Telugu Lo Stories | ఎడ్ల బండి Telugu Story
సిపిఎం జాతీయ మహాసభల సందర్భంగా జరిపిన కథల పోటీలో ప్రచురణకు ఎంపికైన కథ !
బహుశా మీకు ఓడలు బండ్లవడం గురించి తెలిసే ఉంటుంది. అలాగే బండ్లు ఓడలుగా కూడా.అయితే ఎడ్ల బళ్లు ఉద్యమం బాట పట్టి సమ్మె చేయడం గురించి మీకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అది మా ఊళ్ళో జరిగింది. బళ్ల వెనుక మనుషులున్నారు. జీవితాలున్నాయి. తరాతరాల బతుకులున్నాయి. అదొక్కటీ తెలుసుంటే మీరు కథ చదవడానికి అర్హులే. ఆలస్యమెందుకు? పదండి ముందుకు...
చెట్టు నీడ. ఎడ్ల బండి చక్రం ఊడదీసి బలమైన రాటను జాకీలా మోపు చేశాడు కాసులు. తగువు తేలిపోతే బండిని రోడ్డెక్కించాలని నార ఎక్కించే పని పెట్టుకున్నాడు. సుబ్బడు సాయంగా ఉన్నాడు. కాసులు చెమటతో తడిసి ముద్దయ్యాడు. ఒడుపుగా మధ్య మధ్య లో ఆముదం పోస్తూ బండి ఇరుసుకు జనపనారను గట్టిగా చుడు తున్నాడు. ఆము దం వాసన. చిత్రమైన కంపు. ముఖానికి వేడి గాడ్పు కొడుతు న్నది.
చేతి కర్ర ఊతంతో ఆయా సపడుతూ సత్యం వచ్చాడు. ఎడ్ల బండి తోలుకుంటూ కిరాణా సరకులు రవాణా చేయడంతోనే అతని జీవితకాలమంతా గడిచిపోయింది. సాదక బాధకాలు బాగా ఎరిగినవాడు. ఇప్పుడు కొడుకును అదే పనిలో దింపి తను తప్పుకున్నాడు. ఎద్దుల మనసు చదివినవాడు.
''ఈ సందేళ కూచుని ఏదో కాసేపు ముచ్చట్లాడేసుకుని, సీకటడింతర్వాత తాగి తొంగుంటే సరిపోదు. పొద్దుట సద్ది ముద్దవేళ అందరూ బండ్లు కట్టుకుని దొరగారి బంగ్లాకి చేరిపోవాలి. అందరూ కనకాలపేట వాళ్ళే గనుక ఒకళ్లనొకళ్ళు హెచ్చరిక చేసుకుని బయలెల్లాలి. అటో ఇటో తేల్చేద్దాం.. నాయాల కుటుంబాల్లోని చిన్నాచితకా అందర్నీ బీరుపోకుండా బండ్లు ఎక్కించుకుని వెళ్లిపోవాలి. మన బలం ఏపాటిదో ఎరుక పర్చాలి. ఆ తర్వాత జగన్నాథం బాబున్నాడు... ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఆ పైన దేవుడున్నాడు..'' నేల మీద పడి వున్న దుంగపై కూర్చుని అన్నాడు సత్యం.
''దేవుడుండాడా? ఉంటే ఈ బతుకు నలుగుడు కట్టాలేంటి?'' కాసులు అన్నాడు. నిక్కరు జేబులోంచి జాగ్రత్తగా వేళ్ళతో చుట్ట తీసి నోట్లో పెట్టుకున్నాడు. చేతుల నిండా మసి. సుబ్బడు అగ్గిపుల్లతో వెలిగిం చాడు. కాసులు దమ్ము లాగాడు. ఓసారి బండికేసి చూశాడు. అతని చూపు గ్రహించాడు సత్యం.
''ఏ మాత్రం పెట్టావేంటి? '' సత్యం అడిగాడు.
