పాప పరిహారం | లోభం, మోసం చేసిన వ్యక్తికి దేవుడు ఇచ్చిన గుణపాఠం | Telugu Moral Story | Chandamama Kathalu


Dear All, here is the moral story పాప పరిహారం | లోభం, మోసం చేసిన వ్యక్తికి దేవుడు ఇచ్చిన గుణపాఠం | Telugu Moral Story | Chandamama Kathalu


ఒక ఊళ్ళో శ్రీనివాసులు ఆలయం ఉండేది. ఆలయానికి చుట్టుపక్కల గ్రామాలవాళ్ళు కూడా ఎంతో మంది వచ్చేవారు


పాప పరిహారం | లోభం, మోసం చేసిన వ్యక్తికి దేవుడు ఇచ్చిన గుణపాఠం | Telugu Moral Story | Chandamama Kathalu


ఒకరోజు రాత్రి అర్చకుడు గుడి మూసి, చేతిలో లాంతరు తీసుకుని ఇవతలికి వచ్చేసరికి, ఒక బక్కచిక్కిన మనిషి వచ్చి, " అయ్యా, ఒక్కసారి గుడి తలుపులు తెరుస్తారా? దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాను?" అని వేడుకున్నాడు.

అర్చకుడు మనిషిని ఎగాదిగా చూసి, " పవళింపు సేవ అయిపోయింది. రేపు ఉదయమే తలుపులు తెరవడం." అన్నాడు.

" రాత్రి అంతా వేచి ఉండవలసిందేనా ?" అని బక్క మనిషి గొణుక్కున్నాడు.

" రాత్రికి ఇక్కడే అరుగు మీద పడుకో." అని అర్చకుడు వెళ్ళిపోయాడు.

రోగిష్టి మనిషి చీకట్లో తడుముకుంటూ అరుగు మీద సర్దుకుని కూర్చున్నాడు. అతనికి తన గతం గుర్తుకురాసాగింది.

అతని పేరు చలపతి. అతను సంసారి అయాడు గాని సంపాదనపరుడు కాలేక పోయాడు. అతనికి ఒక ముసలి బంధువు ఉండేవాడు. ఆయన పోయాక ఆయన ఆస్తి అంతా తనకే వస్తుందని చలపతికి తెలుసు. అయితే బతికి ఉండగా ముసలాయన చలపతిని తన పంచన చేరనీయలేదు. ముసలివాడు ఎప్పుడు పోతాడా అని చలపతీ, అతని భార్య హనుమాయమ్మా గోతి దగ్గిర నక్కలల్లే కాచుకు కూర్చున్నారు.

ఒకరోజు ముసలివాడు పోనేపోయాడు. వార్త తెలియగానే భార్యాభర్తలిద్దరూ వెళ్ళారు. చలపతి చచ్చిపోయినవాడికి దహన సంస్కారాలు చేశాడు.

తరవాత భార్యాభర్తలు ఇల్లంతా గాలించినా ఎక్కడా ఎర్ర ఏగానీ కనిపించలేదు. పూజ గదిలో పాతకాలపు శ్రీనివాసుడి రాగి విగ్రహం తప్పిస్తే ఇంట్లో మరే విలువైన వస్తువూ లేదు. ముసలివాడు తన డబ్బంతా ఏం చేశాడో చలపతికి అంతుబట్టలేదు.

" రాగి విగ్రహం కూడు పెడుతుందా, గుడ్డ పెడుతుందా? ఎందుకిది?" అంటూ చలపతి శ్రీనివాసులు విగ్రహాన్ని పారెయ్యబోయాడు.

హనుమాయమ్మ అతని చెయ్యి పట్టుకుని ఆపి, '' మనకు బుర్ర ఉండాలి గాని, అన్నీ పెడుతుంది." అంటూ చలపతికి ఒక ఆలోచన చెప్పింది.

చలపతి ఆమెను మెచ్చుకుని, ఒక పాత గుడ్డలో విగ్రహాన్ని చుట్టబెట్టి, రహస్యంగా తన ఇంటికి తెచ్చేసుకున్నాడు.

మర్నాడు వూరంతా ఒక వార్త గుప్పుమన్నది, చలపతి ఇంటి వెనక తోటలో శ్రీనివాసుడు వెలిశాడు! హనుమాయమ్మ ఒంటిమీదికి దేవుడు వచ్చాడు! అంతే! జనం తండోప తండాలుగా రాసాగారు. మూఢ ప్రజలు విరివిగా కానుకలు కూడా అర్పించుకున్నారు.

హనుమాయమ్మ కళ్ళు మూసుకుని, జుట్టు విరబోసుకుని కూర్చున్నది. భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆమె శ్రీనివాసుడు ఇచ్చినట్టుగానే సమాధానా లిస్తున్నది. భక్తులు పరవశించిపోయారు. ఓపిక నశించి పోయాక, హనుమాయమ్మ మూర్ఛపోయినట్టు నటించి, లేచి కూర్చున్నది. దేవుడు దిగిపోయాడనుకుని మూర్ఖప్రజలు ఇళ్ళకు వెళ్ళిపోయారు. కానుకలు లెక్క చూసుకుని " బ్రహ్మాండమైన పథకం!" అంటూ భార్యాభర్తలు తమను తాము అభినందించుకున్నారు.

