Telugu Lo Stories Kathalu Manthri Raju Yadav | మంత్రికి తెలివుండాలి, బంటుకి భక్తుండాలి

Telugu Lo Stories Kathalu Manthri Raju Yadav | మంత్రికి తెలివుండాలి, బంటుకి భక్తుండాలి



Telugu Lo Stories Kathalu Manthri Raju Yadav | మంత్రికి తెలివుండాలి, బంటుకి భక్తుండాలి


మంత్రికి తెలివుండాలి, బంటుకి భక్తుండాలి...
గుర్రానికి వేగముండాలి, ఏనుగుకి బలముండాలి...

సేనాధిపతికి వ్యూహముండాలి, సైనికుడికి తెగింపుండాలి...

యుద్ధం నెగ్గాలంటే, వీళ్ళందరి వెనుక కసి వున్న ఒక రాజుండాలి!

మనందరిలో ఒక రాజుంటాడు...


Telugu Lo Stories Kathalu Manthri Raju Yadav | మంత్రికి తెలివుండాలి, బంటుకి భక్తుండాలి


 
కానీ మనమే, రాజులా ఆలోచించడం ఎప్పుడో ఆపేశాం!
మన కసి - అడవులని చీల్చయినా సరే, సముద్రాలని కోసయినా సరే,
కొత్త దారులు కనుక్కోగలదు అని మనకి తెలుసు.


అయినా, భయానికి బానిసయ్యాం. ఓటమికి తలొంచేసాం!

చరిత్రలో చాలా మంది రాజులు ఓడిపోయారు, పారిపోయారు, దాక్కున్నారు, దాసోహమయ్యారు.
కానీ కొందరే, అన్నీ పోగొట్టుకున్నా కసితో మళ్ళీ తిరిగొచ్చి యుద్ధం చేశారు.


'
రాజంటే స్థానం కాదు, రాజంటే స్థాయి' అని నిరూపించారు.


డబ్బులొచ్చినా పోయినా వ్యక్తిత్వం కోల్పోకు...
రాజ్యాలున్నా చేజారినా రాజసం కోల్పోకు...
రాజంటే కిరీటం కోట పరివారం కాదు,
రాజంటే ధైర్యం... రాజంటే ధర్మం... రాజంటే యుద్ధం!
ఒకరోజు విందుభోజనం చేస్తావు,


ఇంకోరోజు అడుక్కుతింటావు - పాండవుల్లా!
ఒక రాత్రి బంగారు దుప్పటి కప్పుకుంటావు,

మరో రాత్రి చలికి వణికిపోతావు - శ్రీరాముడిలా!

ఎత్తు నుండి నేర్చుకో, లోతు నుండి నేర్చుకో...

రెండింటి నుండి ఎంతో కొంత తీసుకో!

రాజంటే స్టానం కాదు. రాజంటే స్థాయి...

స్థానం - భౌతికం, కళ్ళకు కనపడుతుంది.


స్థాయి - మానసికం, మనసుకు తెలుస్తుంది!

మనందరిలో ఒక రాజుంటాడు...

బ్రతికిస్తావో, చంపేసుకుంటావో నీ ఇష్టం!


Most Read Telugu Story - Marachembu Moral Story for Kid Telugu https://telugulostories.blogspot.com/2024/02/bhale-baapanamma-kids-song-in-telugu.html 


Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing 

Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


Telugu Story మాయ‌ | Telugu Lo Stories 


                        అర్ధరాత్రి గాఢ నిద్రలో గ్రామం. అమావాస్య చీకటి రాత్రి. పోలీస్‌ సైరన్‌ మోతలు, డి.యస్‌.పి. నిరంజన్‌ దాసు పోలీసు బలగంతో గ్రామ దిగ్బంధం చేశాడు. దీక్షా శిబిరం కూల్చివేశాడు. గాఢ నిద్రలో ఉన్న సంజీవరావు, ముత్తమ్మ, యలమంద, మధుసూదన్‌తో పాటు ఉద్యమ నాయకులందరిని అరెస్టు చేసి పోలీసు జీపులెక్కించారు. లారీచార్జీ, బాష్పవాయువు ప్రయోగంతో జనాలను భయభ్రాంతులు చేసి దొరికిన యువకులనల్లా పట్టుకెళ్లారు. గ్రామంలో పోలీసు పికెట్‌. రోజూ పోలీసుల కవాతు. చుట్టూ ఉన్న నాలుగు గ్రామాల్లో పోలీసుల మోహరింపు. దొరికిన వారిని దొరికినట్లు పోలీస్‌ స్టేషన్లకు తరలింపు. ఆడవారిని కూడా వదిలిపెట్టలేదు. మొత్తానికి భయానక వాతావరణం ఏర్పడింది. 