''ఈ బండికి పెట్టిన పెట్టుబడికి నానా సంకలు నాకాను. ఈ మోస్తరు తయారు కావడానికి డబ్బులకి రెక్కలొచ్చాయనుకో. గుడ్డి నమ్మకంతో అప్పుచేసి, మళ్ళీ..ఇట్టంగానే అనుకో.. వొళ్ళు తెలవకుండా బాగు చేసి ఈ కాడకి తీసుకొచ్చాను. అంతా కొత్త బండికి చేసినట్లే. నువ్వే చూడు... చక్రానికి ఆకులు.. పూటీలు.. ఇనుప పట్టా.. అన్నీ మార్చేశాను. డబ్బులు ఖర్సైపోబట్టి గానీ పోలికర్ర కూడా మార్చేద్దును. ఏనాటిదో అది. అక్కడక్కడ చిట్లింది, మరో దఫా చూద్దాం లే అనుకుని...'' అన్నాడు కాసులు.
సుబ్బడు ఆముదం సీసా తన్నేశాడు... సన్నని ధారతో వొలికి పోతోంది.
''ఎదవ నాయాల...తిన్నగా చూసి అడుగెయ్య లేవా?'' అంటూ సత్యం గదమాయించాడు.
''ఒరేరు కాసులూ ... ఇందాక చూసాను. ఎద్దులకు మెత్తగాళ్ళు పడినట్లున్నాయేంటి?''
'' అవును.. రేపు ఈ గొడవ తేలిం తర్వాత నాడాలు ఏయించాలి. ముగ్గురు మనుషులుంటే గానీ పనవ్వదు. ఎద్దుని పడగొట్టాల. డెక్కల మీద నాడాలు కొట్టాలి. ఎద్దుకు వంద కొడితే గానీ నాడాలేసేవాడు వొప్పడం లేదు.'' అన్నాడు కాసులు. ''కానీ మాత్రం, ఒరేరు! ఏ మాటకామాట సెప్పుకోవాలి. మన కనకాల పేటలో బండినీ, ఎద్దుల్నీ నీ అంత కుశాలంగా చూసుకునేవాడు లేడు రా. తొట్టె గెడల మధ్య మోకుతో బిగించిన పడకదిన్నె అదిరందనుకో. ఎద్దులకు రంగుల దారాలతో కట్టిన మువ్వలు, నగిషీల చిడతలు, సొంపుగా ఒసికర్రల మధ్య అల్లిన ఎదురు తడికలు మంచి కుదురుగా వాటంగా అమరాయి. సోగ్గాడి బండిలా ఇంపుగా గూడు.. దాని పైన నల్లటి టార్పాలిన్.. అందుకే కాసులుగాడి బండి చూసి అందరూ ఉడుక్కుంటారు. కుళ్ళి చస్తారు.'' సత్యం పొగిడాడు.
''ఏమిటో పిట్టను కొట్ట పొయ్యిలో పెట్ట... అన్నట్టుంది బతుకు. మా జయవిజయుల కడుపు నింపేటప్పటికి తల తోకకు వత్తున్నాది.
ఉలవలు, గంట్లు, తవుడుతో ఉడకపెట్టిన దాణా తడిసి మోపిడవుతున్నాది. గుర్రం గుడ్డిదైన దాణా తప్పదన్నట్లు... పనున్నా లేకపోయినా తిండి తప్పదు కదా. పైగా మా నేస్తాలకు కాకినాడ వెళ్ళొస్తే చాలు వేడినీళ్ల కాపడం పెట్టాలి.'' కాసులు అన్నాడు.
