Telugu Kids Songs Friendship Paatalu
కోయిలపిల్లా! ఓ కోయిలపిల్లా! Telugu Kids Songs Friendship Paatalu | కవ్వరకాకి, కోయిలపిల్లా! ఓ కోయిలపిల్లా | Telugu Stories
గానం: క్రిష్ణవేణి,టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా
Telugu Kids Songs Friendship Paatalu | కవ్వరకాకి, కోయిలపిల్లా! ఓ కోయిలపిల్లా!, పాడుదమా స్వేచ్ఛా గీతం
కోయిలపిల్లా! ఓ కోయిలపిల్లా!
నిన్నెవరేమన్నారే కోయిలపిల్లా
ఆదివారంనాడొస్తాం పిల్లా
నీకు అందాల పట్టు చీర తెస్తాం పిల్లా
|కోయిలపిల్లా|
సోమవారంనాడొస్తాం పిల్లా
నీకు అందాల గాజులు తెస్తాం పిల్లా
|కోయిలపిల్లా|
మంగళవారంనాడొస్తాం పిల్లా
నీకు మంగళసూత్రం తెస్తాం పిల్లా
|కోయిలపిల్లా|
బుధవారంనాడొస్తాం పిల్లా
నీకు అందాల పట్టీలు తెస్తాం పిల్లా
|కోయిలపిల్లా|
గురవారంనాడొస్తాంపిల్లా
నీకు నడుముకు డాబులు తెస్తాం పిల్లా
|కోయిలపిల్లా|
శుక్రవారంనాడొస్తాం పిల్లా
నీకు చెవులకు కమ్మలు తెస్తాం పిల్లా
|కోయలపిల్లా|
శనివారంనాడొస్తాం పిల్లా
నీకు సొమ్ములుగిమ్ములు తెస్తాం పిల్లా
|కోయిలపిల్లా|
Telugu Kids Songs Friendship Paatalu
కవ్వరకాకి
గానం:నాగవేణి, మూడవ తరగతి, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
కాకీ కాకీ కవ్వరకాకీ
మా చేన్లో వాలొద్దు
మల్లె పువ్వు తుంచొద్దు
మా నాన్న బీదోడు
మాయమ్మ రాక్షసి
నేనేమో పుట్టగోసి!
Telugu Kids Songs Friendship Paatalu
పాడుదమా స్వేచ్ఛా గీతం
రచన: శ్రీ గంటేడ గౌరునాయుడుగారు, శ్రీకాకుళం జిల్లా.
గానం: అనిత, శారద, ఎమ్.రోజ, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
పాడుదమా స్వేచ్ఛాగీతం
ఎగరేయుదమా జాతిపతాకం
దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం
|పాడుదమా|
జలియన్ వాలా బాగు దురంతపు
నెత్తుటి ధారలు హత్తుకొని
ఉరికొయ్యల చెరసాలల గోడల
దారుణాలు తలకెత్తుకొని
పొగిడిన కాలం పోరాడిన కాలం
మరి మరి ఒకపరి తలచుకొని
మృత వీరుల గాధలు తెలుసుకొని
|పాడుదమా|
వందేమాతరమని నినదించిన
వీరుల శౌర్యం తలచుకొని
స్వాతంత్రం నా జన్మహక్కని
గర్జించిన గళమందుకొని
పోరాట ఫలం స్వాతంత్ర ఫలం
కలకాలం కాపాడుకొని
కడు గర్వంగా కొనియాడుకొని
|పాడుదమా|
మన్యం గుండెల మంటై రగిలిన
విప్లవ జ్యోతి స్ఫూర్తియని
గుండు కెదురుగా గుండె నిలిపిన
తెలుగు సింగముల తెగువగని
చీకటి గుండెల బాకై మెరిసిన
గరిమెళ్లను గురుతుంచుకొని
మన తెలుగు తేజమును నింపుకొని
|పాడుదమా|
జనగణమనముల జాగృతినింపిన
జెండా గాథలు చెప్పుకొని
జయహే జయజయహే జననీ యని
జయ గీతమ్ములు పాడుకొనీ
పావన చరితం పరిమళభరితం
అఖండ భారత ఖండమని
అది అక్షయ అమృతభాండమనీ
|పాడుదమా|
Telugu Kids Songs Friendship Paatalu
Friendship Stories : https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
అడవిలోని చిన్న పంది
ఒక సుందరమైన అడవిలో, ఒక చిన్న పంది ఉండేది. అది ఎల్లప్పుడూ మోసపూరితంగా తిరిగి, ఇతర జంతువులను భయపెడుతూ, చిన్న చిన్న కలకలం సృష్టించేది. పిట్టలు, మేకలు, చిన్న జంతువులు దాని దగ్గరికి వెళ్లే ధైర్యం లేకుండా పరుగెత్తేవి. అడవి జీవనం అంతా అసహనంతో నిండిపోయింది.