              ''కలెక్టర్‌ గారూ! ఏం జేస్తున్నారు. మీ అధికారులంతా ఎక్కడ పడుకున్నారు. నెల రోజుల నుండి సిరిపురం గ్రామంలో ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు, బంద్‌లు చేస్తుంటే ... మీరు, మీ యంత్రాంగం ఏంజేస్తున్నట్లు? ఏరికోరి మీరు నా మనిషని మిమ్ములను అక్కడికి పంపితే ఇదా మీ నిర్వాకం? అవతల సి.యం. రాజా ఫార్మాసీ కంపెనీ శంకుస్థాపనకు తొందర పెడుతున్నారు. మీరేంజేస్తరో తెల్వదు! వారంలో అంతా సద్దుమణిగి పనులు మొదలు కావాలి....'' మంత్రి గుర్నాథరెడ్డి ఫోన్‌తో కలెక్టర్‌ సురేంద్రకుమార్‌కు ముచ్చెమటలు పట్టాయి. ''అలాగే సార్‌ ...అలాగే సార్‌... '' అని ఫోన్‌ పెట్టేశాడు.


ఇక చూడు కలెక్టర్‌, యస్‌.పి., జేసి., ఆర్‌.డి.వో.తో పాటు అధికారులంతా సిరిపురం వైపు వురుకులు పరుగులు.


అసలు కథేేంటంటే సిరిపురం గ్రామం పక్కనే రెండు గుట్టల మధ్య రెండొందల ఎకరాల ప్రభుత్వ భూమిఉంది. ఎప్పుడూ గల గలాపారే అమృతం వాగు. ఆపైన ఎప్పుడూ నీరుండే పెద్ద చెరువు. సదరు ప్రభుత్వ భూమి మీద ఓ బడా మందుల ఫ్యాక్టరీ యజమాని కన్ను పడింది. భూమి ఉంది, నీరు ఉంది, కారు చౌకగా దొరికే కూలీలున్నారు. ఇంకేం కావాలి. చక్రం తిప్పాడు.


ఎప్పుడైతే గతంలో ఎసైన్‌మెంటు భూములిచ్చిన సన్న చిన్న కారు రైతులకు ఫ్యాక్టరీకి భూమి అవసర ముందని కలెక్టరు నోటీసులు పంపాడో గ్రామంలో అలజడి మొదలైంది. సంజీవరావు అతనే రిటైర్డ్‌ టీచర్‌ నాయకత్వంలో ఆందోళన మొదలైంది. ఆయనకు తోడుగా మహిళా నాయకురాలు ముత్తమ్మ, రైతు నాయకుడు యలమంద, విద్యార్థి నాయకుడు మధుసూదన్‌ జతకలిశారు.


రైతులు, కూలీలు, మహిళలు, విద్యార్థులు అంతా ఒక్క తాటి మీద నడిచారు. చుట్టూ వున్న నాలుగు గ్రామాల ప్రజలు వీళ్ళకు మద్దతుగా నిలిచారు. సభలు సమావేశాలు ఏర్పాటు చేశారు. అన్ని పార్టీలు ఒక్కటయ్యాయి. ఎక్కడైతే ఫ్యాక్టరీకి భూమి ఇస్తున్నారో అక్కడే టెంటు వేసి ఆందోళన మొదలుపెట్టారు. ఫ్యాక్టరీ వద్దని ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు, ర్యాలీలు, ధూంధాం, ఆటాపాటా, రిలే నిరాహారదీక్షలతో ఉద్యమం ఊపందుకుంది. సంజీవరావు పిలుపిస్తే చాలు కదం తొక్కవలసిందే.


#pedaraasipeddamma #TeluguComedyStories #comedystories #telugustories #kathalu #telugukathalu #telugustories #friendshipstories 

#DevotionalStories 


సంజీవరావు మాస్టారంటే ఆ ఊరుకు వల్లమాలిన ప్రేమ. ఎంతో మంది పేదపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ముందుకు నడిపించారు. సిరిపురం ఊరి బాగోగులు మొత్తం ఆయన చేతిమీద నడవాల్సిందే. ఎలాంటి తగాదాలైనా ఇరువర్గాలకు నచ్చచెప్పి పరిష్కారం చేసి పంపేవాడు. ఇంతవరకు ఆ ఊరు నుండి పోలీస్‌స్టేషన్‌లో ఒక్క కేసు నమోదు కాలేదంటే ఆయన చలవే! సాఫ్ట్‌వేరు ఉద్యోగం చేస్తూన్న కొడుకు సతీష్‌ హైదరాబాదు రమ్మని ఎన్నిసార్లు పిలిచినా ఉన్న వూరిమీద ప్రేమతో ససేమిరా రానన్నాడు.


