Sampoorna Ramayanam Part 35| సంపూర్ణ రామాయణం - రోజు 35 యుద్ధకాండ ప్రారంభం

Sampoorna Ramayanam Part 35| సంపూర్ణ రామాయణం - రోజు 35 యుద్ధకాండ ప్రారంభం 



Sampoorna Ramayanam Part 35| సంపూర్ణ రామాయణం - రోజు 35 యుద్ధకాండ ప్రారంభం 


Sampoorna Ramayanam Part 35| సంపూర్ణ రామాయణం - రోజు 35 యుద్ధకాండ ప్రారంభం



🚩 సంపూర్ణ రామాయణం - 35 వ రోజు 🚩 | యుద్ధకాండ ప్రారంభం | జై శ్రీరామ్!


సుందరకాండ ముగిసిన తర్వాత, అధర్మంపై ధర్మం సాధించే మహా సంగ్రామానికి వేదికైన 'యుద్ధకాండ'లోకి నేడు ప్రవేశిస్తున్నాం.యుద్ధకాండ విశేషాలను వివరంగా తెలుసుకుందాం.


📍 వార్త సేకరణ - విజయ సంకల్పం:

హనుమంతుడు లంక నుండి తిరిగి వచ్చి, సీతమ్మ జాడను రాముడికి తెలియజేయడంతో రాముడి ఆనందానికి అవధులు లేవు. హనుమ నీవు చేసిన మేలుకు నేను సరితూగే బహుమతి ఏది ఇవ్వలేను అని హనుమను ఆలింగనం చేసుకున్నాడు,ఈ హనుమను ఆలింగనం చేసుకునే ఘట్టం సాధనా పరంగా చాలా విశిష్టం అయినది.

Best Telugu Story about Friendship Stories :  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


ఆ తదుపరి వెంటనే ఇప్పుడు సీత ఎక్కడ ఉందో మనకు తెలుసు కనుక ఆలస్యం చేయకుండా వెంటనే మనం దక్షిణ సముద్రం వైపు బయలు దేరాలి అన్నాడు.సుగ్రీవుడి ఆజ్ఞతో కోట్లాది మంది వానర సైన్యం నీలుడి నాయకత్వంలో లంక వైపు పయనమైంది. మహేంద్ర పర్వతాన్ని దాటి సముద్ర తీరానికి చేరుకున్న రాముడు, ఆ అగాధమైన సముద్రాన్ని ఎలా దాటాలో ఆలోచిస్తూ లంకపై దండయాత్రకు సిద్ధమయ్యాడు.హనుమ లంకా నగరం లో తాను చూసిన సైన్య బలం, రక్షణ వ్యవస్త మొత్తం రామునికి నివేదించాడు. సైన్యం మొత్తం దక్షిణ సముద్ర తీరం చేరి అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకుంది.


📍 విభీషణ శరణాగతి (అత్యంత కీలక ఘట్టం):

మరోవైపు లంకలో, రావణుడి తమ్ముడైన విభీషణుడు సీతమ్మను రాముడికి అప్పగించమని హితవు పలికాడు. కానీ, గర్వంతో ఉన్న రావణుడు విభీషణుడి మాటలు లెక్క చేయనుడ్న అతన్ని అవమానించి బయటకు గెంటివేశాడు. దీంతో విభీషణుడు నేరుగా రాముడిని ఆశ్రయించాడు. వానర వీరులు అనుమానించినా, రాముడు మాత్రం "న త్యజేయం కథంచన" (నన్ను ఆశ్రయించిన వాడు శత్రువైనా సరే, ప్రాణమిచ్చైనా రక్షిస్తాను) అని ప్రకటించి విభీషణుడిని చేరదీశాడు. అక్కడే సముద్ర తీరంలో విభీషణుడికి 'లంకారాజ్య పట్టాభిషేకం' చేసి, రాముడు తన మాటను నిలబెట్టుకున్నాడు.


📍 సముద్రుడిపై ఆగ్రహం & వారధి నిర్మాణం:

సముద్రుడు నీ ప్రసన్నం చేసుకొని దారి పొందటం కోసం రాముడు మూడు రోజుల పాటు ఉపవాస దీక్ష చేశాడు. అయినా స్పందించని సముద్రుడిపై రాముడు ఆగ్రహించి, బ్రహ్మాస్త్రాన్ని సంధించబోగా, సముద్రుడు ప్రత్యక్షమై క్షమించమని వేడుకున్నాడు. వానర సైన్యంలో ఉన్న 'నల-నీలుల' చేతుల మీదుగా రాళ్లు సముద్రంలో వేస్తే అవి తేలుతాయని సూచించాడు.


కోట్లాది మంది వానరులు పర్వతాలను, బండరాళ్లను తెచ్చి సముద్రంలో వేయగా, కేవలం ఐదు రోజుల్లోనే 100 యోజనాల పొడవైన అద్భుతమైన 'రామసేతువు' నిర్మితమైంది. ఈ వారధి ద్వారా రామలక్ష్మణులు, వానర సైన్యంతో కలిసి లంకలోని 'సువేల పర్వతం'  చేరుకునీ అక్కడే శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు.


✨ రాముడు విభీషణుడిని ఆదరించిన తీరు మనకు 'శరణాగతి' విలువను నేర్పుతుంది. తప్పు చేస్తున్న వారిని వదిలి, ధర్మం వైపు నిలబడటమే నిజమైన భక్తి.


యుద్ధకాండ చాలా పెద్దది కానీ ముఖ్యమైన విషయాలు మాత్రమే స్పృశిస్తూ అందించే ప్రయత్నం చేస్తాను. సుందరకాండ లాగ పూర్తి కథ ఇవ్వలేను. కచ్చితంగా శ్రీ రామ అనుగ్రహం తో మరొక్క సారు ప్రతి విషయాన్ని విపులంగా తెలుసుకుంటూ చదివే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ముందుగా అనుకున్నట్టే శ్రీ రామ నవమి రోజు పూర్తయ్యే విధంగా ఎంత వివరంగా చెప్పుకో గలిగీతె అంత చెప్పుకుందాం...


శ్రీరామ జయమ్! లక్ష్మణ జయమ్! కపిరాజ జయమ్!


....సశేషం


Read more at స్నేహం - Friendship Telugu Lo Stories Kathalu for Kids 2026

బలం విష్ణోః ప్రవర్ధతాం   #Ramayanam #Yuddhakanda #SriRamaNavami #SanatanaDharma #RamaSetu #VibhishanaSharanagati

Post a Comment

Previous Post Next Post