''నువ్వు అలా అలవాటు చేసావు... సరేలే, నేనొత్తాను. రేపొద్దును ఎలాగూ వుంది కదా రగడ. సూద్దాం! గవర్నమెంటోడు దిగొత్తాడో లేదో?'' సత్యం లేచి నిలబడ్డాడు, వెళ్లడానికి సిద్ధపడుతూ.తెల్లారింది. సముద్రం మూల సూర్యుడు ఎర్రగా కందిపోయి పెద్దగా కనిపిస్తున్నాడు. గోదారి మీంచి చల్లటి గాలి రివ్వుమని కొడుతూంది. లంకల్లోంచి పాలు పితుక్కుని వచ్చేవాళ్ళూ, న్యూస్ పేపర్లు పంచే కుర్రాళ్ళూ, ముసుగులు తొడుక్కుని నడకే ఆరోగ్యరహస్యమని చిరుచెమటలతో నడిచే వాళ్లూ, ఇళ్ల ముందు కళ్ళాపు జల్లుకుని ముగ్గులేసుకునే ఆడాళ్లూ, వీపులకు బ్యాటులు తగిలించుకుని మోటారు వాహనాల మీద ఇండోర్ స్టేడియంకు వెళ్ళేవాళ్ళూ, కురచ ఖాకీ నిక్కర్లతో కవాతులు చేస్తున్న ఆరెస్సెస్ వాళ్ళూ, సైరన్ మోత వినిపించగానే వడివడిగా పిరమిడ్ మందిరానికి పరుగులు పెట్టేవాళ్లూ... అంతటా సుందర తేట హృదయాల పసందైన ఉదయపు కోలాహలం.
Telugu Lo Stories Kathalut Peacock Nemali | సంభోగం చేయని ప్రాణి నెమలి
ఎడ్లబండ్లు సాఫీగా బహు నెమ్మదిగా రోడ్డు మీద బారులు తీరి వస్తున్నాయి. గిట్టల శబ్దం లేదు. కొరడా ఝలిపింపులు లేవు. అదలింపులు లేవు. ముందు బండి దారి చూపుతుంటే మిగిలినవి అనుసరిస్తున్నాయి. విషయమేమిటో తెలియని జనం వింతగా చూస్తున్నారు.
దొరగారి బంగ్లా చేరాయి. ఆ బంగ్లాలో యానాంలోని సమస్త ప్రభుత్వ శాఖలకు ముఖ్య అధికారి ఉంటాడు. ఆయన్ని ప్రాంతీయ పరిపాలనాధికారి అంటారు.
బంగ్లా చుట్టూ రెండు వరుసలలో బండ్లను నిలిపారు. ఎడ్లను బండ్లకు కట్టేశారు. కాడి దగ్గర తొట్టిలో బండి లోంచి ఎండు గడ్డి తీసుకొచ్చి వేశారు. తోకలూపుకుంటూ ఆత్రంగా గడ్డిని అందుకుంటున్నాయి.
Telugu Lo Stories Kathalut Peacock Nemali | సంభోగం చేయని ప్రాణి నెమలి Updated 2026
ఇంతలో జగన్నాథం వచ్చాడు. తెల్లని ఛాయ. అందంగా పెరిగిన చిరుగెడ్డం. కళ్ళల్లో మెరుపు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నాడు. నలభై ఏళ్ల వయసు. ప్రజా సమస్యల పట్ల స్పందించి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
''నేను చెప్పేంత వరకూ మీరిక్కడే ఉండండి'' అంటూ లోపలికి వెళ్ళాడు జగన్నాథం.
అరగంటయ్యింది. ఏ కబురూ లేదు. బళ్ళ వారందరూ గుంపుగా చేరి కబుర్లలో పడ్డారు.
'' ఏం జరుగుతుందో లోపల?''
''పని అవుతుందంటావా!''
''ఇంకా ఎంతసేపు...''
''ఆఫీసరు గార్కి మన బాధ అర్థం చేసుకోవాలా? ఆ పైన పాండిచేది వాళ్ళతో మాట్లాడాలా? ఊరికే కంగారుపడితే ఎలా?''
''ఆఫీసరు గారు లేరంట. గుడికెళ్లారంట. ఆయన రావాలి. అప్పుడు దాకా అంతే.''
అసలు విషయం తెలిసింది. రకరకాల వ్యాఖ్యానాలు.