రోజూ పోలీసులు వస్తూనే వున్నారు. నానా హాంగామా చేసి పోతున్నారు. లాఠీ చార్జీలు, అరెస్టులు నిత్యకృత్యమయ్యాయి. మంత్రి గుర్నాథరెడ్డి హెచ్చరి కతో జిల్లా యంత్రాంగమంతా కలిసి హడావిడిగా సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేయించింది. ఆందోళనకారుల టెంటుకు ఎదురుగానే గ్రామసభ వేదిక సిద్ధమయింది.


జిల్లా కలెక్టరు సరేంద్రకుమార్‌, జే.సి.విజ యరాణి, ఆర్‌.డి.వో. మునిసుందరం, తహశీల్దార్‌ సుందర్‌రావు ముందురాగా ఫ్యాక్టరీ యజమాని సుబ్బరాజు, మేనేజరు సురేంద్ర తళతళ మెరిసేకార్లలో సూటుబూట్లతో దిగారు. డి.యస్‌.పి. నిరంజన్‌దాసు, ఓ వందమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాడు.


వీళ్లంతా వచ్చేసరికి ఆటాపాటా ఊపందుకుంది. ''ఈ వూరు మనదిరో, ఈ భూమి మనదిరో ఏరు మనది, నీరు మనది, గుట్ట మనది, చెట్టు మనది, పంట మనది, పండించే భూమాత మనదిరో, ఫ్యాక్టరీ ఏందిరో, వాని పీకుడేందిరో, పోలీసులేందిరో వాల్ల జులుం ఏందిరో'' నారాయణమూర్తి సినిమా స్టైల్‌ పాటతో సమావేశ స్థలం దద్దరిల్లింది. మాయదారి మందుల కంపెనీ మాకొద్దు, నినాదాలు జోరందుకున్నాయి. ఫ్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. డప్పులు, కంజర్లు, గజ్జెలు ఎవరి దగ్గరున్నవి వారు మోగించారు. వేదిక మీద అధికారులు, వేదిక కింద ఉద్యమకారులు, గ్రామ ప్రజలు. కలెక్టరు లేచి నిల్చుని మైకందుకున్నారు. జనం నినాదాలు చేస్తూనే వున్నారు. సంజీవరావు లేచి తన చేయి ఊపాడు. క్షణంలో అంతా సైలెంటయి పోయింది. కలెక్టరు ఒకింత ఆశ్చర్యపోయాడు.


''సిరిపురం గ్రామ పెద్దలు, ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ దయచేసి గ్రామసభకు సహకరి ంచండి. ఇక్కడ ఫ్యాక్టరీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి. అన్ని రకాల అనుమతు లొచ్చాయి. మీ ప్రాంతం వెనుకబడిందని ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే, మీ పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి. 


విద్యుత్తు, నీరు, రోడ్లు బాగుపడుతాయి. దయచేసి మీ అభిప్రాయాలు చెప్పండి. మా జె.సి.గారు, కంపెనీ యం.డి. సుబ్బరాజుగారు మీకు సమాధానాలు చెప్తారు. సంజీవరావుగారు మీరు మాట్లాడండి.'' కలెక్టరు మాట్లాడుతున్నంత సేపు ''వద్దు, వద్దూ'' అనే నినాదాలు చేస్తూనే వున్నారు. కలెక్టరు కూర్చోగానే సంజీవరావు లేచాడు.


Telugu Lo Stories Kathalu Manthri Raju Yadav | మంత్రికి తెలివుండాలి, బంటుకి భక్తుండాలి.


''కలెక్టరుగారూ, వేదిక మీదున్న పెద్దలందరికి నమస్కారం. అయ్యా! ఫ్యాక్టరీ వద్దని గత నెల రోజులుగా మేం ఆందోళన చేస్తూనే వున్నాం. ఎన్నో అర్జీలు పెట్టుకున్నాం. ఎంతో మంది పర్యావరణ శాస్త్రవేత్తలు వచ్చారు. ఏ ఫ్యాక్టరీ అయినా పర్యావరణం పాడు చేస్తుందని ముఖ్యంగా నీరు కలుషితమైపోతుందని చెప్పారు.


గత నెలరోజుల నుండి మా పేదరైతులు తిండి, నిద్రలేక నానా యిబ్బందులు పడుతున్నారు. తమ భూములు పోతే తామేం చేసి బతకాలని వీళ్ల భయం. అదీగాక ఇప్పుడు మీరు భూములు తీసుకుంటున్న రైతులంతా ఎకరం రెండెకరాల సన్న చిన్నకారు రైతులే. అదీగాక మీరు నిర్మించబోయే ఫ్యాక్టరీ వూరికి దగ్గరలో వుంది దయచేసి ఈ ఫ్యాక్టరీని వేరే చోటికి తరలించండి. ఇది మా గ్రామ ప్రజల అభ్యర్థన'' ముఖం మీద పట్టిన చెమటను పైనున్న తువ్వాలుతో తుడ్చుకుని కూర్చున్నాడు సంజీవరావు.


