Yudha Kanda | Kumbha Karna Samharam Sampoorna Ramayanam Part 37 | సంపూర్ణ రామాయణం
Dear All, Yudha Kanda | Kumbha Karna Samharam Sampoorna Ramayanam Part 37 | సంపూర్ణ రామాయణం.
సంపూర్ణ రామాయణం - 37 వ రోజు
యుద్ధకాండ: కుంభకర్ణ సంహారం & హనుమ సంజీవని పయనం
కథా వివరణ :
నిన్నటి యుద్ధంలో ధనస్సు, కిరీటం కోల్పోయి అవమానంతో లంకకు చేరిన రావణుడు, విచార వదనంతో తన సచివులకు ఇలా వివరించాడు చాలా కాలం క్రిందట నేను బ్రహ్మ గారి నుండి వరాలు పొందిన సమయంలో నర వానరుల గురించి అడగలేదు ఆ రోజే బ్రహ్మగారు నన్ను వారి విషయంలో జాగ్రత్తగా ఉండమని అన్నారు.అదేవిధంగా ఇక్ష్వాకు వంశానికి చెందిన అనరన్యుడు అనేటువంటి రాజు భవిష్యత్తులో నా వంశంలోనే ఒకడు అవతరించి నిన్ను హతమారుస్తాడు అని నన్ను శపించాడు. ఆ తరువాత ఒకనాడు వేదవతి నీ నా కోరిక తీర్చమని అడిగినప్పుడు ఆమె కూడా నన్ను శపించింది.ఆమెయే నాకు మృత్యువు కలిగించడం కోసం జనక మహారాజు పుత్రికగా వచ్చి ఉండవచ్చు .అంతేకాదు ఒకసారి నేను కైలాస పర్వతాన్ని ఎత్తినప్పుడు ఉమాదేవి భీతురాలై ఓరీ దుష్ట రాక్షసుడ ఏదో ఒక రోజున ఒక స్త్రీయే నీ మృత్యువుకు కారణం అవుతుంది అని శపించింది.ఆ తర్వాత వానరుల వంటి ముఖం కలిగి ఉన్న కారణంగా నందీశ్వరుని చూసి నేను నవ్వితే ఒక వానర సేనయే నిన్ను,నీ వంశాన్ని నాశనం చేస్తుంది నీ వంశాన్ని నాశనం చేస్తుంది అని శపించినాడు.దీనికి తోడు ఎంతోమంది అమాయక స్త్రీలను బలాత్కారం చేసినందుకు రంభ,బ్రహ్మదేవుడు,పుంజిక స్థల, నలకూబరుడు అంతా నన్ను శపించారు .ఆ పాపబీజాలన్నీ చివరికి ఇప్పుడు బలం చూపుతున్నవి అని అర్థము.చేసుకుంటున్నాను అన్నాడు
రాక్షసులారా యుద్ధంలో కుంభకర్ణుడునీ తల దన్న గల యోధులు ఎవరు లేరు,నా ప్రాణ సమానమైన తమ్ముడు కుంభకర్ణుడిని నిద్రలేపమని ఆదేశించాడు.
📍 కుంభకర్ణుడి ప్రబోధం:
ఆరు నెలల నిద్రలో ఉండే కుంభకర్ణుడిని లేపడం సామాన్యమైన పని కాదు. కేవలం 9 రోజుల క్రితమే అతను మేల్కొని మళ్ళీ నిద్ర పోయాడు. అతన్ని లేపడం కోసం ఏనుగులతో తొక్కించి, భేరీ నాదాలు చేసి, కొండలంత మాంసాన్ని వడ్డించి అతి కష్టం మీద నిద్రలేపారు.
వాడు తన గుహ నుండి వెడలి రావణ అంతఃపురం వైపు వెళ్తూ ఉంటే చూసిన వానరులు పరుగులు పెట్టారూ. విభీషణుడు అతడే కుంభకర్ణుడు అని రామునికి చెప్పాడు. అంగదుడు అందరిని వెనక్కి పిలిచి దైర్యం నింపాడు
కుంభకర్ణుడు రావణుడితో "అన్నయ్యా! నువ్వు సీతమ్మను అపహరించి తప్పు చేశావు, విభీషణుడి మాట వినాల్సింది" అని హితవు పలికాడు. కానీ అన్న మీద ప్రేమతో, రాముడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు.
