Telugu lo kathalu stories heart touching story | గుండె లోతుల్ని ఆవిష్కరించే కథ | 2026

Telugu lo kathalu stories  heart touching story | గుండె లోతుల్ని ఆవిష్కరించే కథ  |



Telugu lo kathalu stories  heart touching story | గుండె లోతుల్ని ఆవిష్కరించే కథ  |

Telugu lo kathalu stories  heart touching story | గుండె లోతుల్ని ఆవిష్కరించే కథ  |


సరోజ టీచర్ ఆ రోజు ఐదవ తరగతి లోకి వెళ్ళింది .

పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది . " నేను మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను " అని .
అది అబద్ధం ఎందుకంటే ఆ తరగతి మూడో వరసలో ఉన్న మహేశ్ తీరు ఆమెకు నచ్చలేదు . ఏడాదిగా అతడిని గమనిస్తోంది.



అతడు మిగిలిన పిల్లల్లా


ఆటల్లో పాల్గొనడం లేదు , డ్రెస్ సరిగా వేసుకోవడం లేదు. దీంతో ఆమెకు అతడంటే సదభిప్రాయం కలగలేదు .


కాలం గడిచిపోసాగింది . అతడి పేపర్స్ లో ఆమె ఎర్ర సిరా గుర్తులు పెరిగిపోసాగాయి.. మార్కులు తక్కువగా పడుతున్నాయి. అతడు మిగిలిన పిల్లలతో కలవలేక పోవడమూ గమనించింది . పిల్లల గురించి టీచర్ సీసీఈ కుమ్యలేటివ్ రికార్డు రాయాలి . 


అందరి రికార్డులూ రాసేసినా ఎందుకో ఆమెకు మహేశ్ రికార్డు రాయాలనిపించక ఆలస్యం
చేసింది . వార్షిక పరిక్షలూ దగ్గర పడుతున్నాయి.


మహేశ్ వివరాలు నమోదుచేయాలి.

ఒక రోజు అతడి రికార్డు ముందరేసుకుని తిరగేయసాగింది . పేజీలు తిప్పిన కొద్దీ ఆమె అంతరంగంలో అలజడి మొదలవసాగింది.

అతడి ఒకటవ తరగతి అభ్యసనం తీరుపై అప్పటి టీచర్ ఇలా రాసింది " మహేశ్ చాలా తెలివైన కుర్రాడు .

అందరితో కలసి పోతాడు. అతడితో అందరూ చాలాస్నేహంగా ఉంటారు. ఇంటిపని నీట్ గా చేస్తాడు .

బ్రిలియంట్ బాయ్ " రెండో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ ఎక్సలెంట్ కుర్రాడు . కానీ ఈమద్య అతడి తల్లికి వచ్చిన జబ్బు వలన అతడు కుటుంబంలో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు "


మూడో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ ది చాలా కష్టపడేతత్వం. చదువులో బాగానే ఉన్నాడు కానీ
అతడి తల్లి మరణం అతడిని కుంగ తీసింది . అతడి తండ్రి అతడిని పట్టించుకోవడం లేదు . అది అతడిపై విపరీతమైన ప్రభావం చూపవచ్చు "


నాల్గో తరగతి టీచర్ రిపోర్ట్ " మహేశ్ చదువులో వెనుకబడి పోయాడు . అతను ఫ్రెండ్స్ తో కలవక ఒంటరిగా ఉంటున్నాడు . క్లాస్ లో నిద్ర పోతున్నాడు . అతడు ఒక సమస్యాత్మక పిల్లవాడు కాబోతున్నాడు "


సరోజ టీచర్ కి సమస్య అర్ధ మైంది. ఇన్నాళ్ళూ తను మహేశ్ గురించి తెలుసుకోనందుకు బాధ పడింది .

అంతలోనే టీచర్స్ డే వచ్చింది. ఏర్పాట్లలో సరోజ తలమునకలైంది మహేశ్ నీ  సానుభూతితో చూడడం తప్ప ఏమి చెయ్యాలో ఆమెకు తోచలేదు . టీచర్స్ డే రోజు అందరు పిల్లలూ టీచర్ కి కానుకలు ఇస్తున్నారు . అందమైన రంగుకాగితాలతో చుట్టిన విలువైన కానుకలు ఇవ్వసాగారు .