''చూడండీ సంజీవరావుగారు ఇక్కడ ప్రభుత్వ భూమి వందెకరాలు వుంది. మరో వందెకరాలు మేము పేదరైతులకు తలా ఎకరం రెండెకరాలు ఎసైన్డ్‌ పట్టాలు ఇచ్చాం. పట్టాలు ఇచ్చిన్నాడే ప్రభుత్వానికి ఎప్పుడు అవసరముంటే అప్పుడు తీసుకుంటాం అనే కండీషన్‌ మీదే యిచ్చాం. ఇకపోతే ఫ్యాక్టరీ ఆపడం మా చేతుల్లో లేదు. భూ సేకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి. నష్ట పరిహారం ఎక్కువ ఇప్పించే ప్రయత్నం చేద్దాం. ఉపాధి కల్పిద్దాం. వారి పిల్లలకు ఉద్యోగాలిప్పిద్దాం. కాదు మాకు భూమే కావాలంటే ఇంకోచోట కొనిద్దాం.'' జె.సి. విజయరాణి వివరించారు.


''అయ్యా! కలెక్టరు గారూ! మీరిచ్చిన పోరంబోకు భూములు వీల్లంతా రాత్రనక, పగలనక కష్టపడి బావులు తవ్వీ, బోర్లు వేసుకుని పంటలు పండించుకుంటున్నారు. కూలి బతుకు పోయి రైతుగా బతుకుతున్నామని సంతోషంగా వున్నారు. మీరు కంపెనీ పేరుతో మా పొట్టగొట్టకండీ''

''ఇగో ఈ చంద్రమ్మని చూడండి సార్‌! దీని మొగుడు సారా తాగితాగి సచ్చిండు. వున్న ఒక్క బిడ్డను పెంచి పెద్దచేసి ఈ రెండెకరాల భూమిచ్చి పెండ్లి చేసింది. మీ నోటీసు చూసి ఆ అల్లుడు నీ భూమి పోయినంక నీ బిడ్డ నాకెందుకని తన్ని తగిలేసిండు.'' మహిళా నాయకురాలు ముత్తమ్మ తన ఆవేదన వెలిబుచ్చింది. పక్కనే నిల్చున్న చంద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఓదార్చింది ముత్తమ్మ.


''సార్‌! పచ్చటి పంట పొలాల మధ్య ఈ ఫ్యాక్టరీ చిచ్చేంది సార్‌. ఎకరం, రెండెకరాలున్న మాల, మాదిగోల్ల, సుద్దరోల్ల భూములేగావాల్నా సార్‌. పెద్ద భూస్వాములజోలికెల్లరు. అష్టకష్టాలుపడి పెండ్లాల మీద పుస్తెలు అమ్మి ఈ పొలాల్ని బాగుచేసుకున్నాం. మా బతుకులు మేం బతుకుతున్నాం. మా భూములివ్వమంటే ఇవ్వంగాక ఇవ్వం.'' రైతు నాయకుడు యలమంద కరాఖండిగా చెప్పాడు. జారిపోతున్న తన నడికట్టు బిగదీసుకుని కూర్చున్నాడు. వెనుక నుండి చప్పట్లు మోగాయి.


''చూడండీ మీరంతా ఆవేశంలో వున్నారు. అపోహ పడుతున్నారు. ఇప్పుడు కంపెనీ యం.డి. సుబ్బరాజుగారు తమ ఫ్యాక్టరీ గురించి చెబుతాడు వినండి.'' కలెక్టరు మాటలతో జనం సుబ్బరాజు వైపు చూశారు.


సుబ్బరాజు చేయెత్తు మనిషి, పసిడి ఛాయ, రెండు చేతుల వేళ్లకు బంగారు వుంగరాలు, మెడలో గొలుసు, బంగారం ఫ్రేము కళ్లజోడు. ఎటువంటి వారినైనా తన మాటలతో బుట్టలో వేసుకోగల మాయల మరాఠీ. జనం వైపు చూసి రెండు చేతులెత్తి నమస్కరించాడు చిరునవ్వుతో.

''చూడండీ మీరంతా ఏదో ఊహించుకుని భయపడుతున్నారు. మా ఫ్యాక్టరీ మనుషుల ప్రాణాలు కాపాడే మందుల కంపెనీ, ఇది పురుగు మందుల కంపెనీ కాదు. పంటలకు ఏ మాత్రం హాని జరగదు.''


