Pilli Dhairyam Telugu Lo Kathalu Stories | పిల్లి ధైర్యం | The Brave Cat

Pilli Dhairyam Telugu Lo Kathalu Stories | పిల్లి ధైర్యం



Dear All Telugu Lo Stories Readers, here is the Telugu Story about Pilli Dhairyam Telugu Lo Kathalu Stories | పిల్లి ధైర్యం.


బింకం ప్రభావం ఎలా ఉంటుందో ఈ పిల్లుల కథ చదివితే తెలుస్తుంది. పులులు పిల్లులకు భయపడ్డాయట!


ఒక అడవిలో పులుల కుటుంబం ఒకటి ఉండేది. ఆ కుటుంబసభ్యులు ముగ్గురు: `తండ్రి పులి, తల్లి పులి, పిల్ల పులి'. ఒక సారి తండ్రి పులి ఒక మంచి వేటను ఇంటికి తీసుకొచ్చి తల్లిపులి చేతికిస్తూ, "బాగా బలిసిన ఈ అడవి దున్న మాంసాన్ని మనం వండి తిందాం. మన చంటోడికి అది బాగా నచ్చుతుందనుకుంటున్నాను నేను. దీన్ని చక్కగా వండిపెట్ట"మని చెప్పింది.


తల్లి పులి సరేనని ఆ మాంసం వండింది. అడవంతా వాసనలు ఘుమఘుమలాడాయి. వండిన కూరను మూడు వేరు వేరు పాత్రల్లోకి వడ్డించింది తల్లి పులి. 

కానీ ఆ కూర ఇంకా చాలా వేడిగా ఉంది. "దీన్ని తినడానికి వీలవ్వటం లేదమ్మా- చాలా వేడిగా ఉంది! కాసేపాగి తింటే బాగుంటుంది" -అన్నది పిల్ల పులి."సరే. ఆలోపల మనం అడవిలో అలా తిరిగొద్దాం పదండి" అని తండ్రిపులి వాటిని అడవిలోకి తీసుకెళ్లింది.


Pilli Dhairyam Telugu Lo Kathalu Stories | పిల్లి ధైర్యం




Pilli Dhairyam Telugu Lo Kathalu Stories | పిల్లి ధైర్యం



ఇంతలో పిల్లుల కుటుంబం ఒకటి, పులుల గుహ వైపుకు వెళ్ళింది. పిల్లుల కుటుంబం కూడా ముగ్గురు సభ్యులదే: ’తండ్రిపిల్లీ, తల్లిపిల్లీ, పిల్లపిల్లి’!


అటు పోయే సరికి, గుహ పరిసరాల్లో అంతా ఒకటే సువాసన! పిల్లుల నోర్లు ఊటబావులయ్యాయి. వెంటనే అవి మూడూ తోకలూపుకుంటూ గుహలోకి పరుగెత్తాయి; అందులో ఉన్న పెద్ద పెద్ద పాత్రల పైకి ఎక్కి, కూరను ఆబగా తినసాగాయి. ’ఎంత రుచిగా ఉందో!’ అని మెక్కింది పిల్లపిల్లి.

 ’భలే కమ్మగా వండారు, కదూ? ఇదిగో బిడ్డా, ఇంకొంచెం తిను’ అని అందించింది తల్లిపిల్లి. ’చప్పుడు చేయకుండా తినండి మీరు. మనం ఎక్కడున్నామో గుర్తుందా? ఎవరైనా వస్తే ప్రమాదం! త్వరగా కానివ్వండి’ అన్నది తండ్రిపిల్లి. అన్నీ కడుపునిండా మాంసం తిని, భుక్తాయాసంతో అక్కడే పడుకున్నాయి కొంచెంసేపు.


Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.