''అక్కడ్నుంచి అటే ఏ కాకినాడకో చెక్కేసాడేమో. జగన్నాథం బాబు ప్రతిపక్షం వాడు కదా, ఆయనకు పేరొస్తే ఎలా? పై నుంచి సంకేతాలు అందుంటాయి.'' ఊళ్ళో జరిగే ప్రతి సంఘటననూ రాజకీయాలకు ముడి పెట్టి మాట్లాడేవాడొకడు అంటున్నాడు. జగన్నాథం వచ్చాడు. కోపంతో ఆయన ముఖం మరింత ఎర్రబారింది. ఆవేశం రగులుకున్న మనిషిలా ఉన్నాడు. ''మన దెబ్బకు జడిసినట్లున్నాడు. ఫోన్‌లో మాట్లాడితే సాయంత్రం రమ్మంటున్నాడు. కనీసం మనం చెప్పే విషయాలు వినకపోవడం దారుణం. ఓ గంట చూద్దాం. అప్పుడే ఆలోచిద్దాం ఏం చేయాలో?'' జగన్నాథం పైమెట్టు మీద నిలబడి బళ్ళ వాళ్ళందరికీ వినపడేలా గట్టిగా అన్నాడు. వాళ్ళ ఉత్సాహం నీరు గారింది. ఏదో రకంగా తేలిపోతుందనే నమ్మకం సన్నగిల్లింది. అనుకున్న సమయం గడిచింది. అంతా అసహనంగా ఎదురు చూస్తున్నారు.
అప్పటికే జగన్నాథం ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. అందర్నీ దగ్గరకు రమ్మని పిలిచాడు.
''పద్ధతి ప్రకారం ముందు రోజే మనం చేయబోయే నిరసన గురించి తెలియజేసాం. దీనికి పెద్దగా ఆలోచించక్కర్లేదు. వాళ్ళు కావాలనే మనకు ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు. ఎవరూ భయపడక్కర్లేదు. నేను చెప్పినట్టు చేయండి. ఎడ్లను బళ్ళ నుండి విప్పండి. జాగ్రత్తగా ఈ చిన్న మెట్ల గుండా ఆఫీసు గ్రౌండులోకి తోలుకు రండి. మనం తెగించకపోతే లాభం లేదు.
ఊ...కానీయండి.''
జగన్నాథం ఆదేశించగానే పొలోమని ఎద్దుల్ని ఆఫీసు ఎదురు ఖాళీ ప్రదేశంలోకి వదిలేశారు. అవి కదను తొక్కాయి. పూల మొక్కల్ని ధ్వంసం చేశాయి. కనకాంబరాలు, చేమంతులు, బంతిపూలు, గులాబీలు, క్రోటన్సు, సన్నజాజులు... అన్నింటినీ తొక్కి పారేశాయి. ఆ ప్రాంతమంతా పేడతో ఖరాబు అయ్యింది. ఎవరూ ఊహించలేదు.
ఉద్యోగులు బయటకు రాలేదు. చక్కగా తీర్చిదిద్దినట్లు పెంచుతున్న పూలవనం నిమిషంలో బోడిగా మారిపోయింది. అప్పుడొచ్చారు పోలీసులు. ఎద్దుల్ని బయటకు తోలడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
నిమిషాల్లో జగన్నాథం మరో నిర్ణయం తీసుకున్నాడు.టెంట్ వచ్చింది. కుర్చీలు వచ్చాయి. కుటుంబ సభ్యుల్ని అందులో కూర్చోబెట్టాడు. ప్లెక్సీలొచ్చాయి. నినాదాలు రాసిన ప్లకార్డులు నలుమూలలా పెట్టారు.
కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories
'పాండిచేరి ప్రభుత్వం ఆదుకోవాలి', 'తూ.గో జిల్లా కలెక్టరుతో మంతనాలు జరపాలి', 'ఎడ్ల బండ్ల మీదే ఆధారపడ్డ వారికి అండగా నిలవాలి', 'తూ.గో జిల్లా వాణిజ్య అధికారుల జులం నశించాలి', 'మట్లపాలెం బళ్ళను అడ్డగించి సరుకులు దింపేసి ఎద్దుల్ని కట్టడిలోకి తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి', 'కిరాణా సరకుల రవాణాను యధాప్రకారం కొనసాగించాలి'.. ఈ రాతల్ని చుట్టూ అంటించారు.