''మేం పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు కేంద్రం మాకు క్లీన్‌చిట్‌ యిచ్చింది. మాకు ఫ్యాక్టరీ కొత్త కాదు. ఇంతకు ముందే మాకు హర్యానా, బీహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో కంపెనీలున్నాయి. ఎక్కడా ఏ విధమైన హానీ జరగలేదు. కావలిస్తే పోయి చూసిరండి.'' తేలికగా అనేశాడు. వీళ్లెెవరూ అక్కడికి పోయి చూడరని ఈయన ధీమా.



''మీ గ్రామం చాలా వెనుకబడి వుంది. నీళ్ళు లేవు. రోడ్లు లేవు. కరెంటు లేదు. వీధిలైట్లు లేవు. ఒక్క నెల రోజుల్లో అన్నీ సమకూరుస్తా. మీ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తా. బడి, గుడి కట్టిస్తా. కొద్ది రోజుల్లోనే మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మారుస్తా! నా మాటలు నమ్మండి! ''చిరునవ్వులు చిందిస్తూ ముందున్న మంచినీళ్ళ సీసా ఖాళీ చేశాడు.


సర్పంచ్‌ను మాట్లాడమన్నట్లు కలెక్టరు సర్పంచ్‌ వైపు చూశాడు. సుబ్బరాజు పక్కనే కూర్చున్న సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి లేచాడు. ''సుబ్బరాజుగారు చెప్పింది అక్షరాల నిజం. ఇంతకాలం మన వూరు వెనుకబడి వుంది. అందుకే మన మంత్రిగారు మన వూరు బాగు కొరకు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టిస్తున్నాడు. అందుకే మన గ్రామ పంచాయితీ ఫ్యాక్టరీకి అనుమతిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది సార్‌.''


''ఎంతెంత మేశారు?'' వెనుక నుండి అరుపులు కేకలు.


''మాయదారి కంపెనీ మాకొద్దు, సుబ్బరాజు గోబ్యాక్‌, సర్పంచ్‌ డౌన్‌ డౌన్‌ నినాదాలు మిన్నుముట్టాయి.'' అంతా గోలగోలగా వుంది. జనమంతా లేచి నిల్చున్నారు. ఎవరేం మాట్లాడుతున్నారో వినబడడం లేదు. అంతా గందరగోళం.


స్టేజీ మీదున్న అధికారుల్లో అసహనం మొద లైంది. డి.యస్‌.పి. నిరంజన్‌ దాసు పొట్టమీద నుండి జారి పోతున్న బెల్టు సరిచేసుకుని మీసం మీద చేయి వేసి నెత్తిమీద టోపీ అటూఇటూ తిప్పి చేతికర్రతో టేబుల్‌ మీద టకటకలాడించాడు. అతని కండ్లు ఎర్ర బారాయి. కలెక్టరు ముందు జరుగుతున్న గొడవకు కోపం నషాలానికెక్కింది. ''చూడండీ చట్టాన్ని మీచేతుల్లోకి తీసుకుని శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వూరుకునేది లేదు. మీరు చెప్పేది మీరు చెప్పారు. మేము చెప్పేది వినాలిగాని ఈ గొడవేంటి. వయోలెన్సు ఏ విధంగా కంట్రోల్‌ చెయ్యాలో మాకు బాగా తెల్సు. నెల రోజులుగా ఓపిక పట్టాం. మీరు కమ్యునిస్టుల్లా, విప్లవకారుల్లా మాట్లాడకండి. వూరుకునేది లేదు....'' కోపంతో వూగిపోతూ కూర్చున్నాడు డి.యస్‌.పి. నిరంజన్‌ దాసు.


జనంలో అక్కడక్కడ ఎర్ర చొక్కాలు, ఎర్ర చీరలు, ఎర్ర రుమాళ్లు, ఎర్ర బ్యానర్లు కనిపించాయి. అదీ ఆయనకు మంట. ఇంట్లో భార్య ఎర్ర చీర కట్టుకున్నా సహించేవాడు కాదు. విప్లవకారుల పేరుతో అన్యాయంగా నలుగురు యువకులను కాల్చిచంపి ఎన్‌కౌంటర్‌ నిరంజన్‌దాసు అయ్యాడు. ఎప్పుడూ ఓ పది మంది సెక్యూరిటీ లేంది బయటకెళ్లలేని భయం భయం బతుకు ఆయనది.


