Telugu Lo Stories Kathalu Friendship Heart touching story | యదార్థంగా జరిగిన సంఘటన
ఇది యదార్థంగా జరిగిన సంఘటన..........దయచేసి చదవగలరు......
ఒక భార్య ..భర్త ఎంతో అన్యోన్యంగా ఉండేవారు....వారి అన్యోన్యతకు గుర్తుగా వారికి ఓ కుమార్తె పుట్టింది.......చాలా సంతోషంగా ఉన్నదాంట్లొనే ఎంతో తృప్తిగా ఉండేవారు...... .
పాపకు నాలుగు సంవత్సరాల వయస్సు. ఆ పాప తల్లి ఒకరోజు తన కూతురితో
"నీకు ఒక తమ్ముడు పుడతాడు కొద్దిరోజుల్లో....నీవు వాడిని బాగా చూసుకోవాలి వాడితో గొడవపడకుండా బుద్ధిగా ఆడుకోవాలి . వాడికి ఏ లోటూ రాకుండా చూసుకోవాలి " అని చెప్పింది.... అప్పటినుండి ఆ పాప రోజూ అమ్మ నాన్నలను తమ్ముడు ఎప్పుడొస్తాడు అని అడుగుతూ ఉండేది........తన తమ్ముని మీద ఎనలేని ప్రేమను అనురాగాన్ని పెంచుకోసాగింది........
నెలలు నిండి ఆ తల్లి నిజంగానే ఓ మగ శిశువును ప్రసవించింది.....కానీ..... ఆ బిడ్డకు ఏదో తీవ్ర అనారోగ్యం వలన ఆ బిడ్డను ఇంటెంసివ్ కేర్లో ఉంచాల్సి వచ్చింది....ఈ పాపకేమో తన తమ్ముడిని చూడాలని ఆశగా ఉంది...కానీ ఆ గదిలోకి ఎవరినీ వెళ్ళనివ్వడంలేదు......అమ్మను అడిగింది.....వాళ్ళ నాన్నను బ్రతిమలాడింది......పాప నాన్న ఆ పాపను ఎత్తుకుని తమ్మునికి ఆరోగ్యం బాలేదు నువ్వుకూడా విసిగించకు అని మెల్లగా చెప్పాడు........కానీ ఆ పాప అస్సలు వినడంలేదు......ఇలా అంది.
నాన్నా! ఒక్కసారి నాకు నా తమ్ముడిని చూపించండి..వాడిదగ్గరికి నన్ను తీసుకెళ్ళండి .వాడికి ఏమీ కాదు....ప్లీజ్ ,,,,,,,వాడితో నేను ఆడుకోవాలి. నా తమ్ముడి దగ్గరికి ఎందుకు నన్ను తీసుకెళ్ళడంలేదు
అని బిగ్గరగా ఏడ్చింది.......
ఆ పాప ఏడుపును ఆపకపోయేసరికి .........తండ్రి డాక్టరుదగ్గరికి వెళ్ళి మా బాబు బ్రతికి ఉంటాడో లేదో మాకు భయంగా ఉంది కనీసం ఈ పాపనైనా బ్రతికించుకోవాలి. బాబుని ఒక్కసారి పాపకు చూపించి తీసుకువస్తాను .దయచేసి అనుమతిని ఇవ్వండి....అని అడిగాడు........
డాక్టర్లు కూడా ఆ పుట్టిన బిడ్డ పరిస్థితి సరిగ్గా లేదని..అసలు చలనమే లేదనీ చెప్పి.........ఒక్కసారి ఆ పాపను తన తమ్ముని దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి అనుమతినిచ్చారు......
పాప తన ఏడుపును ఆపి తన తమ్ముడిని చూడటానికి గదిలోకి వెళ్ళింది....... " తమ్ముడూ! లెయ్యిరా! నేను నీ అక్కను..........అమ్మ నువ్వు వస్తావనీ నేను నిన్ను బాగా చూసుకోవాలని,,,,,నీతో బాగా ఆడుకోవాలని చెప్పింది. చాలా రోజులు ఎదురుచూశాను. ఇప్పుడు ఇలా పడుకుని ఉన్నావే! లెయ్ .......మనం ఆడుకుందాం " అంటూ ఆ బాబు చేతివేళ్ళను మెత్తగా తాకింది..."
ఆశ్చర్యంగా ఆ పసిబిడ్డ కళ్ళు తెరిచి అలా చూసి ఏడుపు మొదలెట్టాడు.. అంతవరకు చలనమే లేని ఆ పసిబిడ్డ అలా ఏడవగానే డాక్టర్లు పరుగున ఆ గదిలోకి చేరుకుని ఇక ఆ బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు....
ఇది కట్టుకథ కాదు......
ఒక పాప మనసులో తన తమ్ముడిపై పెంచుకున్న ప్రేమ అనురాగాలు ఖచ్చితంగా ఆ బిడ్డను చేరాయి.....ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడు.......వింతగా లేకపోయినా ఇందులో తెలుసుకోవలసిన అంశం ఉంది......పసిపిల్లల ప్రేమ.........అనురాగం.......నిజంగా ఆ దేవుడి ఆశీస్సులతో సమానం కదా!
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu
కథ సమాచారం
| కథ రకం | Telugu Moral Stories |
|---|---|
| ప్రధాన అంశం | నీతి మరియు మంచి ప్రవర్తన |
| ఎవరికి ఉపయోగకరం | పిల్లలు, కుటుంబ సభ్యులు మరియు తెలుగు కథలను ఇష్టపడే పాఠకులు |
| ముఖ్యమైన సందేశం | కథలోని సంఘటనలను ఆలోచించి, అందులోని మంచి పాఠాన్ని జీవితంలో ఉపయోగించుకోవచ్చు. |
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?
Telugu Lo Stories Kathalu Friendship Heart touching story | యదార్థంగా జరిగిన సంఘటన ఇది యదార్థంగా జరిగిన సంఘటన..........దయచేసి చదవగలరు...... ఒక భార్య...
ఈ కథను పిల్లలు చదవవచ్చా?
అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.
ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?
కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.
ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?
ఇది Telugu Moral Stories విభాగానికి చెందిన తెలుగు కథ.
ఈ కథకు సంబంధించిన అంశాలు: Telugu Lo Stories Kathalu Friendship Heart touching story | యదార్థంగా జరిగిన సంఘటన, Telugu moral stories, Neethi Kathalu, Telugu Kathalu
ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు
- IndianInQ8 — Latest Jobs, News & Entertainment
- Kuwait Bus Routes — Kuwait City Bus Routes & Information
- ITIL Course — ITIL Learning & Course Resources
Post a Comment