
కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.
ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?
ఇది Hard Work Stories విభాగానికి చెందిన తెలుగు కథ.
ఈ కథకు సంబంధించిన అంశాలు: About India Telugu Lo Stories Kathalu | భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి, Hard Work Stories in Telugu, Kashtapadi Pani Cheyadam Kathalu, Success moral stories
ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు
- IndianInQ8 — Latest Jobs, News & Entertainment
- Kuwait Bus Routes — Kuwait City Bus Routes & Information
- ITIL Course — ITIL Learning & Course Resources
Post a Comment