📍 భీకర యుద్ధం - కుంభకర్ణ వధ:
యుద్ధ రంగంలో కుంభకర్ణుడు వికటాట్టహాసం చేస్తూ వేలమంది వానరులను భక్షించడం మొదలుపెట్టాడు. సుగ్రీవుడిని బంధించి లంకకు తీసుకువెళ్లబోగా, చాలా చక్యంగా తప్పించు కున్నాడు. చివరకు శ్రీరాముడు స్వయంగా రంగంలోకి దిగి, ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుడి చేతులను, కాళ్లను ఖండించి, చివరకు అతని శిరస్సును నేలకూల్చాడు. ఒక మహా పర్వతం కూలినట్లు కుంభకర్ణుడు సముద్రంలో పడిపోయాడు.
కుంభకర్ణుడు కూలిపోయిన వార్త విని రావణుడు మూర్ఛపోయాడు. తన కుడిభుజం తెగిపోయిందని విలపించాడు. అప్పుడు రావణుడి తేజస్సు గల కుమారులు అతన్ని ఓదార్చి, తాము యుద్ధానికి వెళ్తామని అనుమతి కోరారు.
Koti Panodu Telugu Kathalu Stories | కోటి పనోడు | Updated 2026 https://telugulostories.blogspot.com/2015/08/koti-panodu-telugu-kathalu-stories.html
📍 నరాంతక, దేవాంతక, త్రిశీరుల పతనం
నరాంతకుడు: మెరుపులాంటి గుర్రంపై స్వారీ చేస్తూ వానర సైన్యాన్ని చీల్చిచెండాడాడు. అప్పుడు అంగదుడు ఎదురువెళ్లి, తన అరచేతి దెబ్బతో నరాంతకుడి గుర్రాన్ని, ఆపై నరాంతకుడిని సంహరించాడు.
దేవాంతకుడు & త్రిశీరుడు: వీరిద్దరూ ఏకకాలంలో హనుమంతుడిపై దాడి చేశారు. హనుమంతుడు తన ముష్టి ఘాతాలతో దేవాంతకుడిని, తన గోళ్లతో మరియు త్రిశీరుడి స్వంత ఖడ్గంతోనే అతని మూడు తలలను నరికి సంహరించాడు.
మహోదర, మహాపార్శ్వులు: వీరు నీలుడు మరియు రిషభుడి చేతిలో హతమయ్యారు.
📍 అతికాయుడి అద్భుత యుద్ధం
రావణుడి కుమారులలో అతికాయుడు ధన్యుడు. ఇతను శివుడి నుండి దివ్యాస్త్రాలను పొందినవాడు. పర్వతం లాంటి రథంపై యుద్ధానికి వచ్చిన ఇతనిని చూసి విభీషణుడు రాముడికి ఇతని శక్తి గురించి వివరించాడు.
అతికాయుడికి - లక్ష్మణుడికి మధ్య భీకరమైన అస్త్ర యుద్ధం జరిగింది.
లక్ష్మణుడు ప్రయోగించిన బాణాలన్నీ అతికాయుడి కవచాన్ని తాకి వెనక్కి వచ్చాయి.
లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి అతికాయుడి శిరస్సును ఖండించాడు.
📍 రామ లక్ష్మణ మూర్ఛ
కుంభకర్ణుడి తో పాటు కుమారుల మరణంతో కుంగిపోయిన రావణుడు,ఇంద్రజిత్తును మరలా పంపాడు. ఇంద్రజిత్తు మాయా యుద్ధం చేస్తూ, రామ లక్ష్మణుల తీవ్రమూగ గాయపరిచాడు.
శల్యగ్రస్తుడైనప్పటికీ రాముడు ఏమాత్రం తొణకకుండా “లక్ష్మణా! ఇంద్రజిత్తు బ్రహ్మదేవుని శక్తితో పరిపూరితమైన బాణాలను వదులుతున్నాడని నేను అర్ధం చేసుకోగలుగు తున్నాను. శక్తిమంతుడైన ఈ రాక్షసుడు అదృశ్యంగా ఉన్నంతకాలం అతన్ని ఎవరూ జయించలేరు. అందువల్ల అతని బాణాలు మనను లోబరుచుకోనివ్వటమే ఉత్తమం. మనం స్పృహ కోల్పోవటం చూసిన వెంటనే ఇంద్రజిత్తు తనను విజేతగా భావించుకొని లంకకు తిరిగవెళ్ళి రావణునికి తెలియజేయటం తథ్యం" అన్నాడు.