అప్పుడే, చెరట దగ్గర కూర్చున్న జ్ఞాని, చిన్నారి వలె, మృదువుగా, కానీ స్పష్టంగా, అడవిలోని అన్ని జంతువుల దగ్గర ఇలా చెప్పారు:
“ప్రతి జీవికి ప్రాముఖ్యత ఉంది. దయ చూపించి, సరైన మార్గాన్ని చూపిస్తే, సమస్య తేలిపోతుంది. శక్తితో నేరుగా ఆజ్ఞలు ఇవ్వడం అవసరం లేదు.”
అందువల్ల, అడవిలోని జంతువులు కలసి ఆ చిన్న పందిని ప్రేమతో, సహనంతో, సరైన మార్గాన్ని చూపడం ప్రారంభించారు. చిన్న పంది ఇప్పుడు ఎప్పుడు సత్యాన్ని అర్థం చేసుకుని, ఇతర జంతువులను భయపెట్టకుండా, అందరితో సుఖంగా జీవించడం నేర్చుకుంది. అడవి మళ్లీ సుఖంగా, ఆనందంగా మారిపోయింది.
పాఠం: దయ మరియు మార్గదర్శనం ప్రతి సమస్యను పరిష్కరిస్తాయి.
Visit for Latest Kuwait Jobs News and Accommodation, Part Time Business and Jobs in Kuwait and many more ....
The Little Boar in the Forest
In a vibrant forest, a little boar ran around mischievously, scaring the other animals. Birds, goats, and smaller creatures avoided its path, afraid of its tricks and sudden movements. The entire forest seemed tense and uneasy.
One day, the wise sage, sitting by the pond, spoke gently, almost like a child:
“Every living creature is important. Show kindness and guide them the right way, and problems will be solved. There’s no need to use force.”
The animals in the forest worked together. They approached the little boar with patience, teaching it gently how to live without frightening others. Slowly, the boar learned to understand, behave kindly, and coexist peacefully.
The forest became calm and joyful again. Harmony returned, and all the creatures could live together happily.
Moral: Kindness and guidance can solve any problem.
కథ సమాచారం
| కథ రకం | Friendship Stories |
|---|---|
| ప్రధాన అంశం | స్నేహం, నమ్మకం మరియు సంబంధాలు |
| ఎవరికి ఉపయోగకరం | పిల్లలు, కుటుంబ సభ్యులు మరియు తెలుగు కథలను ఇష్టపడే పాఠకులు |
| ముఖ్యమైన సందేశం | కథలోని సంఘటనలను ఆలోచించి, అందులోని మంచి పాఠాన్ని జీవితంలో ఉపయోగించుకోవచ్చు. |
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?
Telugu Kids Songs Friendship Paatalu కోయిలపిల్లా! ఓ కోయిలపిల్లా! Telugu Kids Songs Friendship Paatalu | కవ్వరకాకి, కోయిలపిల్లా! ఓ కోయిలపిల్లా | గానం:...
ఈ కథను పిల్లలు చదవవచ్చా?
అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.
ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?
కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.
ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?
ఇది Friendship Stories విభాగానికి చెందిన తెలుగు కథ.
ఈ కథకు సంబంధించిన అంశాలు: Telugu Kids Songs Friendship Paatalu | కవ్వరకాకి, కోయిలపిల్లా! ఓ కోయిలపిల్లా | Telugu Stories అడవిలోని చిన్న పంది, Friendship stories in Telugu, Sneh Kathalu, Friendship moral stories
ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు
- IndianInQ8 — Latest Jobs, News & Entertainment
- Kuwait Bus Routes — Kuwait City Bus Routes & Information
- ITIL Course — ITIL Learning & Course Resources

Post a Comment