అంతలోనే పులులు గుహద్వారం వరకూ వచ్చేశాయి! వాటిని చూడగానే పిల్లులు మూడూ ఒక్క ఉదుటున దూకి పరుగెత్తి, రాళ్ల మాటున నక్కి కూర్చున్నాయి: "అయ్యో! ముందూ వెనకా ఆలోచించకుండా లోపలికొచ్చాశామే! పైగా పులులు వండుకున్న మాంసాన్ని కడుపునిండా తినేశాం. ఇక అవి మనల్ని కనుక్కోవడం ఖాయం. ఈ రోజుతో మనకు మాంసం చెల్లినట్లే!" అన్నది తల్లిపిల్లి బాధగా.


"అమ్మా! ఆ పులులు మనవైపుకే వస్తున్నట్లు లేదూ?!" అన్నది పిల్లపిల్లి, భయపడుతూ.

"మీరేం భయపడకండి. కాసేపు చప్పుడు చేయకుండా ఉండండి." అన్నది తండ్రిపిల్లి బింకంగా.
అప్పటికే బాగా ఆకలిగొన్న పులులు మూడూ నేరుగా పాత్రల దగ్గరికే పోయాయి. 

పిల్లులు ఎంత తిన్నా గుండిగలోని మాంసం అస్సలు తరగలేదు.. అవి ఏమాత్రం తినగలవు కనక? ఇక ఆ మిగిలిన మాంసాన్నే పులులు కడుపునిండా తిన్నాయి. కడుపు నిండగానే వాటికి నిద్ర ముంచుకొచ్చింది. త్వరలో అవి నిద్రలోకి జారుకున్నాయి. పిల్లులు మూడూ ’బ్రతుకు జీవుడా’ అని అక్కడి నుండి జారుకుని, బయటపడ్డాయి.

ఇక దైర్యంగా ముందు నడిచింది తండ్రి పిల్లి. 

Pilli Dhairyam Telugu Lo Kathalu Stories | పిల్లి ధైర్యం



"ఈ పులులు ఒట్టి దద్దమ్మల్లా ఉన్నాయి.. మనం తిన్న సంగతి అవి కనుక్కోలేకపోయాయి కదమ్మా?" అన్నది పిల్లపిల్లి మురిసిపోతూ.

"నిజమే మరి! మనం ఎంత మాంసం తిన్నామో కదా? అయినా అవి ఏ మాత్రం కనుక్కోలేకపోయాయి, చూడు!" అన్నది తల్లి పిల్లి మురిపెంగా.




"అదేం కాదు. మనం తిన్న తరువాత ఆ సంగతి వాటికి తెలీకుండా ఎలా పోతుంది? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, వాటికి. అయినా అవి అర్ధం కానట్లు నటించాయంతే. ఎందుకంటే, నిజానికి వాటికి మనం అంటే చాలా భయం! చూడండి- నిద్రపోతున్నట్లు ఎలా నటిస్తున్నాయో ఇప్పుడు?! అన్నది తండ్రి పిల్లి గర్వంగా ముఖం పెట్టి, పెద్దమనిషి మాదిరి!




 

Moral of the story "Pilli Dhairyam" (పిల్లి ధైర్యం):

 ధైర్యం, చతురత్వం మరియు జాగ్రత్తతో సమస్యలను ఎదుర్కోవడం ఎప్పుడూ ఫలితాన్ని ఇస్తుంది. భయం ఉన్నా, తెలివిగా ఆలోచిస్తే విజయాన్ని
సాధించవచ్చు.



 

Pilli Dhairyam – The Brave Cat

Once upon a time, in a forest, there lived a tiger family: a father tiger, a mother tiger, and a little tiger cub. One day, the father tiger brought home a freshly hunted piece of meat. He handed it to the mother tiger and said,
"Cook this meat well. Our little one will love it!"


The mother tiger cooked the meat and divided it into three bowls. However, the meat was still too hot for the cub to eat. So the father tiger suggested,
"Let’s take the meat to the forest for a while so it cools down."


Meanwhile, a family of three cats – a father cat, a mother cat, and a little cat – came near the tiger’s den. The smell of the cooked meat reached them, and their mouths watered. They quickly ran into the den and ate the meat from the big bowls.


