Success at Work… But Failure in Life! | వృత్తిలో విజయం… జీవితంలో వైఫల్యం!
Success at Work… But Failure in Life! | వృత్తిలో విజయం… జీవితంలో వైఫల్యం!
అనగనగా ఒక ఆర్థోపెడిక్ వైద్యుడు. ఎంబీబీఎస్, ఎమ్మెస్ అవీ అన్నీ చేసి జర్మనీ వెళ్లి ఫెలోషిప్పు అవీ అన్నీ చేసి మోకాలి కీళ్ళ మార్పిడి చికిత్స బాగా నేర్చుకుని, ఆ కీళ్ల వైద్యం చెయ్యడంలో గొప్ప నేర్పరి అయ్యాడు.
అతను ప్రతివారం ఈ మోకాలి కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తూ ఉండేవాడు. వారానికి రెండ్రోజులు ఓపీల్లో రోగుల్ని చూస్తూ వాళ్లకి కీళ్ల గురించి ఏం చెయ్యాలి అని వాళ్ళకి సవివరంగా చెప్పేవాడు. రోగుల్ని పరీక్ష చేసే మంచం మీద పడుకోబెట్టి వాళ్ళకి మోకాలి కీలు చుట్టూ ఉండే కండరాలు బలపడటానికి రకరకాల వ్యాయామాలు నేర్పేవాడు.
మెట్లు ఎక్కకండి, మటం వేసుకుని కూర్చోకండి వంటి సలహాలు ఇస్తూనే, నడవడం కంటే సైక్లింగ్ మోకాళ్లకి మంచిదని చెప్తూ ఉండేవాడు. అతను కూడా అందరూ బీచు రోడ్డులో నడకకి వెళ్తే అతను మాత్రం సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేవాడు. నడిచి వెళ్ళేవాళ్ళని చూసి వాళ్ల అజ్ఞానాన్ని చూసి బాధపడేవాడు అరెరే వీళ్ళు వాళ్ల బరువంతా కీళ్ళ మీద వేసి పాడుచేసుకుంటున్నారే అనీ. వాళ్ళలో ఎవరెవరికి ఎన్నాళ్ళలో కీళ్లు అరిగిపోయి మార్పిడి అవసరం అవుతుందో అని లెక్కలు వేసేవాడు మనసులో.
ఈ కీళ్ళ మార్పిడి గురించి అతను యూట్యూబు, ఇన్స్టా లాంటివాటిల్లో చాలా వీడియోలు చేసి ప్రజలకి అవగాహన కల్పించేవాడు. అతను అంతర్జాతీయ జర్నళ్లలో కీళ్ల మార్పిడి మీద పరిశోధనా పత్రాలు రాసేవాడు. ప్రతివారం మిగతా ఎముకల వైద్యులతో కలిసి బీచు రోడ్డులోని ఏదో ఒక హోటల్లో జరిగే మెడికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేవాడు. అలాగే ప్రతి మూడు నెలలకి సింగపూరు, ఐరోపా, లేదా ఉత్తర అమెరికా దేశాలకి వెళ్లి అక్కడి కాన్ఫరెన్సులలో పాల్గొనేవాడు. చాలామంది జూనియర్ వైద్యులకి అతని మెళకువలు నేర్పాడు.
ఎవరో విలేఖరి మీకు మోకాలు అంటే ఎందుకంత మమకారం అని అడిగితే, తాను ఎంబీబీఎస్ మొదటి ఏడాది అనాటమీ పరీక్షలో అందరూ నీ (మోకాలి) జాయింటు ఎస్సే అడిగితే అందులో ఉండే ఎముకలు, లిగమెంట్లు, నరాలు, నాడులు, కండరాలు అన్నీ కలిపి చక్కగా రాయటం వలన, లివర్ బ్లడ్ సప్లయ్ ప్రశ్నకి సమాధానం తెలియక రాయటం వదిలేసినా ఆ పరీక్ష పాసయ్యినట్లు అప్పట్నుంచీ అయితే మోకాలు వైద్యుడే అవ్వాలి అని నిర్ణయించుకున్నానని చెప్పాడు.
ప్రతి ఐదేళ్లకి మోకాళ్లకి ఒక ఎక్సరే తీయుంచుకుని వాటిని గత ఎక్సరేలతో పోల్చుకుని హమ్మయ్య బాగానే ఉన్నాయి అనుకునేవాడు. వాళ్ళవిడ పూజకి కాళ్ళు మడిచి కూర్చుంటే, మానేస్తే పూజ మానెయ్ కానీ మోకాళ్ళు మడవకు అని హుకుం జారీ చేశాడు. మోకాళ్ళు అంటే అంత జాగ్రత్త అతనికి.
ఒకరోజు వర్షం పడుతోంది అని, పొద్దున్నే ఇంట్లో ఉన్న ఎలిప్టికల్ మీద ఎక్సర్సైజు చేస్తుంటే ఎందుకో ఒక్కసారిగా భళ్లున వాంతి అయింది. పరగడుపున కాబట్టి కడుపులో ఆహారం లేదు. వాంతి అంతా రక్తం. ఎరుపు నుంచి ముదురు కాఫీ రంగులో ఉంది ఆ రక్తం. వెంటనే శోష వచ్చి పడిపోయాడు.