''అయ్యా డి.యస్‌.పి. గారూ నిజం మాట్లాడితే, అన్యాయాన్ని ఎదిరిస్తే మా రైతుల గోస చెప్పుకుంటే, మా గ్రామ ప్రజల బాధ చెప్పుకుంటే, మా ఆడపడుచుల బాధ, మా కడుపు మంట చెప్పుకుంటే మేం కమ్యూనిస్టులమా! విప్లవకారులమా! కానియ్యండి. మేం ప్రజల పక్షాన నిలబడుతాం. మా ఊరిని వల్లకాడుగా మార్చే ఫ్యాక్టరీని పెట్టనివ్వమంటే పెట్టనివ్వం. మా ప్రాణాలు పోయినా సరే వెనకడుగు వేసేది లేదు ఏంజేసుకుంటారో చేసుకోండి'' విద్యార్థి నాయకుడు మధుసూదన్‌ మాట్లాడటంతో సభ వేడెక్కింది. పెద ్దపెట్టున నినాదాలు మొదలయ్యాయి. ''డౌన్‌ డౌన్‌, గోబ్యాక్‌'' నినాదాల మధ్య కాసేపు మంతనాలాడి కలెక్టరు, సుబ్బరాజు, అధికారులంతా గ్రామసభ ముగిసిందని చెప్పి వెళ్ళిపోయారు.


అర్ధరాత్రి గాఢ నిద్రలో గ్రామం. అమావాస్య చీకటి రాత్రి. పోలీస్‌ సైరన్‌ మోతలు, డి.యస్‌.పి. నిరంజన్‌ దాసు పోలీసు బలగంతో గ్రామ దిగ్బంధం చేశాడు. దీక్షా శిబిరం కూల్చివేశాడు. గాఢ నిద్రలో ఉన్న సంజీవరావు, ముత్తమ్మ, యలమంద, మధుసూదన్‌తో పాటు ఉద్యమ నాయకులందరిని అరెస్టు చేసి పోలీసు జీపులెక్కించారు. లారీచార్జీ, బాష్పవాయువు ప్రయోగంతో జనాలను భయభ్రాంతులు చేసి దొరికిన యువకులనల్లా పట్టుకెళ్లారు. గ్రామంలో పోలీసు పికెట్‌. రోజూ పోలీసుల కవాతు. చుట్టూ ఉన్న నాలుగు గ్రామాల్లో పోలీసుల మోహరింపు. దొరికిన వారిని దొరికినట్లు పోలీస్‌ స్టేషన్లకు తరలింపు. ఆడవారిని కూడా వదిలిపెట్టలేదు. మొత్తానికి భయానక వాతావరణం ఏర్పడింది.


అనుకున్న ప్రకారం ఓ వారం రోజుల్లో అనుకున్న చోట భారీ పోలీసు బందోబస్తు మధ్య రాజా ఫార్మసీ మందుల ఫ్యాక్టరీ శంకుస్థాపన ఘనంగా జరిగింది. క్యాబినెట్‌ మంత్రి గుర్నాథరెడ్డి, సుబ్బరాజు జిల్లా అధికారులు మందీ మార్బలంతో కార్యక్రమం సజావుగా సాగింది. ఉద్యమకారులంతా పోలీసు స్టేషన్‌లోనే ఉన్నారు.


ఇక ఆ రోజు నుండి నిర్మాణ కార్యక్రమాలు ఊపందు కున్నాయి. ఫ్యాక్టరీ నిర్మాణంతో పాటు గుడి, బడి, హాస్పిటల్‌ పనులు చకచక జరిగిపో తున్నాయి. మెయిన్‌రోడ్డు నుండి గ్రామానికి రెండు కిలోమీటర్ల డబుల్‌లైన తారు రోడ్డు. గ్రామంలో అంతర్గత సిమెంటు రోడ్లు, వీధివీధికి కరెంటు స్తంభాలు వేసి లైట్లు బిగించారు. కూడళ్లలో హైమాస్టు లైట్లు ఏర్పాటు. ఇంటింటికి నల్లా ఇరువై నాలుగ్గంటలు నీళ్ళు వచ్చే ఏర్పాట్లు జరిగాయి.


ఇంతకాలం నిరసనలతో, ఆందోళనలతో అట్టుడికిన గ్రామం క్రమంగా చల్లబడింది. యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీకి వెళ్ళిపోయారు. ఇంజనీరింగ్‌లో సీట్లు రాని కొంతమంది విద్యార్థులకు సుబ్బరాజు తన కాలేజీలో సీట్లు ఇప్పించాడు. కేసుల భయంతో చాలా మంది గప్‌చుప్‌ అయిపోయారు. తాయిలాలతో ఒక్కొక్కరిని తనవైపు తిప్పుకున్నాడు రాజు. మేనేజర్‌ సురేంద్ర సర్పంచ్‌ ఇంట్లో మకాం వేసి అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నాడు.


ఆరునెలల్లో రాజా ఫార్మసీ ఫ్యాక్టరీతో పాటు రామాలయం, హాస్పిటల్‌, పాఠశాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. కేంద్రమంత్రి, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికారులంతా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రామాలయం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించాడు రాజు. ఓ పదిమంది వేద పండితులు వారం రోజులపాటు పూజలు, యజ్ఞాలు నిర్వహించారు. ఊరి పెద్దలం దరిని పిలిచి అందులో పాల్గొనేలా చేశాడు రాజు.