వాతావరణం మారిపోయింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఉత్కంఠ పెరిగిపోయింది. పరిపాలనాధికారి సూర్యతేజ వచ్చారు. ఎవరినీ పలకరించకుండా లోపలికి వెళ్ళిపోయారు. చర్చలకు పిలవలేదు.
కాసేపటికి సూపరిండెంటు మరో గుమస్తా వచ్చారు.''ఇది ప్రభుత్వ పరిధిలో పరిష్కరించే సమస్య కాదు. పరాయి రాష్ట్రం వారు తీసుకున్న నిర్ణయానికి మనం బాధ్యులం కాము.'' అని పరిపాలనాధికారి మాటగా చెప్పారు.
''కుదరదు. సూర్యతేజగారు స్వయంగా టెంటు దగ్గరకు రావాల్సిందే. మేం ఆయనతోనే మాట్లాడతాం.''
మరో అరగంటలో సూర్యతేజ శిబిరం దగ్గరకు వచ్చారు. జగన్నాథం స్పష్టంగా చెప్పాడు.
''వీరంతా వారానికి ఒక రోజు అంటే ఆదివారం నాడు కాకినాడ వెళతారు. షావుకార్లు సరుకుల్ని కొనిబడి చేసి బళ్ళకు అప్పగిస్తారు. మంగళవారం పొద్దుటకు యానాం చేరతాయి. యానాం చుట్టు పక్కల గ్రామాలకు వీళ్ళే కిరాణా సామానులు తీసుకొస్తారు. ఇది ఇప్పుడు కొత్తగా మొదలయ్యింది కాదు. వందల ఏళ్ళ నాటి నుంచి జరుగుతున్న విధానం వీటికి మోటారు వెహికల్స్‌కి మల్లే వే బిల్లులేంటి? డబ్బులు లంచాలేమిటి? అవగాహన లేకుండా ఆంధ్రా వాళ్ళు చేస్తున్నారు. యానాంలో ముఖ్యంగా కనకాల పేటలో చాలా కుటుంబాలు ఇదే వృత్తిలో ఉన్నాయి. మానవతాదృష్టితో ఆలోచించి న్యాయం చేయమని కలెక్టరు గారికి మన ప్రభుత్వం తరుపున చెప్పుకుందాం.
కోరదాం. వాళ్లు అంగీకరించకపోతే ఏం చేయాలో ఆలోచిద్దాం.'' అన్నాడు జగన్నాథం. ''పాండిచేరి అధికారులతో మాట్లాడి చెబుతాను.
ముందుగా మీరు ఈ ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళిపోండి. ప్రశాంత వాతావరణం ఏర్పడాలంటే మీ సహకారం అవసరం. జగన్నాథం గారూ, నాక్కొంచెం సమయం ఇవ్వండి, దయచేసి అందర్నీ ఇక్కడ్నుంచి తీసుకుపోండి.'' అని సూర్యతేజ చెప్పి వెళ్ళిపోయాడు.
''ఆయన దగ్గర్నుంచి సరైన స్పందన వచ్చిందాక కదలొద్దు'' అన్నాడు సత్యం.
''అలాగే...'' అన్నాడు జగన్నాథం.
బండివాళ్ళ సమ్మె ప్రభావం అంత తేలిగ్గా తీసేయదగ్గది కాదని ఊళ్ళో వాళ్ళకు తెలుసు. కాకినాడ నుండి రావాల్సిన టోకుగా తీసుకున్న సరకులు నిలిచిపోతాయి. దాంతో ధరలు పెరిగిపోతాయి. అమ్మకందార్లు తమ దగ్గర ఉన్న నిత్యావసర వస్తువులను దాచి అమ్మడం మొదలెడతారు. పత్రికలు విరుచుకుపడతాయి. కోరింగ రేవు గుండా జల రవాణా చేసుకోవాల్సి వస్తుంది. దానికి మరల ఎలాంటి సమస్యలొ
స్తాయో తెలియదు. పరిస్థితి చక్కదిద్ద కపోతే మరింత గడ్డు కాలం దాపురిం చడం ఖాయమని అందరూ అనుకు న్నారు.