ఇంటికి సరుకులు తెచ్చిన పేపర్ బ్యాగ్ లో ఏదో పెట్టి తెచ్చి ఇచ్చాడు మహేశ్. ఆ బ్యాగ్ సగం చిరిగి ఉంది .

అందరు పిల్లలూ అది చూసి ఎగతాళిగా నవ్వతున్నారు . సరోజ వారిని కసిరి " చాలా బాగుంది " అని మహేశ్ తో అంది .

ఆమెకు దూరంగా నిల్చున్న మహేశ్ " మీరు ఈ రోజు మా అమ్మలా కనిపిస్తున్నారు" అన్నాడు .
అందరు పిల్లలూ వెళ్లి పోయారు . అయినా సరోజ టీచర్ మాత్రం క్లాసును వదల లేక పోయింది .
క్లాసులో కూర్చుని గంట సేపు ఏడ్చింది .


ఆ రోజు నుండి ఆమె మహేశ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టింది . మహేశ్లో మార్పు చాలా త్వరగా వచ్చింది . ఆమె ప్రోత్సహిస్తున్నకొద్దీ చురుకుగా తయారయ్యాడు . వాడు ఆ సంవత్సరం తరగతి ఫస్ట్ గా వచ్చాడు .


ఆ తర్వాత అతను సెకండరీ స్కూల్ కి పోయాడు. ఇక్కడితో అయిపోలేదు .

మరుసటి సంవత్సరం ఆమెకు ఉత్తరం వచ్చింది.

అందులో " ప్రాధమిక విద్యాభ్యాసం లో నాకు నచ్చిన ఉపాధ్యాయిని మీరు " అది ఆ ఉత్తరం సారాంశం .

మరో నాలుగేళ్లకు వచ్చిన ఉత్తరంలో " నేను సెకండరీ విద్యలో జిల్లా స్థాయిలో ర్యాంక్ సాధించాను . అయినా ఇప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ " మరో రెండేళ్లకు ఇంకో ఉత్తరం " నేను ఇపుడు
చదువు విషయం లో కష్టపడుతున్నాను .


ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా చదువు కొనసాగిస్తున్నాను . ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ " ఇంకో నాలుగు సంవత్సరాలు గడిచాయి . ఇంకో ఉత్తరం " డిగ్రీ తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాలు చదవాలి అనుకున్నాను . చదివాను .


సాధించాను . ఇదంతా మీ చలవే . మీరే నాకు ఫేవరెట్ టీచర్ " ఈసారి అతడి ఉత్తరం లో చివరన సంతకం కింద మహేశ్, M.D. అని సంతకం చేశాడు .


ఇంతటితో ఈ కధ అయిపోలేదు .

ఇంకో ఉత్తరం వచ్చింది .


" నేను ఒక అమ్మాయిని చూశాను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను . మా అమ్మగారు లేని సంగతి మీకు తెలిసిందే..నాన్న గారు కూడా రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు . వివాహంలో పెళ్ళికొడుకు తల్లి స్థానంలో మీరుండాలని నా కోరిక " సరోజ పెళ్ళికి వెళ్ళేటపుడు మహేశ్ ఐదవ తరగతిలోబహూకరించిన నెక్లెస్ ధరించింది..



అందులో సగం రాళ్ళు ఊడిపోయాయి .

ఆ పెళ్లి రోజు మహేశ్ కి వాళ్ళ అమ్మ కనిపించింది..



"కన్ను తెరిస్తే జననం...కన్నుమూస్తే మరణం... రెప్పపాటు జీవితం”. ఒక మహాకవి రాతల్లో జనించిన జీవిత సత్యమిది.

జననానికి, మరణానికి మధ్యసాగే ఈ జీవన సమరంలో మనిషి ప్రతిక్షణం ఒత్తిళ్ళకు లోనవుతూ, సమస్యలతో సతమతమవుతూ యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోతున్నాడు. 

ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కోల్పోతున్నాడు. దానికి కారణం ఒక్కటే...కనీస సరదాలను కూడా అందుకోలేనంత బిజీగా జీవితాన్ని గడపడం. శారీరక సమస్యలకి మందులెన్ని ఉన్నా మానసిక సమస్యలకి మాత్రం భగవంతుడు ప్రసాదించిన అత్యద్భుత ఔషధం మాత్రం నవ్వు.


నవ్వులను మనిషి ఆస్వాదించడానికి మాధ్యమాలు ఎన్నో ఉన్నాయి. అంటే సినిమాలు, టి.వి.లు, లాఫింగ్ క్లబ్‌లు, నాటకాలు, హాస్య పుస్తకాలు లాంటివి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది వాటిలో ఒకటి.


మీరు మాత్రం కష్టాలున్నా, సమస్యలున్నా, బాధలున్నా, అప్పులున్నా, ముప్పులున్నా వీటన్నిటినీ ఒక పక్కనపెట్టి మరో పక్క నా పుస్తకాన్ని పెట్టుకోండి. మీ బాధలన్నీ మర్చిపోతారు. పుస్తకం చదివి హాయిగా నవ్వుతారు. బిగ్గరగా నవ్వుతారు... పగలబడి నవ్వుతారు... విరగబడి నవ్వుతారు... నవ్వుతూనే ఉంటారు. మీరలా నవ్వుతూనే ఉండాలని కోరుకుంటూ.... 


- గుత్తుల శ్రీనివాసరావు


Mahesh and Teacher Saroja – A Heart-Touching Story

Once upon a time, in a school, Teacher Saroja went to her fifth-grade class. She told the children, “I love all of you equally.”


But this was not entirely true, because there was a boy named Mahesh in the third row. Teacher Saroja didn’t like him at first. He didn’t join games, didn’t wear his uniform properly, and his marks were low.


As time went on, Teacher Saroja noticed something. When she checked Mahesh’s school record from previous years:

  • In first grade, his teacher wrote: “Mahesh is smart, friendly, and does his homework well.”
  • In second grade, the teacher wrote: “Mahesh is excellent, but his mother was sick, and he faced difficulties at home.”
  • In third grade, the teacher wrote: “Mahesh works hard in studies, but his mother passed away, and his father doesn’t pay attention to him. He might face big challenges.”
  • In fourth grade, the teacher wrote: “Mahesh is falling behind in studies. He stays alone and seems unhappy. He may become a troubled child.”


Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 



After reading this, Saroja understood that Mahesh was not a bad boy—he was just facing many problems at home. She felt sad that she hadn’t noticed it before.

On Teachers’ Day, all students gave gifts to their teachers. Mahesh came with a small paper bag. The bag was torn, and other children laughed. But Saroja smiled and accepted it kindly. Mahesh told her, “You look like my mother today.”


Saroja’s heart melted. From that day, she gave Mahesh special care and encouragement. Slowly, Mahesh became active, confident, and happy. By the end of the year, he stood first in his class.


Later, Mahesh went to secondary school, but he never forgot Saroja. Every few years, he sent her letters, thanking her for believing in him and helping him succeed.

Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 


Finally, after completing his medical degree, Mahesh wrote to Saroja again. He asked her to be like a mother on his wedding day, since his parents had passed away. On the wedding day, Saroja gave him a special necklace—half of its stones were missing, but it was filled with love.

 

Moral of the Story:

  • A little care, love, and encouragement can change someone’s life.
  • Everyone may be going through struggles we don’t see.
  • Kindness and understanding can help someone grow strong and succeed.

 

 

తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?

Telugu lo kathalu stories heart touching story | గుండె లోతుల్ని ఆవిష్కరించే కథ | Telugu lo kathalu stories heart touching story | గుండె లోతుల్ని...

ఈ కథను పిల్లలు చదవవచ్చా?

అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.

ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?

కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.

ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?

ఇది Telugu Moral Stories విభాగానికి చెందిన తెలుగు కథ.

ఈ కథకు సంబంధించిన అంశాలు: Telugu lo kathalu stories heart touching story | గుండె లోతుల్ని ఆవిష్కరించే కథ | 2026, Telugu moral stories, Neethi Kathalu, Telugu Kathalu

#TeluguStories #MoralStories #TeluguKathalu #NeethiKathalu #TeluguMoralStories

ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు

Post a Comment

Previous Post Next Post