ఇంద్రజిత్తు బాణాలవల్ల రామలక్ష్మణులు తీవ్రంగా గాయపడి స్పృహకోల్పోయి నేలపై పడ్డారు. తన శత్రువులు పరాజితులు కావటం చూచిన ఇంద్రజిత్తు ఆనందోత్సాహాలతో పొంగిపోతూ ఆ విషయం తన తండ్రికి తెలియజేయటానికై లంకకు తిరిగి వెళ్ళాడు.
ప్రాణం మిగిలివున్న వానరులు రామలక్ష్మణుల పరిస్థితి చూచి విపరీతంగా నిస్పృహ చెందాడు. విభీషణుడు వారితో “మహాయోధులారా! బ్రహ్మదేవుని ఆయుధాల పట్లగల గౌరవభావం కారణంగానే రామలక్ష్మణులు ఐచ్ఛికంగా ఈ నిస్సహాయస్థితికి లోనైనారు. కనుక మీరు శోకించకండి. కొద్దిసేపట్లోనే వారు మేల్కొని శత్రువును సంహరిస్తారు" అంటూ ధైర్యం చెప్పాడు.
ఇంద్రజిత్ దాటికి విభీషణుడు, హనుమ తప్ప అంత మూర్ఛ వచ్చి పడిపోయారూ. కాగడా పెట్టుకుని వెతకగా జాంబవంతుడు కనపడుతాడు. విభీషణుడు అతన్ని లేపగా హనుమ జీవించే ఉన్నాడ అని అడుగుతాడు.ఒక్క హనుమ ఉంటే మొత్తం సైన్యం బతుకుతుంది అన్నాడు.
📍 హనుమంతుడి అద్భుత ఘట్టం - సంజీవని:
ఈమాటలు విన్న హనుమంతుడు ముందుకు వచ్చాడు. జాంబవంతుని పాదాలను గట్టిగా పట్టుకొని "నేను క్షేమంగానే ఉన్నాను. నిశ్చింతగా ఉండు” అని చెప్పాడు.
జాంబవంతుడు అతనితో “నీవు శీఘ్రమే హిమాలయాలకు వెళ్ళి ఋషభ పర్వతం ఎక్కడుందో చూడు. అన్ని దిక్కులను దీప్తిమంతం చేసే మహిమాన్వితమైన ఓషధులతో ఆచ్ఛాదితమైన ఉజ్వలమైన పర్వతమొకటి ఋషభ, కైలాసాలకు మధ్యలో ఉంటుంది. ఈ ఓషది మొక్కల్లో నేను చెప్పే నాలుగింటిని నీవు సేకరించి ఇక్కడకు తీసుకురావాలి. మృతుడైన వ్యక్తిని తిరిగి జీవింపజేయగల మృతసంజీవని, దేహంలో నాటుకున్న ఆయుధాలను వెలికితీసి గాయాలను మాన్పడానికి ఉపయోగించబడే శల్యకరణి, దేహం యొక్క సహజ తేజస్సును పునరుద్ధరించే సువర్ణకరణి, విరిగిన ఎముకలను నయంచేసి, ఖండితావయవాలను కలపడానికి వాడబడే సంధాని అనేవే ఈ ఔషధులు. ఈ ఔషధులను నీవు తేగలిగితే అసువులు బాసిన వానర వీరులనందరిని పునరుజ్జీవింపజేయవచ్చు" అన్నాడు.
వాయువేగంతో వెళ్ళి వెళ్ళిన హనుమ వాటిని గుర్తించడం ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశంతో మొత్తం పర్వతాన్ని పెకిలించి తీసుకుని వచ్చాడు.ఆ మూలికల ప్రభావం తో రామ లక్ష్మణులు మొత్తం సైన్యం నిద్రలో నుండి మేలుకొన్నట్టు లేచి కొత్త ఉత్సాహం పొందారు.
✨ నేటి పాఠం: కుంభకర్ణుడు తప్పు అని తెలిసినా అన్న పక్షాన నిలబడి ప్రాణాలు వదిలాడు, కానీ విభీషణుడు ధర్మ పక్షాన నిలబడ్డాడు. కష్ట కాలంలో ధర్మం వైపు ఉండటమే నిజమైన ధీరత్వం. అలాగే, హనుమంతుడి కార్యదక్షత మనకు అసాధ్యమైనది ఏదీ లేదని చాటి చెబుతుంది.
శ్రీరామ జయమ్! లక్ష్మణ జయమ్! కపిరాజ జయమ్!
బలం విష్ణోః ప్రవర్ధతాం
.....సశేషం
Yudha Kanda | Kumbha Karna Samharam Sampoorna Ramayanam Part 37 | సంపూర్ణ రామాయణం
Post a Comment