సాయంత్రమైంది...
ఆఫీసు ప్రాంగణం లోని మొక్కల్ని పాడు చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించినందుకు శిబిరంలో ఉన్నవాళ్లు నోటీసులు అందుకున్నారు.
ఇంత దాకా వచ్చాక అరెస్టులకైనా సిద్ధపడక తప్పదని జగన్నాథం తెలియజేశాడు.
మచ్చికైన ఎద్దులు ఎంత గొప్పగా విశ్వాసాన్ని ప్రకటిస్తాయి? పోలీ సులు వాటిని బయటకు తోలేయగానే సుశిక్షు తులైన సేవకుల్లా తమ బండిని గుర్తించుకుని సరిగ్గా అక్కడకెళ్ళి నిలబడ్డాయి. వాటి క్రమశిక్షణ తీరు గొప్పది. యానాం నుండి కాకినాడ వెళ్ళేటపుడు గానీ, సరుకులు నింపుకుని తిరిగి యానాం వచ్చేటప్పుడు గానీ ప్రత్యేకంగా తోలనక్కర్లేదు. రోడ్డు ఎడమ పక్కన నిదానంగా నడుచుకుంటూ పోతాయి.
బండివాడు నిండా సరుకులు సర్దుకుంటాడు. కాకినాడలో జనం సద్దుమణిగాక రాత్రి పదకొండు గంటలకు బళ్ళన్నింటినీ ప్రయాణానికి సిద్ధం చేస్తారు. అన్ని బళ్ళు ఒకేసారి బయలు దేరతాయి. ముందున్న బండివాడు ఎదర తొట్టె మీద పడుకుని ఎద్దుల్ని అదలిస్తాడు అంతే. ఇక వాటి గమనం సంగతి పట్టించుకోనక్కర్లేదు. ఆదమరచి నిద్రపోయినా ఇబ్బంది లేదు. చక్కగా నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ గమ్యం చేరుస్తాయి. ప్రతి బండి అడుగున ఇరుసు మధ్యగా కిరోసిన్ లాంతరు వెలిగించి వేలాడదీస్తారు. అది అటూ ఇటూ ఊగుతూ వుంటుంది. లారీలు, బస్సులు దూరం నుంచే వెలుగును బట్టి బళ్ళను గుర్తించడం వల్ల చీకటి రాత్రుల్లో కూడ ప్రమాదాలు జరిగే అవకాశం లేదు.
ఏమైంది అక్కడీ ఏదో గలాభా జరుగుతున్నట్టుంది?
కాసులు ఎద్దు తన కొమ్ములతో పోలీసును పొడిచింది. బొక్క బోర్లా పడ్డాడు. లేచి నిలబడి బట్టలు దులుపుకుని అటూ ఇటూ చూశాడు. కాడి చిడత లాక్కుని ఎద్దుని కుమ్మడం మొదలెట్టాడు. అక్కడితో ఆ పోలీసు కోపం చల్లారలేదు. గబగబా బండెక్కి తడికలకు ఆధారమైన ఒసికొయ్య ఊడదీసి దిగ్గున కిందికి ఉరికాడు. ఎద్దుని బాదాడు. బాదాడు.. బాదాడు.. అలుపొచ్చేదాక. ఎద్దు అలాగే ఒళ్ళప్పగించి నిలబడి ఉంది. కాసులు ముందుకు అడుగేసి పోలీసు చేతిలోని ఒసికొయ్యను పట్టుకుని ఆపాడు. ఇద్దరూ గింజుకుంటున్నారు.
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
మిగిలిన్న వాళ్ళు విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపులో జరగాల్సిన దారుణం జరిగిపోయింది. సంఘటనను అనుకోని మలుపు తిప్పింది.ఎద్దు సొమ్మసిల్లి పడిపోయింది. చలనం లేకుండా తల వాల్చేసింది. ప్రాణం గాలిలో కలిసిపోయింది.
