Maya Ramudu Sampoorna Ramayanam Part 36| సంపూర్ణ రామాయణం - రోజు 36 మాయా రాముడు


Maya Ramudu Sampoorna Ramayanam Part 36| సంపూర్ణ రామాయణం - రోజు 36 మాయా రాముడు.

 

Maya Ramudu Sampoorna Ramayanam Part 36| సంపూర్ణ రామాయణం - రోజు 36 మాయా రాముడు




🚩 సంపూర్ణ రామాయణం - 36 వ రోజు 🚩


*మాయా రాముడు*

రాముడు సైన్యంతో సహా లంకా నగరం యొక్క ఉత్తర సముద్ర తీరానికి చేరాడు అని తెలుసుకున్న రావణుడు. చివరి ప్రయత్నం గా విద్యుత్ జిహ్వుడి తో సరిగ్గా రాముణ్ణి పోలిన మాయ శిరస్సు తయారు చేయించి సీతమ్మకు రాముడు మరణించాడు అని చూపించాడు.అది నిజమే అనుకున్న సీతమ్మ తల్లి తీవ్ర వేదన పడింది. అంతలోనే ప్రహస్తుడు యుద్ధ సన్నాహల కోసం సభకు రావాల్సింది గా రాజు నీ కోరితే రావణుడు వెళ్ళాడు,అలా వాడు వెళ్లగానే శిరస్సు మాయం అయింది. అక్కడే ఉన్న విభీషణుని భార్య సరామ ఇది మాయా శిరస్సు అని, నిన్ను లొంగతీసుకోవడానికి రావణుడు పన్నిన పన్నాగం అని చెప్పింది.


వానర సేన లంకా నగరం వెలుపలి వైపు మొత్తం చుట్టూ ముట్టింది. అనంతమైన వానర సేనా సముద్రాన్ని చూసిన రాక్షస యోధులు సంభ్రమానికి లోనయ్యారు. పరుగులు పెట్టుకుంటు వెళ్ళి రావణుడికి విషయం చెప్పారు. వెంటనే మేడ పై భాగానికి వెళ్ళి చూసాడు రావణుడు.ఇసుక వేస్తే రాలనట్లుగా వానర సమూహాలతో నిండి లంకా పరిసర భూమి యావత్తు గోధుమవన్నెను సంతరించుకోవటం చూసి రాక్షసరాజు నివ్వెరపోయాడు. రాముని వంక గుడ్లప్పగించి చూస్తూ తదుపరి కర్తవ్యం ఏమిటన్నది పాలుపోక చాలాసేపు రావణుడు అలాగే చేష్టలుడిగి నిలిచిపోయాడు.


📍 అంగద రాయబారం - శాంతి కోసం చివరి ప్రయత్నం:

అంతట రాముడు ధర్మాన్ని పాటించడంలో తన నిబద్ధతను చాటిచెప్పాడు. యుద్ధం వల్ల కలిగే ప్రాణనష్టాన్ని నివారించడానికి, సీతమ్మను గౌరవంగా అప్పగిస్తే యుద్ధం అవసరం లేదని, సంధి కోసం వాలి కొడుకైన అంగదుడిని రావణుడి వద్దకు రాయబారిగా పంపాడు.


📍 రావణుడి అహంకారం - రాయబార తిరస్కరణ:

అంగదుడు అత్యంత నైపుణ్యంతో, భక్తితో, రావణుడికి రాముడి మహిమను, రావణుడి తప్పులను వివరించాడు. తన తండ్రి వాలిని రాముడు చంపినప్పటికీ, తాను రాముడి భక్తుడిగా ఉన్నానని, రాముడికి శరణు కోరడం వల్లనే మేలు జరుగుతుందని హితవు పలికాడు. కానీ, గర్వంతో ఉన్న రావణుడు తన తమ్ముడు విభీషణుడిని గెంటివేసినట్లే, అంగదుడిని కూడా అవమానించి, సంధిని తిరస్కరించాడు. రాముడు ఆశ్చర్యపోయి, యుద్ధం తప్పదని నిశ్చయించుకున్నాడు.


📍 యుద్ధ భేరి - నాగపాశ బంధనం:

యుద్ధం భీకరంగా ప్రారంభమైంది.రామ, లక్ష్మణులకు జయం! జయం!" అంటూ వానరులంతా ముక్తకంఠంతో ఘోషించగా ఆ శబ్దతరంగాలతో లంకానగరం దద్దరిల్లింది. అంతట వానరులు రక్షణ ప్రాకారాల మీదకు ఎగబ్రాకుతూ వృక్షాలతోను, శిలలతోను వాటిని కూల్చసాగారు. అంతట రావణుడు తన సైన్యాలను శీఘ్రమే ముందుకు సాగమని ఆదేశించాడు. అలా భయంకర గర్జన ధ్వనుల మధ్య భీకరమైన సంఘర్షణ ప్రారంభమైంది.