"It’s so delicious!" exclaimed the little cat.


After eating their fill, the cats realized that the tigers were approaching! Terrified, they hid quietly. The father cat, however, stayed calm and whispered,
"Don’t be afraid. Stay silent, and we will be safe."


The tigers arrived and, thinking the meat was untouched, ate the remaining portion. Once the tigers were full and asleep, the brave cats quietly sneaked out of the den and escaped safely.


The father cat led the way courageously, and the little cat proudly said,
"We ate so much, yet the tigers never realized it!"


The mother cat agreed,
"Yes! Even though they were so close, our courage and cleverness saved us."

  

Moral of the story "Pilli Dhairyam" :

 Bravery, cleverness, and careful thinking always help overcome challenges. Even if you are scared, acting wisely can lead to success.

  

  

FAQs in Telugu

Q1: పిల్లి ధైర్యం కథ ఏం నేర్పిస్తుంది?
A1: ధైర్యం, తెలివి, జాగ్రత్తగా సమస్యలను ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది.


Q2: పిల్లులు ఎందుకు ధైర్యంగా ఉన్నారు?
A2: పులుల భయం ఉన్నా, సవాళ్లను తెలివిగా మరియు జాగ్రత్తగా ఎదుర్కోవడం వల్ల.


Q3: కథలో పిల్లులు పులుల గుహలోకి ఎందుకు వెళ్లారు?
A3: ఆకలి కారణంగా వాసనతో ఆకర్షితమై, పులుల మాంసం తినడానికి.


Q4: పిల్లులు ఎలా బయటకు బయటకు తప్పిపోయాయి?
A4: ధైర్యంగా ముందే నడిచి, జాగ్రత్తగా మరియు సైలెంట్‌గా పులుల నుండి దూరమై బయటకు వెళ్లాయి.


Q5: కథ చిన్న పిల్లలకు ఎందుకు ఉపయోగకరమైంది?
A5: పిల్లలకు భయాన్ని ఎదుర్కోవడం, ధైర్యంగా ఆలోచించడం, మరియు సమస్యలను తెలివిగా పరిష్కరించడం నేర్పుతుంది.

  

 

FAQs in English

Q1: What lesson does “Pilli Dhairyam” teach?
A1: It teaches the importance of bravery, cleverness, and careful problem-solving.


Q2: Why were the cats brave in the story?
A2: Because they faced challenges wisely and cautiously, even though the tigers were scary.


Q3: Why did the cats go into the tiger’s den?
A3: They were attracted by the smell of the meat and wanted to eat it.


Q4: How did the cats escape safely?
A4: By being brave, leading cautiously, and moving silently away from the tigers.


Q5: Why is this story useful for young children?
A5: It teaches kids how to face fears, act wisely, and solve problems courageously.

 

 

కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories

 

In Telugu:
పిల్లి ధైర్యం, పిల్లలకి కథలు తెలుగు, తెలుగులో ధైర్య కథలు, నెతి కథలు పిల్లలకు, పిల్లల మోడల్ కథలు 

In English:
Pilli Dhairyam, Telugu stories for kids, moral stories in Telugu, bravery stories for children, kids animal stories Telugu

  


తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?

Pilli Dhairyam Telugu Lo Kathalu Stories | పిల్లి ధైర్యం Dear All Telugu Lo Stories Readers, here is the Telugu Story about Pilli Dhairyam Telugu Lo...

ఈ కథను పిల్లలు చదవవచ్చా?

అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.

ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?

కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.

ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?

ఇది Telugu Moral Stories విభాగానికి చెందిన తెలుగు కథ.

ఈ కథకు సంబంధించిన అంశాలు: Pilli Dhairyam Telugu Lo Kathalu Stories | పిల్లి ధైర్యం | The Brave Cat, Telugu moral stories, Neethi Kathalu, Telugu Kathalu

#TeluguStories #MoralStories #TeluguKathalu #NeethiKathalu #TeluguMoralStories

ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు

Post a Comment

Previous Post Next Post