ఇక కాసులు వీరంగం చేశాడు. పిచ్చెక్కినట్లు అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. జనం పోగుపడిపోయారు. తనొక కర్ర తీసుకున్నాడు. మెట్లెక్కి ఆఫీసు కిటికీ వైపుకు విసిరాడు. అద్దం భళ్ళున బద్దలయ్యింది. రోడ్డు మీద పేడ తీసుకుని దొరగారి బంగ్లా గోడకేసి కొట్టాడు. చేతుల్లోకి తీసుకుంటున్న పేడను అలా విసురుతూనే ఉన్నాడు. అతనికి మరో ఇద్దరు తోడయ్యారు. రాళ్లు, పేడ విరజిమ్ముతూనే ఉన్నారు. జగన్నాథం నిశ్చేష్టుడై చూడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయుడుగా నిలబడిపోయాడు.
''ఒరేరు! కనకాల పేట వాళ్లు పౌరుషానికి పెట్టింది పేరని తెలియదా? అగ్గి రాజేస్తే ఇక ఆరదు రా..! తాతల నాటి నుండీ ఇదే పని చేస్తున్నాం. ఇదే బతుకు తెరువుగా గడుపుతున్నాం. ఒక్కపక్క ఏడ్వ గలిగేవాడే ఎగసాయం చేత్తున్నాడు. కొద్దిపాటి కొండ్రకు వేడినీళ్ళుకు చన్నీళ్లని ఈ బండి తోలుకుని మేం చేస్తున్నాం. సవా లచ్చ రూల్స్ అడ్డంగా పెట్టి కాల్చుకు తింటున్నారు.'' ఎగిరెగిరిరి పడుతూ అరుస్తున్నాడు కాసులు.
తువ్వాలు మెడ చుట్టుకుంటూ- ''ఆవు ఎంతో ఎద్దూ అంతే. అది పాలు ఇత్తుంది. ఇది బతుకు ఈడుత్తుంది. ఈయేళ అత్తారబత్తంగా చంటిపిల్లాడిలా పెంచుకునే నా జయుడ్ని పొట్టన పెట్టుకున్నారు. అంటేనన్ను సంపినట్లే. జయుడు లేకపోతే విజయుడు లేడు. వీళ్ళిద్దరూ లేకపోతే ఈ కాసులు గాడు లేడు. నన్ను కూడా సంపి ఆటితో నన్నూ తగలెయ్యండి.'' అంటూ ఒంటి మీది బనీను చింపుకుని గుండెను చూపిస్తున్నాడు. వాళ్ళలో ఒకడు కాసుల్ని గట్టిగా పట్టుకున్నాడు. విదిలించుకున్నాడు.
''నాయాలా! ఇప్పుడొచ్చాయా రూల్స్? జీవాలు మోసే సరుకులకు వే బిల్లులు కావాల్సి వచ్చిందా? మా కడుపులు కొట్టే అధికారం మీకెవ్వరిచ్చారు? వందల ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడెందుకు? మా బతుకు నాశనం గురించి కలక్టేరుతో మాట్లాడడానికి మీకేమైనా నొప్పా? అయ్యా...బాబూ...మా పెజల బాధలు ఇవీ.. ఈటిని యదాపెకారం నడవనీయండి అని అడగలేరా? దొంగచాటున లచ్చల రూపాయిల దొడ్డి దారిన దాటి పోతూనే ఉంటాయి. నోటిమాట సాయం చేయడానికి ఇంత యాగీ చేసేత్తున్నారు. కలక్టేరు మంచి వాడంట. బతుకుల్ని వీధి పాలు చేయడానికి ఒప్పడంట. మరేం పోయేకాలం వచ్చింది మీకు?''
