Panchatantra Kathalu Mosali Kanneellu | పంచతంత్ర కథలు : మొసలి కన్నీళ్లు | Monkey and Crocodile Telugu Story
పంచతంత్ర కథలు : Panchatantra Kathalu Mosali Kanneellu మొసలి కన్నీళ్లు కథలో కోతి మరియు మొసలి మధ్య జరిగిన స్నేహం, మొసలి భార్య చేసిన కుట్ర, తెలివైన కోతి తన చాకచక్యంతో ఎలా ప్రాణాలను కాపాడుకుందో తెలుసుకోండి. పిల్లలకు, పెద్దలకు ఉపయోగపడే ఈ తెలుగు నీతి కథ స్నేహం, నమ్మకం, తెలివితేటలు మరియు మోసగాళ్ల నుండి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది.
Panchatantra Kathalu Mosali Kanneellu పంచతంత్ర కథలు :మొసలి కన్నీళ్లు
ఒక నది ఒడ్డున ఉన్న చెట్టుపై ఒక కోతి నివసిస్తుండేది. అది ఆ చెట్టుకి కాచే తియ్యటి పళ్ళని తింటూ కొన్ని పళ్ళని తింటూ మరికొన్ని సరదాగా నీటిలోకి విసురుతూ ఆనందించేది. అలా కోతి నీళ్ళలోకి విసిరిన పళ్ళను అందులో నివసిస్తున్న మొసలి ఒకటి తింటూ ఉండేది.
మొసలికి ఆ పళ్ళు ఎంతగానో నచ్చి ఒకనాడు ‘ఓ కోతిబావా నాకు ఈ పళ్ళంటే ఎంతో ఇష్టం. నువ్వు నీళ్ళలోకి విసిరిన పళ్ళని తిని ఆనందిస్తున్నాను. దయచేసి రోజూ కొన్ని పళ్ళని నాకు ఇవ్వగలవా’ అని బ్రతిమిలాడింది. ఆ రోజునుండి కోతి, మొసలి కోసం కొన్ని పళ్ళు కోసి ఇవ్వసాగింది. ఆ విధంగా అనతికాలంలోనే మొసలి, కోతీ మంచి స్నేహితులయ్యాయి.
మొసలి ఇంటివద్ద భార్యా పిల్లలని కూడా మరచి ఎక్కువ సమయం కోతితోనే గడప సాగింది. దాంతో మొసలి భార్య కి చాలా కోపం వచ్చింది.
‘ఈ కోతితో స్నేహం ఏర్పడ్డాక నా భర్త నాతో సమయం గడపడటమే మానుకున్నాడు. దీని పీడ వదిలించుకోకుంటే నా భర్త నాకు దూరమైపోతాడు’ అనుకుంది.
ఇలా ఉండగా మొసలి ఒకనాడు కోతి ఇచ్చిన పళ్ళు తీసుకుని భార్యకి ఇద్దామని ఇంటికి వచ్చింది. భార్య పడుకుని ఉండడం చూసి ‘ఏమైంది? ఎందుకలా ఉన్నావు?’ అని అడిగింది.
‘నాకు ఈ మధ్య విపరీతమైన తలనెప్పిగా ఉంటున్నది. ఎంతమంది వైద్యులను అడిగినా అందరూ కోతి గుండెకాయతో చేసిన మందుతోనే నా తలనెప్పి తగ్గుతుందని చెప్పారు. ఇప్పుడు కోతి గుండెకాయ ఎక్కడ దొరుకుతుంది?’ దిగులుగా అన్నది మొసలి భార్య.
‘ఓస్! ఇంతేనా? నువ్వేం దిగులుపడకు. నాకు ఒక కోతి మిత్రుడు ఉన్నాడు. అతడి గుండెకాయ అడిగి తెస్తాను. నీ తలనెప్పి తప్పక తగ్గుతుంది’ అని చెప్పింది మొసలి.
వెంటనే కోతి వద్దకు వెళ్ళి ‘మిత్రమా మనం ఇంతకాలం నుంచి స్నేహితులుగా ఉన్నా నిన్నెప్పుడూ మా ఇంటికి తీసుకుని రాలేదని నా భార్య అలిగింది నాపై. అందుకని నిన్ను పిలుచుకుని పొదామని వచ్చాను’ అంది.
‘కానీ, నేను నీళ్లల్లోకి ఎలా రాగలను?' సందేహం వెలిబుచ్చింది కోతి. అదా! నువ్వు నా వీపు పైన కూర్చో. నిన్ను క్షణంలో మా ఇంటికి తీసుకెళతాను’
మొసలి మాటలు నిజమని నమ్మిన కోతి చెట్టు మీదనుండి క్రిందకు వచ్చి మొసలి వీపు పైన కూర్చుంది. కోతిని మోసుకుంటూ మొసలి తన ఇంటి దారి పట్టింది. నీళ్ళల్లో కొంత దూరం వెళ్ళాక మొసలి ఏడవడం మొదలు పెట్టింది. మొసలి కన్నీళ్ళు చూసిన కోతి కంగారుగా ‘అదేమిటి మిత్రమా ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగింది.