పాతకాలపు విగ్రహాన్ని ఇంటి మధ్య నడవలో ప్రతిష్ఠించారు. ప్రతి శని వారమూ హనుమాయమ్మ మీదికి

శ్రీనివాసుడు వస్తున్నాడు. భక్తులను పలకరిస్తున్నాడు. వార్త చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించింది. జనం తండోపతండాలుగా రాసాగారు.

చలపతికి ఇంకా పెద్ద ఆలోచన కలిగింది. చిన్న చిన్న కానుకలతో లాభం లేదు. హుండీ ఒకటి ఉంచి, శ్రీనివాసుడికి గుడి కట్టించటానికి లోకులు తమకు తోచినది అందులో వేసే ఏర్పాటు ఆలోచించాడు. హనుమాయమ్మ ఆలోచనను మెచ్చుకున్నది.

మర్నాడు చలపతి ఒక పెద్ద రాగి బిందెను తెచ్చి. దానికి ఒక పసుపు గుడ్డ వాసెన కట్టి, విగ్రహం పక్కన పెట్టాడు. హనుమాయమ్మ భక్తులతో శ్రీనివాసుడు అన్నట్టుగా, "మీలో పుణ్యాత్ములు నా కోసం గుడి కట్టించండి. హుండీలో న్యాయంగా సంపాదించిన డబ్బే వెయ్యండి. అన్యాయపు డబ్బు హుండీలో పడగానే చిల్లపెంకులుగా మారిపోతుంది." అని చెప్పింది.

హుండీలో డబ్బు పడసాగింది. ఆరు మాసాల్లో హుండీ నిండింది.

" డబ్బు మనకు చాలు. దూర ప్రాంతాలకు పోయి దీనితో హాయిగా బతుకుదాం."అనుకున్నారు భార్యా భర్తలు.

కాని ఎవరికీ అనుమానం కలగకుండా బిందెను తరలించటం కష్టం. పది మంది వచ్చే పోయే లోగిలి! ఆలోచించి హనుమాయమ్మ తన మొగుడి చేత అలాటి బిందే మరొకటి తెప్పించి, దానికి కూడా పసుపుగుడ్డ వాసెన కట్టి, దాని నిండా చిల్ల పెంకులు నింపి, విగ్రహం పక్కన పెట్టి, అసలు బిందెను పాతగుడ్డలో చుట్టి వేరుగా పెట్టాలన్నది.

" అర్థరాత్రి దాటాక చల్లగా జారుకుందాం. పిచ్చిభక్తులు తమ డబ్బు అన్యాయార్జితం కావటంచేత చిల్లపెంకులుగా మారాయనీ, అందుకే మనం ఇక్కడ ఉండటం ఇష్టంలేక వెళ్లిపోయామని అనుకుంటారు." అన్నది హనుమాయమ్మ.

చీకటిపడగానే చలపతి దొడ్లోకి వెళ్ళి, చిల్లపెంకులు ఏరి కొత్తబిందెలో పోసి, పాతబిందెను తీసుకుపోయి తలుపువార పెట్టి, కొత్తబిందెను విగ్రహం పక్కన పెట్టాడు. లోపల హనుమాయమ్మ నిద్రపోయింది.

చలపతికి ఒక అనుమానం వచ్చింది. భక్తులందరిదీ అన్యాయార్జితం. అయి ఉండదు కదా ! అందుచేత అతను పాత బిందె నుంచి దోసెడు నాణాలు తీసి, కొత్త బిందెలోని చిల్ల పెంకుల మీద పోసి, తాను కూడా కాసేపు నడుంవాల్చాడు.

భార్య లేపినదాకా అతనికి మెలకువ రాలేదు. అప్పటికి మూడోఝాము జరుగుతున్నది. తొలికోడి కూయకముందే పొలిమేర దాటిపోవటం మంచిది. లేకపోతే పొలం పనులకు పోయేవాళ్ళు చూస్తారు.

చలపతి కంగారుగా లేచి పాతపంచెలో తలుపువార ఉన్న బిందెను చుట్టి నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. ఇద్దరూ బయలుదేరి తెల్లవారేసరికి ఊరు దాటి చాలా దూరం వెళ్ళారు. మధ్యాన్నంవేళ కాస్సేపు విశ్రాంతి తీసుకుని, ఊరయినా చేరేలోపుగా కొంత డబ్బు దగ్గిర ఉంచు కుందామని, బిందె వాసెన విప్పారు.

ఇద్దరి ప్రాణాలూ ఒక్కసారి ఆక్రో శించాయి. పైన కొద్దినాణాలు తప్పిస్తే బిందెనిండా చిల్ల పెంకులే!