లేచి చూసేసరికి పైన లైట్లు బాగా కాంతివంతంగా వెలుగుతున్నాయి. చుట్టూ చూస్తే అతనికి బాగా తెలిసిన వాతావరణమే. అతని ఆసుపత్రే కాకపోతే ఇప్పుడు అతనే అక్కడొక పేషెంటు. అల్ట్రాసౌండు, అప్పర్ జీఐ ఎండోస్కోపీ అన్నీ అయ్యాయి.
రిపోర్టులు పక్కన ఉంటే చూసుకున్నాడు. లివర్ సిర్రోసిస్ విత్ పోర్టల్ హైపర్టెన్షన్ అని ఉంది. నమ్మలేకపోయాడు.
ఈలోపు గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు వచ్చాడు. “మీరు బాగా ఎక్కువ కాన్ఫరెస్నులకి వెళ్లినట్లున్నారు?” అని అడిగారు.
“అవును డాక్టర్, ఎందుకలా అడుగుతున్నారు!?” అని అనుమానంగా అడిగాడు ఆర్థో డాక్టర్.
“ఏం లేదు, కాన్ఫరెన్సు, వారాంతం మెడికల్ ఎడ్యుకేషన్ మీటింగ్ అనంతరం బాగా తాగితేనూ లివర్ చెడిపోయింది. సిర్రోసిస్ వచ్చింది.” అని వివరించాడు అతను.
ఆర్థో డాక్టరు మౌనంగా ఉండిపోయాడు.
“కీళ్లు పట్టుకుని కాలేయం వదిలేశారు మీరు!” అని అంటూ ఆ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు నడుచుకుంటూ బయటికెళ్లి మెట్లెక్కి పైవార్డుకి వెళ్లిపోయారు.
నీతి (మోరల్):
“ఒక్క విషయంపైనే అతిగా దృష్టి పెట్టి, మిగతా ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేస్తే జీవితం అసమతుల్యమవుతుంది.”
లేదా మరింత స్పష్టంగా చెప్పాలంటే:
“వృత్తి నైపుణ్యం ఎంత ఉన్నా, స్వీయ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తే ఫలితం చేదుగా మారుతుంది.”
మరొక విధంగా చెప్పాలంటే:
“ఇతరులకు ఉపదేశం చేసే ముందు, మనమే ఆచరించాలి.”
ఈ కథ మనకు చెబుతున్న ప్రధాన సందేశం ఏమిటంటే —
మోకాళ్ల ఆరోగ్యంపై అంత శ్రద్ధ పెట్టిన వైద్యుడు, తన కాలేయ ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోలేదు. ఒక వైపు శాస్త్రజ్ఞానం, మరో వైపు జీవనశైలి. రెండింటి మధ్య సమతుల్యత లేకపోతే పరిణామం ప్రమాదకరం.
జీవితంలో సమతుల్యతే అసలైన ఆరోగ్యం.
Success at Work… But Failure in Life! | వృత్తిలో విజయం… జీవితంలో వైఫల్యం!
Success at Work…
But Failure in Life!
A Moral Story for Children
Once upon a time, there was a very famous bone doctor. He
studied very hard and completed all his medical degrees. He even went to
Germany to learn special training in knee replacement surgery. Soon, he became
an expert in treating knee problems.
Every week, he performed many knee surgeries. On certain
days, he met patients in his clinic and carefully explained how to protect
their knees. He taught them exercises to make their leg muscles stronger.
“Don’t climb too many stairs.”
“Don’t sit cross-legged.”
“Cycling is better than walking for your knees,” he would say.
He followed this advice himself. While others went for
morning walks, he chose to ride a bicycle. When he saw people walking, he would
think, “Oh no! They are putting too much weight on their knees. One day they
may need surgery!”
He made videos online to teach people about knee care. He
wrote research papers. He traveled to many countries to attend medical
conferences. He trained many young doctors. Everyone admired him for his
knowledge and skill.
One day, a reporter asked him, “Why do you love knees so
much?”
The doctor smiled and said, “When I was a first-year medical
student, I passed an important exam because I wrote a perfect answer about the
knee joint. From that day, I decided to become a knee specialist!”
He took great care of his own knees too. Every five years,
he got X-rays done just to make sure they were healthy. If his wife tried to
sit cross-legged during prayers, he would quickly say, “Don’t bend your knees
too much!”
He was very careful about knees.
But one rainy morning, something unexpected happened. While
exercising at home, he suddenly felt sick and vomited blood. He fainted and was
rushed to the hospital.
When he opened his eyes, he realized he was no longer the
doctor — he was now the patient.
After several tests, the reports showed that he had severe
liver disease. He was shocked.
Another doctor gently asked him, “You attend many
conferences, don’t you?”
“Yes,” he replied.
The doctor explained, “After conferences and meetings, if
someone drinks too much alcohol again and again, it can damage the liver. That
is what has happened.”
The knee specialist sat quietly. He had taken great care of
his knees… but had forgotten to take care of his liver.
As the other doctor walked away, he said softly,
“You protected your knees… but ignored your liver.”
Moral of the Story
- If we
focus too much on one thing and ignore other important things, life
becomes unbalanced.
- No
matter how successful we are in our profession, neglecting our own health
can lead to serious problems.
- Before
advising others, we must practice what we preach.
True health comes from balance in life.
#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories
#storyintelugu #storiesintelugu #teluguneethikathalu #neethikathalu #telugufairytales #telugumoralstories #telugulostories
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
Best Telugu Story about Friendship Stories : https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
Post a Comment