ఇంటింటికి పులిహోర పొట్లాలు, లడ్డూ, ప్రసాదం పంపిణీ, ఆఖరి రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఆడవారికి పసుపు, కుంకుమ, చీరలు, గాజులు మగవారికి ధోవతులు, ముసలివారికి పెన్షన్లు పంపిణీ చేశాడు. స్కూలు పిల్లలకు యూనిఫారాలు, బ్యాగులు క్రికెట్‌ కిట్‌లు పంచాడు.

కార్పొరేటు తలదన్నే పాఠశాల, హాస్టల్‌ వసతి కల్పించి గ్రామంలోని విద్యార్థులందరిని చేర్పించాడు. వారం వారం హాస్పిటల్‌కు హైదరాబాదు నుండి స్పెషలిస్టులను పిలిపించి ఉచితంగా మందులిచ్చే ఏర్పాటు, మరీ పెద్ద జబ్బయితే హైదరాబాదులోని తన హాస్పిటల్‌కు తరలించి వైద్యం చేయించే ఏర్పాట్లు చేశాడు. అందరి మీద కేసులు ఎత్తివేయించాడు.

ఇంకో విషయం


కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


తాగినవారికి తాగినంత 'మందు' ఏర్పాట్లు చేశాడు. అన్ని తాయిలాలతో ఒక్కొక్కరుగా అందరిని తనవైపు తిప్పుకున్నాడు సుబ్బరాజు. సిరిపురం గ్రామాన్ని రంగుల ప్రపంచంలో ముంచేశాడు. ఆ వూరి మీద ఓ మాయ పొర కమ్మేలా చేశాడు.

మందుల ఫ్యాక్టరీలో మందుల తయారీ కార్యక్రమం మొదలైంది. నైపుణ్యం పేరుతో పెద్ద ఉద్యోగస్తులందరినీ తన వారితో నింపేశాడు. చిన్నాచితక అటెండర్‌, స్వీపర్‌, చౌకీదారు లాంటి పోస్టులు గ్రామస్తులకిచ్చాడు. ఆడవారిని అతి తక్కువ కూలీతో ప్యాకింగ్‌ పనుల్లో పెట్టుకున్నాడు.


ముందు ఓ పది రకాల మందుల తయారీతో మొదలుపెట్టి రెండు మూడెండ్లలో వందల కొలదీ మందులు తయారీ చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసి దేశంలో నెం.1 స్థానానికి ఎగబాకింది రాజా ఫార్మసీ. రాత్రి, పగలు రెండు షిప్టుల పని చేయటం మొదలుపెట్టింది.


రెండు సంవత్సరాలు గడిచేసరికి బావులలోని, బోర్లలోని నీళ్ళన్నీ క్రమంగా ఎర్రగా చందనంలా మారాయి. ఎటూ రెండు మూడు కిలోమీటర్ల దూరం ఇదే పరిస్థితి. తాగడానికి ఏ మాత్రం పనికిరాకుండా పోయాయి. మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల పంట పండింది. రాజు ఏర్పాటు చేసిన బోరు నీళ్ళు కూడా పనికి రాకుండా పోయాయి. జనం అయోమయం, ఆందోళనలో పడిపోయారు.


తెల్లటినీళ్ళతో గలగలాపారే అమృతం వాగునీళ్ళు నల్లగామారి కంపు వాసనకొడుతున్నాయి. ఏడాది పొడుగునా పశువులు, మనుషులు ఆ నీళ్ళు తాగి సేద తీరడం జరిగేది. వాగెంట వేసిన బోర్లన్నీ కలుషితమైపోయాయి. ఫ్యాక్టరీ వ్యర్థాలు మొదట్లో దూరంగా డంప్‌ చేసేవారు. క్రమంగా రాత్రిపూట గుట్ట పక్కనే వున్న వాగులో డంప్‌ చేయటం మొదలుపెట్టారు.


ఏడాదికి మూడు పంటలు పండే భూములన్నీ చవుడు బారిపోయాయి. పంట పొలాలు ఎర్రగా మారి పెట్టుబడులు రాక రైతులు అప్పులపాలయ్యారు. అదీగాక పెద్దచెరువులోని అర టియంసి నీళ్లని సుబ్బరాజు తన ఫ్యాక్టరీకి మల్లించుకున్నాడు. వెరసి రైతులు ఓ పంట నష్టపోయారు.