జరిగినదేమంటే, హనుమాయమ్మ నిద్ర లేస్తూనే బిందెలు మారాయో లేదో అని చూడటానికి, విగ్రహం పక్కన ఉన్న బిందెలో చెయ్యిపెట్టింది. పైన చలపతి పోసిన నాణాలు ఆమె చేతికి తగిలాయి. అదే అసలు బిందె అనుకుని, ఆమె దాన్ని తలుపువార పెట్టి, అక్కడ ఉన్న అసలు బిందెను విగ్రహం పక్కన పెట్టింది.


పాప పరిహారం | లోభం, మోసం చేసిన వ్యక్తికి దేవుడు ఇచ్చిన గుణపాఠం | Telugu Moral Story | Chandamama Kathalu



జరిగిన పొరపాటు అర్థంకాగానే హనుమాయమ్మకు మతిచలించింది. ఆమె త్వరలోనే మంచానపడి మరణించింది. చలపతి చావలేదు గాని, కుక్క కన్న హీనంగా బతికి, తాను చేసిన పాపాలను గురించి ఎంతో మనోవేదన పడ్డాడు. తాము విడిచిపెట్టివెళ్లిన డబ్బుతో లోకులు నిజంగా గుడి కట్టించిఉంటే, దేవుణ్ణి ఒక్కసారి చూసి, తన పాపాన్ని పరిహారం చేసుకోవాలని అతనికి గాఢమైన కోరిక కలిగింది. ఒంట్లో శక్తిలేకపోయినా, అష్ట కష్టాలుపడి చలపతి తన ఊరికి తిరిగి వచ్చాడు. తమ ఇంటిస్థానంలో అందమైన గుడి కనిపించింది. అతనికి ఆనందం కలిగింది. కాని దేవుడి దర్శనంకాలేదు.

"తెల్లవారగానే దేవుణ్ణి దర్శించుకుని క్షమాపణ చెప్పుకోవాలి! పాపపరిహారం చేసుకోవాలి." అనుకుంటూ చలపతి అరుగు మీద పడుకున్నాడు.

కాని అది సాధ్యపడలేదు. అలా పడుకున్న చలపతి మరి లేవలేదు.


Short Moral:
"లోభం మనిషిని పతనం చేస్తుంది; నిజాయితీ మాత్రమే జీవితానికి శాంతిని ఇస్తుంది."

-ఎం. కామేశ్వరరావు


మరిన్ని మంచి మంచి చందమామ కథల కోసం మన చందమామ కథలు-Chandamama story books పేజీని follow చేయండి 🙏

 

పాప పరిహారం కథ, Papam Pariharam Telugu Story, Telugu Moral Stories, Telugu Kathalu, Chandamama Kathalu, Chandamama Stories Telugu, Telugu Bhakti Kathalu, Telugu Neethi Kathalu, Telugu Stories For Kids, Telugu Pauranika Kathalu, Srinivasa Swamy Stories, Lord Venkateswara Stories Telugu, Telugu Devotional Stories, Moral Stories In Telugu, Telugu Fairy Tales, Telugu Old Stories, Telugu Literature Stories, Telugu Short Stories, Telugu Kids Stories, Best Telugu Stories, Telugu Animated Stories, Telugu Village Stories, Telugu Inspirational Stories, Telugu Dharma Kathalu 

కొంగ మరియు పీత (ఎండ్రకాయ), Stork and Crab Panchatantra Telugu Friendship stories


Best Telugu Story about Friendship Stories :  https://telugulostories.blogspot.com/2023/05/friendship-story-in-telugu.html


#పాపపరిహారం, #తెలుగుకథలు, #చందమామకథలు, #తెలుగునీతికథలు, #భక్తికథలు, #శ్రీనివాసుడు, #వేంకటేశ్వరస్వామి, #TeluguKathalu, #TeluguStories, #TeluguMoralStories, #ChandamamaStories, #MoralStories, #TeluguBhaktiStories, #TeluguKidsStories, #TeluguLiterature, #TeluguOldStories, #DevotionalStories, #TeluguShortStories, #IndianMoralStories

తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?

Dear All, here is the moral story పాప పరిహారం | లోభం, మోసం చేసిన వ్యక్తికి దేవుడు ఇచ్చిన గుణపాఠం | Telugu Moral Story | Chandamama Kathalu ఒక ఊళ్ళో...

ఈ కథను పిల్లలు చదవవచ్చా?

అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.

ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?

కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.

ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?

ఇది Telugu Moral Stories విభాగానికి చెందిన తెలుగు కథ.

ఈ కథకు సంబంధించిన అంశాలు: పాప పరిహారం | లోభం, మోసం చేసిన వ్యక్తికి దేవుడు ఇచ్చిన గుణపాఠం | Telugu Moral Story | Chandamama Kathalu, Telugu moral stories, Neethi Kathalu, Telugu Kathalu

#TeluguStories #MoralStories #TeluguKathalu #NeethiKathalu #TeluguMoralStories

ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు

Post a Comment

Previous Post Next Post