రాక్షస సైన్యం వానర సైన్యంతో హోరాహోరీగా తలపడింది. రామలక్ష్మణులు తమ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ, కోట్లాది మంది రాక్షసులను సంహరించారు. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు మాయా యుద్ధం చేస్తూ, ఆకాశం నుండి రామలక్ష్మణులపై 'నాగపాశాన్ని' ప్రయోగించాడు. ఈ నాగపాశానికి రామలక్ష్మణులు మూర్ఛపోయి కిందపడ్డారు. వానర సైన్యం ఆందోళన చెందింది.


రాక్షసులు "రాముడు మరణించాడు! ఇంద్రజిత్తు ఒక్కడే ఆయనను వధించాడు!” అంటూ హర్షాతిరేకంతో కేకలు పెట్టారు. అప్పటికి రామ, లక్ష్మణులు మరణించారని సంతృప్తి చెందిన ఇంద్రజిత్తు తనను విజయం వరించిందన్న మదోన్మత్తతతో రావణుని ప్రాసాదానికి పయనమైనాడు.


ఈ విషయం తెలిసిన సీతమ్మ తీవ్ర దిగ్బ్రాంతి కి లోనయ్యింది, సీతమ్మను విమానం లో తీసుకు వచ్చి రామ లక్ష్మణుల ను పైనుంచి చూపించారు రావణుడు.సీతమ్మ వారి స్తితి చూసి అపరిమిత దుఃఖం పొందింది, అయితే త్రిజట సీతమ్మను ఓదారుస్తూ భర్త శరీరం విడిచిన స్త్రీ ఎక్కితే పుష్పకం కదలదు, పైగా రామ లక్ష్మణునులు పడి ఉన్నారు కానీ వారి ముఖ తేజస్సు తగ్గలేదు. వారు మూర్ఛ వచ్చిపడిపోయి ఉండవచ్చు మరణించ లేదు అని ఓదార్చింది.


📍 గరుత్మంతుడి రాక - నాగపాశ విముక్తి:

వానరులు రామలక్ష్మణులను రక్షించడానికి సుగ్రీవుడు,విభీషణుడు ప్రయత్నిస్తుండగా,అంతలోనే సముద్రపు ఒడ్డున హోరున శబ్దం చేసుకుంటూ గాలి వచ్చింది. అందులో నుండి నే గరుత్మంతుడు ఆకాశం నుండి ప్రత్యక్షమై,రామలక్ష్మణుల ముఖాలను తన చేతులతో తుడిచాడు. ఆయన స్పర్శమాత్రం చేత వారి శరీరాలు ప్రకాశించసాగాయి. వారి శక్తి ద్విగుణీకృతమైంది. గరుడుడు రాముణ్ణి లేవనెత్తి ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. రాముడు సంతోషాతిశయంతో “మేమిద్దరమూ నీకు శాశ్వతంగా ఋణపడివున్నాం. మేము యోగ్యులమైనట్లయితే దయచేసి నీవెవరవో మాకు వెల్లడించు" అన్నాడు.


ఆ మహావిహంగం బదులిస్తూ “నేను మీ నిత్యసేవకుణ్ణయిన గరుత్మంతుణ్ణి, వినతా పుత్రుణ్ణి. ఇంద్రజిత్తు యొక్క నాగాస్త్ర బంధనాలనుండి మిమ్మల్ని ఇంద్రుని నాయకత్వంలోని దేవతలంతా కలిసి కూడా విడిపించలేకపోయేవారు. కద్రువ పుత్రులైన ఈ సర్పాలను ఇంద్రజిత్తు బ్రహ్మదేవుని నుండి పొందిన మాయాశక్తుల ప్రభావంతో అస్త్రాలుగా మార్చాడు. సర్పాలు నాకు సహజసిద్ధమైన ఆహారం కనుక నేనంటే వారికెప్పుడూ భయమే.


అందుకనే వారిని తరిమివేయటం కోసమే నేనిక్కడకు వచ్చాను. నా ప్రియమైన ప్రభూ! రాక్షసులతో పోరాడేటప్పుడు మీరెంతో జాగ్రత్తగా ఉండాలి.


నీవంటి ధీరోదాత్తులు సర్వదా ఋజువర్తనులై ఉండగా వారు మాత్రం మిక్కిలి జిత్తులమారివారని గ్రహించాలి. ఇక నేను సెలవు తీసుకోగోరుతాను. నేను వెళ్ళేముందుగా నీకు హామీయిస్తున్నాను. ఏమంటే నీవు విజయం సాధించటం, నీ ప్రియతమ సీతను తిరిగి పొందటం తథ్యం!" అన్నాడు.


