Mano Shakthi Telugu Motivational Stories Kathalu | మనోశక్తి

Mano Shakthi Telugu Motivational Stories Kathalu | మనోశక్తి


Daer All, here we will find the details about the story of - Mano Shakthi Telugu Motivational Stories Kathalu | మనోశక్తి. 

అనగా అనగా పంజాబ్ ప్రాంతాన్ని బల్వంత్ సింగ్ అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకి జంతువుల్ని పెంచటం అంటే చాలా‌ ఇష్టం ఉండేది. ఆయన పెంపకంలో అందమైన గుర్రాలు లెక్కలేనన్ని ఉండేవి. వాటిలో కొన్ని అతి వేగంగా‌పరుగులు తీసేవి. కొన్ని సాటిలేని


Mano Shakthi Telugu Motivational Stories Kathalu | మనోశక్తి


యుద్ధాశ్వాలు- ఇవేకాక రాజుగారి దగ్గర పెద్ద పెద్ద ఏనుగుల మందలు ఉండేవి-వందలాది మంది మావటీలు వాటికి శిక్షణనిస్తుండేవాళ్ళు.


ఆ ఏనుగుల్లో ప్రత్యేకమైన ఏనుగొకటి ఉండేది. బలంలో గాని,బడ్డూ పొడవుల్లో గానీ దానికి సాటివచ్చే ఏనుగు మరొకటి లేదు. ఐరావతం లాంటి ఆ ఏనుగు పేరు భీముడు.


రాజుగారికి భీముడంటే విపరీతమైన అభిమానం ఉండేది. దాన్ని బలంగాను, సంతోషంగాను ఉంచేందుకు ఎంతైనా సరే, వెచ్చించేందుకు ఆయన వెనుకాడేవాడు కాదు.


మొదట్లో భీముడు అడవిలో స్వేచ్చగా తిరుగుతుండేది. పట్టుబడిన కొత్తల్లో అది చాలాసార్లు తప్పించుకొనే ప్రయత్నం చేసింది-కొన్ని సార్లు నిజంగానే తప్పించుకుపోయింది కూడా. కానీ రాజుగారు తన మనుషుల్ని పంపి, ప్రతిసారీ దాన్ని తిరిగి బంధిస్తూ వచ్చారు. మెల్లగా భీముడు కూడా మనుషుల మాదిరే, ధనికస్వామ్యపు బీద జీవితంలో రుచులు వెతుక్కునే పట్టణ వాసానికి అలవాటు పడిపోయింది. అరణ్యపు స్వేచ్చ జీవితంలోని సుఖం మెల్లగా మరుగు పడింది.రాజుగారి మనుషులు చూపించే తాయిలాలు దానికి నచ్చసాగాయి.


#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

#DevotionalStories 

పండుగ రోజుల్లో దానికోసమే ప్రత్యేకంగా తయారుచేయించిన ఆభరణాలతో దాన్ని అలకరించేవాళ్ళు. రాజుగారు, మంత్రిగారు భీముడి మీద కూర్చుని, ప్రధాన వీధుల్లో ఊరేగింపుగా వెళ్తుంటే, మిగిలిన ఏనుగులన్నీ వెంటనడిచేవి. వాళ్ల ముందు సంగీత వాయిద్యాలను పట్టుకొని, వాద్యకారుల బృందం ఒకటి నడిచేది.

సైనికుల పాటల్ని ఆలపిస్తూ, ఆ సంగీతం భీముడి చెవులకు చాలా ఇంపుగా అనిపించేది. నిజానికి ఆ పాటల్ని వింటూ అది మంత్రముగ్ధం అయిపోయేది.


ఒకరోజున మావటీలు దాన్ని స్నానానికి ఊరి బయట ఉన్న చెరువుకు తీసుకెళ్ళారు. భీముడు ఆ చెరువులో పడి సంతోషంగా ఈదులాడింది. అలా ఈదుతూ, అకస్మాత్తుగా అది అక్కడే ఉన్న బురదలో కూరుకుపోయింది. 

ఇక అది తన బలం మొత్తాన్నీ ఉపయోగించి, ఆ ఊబిలోంచి బయట పడేందుకు పెనుగులాడింది- కానీ ఎంత పెనుగులాడితే అంత లోపలికి కూరుకుపోయింది తప్ప, అది ఇక బయటికి రాలేకపోయింది. కబురు రాజుగారికి చేరింది. ఆయన భీముడిని బయటికి లాగేందుకు చేతనైన ప్రయత్నాలన్నీ చేయమని ఆదేశించారు. ఎవరేమి చేసినా ప్రయోజనం లేదు- భీముడు కొద్దికొద్దిగా దిగబడిపోసాగాడు.

Mano Shakthi Telugu Lo Stories Kathalu | మనోశక్తి


అందరూ నిరాశ పడుతున్న ఆ తరుణంలో మంత్రి కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది. ఆస్థాన వాద్యబృందాన్ని రప్పించి, భీముడికి ఇష్టమైన పాటల్ని వినిపించమన్నాడు. సంగీతం ఆ ఏనుగులో నిద్రాణమై ఉన్న శక్తుల్ని వేటినో మేలుకొలిపింది. 

ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అది శరీరాన్ని పట్టి బధించిన బురదను దులుపుకున్నది. తనలోని శక్తినంతటినీ కూడగట్టుకొని, అది కొంచెం కొంచెంగా జరుగుతూ, ఊబిలోంచి బయట పడింది. 

చుట్టూ ఉన్నవాళ్ళు హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు.


అందరూ ఒక కొత్త సంగతిని తెలుసుకున్నారు- మనసులో మనకెవ్వరికీ తెలియని శక్తులు చాలా ఉన్నాయి. శరీరం ఒంటరిగా చేయలేని పనుల్ని కూడా, మనసు తోడైనప్పుడు అది అతి సులభంగా చేసేస్తుంది. 

జీవితం చరమ దశలోనైనా సరే, మనం ఏది కోరుకుంటే అది సాధించగలం- మనసుపెట్టి పనిచేయాలి- అంతే.



Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,  pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu

 

Mano Shakthi Telugu Lo Stories Kathalu | మనోశక్తి

కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


Best Telugu Story about Friendship Stories :  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html



Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu  

 కథ సమాచారం

తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?

Mano Shakthi Telugu Lo Stories Kathalu | మనోశక్తి అనగా అనగా పంజాబ్ ప్రాంతాన్ని బల్వంత్ సింగ్ అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకి జంతువుల్ని పెంచటం అంటే...

ఈ కథను పిల్లలు చదవవచ్చా?

అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.

ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?

కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.

ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?

ఇది Motivational Stories విభాగానికి చెందిన తెలుగు కథ.

ఈ కథకు సంబంధించిన అంశాలు: Mano Shakthi Telugu Lo Stories Kathalu | మనోశక్తి, Motivational stories in Telugu, Telugu inspirational stories, Success stories in Telugu

#TeluguStories #MotivationalStories #TeluguInspirationalStories #SuccessStories #TeluguKathalu

ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు

Post a Comment

Previous Post Next Post