Dear all, here the Telugu Story Sad Tree Telugu Lo Stories Kathalu | దు:ఖ వృక్ష ఫలం
మంగళ గిరి గ్రామంలో మాధవుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు మంచివాడు, పట్టుదల గలవాడు. కానీ సిగ్గరి కావటంతో పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. దాంతో అందరూ వాణ్ణి ‘మందమతి’ అనీ, ‘ఆలోచించటం రాని వాడనీ’ అనేవాళ్ళు.
రాను రాను ఆ మాటల్ని నమ్మేసిన మాధవుడు, నిజంగానే తాను అనాలోచనా పరుణ్ణనీ, అసమర్ధుణ్ణనీ అనుకోసాగాడు. అది చూసి వాడి తల్లి చాలా బాధ పడేది.
ఓసారి ఊరి నుండి వాడి మేన మామ వాళ్ళని చూడవచ్చాడు. మాధవుడి గురించి అన్నతో చెప్పుకొని వాపోయింది వాడి తల్లి. నాలుగురోజులు మాధవుణ్ణి బాగా పరిశీలించిన మేనమామ, ఆమెకి భరోసా ఇచ్చాడు. ఆ రోజు సాయంత్రం మాధవుణ్ణి మాటల్లో పెట్టి, వాడి సామర్ధ్యాన్ని పొగిడాడు.
మాధవుడు విచారంగా "నన్ను ఆటపట్టిస్తున్నావా మామయ్యా! నాకు ఆలోచించటమే రాదు. ఇంకేం సామర్ధ్యం?" అన్నాడు.
Sad Tree Telugu Lo Stories Kathalu | దు:ఖ వృక్ష ఫలం
మేనమామ వెంటనే "అయితే ఓ పందెం వేసుకుందాం. ఊరంతా వెదికి, దుఃఖ వృక్షం ఎక్కడుందో కనిపెట్టి, దానిని దేనికి ఉపయోస్తారో చెప్పు. ఆ పని నువ్వు చేస్తే నేను గెలిచినట్లు.
అప్పుడు ‘నువ్వు సమర్దుడివి’ అన్న నా మాటని నువ్వు ఒప్పుకోవాలి. చెయ్యలేకపోతే నువ్వు గెలిచినట్లు. అప్పుడు ‘నువ్వు అసమర్ధుడివి’ అనే నీ మాటని, నేను ఒప్పుకుంటాను" అన్నాడు.
మాధవుడు సరేనన్నాడు.
మర్నాడు ఊరంతా గాలించాడు. "దుఃఖ వృక్షం అంటే ఏమిటి, ఎక్కడుంది?" అని అందర్నీ అడిగాడు. అందరూ వాణ్ణి చూసి నవ్వినా పట్టుదల విడిచిపెట్టలేదు. ఎవర్నడిగినా ఏమీ తెలియక పోవటంతో, చెఱువు గట్టున కూర్చున్నాడు.
పక్కనే ఉన్న చింత చెట్టు క్రింద పిల్లలు గోళీలాడుకుంటున్నారు. ఒక్కసారిగా మాధవుడికి దుఃఖాన్ని ‘చింత’ అంటారని గుర్తుకొచ్చింది.
గబగబా చెట్టెక్కి, పై కండువా నిండా చింత పండ్లు తెంపు కొచ్చి తల్లికిస్తూ "అమ్మా! వీటితో పులిహోర చెయ్యి" అన్నాడు.
Read Also Telugu Kids Songs Friendship Paatalu https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html
రాత్రి భోజనాల వేళ, మేనమామ వాడితో "ఏరా అబ్బాయ్! నువ్వు ఓడిపోయినట్లే కదా! ఇప్పుడు ఒప్పుకుంటావా నా మాటే నిజమనీ, నువ్వు సమర్ధుడివే, ఆలోచనా పరుడివేనని?" అన్నాడు కళ్ళెగరేస్తూ!
"నేను ఓడి గెలిచాను మామయ్యా!" అన్నాడు మాధవుడు నవ్వుతూ.
"ఓరి పిడుగా?" అన్నాడు మేనమామ సంతోషంగా!
The Sad Tree's Fruit | Moral Story for Kids
In a village called Mangalagiri, there was a young man named Madhav. He was a good person and very determined, but he was very shy and didn’t talk much to others. Because of this, people started calling him "slow" and "someone who doesn’t think well."
Madhav began to believe these things about himself. He thought he wasn’t smart or capable. His mother was very sad when she saw this.
One day, Madhav's uncle from another village came to visit. Madhav’s mother told him about how her son was feeling bad because of what others were saying. Madhav's uncle spent four days watching him carefully. Then, he decided to help.
One evening, Madhav's uncle praised him and said, "You are capable and smart, Madhav."
Madhav, feeling sad, replied, "Are you making fun of me, uncle? I can't think properly. I don’t have any skills."
His uncle smiled and said, "Let’s make a bet. I will give you a challenge. Go around the village and find the 'sad tree.' If you can find it and tell me what it's good for, I will say that you are smart. But, if you can’t find it, I will agree with you that you are not capable."
Madhav agreed to the challenge.
Visit Kuwait Bus for the latest public transport buses in Kuwait, stops, schedule and timing
The next day, Madhav went all around the village asking everyone, "Where is the sad tree? What is it used for?" Everyone laughed at him, but he didn’t give up. He kept asking people, but no one knew. Finally, he sat by a pond and thought hard.
Nearby, some children were playing under a tamarind tree. Suddenly, Madhav remembered that "sad" means "tamarind" in another way. He quickly climbed the tree, picked tamarind fruit, and went to his mother. He said, "Mom, make some tamarind rice with these!"
In the evening, when Madhav’s uncle asked, "Did you find the sad tree?" Madhav smiled and said, "Yes, I won the bet, uncle! You were right. I am capable, and I can think."
His uncle was happy and said, "Good job, Madhav! I’m proud of you."
Ramu Somu Story in Telugu pdf, friendship stories for Kids, best friends kathalu
కథ సమాచారం
| కథ రకం | Hard Work Stories |
|---|---|
| ప్రధాన అంశం | కష్టపడి పనిచేయడం మరియు ఫలితం |
| ఎవరికి ఉపయోగకరం | పిల్లలు, కుటుంబ సభ్యులు మరియు తెలుగు కథలను ఇష్టపడే పాఠకులు |
| ముఖ్యమైన సందేశం | కథలోని సంఘటనలను ఆలోచించి, అందులోని మంచి పాఠాన్ని జీవితంలో ఉపయోగించుకోవచ్చు. |
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?
Dear all, here the Telugu Story Sad Tree Telugu Lo Stories Kathalu | దు:ఖ వృక్ష ఫలం మంగళ గిరి గ్రామంలో మాధవుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు మంచివాడు,...
ఈ కథను పిల్లలు చదవవచ్చా?
అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.
ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?
కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.
ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?
ఇది Hard Work Stories విభాగానికి చెందిన తెలుగు కథ.
ఈ కథకు సంబంధించిన అంశాలు: Sad Tree Telugu Lo Stories Kathalu | దు:ఖ వృక్ష ఫలం, Hard Work Stories in Telugu, Kashtapadi Pani Cheyadam Kathalu, Success moral stories
ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు
- IndianInQ8 — Latest Jobs, News & Entertainment
- Kuwait Bus Routes — Kuwait City Bus Routes & Information
- ITIL Course — ITIL Learning & Course Resources

Post a Comment