📍 రావణ ప్రధమ భంగం - "ఈ రోజుకు వెళ్లి రేపు రా":

రామలక్ష్మణులు తిరిగి యుద్ధంలోకి రావడంతో రావణుడు తన ముఖ్య యోధులను యుద్దముకు పంపాడు హనుమ,అంగదుడు,సుగ్రీవుడు అందరిని ఒక్కొకరుగా సంహరించారు. దాంతో రావణుడే స్వయంగా యుద్ధానికి వచ్చాడు. హనుమ తోను,రామలక్ష్మణులతోను భీకరంగా పోరాడాడు. 


చివరగా రాముడు తన బాణాలతో రావణుడి ధనస్సును, కిరీటాన్ని, ఆయుధాలను కూల్చివేశాడు. రావణుడు అస్త్రసన్యాసం చేసి, రథం మీద భంగపాటుతో నిలబడ్డాడు.

(ఇది అత్యంత శక్తివంతమైన సర్గ గా పెద్దల చేత చెప్పబడింది దీన్ని నిత్యం పఠించడం ద్వారా దీర్ఘ కాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధులు కూడా తగ్గుతాయి)


ఆ సమయంలో రాముడు అతన్ని చంపకుండా, "రావణా! ఈ రోజుకు వెళ్లి రేపు రా" అని పంపాడు. ఈ ఘట్టం రాముడి దయను, మరియు యుద్ధ ధర్మాన్ని చాటిచెబుతుంది.


✨ నేటి పాఠం: రాముడు శాంతి కోసం చేసిన ప్రయత్నం, మరియు శత్రువుపై కూడా దయ చూపడం, మనకు 'క్షమాగుణం' మరియు 'ధర్మం' విలువను నేర్పుతుంది. దేవుడు మనకు ఎప్పుడూ ఒక అవకాశం ఇస్తాడని, దానిని సద్వినియోగం చేసుకోవాలని ఇది చెబుతుంది.


ఇక్కడ ఒక్కో యోధుడి యుద్ధం ఒక్కో అద్భుతం నిజంగా ఇంత లఘువుగా చెప్పటం కాస్త కష్టమైన విషయం కానీ ప్రస్తుతం పూర్తిగా వివరించే వీలు,సమయం లేదు. ప్రతి సర్గ ను వివరంగా చెప్పుకునే భాగ్యం కలిగేలా చేయమని రాముని కోరుకుందాం...


శ్రీరామ జయమ్! లక్ష్మణ జయమ్! కపిరాజ జయమ్!


...సశేషం


బలం విష్ణోః ప్రవర్ధతాం


Read more at స్నేహం - Friendship Telugu Lo Stories Kathalu for Kids 2026

బలం విష్ణోః ప్రవర్ధతాం   #Ramayanam #Yuddhakanda #SriRamaNavami #SanatanaDharma #RamaSetu #VibhishanaSharanagati

జయ శ్రీరామ 

#Ramayanam #Yuddhakanda #SriRamaNavami2026 #SanatanaDharma #AngadaRayabaram #RavanaBhangam #ComprehensiveRamayanam 

తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ కథలోని ప్రధాన సందేశం ఏమిటి?

Maya Ramudu Sampoorna Ramayanam Part 36| సంపూర్ణ రామాయణం - రోజు 36 మాయా రాముడు. 🚩 సంపూర్ణ రామాయణం - 36 వ రోజు 🚩 *మాయా రాముడు* రాముడు సైన్యంతో సహా లంకా...

ఈ కథను పిల్లలు చదవవచ్చా?

అవును. కథలోని సంఘటనలు మరియు సందేశాన్ని వయస్సుకు తగిన విధంగా పిల్లలకు వివరించి చదివించవచ్చు.

ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?

కథలోని పాత్రల నిర్ణయాలు, పరిణామాలు మరియు చివరగా వచ్చే సందేశాన్ని గమనిస్తే మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి పాఠాన్ని గుర్తించవచ్చు.

ఈ కథ ఏ విభాగానికి చెందుతుంది?

ఇది Devotional Stories విభాగానికి చెందిన తెలుగు కథ.

ఈ కథకు సంబంధించిన అంశాలు: Maya Ramudu Sampoorna Ramayanam Part 36| సంపూర్ణ రామాయణం - రోజు 36 మాయా రాముడు, Devotional stories in Telugu, Bhakti Kathalu, Spiritual stories in Telugu

#TeluguStories #DevotionalStories #BhaktiKathalu #SpiritualStories #TeluguKathalu

ఇతర ఉపయోగకరమైన వెబ్‌సైట్లు

Post a Comment

Previous Post Next Post