గాలి, నీరు కలుషితమైపోయి గ్రామంలో జనం చిత్ర విచిత్ర రోగాల బారిన పడ్డారు. చాలామంది టి.బి., క్యాన్సర్‌, పచ్చకామెర్లు, దద్దుర్లలాంటి రోగాల తో హాస్పిటల్‌ల చుట్టూ తిరగటం మొదలు పెట్టారు.


రెండేళ్లయ్యేసరికి ఏవో కారణాలతో హాస్పిటల్‌, పాఠశాల ఎత్తివేశాడు. ముసలివాళ్ళ పెన్షన్లు ఎగనామం పెట్టాడు.


కోటి రూపాయల కాంట్రాక్టుకు ఆశపడి సర్పంచ్‌ నాగిరెడ్డి ఫ్యాక్టరీ ప్రక్కన ప్రభుత్వ భూమిలో కట్టిన కస్తూర్బా పాఠశాల ముణ్ణాల్ల ముచ్చటైంది. పిల్లలందరికి శరీరమంతా దద్దుర్లు, బొబ్బర్లు, పుండ్లు, దగ్గులు, తుమ్ములతో పాఠశాల అక్కడి నుండి షిప్టు చేయటం జరిగింది. ఫ్యాక్టరీ దగ్గరగా వున్న రైతులంతా అయినకాడికి సుబ్బరాజుకు తమ భూములమ్ముకుని వూరు విడిచిపోయారు.


ఎప్పుడూ పచ్చని చెట్లతో, పచ్చని గడ్డితో పశువులకు, మేకలకు, నెమళ్ళకు, కుందేళ్ళకు, రకరకాల పక్షులకు ఆలవాలమైన మల్లన్న గుట్టలు మసిబారిపోయాయి. చెట్లన్నీ ఆకు రాల్చాయి. ఇప్పుడక్కడ నెమళ్ళు కాదు ఏ పిట్టలు లేవు. రాజు వేయించిన రోడ్లు, లైట్లు ఆయన ఫ్యాక్టరీ కొరకే అని ఆలస్యంగా అర్థమైంది.


రాజా ఫార్మసీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అట్టహాసంగా ఉత్సవాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఫార్మా ఉత్పత్తులు దేశ విదేశాల్లో ఎగుమతి చేసి కోట్ల టర్నోవరు సంపాదించారు. పది కోట్లతో ప్రారంభించిన కంపెనీ ఐదేండ్లలో వేల కోట్ల టర్నోవరుకు ఎదిగింది. వందల ఎకరాల భూములు సంపాదించినది. ఎక్కువ మందులు ఉత్పత్తి చేసినందుకు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఉత్తమ ఫార్మసీ అవార్డు అందుకుంది.


నష్టపోయిందల్లా సుబ్బరాజు మాయ మాటలతో నమ్మి మోసపోయిన సిరిపురం అమాయక జనం. గాలి, నీరు కలుషితమై రోగాలపాలు కావటం, అమ్మలాంటి అమృతం వాగు విషతుల్యం గావటం, మల్లన్న గుట్ట మసిబారిపోవటం, భూములు కోల్పోయి రైతులు అనాథలు కావటం, కోటి రూపాయల కస్తుర్బా స్కూలు పనికిరాకుండా పోవటం, వెరసి సిరులొలికే సిరిపురం బికారిగా మిగిలిపోయింది.


సంజీవరావు మాస్టారుకు టి.బి., ముత్తమ్మకు పచ్చకామెర్ల వ్యాధి వచ్చిందనే వార్త వూరంతా దావానంలా వ్యాపించింది. అలజడి మొదలైంది. అందరిలో ఆందోళన మొదలైంది. నివురుగప్పిన నిప్పులా వున్న ఆవేశం లావాలా బయటకొచ్చింది. వూరిని కమ్మిన మాయపొర తొలగిపోయింది. ఓ అరుణోదయవేళ ''ఫ్యాక్టరీ బంద్‌ కరో - గాంవ్‌ కో బచావో'' నినాదం ఊపందుకుంది. మరో ఉద్యమం పురుడు పోసుకుంది. 



Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more .... 

friendship stories in telugu, friendship story in telugu, telugu moral stories on friendship, చదువు గురించి నీతి కథలు, heart touching moral stories in telugu, friendship moral stories in telugu, puli meka story in telugu, friends story in telugu, sneham goppatanam telipe katha in telugu, telugu friendship stories,  pattudala story in telugu, friendship neethi kathalu in telugu, friendship short stories in Telugu language with moral, puli meka katha, putukku jara jara dubukku me, short story on friendship in telugu with moral, putukku jara jara dubukku me meaning in telugu, sneham viluva story in telugu, story on friendship in telugu, telugu friendship stories pdf, Telugu stories for elders, friendship stories in telugu pdf, elephant and friends story in Telugu


Best Telugu Story about Friendship Stories :  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html



Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu  

 monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu

Post a Comment

0 Comments