‘ఏం చెప్పమంటావు మిత్రమా!’ అంటూ భార్యకు తలనెప్పి రావడం.. వైద్యులు చెప్పిన మందు గురించి భార్య చెప్పడం... అంతా వివరంగా కోతికి చెప్పి ‘నువ్వు నాకు మంచి మిత్రుడివి కనుక నీకు ఈ విషయం ముందే చెప్తున్నాను’ అంది మొసలి. తనని చంపాలని మొసలి భార్య పన్నాగం పన్నిందని అర్థమైంది తెలివిగల కోతికి.
‘అయ్యో! ఎంత పని జరిగింది మిత్రమా! ఈ మాట నువ్వు ముందరే చెప్పి ఉంటే బాగుండేది కదా!’ ‘ఏం ఇప్పుడేమైంది?’ ప్రశ్నించింది మొసలి. ‘నా గుండెకాయ చెట్టు మీద పెట్టి వచ్చాను. గుండె లేని నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళినా నీకు లాభం ఉండదు’ ‘అవునా? మరిప్పుడేం చేద్దాం?’
‘నన్నువెంటనే చెట్టు వద్దకు తీసుకెళ్ళు. నా గుండె తీసుకుని త్వరగా వచ్చేస్తాను. అప్పుడు నీ భార్య కూడా సంతోషిస్తుంది. ఆమె తలనెప్పికి మందూ అమరుతుంది.’ అంది కోతి. తెలివి తక్కువ మొసలి ఆ మాటలు నమ్మి కోతిని తిరిగి నది ఒడ్డుకి తీసుకొచ్చింది.
అంతే కోతి చెంగున ఒడ్డు పైకి గెంతి గబ గబా చెట్టెక్కి కూర్చుంది. కోతి ఎంతకూ రాక పోయేటప్పటికి మొసలి ‘మిత్రమా త్వరగా రా’ అని కేక పెట్టింది.
Panchatantra Kathalu Mosali Kanneellu | పంచతంత్ర కథలు : మొసలి కన్నీళ్లు | Monkey and Crocodile Telugu Story
అప్పుడు కోతినవ్వి ‘ మిత్ర ద్రోహీ, నన్ను చంపి నీ భార్యను కాపాడుకుందామనుకున్నావా? నీ దుర్భుద్ది నాకు తెలిసింది. గుండె ఎక్కడైనా చెట్టు మీద ఉంటుందా? మోసాన్ని మోసంతోనే జయించాను. ఇవాల్టితో నీకూ నాకూ మధ్య స్నేహం ముగిసిపోయింది. వచ్చిన దారినే తిరిగి పో!’ అంది కోతి.
మొసలి తను చేసిన బుధ్ధిమాలిన పనికి సిగ్గుపడి మంచి మిత్రుణ్ణి కోల్పోయానని బాధపడి నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోయింది.
--మోసకారులనుంచి తప్పించుకోవాలంటే వారిని మోసంతోనే జయించాలి.
👉 ఈ అందమైన Panchatantra Kathalu Telugu కథను పూర్తిగా చదవండి. నచ్చితే Like,
Share & Subscribe చేయండి.
పంచతంత్ర కథలు : మొసలి
కన్నీళ్లు | Panchatantra Kathalu Telugu Moral Stories
Mosali Kanneellu Telugu Story | Panchatantra Kathalu |
Monkey and Crocodile Story
తెలుగు నీతి కథలు
| పంచతంత్ర కథలు : మొసలి కన్నీళ్లు
| Moral Story for Kids
Panchatantra Kathalu, Panchatantra Kathalu Telugu, Mosali
Kanneellu, Monkey and Crocodile Story Telugu, Telugu Moral Stories, Telugu
Kathalu, Panchatantra Stories in Telugu, Telugu Stories for Kids, Kids Stories
Telugu, Moral Stories Telugu, Telugu Neethi Kathalu, Monkey Story Telugu,
Crocodile Story Telugu, Telugu Children Stories, Bedtime Stories Telugu, Telugu
Educational Stories, Panchatantra Tales Telugu, Telugu Fairy Tales, Telugu
Story Reading, Telugu Story Channel, తెలుగు కథలు,
పంచతంత్ర కథలు, మొసలి కన్నీళ్లు, కోతి మొసలి కథ, తెలుగు నీతి కథలు, పిల్లల కథలు, చిన్నారుల కథలు, తెలుగు బాలల కథలు, నీతి కథలు తెలుగు, తెలుగు పంచతంత్రం, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు పిల్లల కోసం, కోతి కథ, మొసలి కథ, తెలుగు కథల వీడియో
#PanchatantraKathalu #MosaliKanneellu #TeluguKathalu
#TeluguMoralStories #Panchatantra #MonkeyAndCrocodile #KidsStories
#TeluguStories #NeethiKathalu #MoralStories #TeluguKids #StoryTime #TeluguStory
#ChildrenStories #TeluguLiterature
Post a Comment