పోలీసుల బలగం వచ్చేసింది. గుంపుని చెదరగొడ్తున్నారు. పరిస్థితి జగన్నాథం చేతుల్లోంచి ఎప్పుడో జారిపోయింది. ఉన్నట్టుండి కాసులు ఒక్కుదుటన ముందుకురికాడు. బండి కింద వేలాడుతున్న లాంతరును గట్టిగా లాగి చేతుల్లోకి తీసుకున్నాడు. మూత తీసి నెత్తి మీద పోసుకుని అగ్గిపుల్ల వెలిగించడానికి సిద్ధమై పోయాడు. అందరూ భయం భయంగా చూస్తున్నారు.
''ఎవరూ దగ్గరకు రాకండి. వస్తే నేనేం చేత్తానో నాకు తెలియదు. ఎద్దులు పోయాక నేనెందుకు నా బండెందుకు?'' ''ఏరు ..కాసులు.. ఎలాంటి పిచ్చిపనులు చేయకు. నీ వెనకాతల పెళ్లాం పిల్లలు ఉన్నారు. అనవసర రాద్ధాంతం చేయకు. తొందరపడితే నష్టపోయేది నీవే...'' జగన్నాథం మాటలు ఇంకా పూర్తి కాలేదు.
లాంతరు లోంచి కిరసనాయిలు బండి మధ్యలో ఉన్న గడ్డి మీదపోశాడు. అగ్గిపుల్ల వెలిగించి విసిరాడు. భగ్గుమంది. క్షణంలో సగం మంటలు ఎగిశాయి. వెదురు తడికలు, పడక దిన్నె, తాళ్లు, కాడి పైకప్పు మీది టార్పాలిన్ అంటుకుంటే ఆర్పడం ఎవరి తరమూ కాదు. అంటుకుంది... అందుకే ఉవ్వెత్తున మంటలు.
కాసులు అపురూపంగా చూసుకునే బండి కళ్ళెదుట అగ్గిపాలవుతున్నది. ఎద్దు చనిపోయింది. పిచ్చెక్కినవాడిలా బండి చుట్టూ తిరుగుతున్నాడు. మంట తాలుకు అగ్ని కీలలు కాసుల్నీ తాకుతున్నాయి. అయినా లెక్క చేయకుండా మంట ఎగదోయడానికి, వద్దంటున్నా వినకుండా పక్క బండి లోంచి గడ్డి తీసుకొచ్చి వేస్తున్నాడు. చీకటి తెరల మధ్య ఎవరేం చేస్తున్నారో తెలియడం లేదు. వాతావరణమంతా ఆడాళ్ళ రోదనలతో గందరగోళంగా తయారయ్యింది. మంట అంతకంతకూ పెరిగిపోతోంది.
Visit
Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing
జనం నీళ్ళ కోసం పరుగులెట్టారు. ఈ లోపులో జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. మిగిలిన బళ్ళను దూరంగా తీసుకుపోయారు.
ఆ మంటలు చూస్తూ కాసులు నేల మీద చతికిలపడిపోయాడు. కళ్ళు మూసుకుని ఏడవడం మొదలెట్టాడు. అప్పటికే కాసులు చేతులు కాలాయి. బట్టలు అంటుకున్నాయి. ఆర్పేశారు. వెంటనే కాసుల్ని ఆసుపత్రికి తీసుకునిపోయారు. అక్కడితో, ఆ రోజుతో నిరసనలు ఆగిపోలేదు. కారణాలేమైతేనేం వారం రోజుల పాటు సాగాయి.
ఉద్యమాలు, పోరాటాల త్యాగం ఊరికే పోదు. కలకాలం చెప్పుకునే గాథగా మారుతుంది. తరతరాలకు ఒక స్ఫూర్తిగా నిలిచిపోతుంది. జెండా తొలిసారి పాతిన వారి పేరు చరిత్ర పుటలలో ఎప్పటికీ ఉండిపోతుంది. పరిపాలకులు దిగి రాక తప్పదు.
ఆలస్యంగా నైనా కాసులు త్యాగం కూడ ఊరికే పోలేదు.
🌟 Moral of the story:
Do not be proud or arrogant. Everyone has their own unique talent, so we should respect others and be humble.
Post a Comment